అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు?: హెచ్‌డీ కుమారస్వామి | HD Kumaraswamy Attacks Siddaramaiah For Double Standards On Karnataka Governor, More Details Inside | Sakshi
Sakshi News home page

సీఎంగా సిద్దరామయ్య అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా: హెచ్‌డీ కుమారస్వామి

Published Sat, Sep 28 2024 9:09 PM | Last Updated on Mon, Sep 30 2024 6:52 PM

HD Kumaraswamy Attacks Siddaramaiah For Double Standards On Karnataka Governor

బెంగళూరు: ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి శనివారం విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ విషయంలో సీఎం సిద్దరామయ్య రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ‘గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందుకు గవర్నర్‌ను ప్రశంసించారు.

అదే గవర్నర్ ఇప్పుడు తనపై(సీఎం) ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలందరూ గవర్నర్‌ను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత హన్సరాజ్ భరద్వాజ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకలా వ్యవహరించిందని..ప్రస్తుతం థావర్‌చంద్ గెహ్లాట్‌తో భిన్న వైఖరితో ఉందని విమర్శలు గుప్పించారు.

‘ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. గవర్నర్ చిత్రపటానికి చెప్పులు వేసి, దిష్టిబొమ్మలను తగులబెట్టి అవమానించారు. ఇప్పుడు ఎవరిపైకి చెప్పులు విసిరి, ఎవరి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.  ప్రభుత్వం, ముఖ్యమంత్రే తప్పు చేశారు. గతంలో సిద్ధరామయ్య స్వయంగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుండి వివరణ కోరడం గవర్నర్ హక్కు. ఆయన ఇప్పుడు తన మాటలను మరచిపోయినట్లున్నారు. అప్పట్లో ఆయన చేసిన సొంత ప్రకటనలను ఆయనకు చూపించాలి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.
చదవండి: కశ్మీర్‌లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement