hd kumaraswamy
-
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రిని కోరాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరినట్టు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో విశాఖ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.కేంద్ర మంత్రి కుమారస్వామిని ఈరోజు వైఎస్సార్సీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరాం. తెలుగు ప్రజల త్యాగాల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్‌కు ఉన్న అప్పులను ఈక్విటీలుగా మార్చాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరాము.మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దశలవారీగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ తన తొలి ప్రాధాన్యతగా మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై కేంద్ర కేబినెట్‌కు ఫైల్ వెళ్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగుతుందని హామీ ఇచ్చారని అన్నారు. -
ఈవీఎంల సహాయంతో కాదయ్యా సార్ అన్నది!
-
అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు?: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి శనివారం విమర్శలు గుప్పించారు. గవర్నర్ విషయంలో సీఎం సిద్దరామయ్య రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ‘గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందుకు గవర్నర్‌ను ప్రశంసించారు.అదే గవర్నర్ ఇప్పుడు తనపై(సీఎం) ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలందరూ గవర్నర్‌ను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత హన్సరాజ్ భరద్వాజ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకలా వ్యవహరించిందని..ప్రస్తుతం థావర్‌చంద్ గెహ్లాట్‌తో భిన్న వైఖరితో ఉందని విమర్శలు గుప్పించారు.‘ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. గవర్నర్ చిత్రపటానికి చెప్పులు వేసి, దిష్టిబొమ్మలను తగులబెట్టి అవమానించారు. ఇప్పుడు ఎవరిపైకి చెప్పులు విసిరి, ఎవరి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రే తప్పు చేశారు. గతంలో సిద్ధరామయ్య స్వయంగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుండి వివరణ కోరడం గవర్నర్ హక్కు. ఆయన ఇప్పుడు తన మాటలను మరచిపోయినట్లున్నారు. అప్పట్లో ఆయన చేసిన సొంత ప్రకటనలను ఆయనకు చూపించాలి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.చదవండి: కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ -
ఈ–టూవీలర్లపై 10 వేలు
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది. మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25 లక్షల టూ–వీలర్లకు.. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు. -
ప్రభుత్వరంగ సంస్థల భూములను వెనక్కి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌యూ) రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తో భేటీ అయ్యారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని, వీటి ఆ«దీనంలో ఉన్న మిగులు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని శ్రీధర్‌బాబు కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 70 ఏళ్లలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటి ఏర్పాటు కోసం అప్పట్లో వేలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామ ర్ధ్యం కలిగిన సీసీఐ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపురాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉన్నాయని, వీటితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. త్వరలో హైదరాబాద్‌లో పర్యటించి శ్రీధర్‌బాబు ప్రస్తావించిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మాండ్య లోక్‌సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడివిట్లో తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచారు. తమకు రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుమారస్వామికి రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా ఆయన భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయి. తమ ఉమ్మడి కుటుంబంలో తన పేరిట మరో రూ.8.17 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి వెల్లడించారు. -
సోదరీ సహకరించు.. సుమలత ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు. 'సోదరి' సహకారం వచ్చా.. బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు. -
మాజీ సీఎం ఫ్యామిలీ సీట్లు కన్ఫమ్!
లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్‌బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. -
సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. వీడియోలో.. ఓ మీటింగ్‌లో జనం మధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ట్విటర్లో షేర్ చేశారు. క్యాష్ఫర్ పోస్టింగ్ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని, ఎలాంటి భయం లేకుండా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని, సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ గురించి అని తెలిపారు. క్యాష్ ఫర్ ఫోస్టింగ్ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో సుధీర్ఘ పోస్టు చేశారు. Unfortunately, former Chief Minister H.D. Kumaraswamy, who was involved in rampant corruption during his tenure, thinks all are like him. His pessimistic attitude does not allow him to think beyond corruption. His insecurity in politics often forces him to fabricate fake stories… — Siddaramaiah (@siddaramaiah) November 16, 2023 అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ Yathindra Siddaramaiah : ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹವಾ ಪ್ರತಿಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲಿಂಕ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ Click Here to Watch NewsFirst Kannada Live Updates LIVE Link : https://t.co/GFweTyzikB@siddaramaiah#CMSiddaramaiah #YathindraSiddaramaiah pic.twitter.com/Py38uVLcVv — NewsFirst Kannada (@NewsFirstKan) November 16, 2023 -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్‌కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్‌కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్‌కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
కన్నడ నాట పొత్తు రాజకీయం
శివాజీనగర: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ హైకమాండ్‌తో జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్‌ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్‌తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్ పొత్తు వార్తలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది. జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. చర్చలు జరిగాయి: బొమ్మై పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు. -
ఘోరంగా ఓటమిపాలైన నిఖిల్
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఏళ్లుగా రామనగర జిల్లాను కంచుకోటగా భావిస్తున్న జేడీఎస్‌కు ఈసారి ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో నాలుగు స్థానాలపైకి మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది. రామనగర నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కుమారస్వామి ఘోరంగా ఓటమిపాలయ్యాడు. దీంతో జేడీఎస్ కంచుకోటకు బీటలు పడ్డాయి. అనూహ్యంగా రామనగరలో కాంగ్రెస్ అభ్యర్థి, డీకే శివకుమార్ ఆప్తుడు ఇక్బాల్ హుసేన్ విజయం సాధించారు. మాగడిలో హెచ్‌సీ బాలక్రిష్ణ, కనకపురలో డీకే శివకుమార్ విజయం సాధించారు. ఒక్క చెన్నట్టణలో మాత్రం కుమారస్వామి ఎలాగో గట్టెక్కారు. చెన్నపట్టణలో అపర భగీరథుడిగా పిలవబడే ఎమ్మెల్సీ యోగేశ్వర్ పరాజయం పాలవడం చర్చనీయాంశంగా మారింది. -
‘కింగ్‌మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్‌ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనుంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
షరతులకు అంగీకరిస్తే సంకీర్ణానికి సిద్ధం
శివాజీనగర: ఈసారి కూడా ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవటంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తమ షరతులకు ఆమోదిస్తే సంకీర్ణానికి సిద్ధమనే సందేశాన్ని పంపినట్లు తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారస్వామి...తమకు 50 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము విధించే షరతులకు అంగీకరించే పార్టీలతో పొత్తు సిద్ధమని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి..పలు పర్యాయాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో ఈసారి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలకు జలవనరుల, విద్యుత్, ప్రభుత్వ పనుల శాఖలు ఇవ్వాలి. జేడీఎస్ ప్రణాళికా అంశాలను అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఇవ్వాలని తదితర షరతులు పెట్టనున్నట్లు తెలిసింది. -
కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామన్న నమ్మకం నాకుంది. అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష -
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
కర్నాటకలో బిగ్ ట్విస్ట్.. జేడీఎస్‌కు బూస్ట్!
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు రోజుల క్రితం అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టును రిలీజ్ చేసింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో, వారందరూ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి బిగ్ బాంబ్ పేల్చారు. చాలా మంది నేతలు జేడీఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్బంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రేపు తమ పార్టీలోకి చాలా మంది నేతలు రాబోతున్నారని ప్రకటించారు. బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోల్ చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలువబోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ ఇప్పటికే తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసిందన్నారు. రేపు(శుక్రవారం) రెండో జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు స్థానం కల్పించకపోవడంతో సీనియర్ నేత, లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది.. బీజేపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం.. దొడ్డప్ప గౌడ పాటిల్ కూడా తాను పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. Many leaders will join JD(S) tomorrow. (BJP leader) Doddappa Gowda Patil Naribol's name is final. We are keen to win 30 to 40 seats in Uttara Karnataka. I will release the second list of candidates tomorrow: Former CM & JDS leader HD Kumaraswamy#KarnatakaElections2023 pic.twitter.com/omsKNzILel — ANI (@ANI) April 13, 2023 -
హాసన్ విషయంలో నా వైఖరి మారదు
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు. -
కుమారస్వామికి ముద్దు
యశవంతపుర: మాజీ సీఎం కుమారస్వామిని ఒక మహిళ ముద్దాడింది. పంచరత్న యాత్రలో భాగంగా హెచ్డీ కుమారస్వామి శనివారం యశవంతపురలోని మారుతీనగరలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక మహిళా కార్యకర్త జీపు వెనుక నుంచి పైకెక్కి కుమారస్వామి బుగ్గపై ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
‘జాతీయపార్టీలను కన్నడిగులు తిరస్కరిస్తారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఈసీ శంఖారావం పూరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమర్మం చేశాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రాంతీయవాద నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్.. జాతీయ పార్టీలను తిరస్కరించేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారాయన. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అదీ ఒకే విడతలో ముగించాలనుకోవడం మంచి పరిణామం. ఇప్పటికే మా పార్టీ 70 శాతం ప్రచారాన్ని ముగించింది అని పేర్కొన్నారాయన. ఇరు పార్టీల నుంచి పొత్తు కోసం తనకు ఆహ్వానం అందిందన్న ఆయన.. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కర్ణాటకకు చేసిందేమీ లేదని, ఈ లెక్కన ఈసారి ప్రాంతీయవాదానికే కన్నడ ప్రజలు కట్టం కడతారని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. అధికార బీజేపీ, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌లు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనపై వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని చెబుతున్న కాంగ్రెస్.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి సీనియర్లు దృష్టి సారించిన కర్ణాటక ఎన్నికల్లో.. గెలుపు తమదేనన్న ప్రకటించుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే ఉద్దేశంలో ఉంది బీజేపీ. ఇదీ చదవండి: ఆత్మ విశ్వాసం.. ఆత్మ గౌరవం.. అసంతృప్తి చెరిపేయడం.. ఎవరికో? -
సగం ధరకే గ్యాస్ సిలిండర్!
కర్ణాటక: రాష్ట్రంలో జేడీఎస్ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ ధరలను 50 శాతం తగ్గిస్తామని మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. మంగళవారం యశవంతపురలో పంచరత్న రథయాత్రలో మాట్లాడారు. కేంద్రం ఉచితంగా గ్యాస్‌ను అందిస్తుందని ఉజ్వల యోజన పథకాన్ని నమ్మిన మహిళలు ఒక సిలిండర్ తీసుకున్న తరువాత షాక్‌కు గురయ్యారు. ఇప్పడు సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిందని కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏటా ఐదు సిలిండర్లు ఉచితంగా, మరో 10 సిలిండర్లు సగం ధరకు అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్లుకు ప్రతి నెల రెండు వేలు ఇస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. -
కర్నాటకలో విషాదం.. జేడీఎస్ నేత హఠాన్మరణం
కర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివానంద పాటిల్(54) గుండెపోటు కారణంగా అకాల మరణం చెందారు. కాగా, పాటిల్‌కు ఇటీవలే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జేడీఎస్ అధిస్టానం సీటును ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆయన ఇలా మృతిచెందడం కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వివరాల ప్రకారం.. కర్నాటకలో రాబోయే ఎన్నికల్లో సిందగీ అసెంబ్లీ స్థానం నుంచి తనకు ఎమ్మెల్యే సీటు ఖరారు కావడంతో శివానంద పాటిల్ ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుగా గురయ్యారు. గుండెపోటు వచ్చిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఆయన మృతిచెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక, శివానంద పాటిల్.. భారత సైన్యంలో సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జేడీఎస్ నుంచి రాజకీయాల్లోకి అరగ్రేటం చేశారు. కాగా, రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలోనే ఆయన ఇలా మృతిచెందారు. శివానంద పాటిల్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మరోవైపు.. శివానంద పాటిల్ మృతిపై జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామితో సహ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పాటిల్ ఆత్మకు శాంతి కలుగాలని, ఆయన కుటుంబానికి అంతా మంచే జరిగేలా దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరారు. 21 Jan 2023 : 🇮🇳 : Karnataka : JDS leader Shivanand Patil dies of 💔attack💉, was to contest assembly elections from Sindgi seathttps://t.co/DxAOwwVGxC#heartattack2023 #heartattack #BeastShotStrikesAgain pic.twitter.com/ktzuo3OdNN — Anand Panna (@AnandPanna1) January 21, 2023 -
కేసీఆర్ కొత్త పార్టీ.. జేడీఎస్ కుమారస్వామి రాక
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో నగరంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరగబోయే పార్టీ జనరల్‌బాడీ మీటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ మీటింగ్ కోసం పలువురు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం ఆహ్వానం వెళ్లింది. ఈ క్రమంలో.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమారస్వామితో పాటు జేడీఎస్ కీలక నేత.. మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు నగరానికి చేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కుమారస్వామి బృందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ స్వాగతం పలికారు. చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. నగరంలోని తెలంగాణ భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో జేడీఎస్ కుమారస్వామి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. తమిళనాడుకు చెందిన విడుత్తలై చిరుత్తైగల్ కట్చీ (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావలవన్ కూడా నగరానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. Received Viduthalai Chiruthaigal Katchi Party President, Member of Parliament and Dalit leader from Tamilnadu Sri @thirumaofficial in Hyderabad today. pic.twitter.com/BSUHfdPhrz — Balka Suman (@balkasumantrs) October 4, 2022 -
Hindi Diwas: ‘హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం’
బెంగళూరు: ఒకవైపు హిందీ దివస్ దినోత్సవాన్ని(సెప్టెంబర్ 14న) దేశవ్యాప్తంగా బీజేపీ ఘనంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో.. వ్యతిరేకత కూడా చాలాచోట్ల వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో హిందీ దివస్‌కు వ్యతిరేకంగా జేడీఎస్(జనతాదల్ సెక్యులర్) ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘‘హిందీని బలవంతంగా రుద్దితే చూస్తూ ఊరుకోం. భారతీయులను విడదీయాలని బీజేపీ చూస్తోంది. కేవలం ఒక భాషను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంద’’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే.. ప్రజల సొమ్ముతో ఇలాంటి వేడుకలు నిర్వహించకూడదంటూ సీఎం బసవరాజ్ బొమ్మైకి కుమారస్వామి ఇదివరకే ఓ లేఖరాశారు. బలవంతంగా హిందీ భాషా దినోత్సవం వేడుకలు జరపడం కన్నడ ప్రజలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కన్నడ భాష ప్రాధాన్యత గురించి రాష్ట్రంలో జోరుగా చర్చ కూడా నడిచింది. అయినప్పటికీ.. కర్ణాటకలో హిందీ దివస్ వేడుకలు జరుగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: ‘బీజేపీది అశాంతివాదం’ -
ప్రగతిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో జరిగిన సమావేశం అర్థవంతంగా సాగిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేటీఆర్ అందించిన ఆతిథ్యం, చూపించిన అభిమానంతో తన హృదయం నిండిపోయిందని కుమారస్వామి పేర్కొన్నారు. -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూ ర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత ప్రస్తుత దేశ రాజకీయాల్లో తక్షణ అవసరం. కాంగ్రెస్ నాయ కత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీకి ఆ పార్టీ ఎంతమాత్రం ప్రత్యా మ్నాయం కాదనే విషయం తేటతెల్లమైంది. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ రోజురోజు కూ నాపై ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీ మతతత్వ విధా నాలు, మోదీ ప్రజా వ్యతిరేక.. నిరంకుశ వైఖరిపై పోరాడాల్సిందిగా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు కోరు తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి బీజేపీని ఇంటికి పంపాల్సిందిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ కార్యవర్గాలు తీర్మానం చేస్తున్నాయి..’ అని సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి వివరించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో వీరిద్దరూ భేటీ అ య్యారు. ఈ సందర్భంగా ఇటీవల రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను కూడా కేసీఆర్ తెలియజేశారు. మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు తెలిపారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు.. ‘వ్యవసాయంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాలను అధోగతి పాలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పలువురు రైతు సంఘాల నేతలు ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సాగు సంక్షేమ పథకాలను పరిశీలించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ తరహాలోనే రైతు రాజ్యం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయొచ్చు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం ఉంది. వర్తమాన రాజకీయాలు, పాలనలో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేప థ్యంలో కేసీఆర్ వంటి నాయకుడు అత్యవసరం. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. గుణాత్మక మార్పు కోసం స్థాపించే ఆ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాం. తెలంగాణలో రైతుల శ్రేయస్సు లక్ష్యంగా అమలవుతున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పాలన, పథకాలపై కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతు న్నాయి. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ స్థాపించే రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కుమారస్వామి ప్రకటించారు. విభజన కుట్రలను సమష్టిగా తిప్పికొడతాం దేశంలో విచ్ఛిన్నకర పాలనతో ప్రజల నడుమ విభ జన సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలు తిప్పి కొట్టడం సహా పలు అంశాలపై కేసీఆర్, కుమార స్వామి చర్చించారు. దేశం విచ్ఛిన్నం అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవాలని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సమష్టి కృషి చేయాలని నిర్ణయించారు. భేటీలో ప్రస్తావనకు వచ్చిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ దేశ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే దేశంలో రాజకీయ, పాలన సంక్షోభం తప్పదు. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలుచుకోవాలి. ♦ దేశ రాజకీయాల్లో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాల పట్ల దేశ ప్రజలు విసుగెత్తి పోయారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ పంథాపై ఏకాభిప్రాయం అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను నేతలు పరిశీలించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సాదర స్వాగతం, వీడ్కోలు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు చేరుకున్న కుమార స్వామికి సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూ దనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్‌రెడ్డిని కేసీఆర్ పరిచ యం చేశారు. ప్రగతిభవన్‌లో కుమార స్వామితో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భోజనం చేశారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామికి కేసీఆర్ మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ‘ప్రకాశవంతమైన దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వం, వ్యక్తిత్వం కలిగిన కేటీఆర్‌తో జరిగిన చర్చ అర్థవంతంగా సాగింది. కేటీఆర్ అభిమానం, గౌరవంతో నా హృదయం నిండిపోయింది’ అని కుమారస్వామి ట్వీట్ చేశారు. -
రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా నాలుగో సీటును దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీజేపీ రెండు సీట్లు సులభంగా గెలుస్తుంది. మూడో సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశముంది. ఇక నాలుగో స్థానంపై జేడీ(ఎస్) ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి కోరుతున్నారు. లౌకికవాద శక్తులను బలోపేతం చేసేందుకు తన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే తమ అభ్యర్థి గెలుస్తారని కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై తమకు నమ్మకం లేదని జాతీయ నేతలు చొరవ తీసుకుని తమ విజయానికి మద్దతు ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదు తమ అభ్యర్థికే జేడీ(ఎస్) మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోంది. గతంలో తాము చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే సమయం ఇప్పుడు వచ్చిందని పేర్కొంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 2020లో తమ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారని హస్తం పార్టీ గుర్తు చేసింది. కుమారస్వామి ఈ వాదనను వ్యతిరేకించారు. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. బీజేపీ నుంచి ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చిందన్నారు. ఒకవేళ బీజేపీ పోటీ చేసివుంటే కాంగ్రెస్ కచ్చితంగా బరిలోకి దిగేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగి పోయారని.. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు. ఒక్క సీటు.. మూడు పార్టీలు! ఇక తాజా రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే బలం లేనప్పటికీ నాలుగో స్థానంలో మూడు పార్టీలు పోటీకి దిగాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కర్ణాటక శాసనసభలో బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ రెండు సీట్లు సునాయాసంగా గెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థితో సహా కాంగ్రెస్‌కు 70 మంది ఉండటంతో.. వారికి ఒక సీటు ఖాయం. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు (నిర్మలా సీతారామన్, జగ్గేష్) ఎన్నికైన తర్వాత, బీజేపీకి అదనంగా 32 ఎమ్మెల్యే ఓట్లు మిగిలిపోతాయి. జైరాం రమేష్‌ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్‌కు 24 ఎమ్మెల్యే ఓట్లు మిగులుతాయి. జేడీ(ఎస్)కు 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ బలం ఒక సీటు గెలవడానికి సరిపోదు కాబట్టి కాంగ్రెస్ మద్దతును జేడీ(ఎస్) కోరుతోంది. (క్లిక్: రాజ్యసభ ఎన్నికలు.. ఎన్సీపీ నేతలకు షాక్) క్రాస్ ఓటింగ్ భయం.. అయితే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశముందని జేడీ(ఎస్) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించినట్టు కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుంది? బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై జేడీ(ఎస్) విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. నాలుగో స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు డి. కుపేంద్ర రెడ్డి- జేడీ(ఎస్) మన్సూర్ అలీఖాన్- కాంగ్రెస్ లహర్ సింగ్ సిరోయా- బీజేపీ -
చచ్చిపోవడానికి రెడీగా ఉండండి.. మాజీ సీఎంలకు వార్నింగ్
సాక్షి, బెంగళూరు: మాజీ సీఎంలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏకంగా 63 మందిని ఓ క్షణంలోనైనా చంపేస్తామనడం కర్నాటకలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, లేఖలో వీరందరూ ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ లేఖ అందినవారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు. ఈ లేఖపై మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని కోరారు. లేఖల విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు. -
Bitcoin Scam: మాజీ సీఎం సంచలన ఆరోపణలు
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ‘బిట్‌కాయిన్ స్కామ్’ వ్యవహారం.. విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత ముదురుతోంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి మీద తాజాగా సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి. జన ధన్ అకౌంట్లను సైతం హ్యాక్ చేసిన నిందితుడు.. అకౌంట్ల నుంచి 2రూ. చొప్పున.. మొత్తం 6 వేల కోట్ల రూపాయల్ని తస్కరించాడని కుమారస్వామి ఆరోపించారు. అయితే తన దగ్గర పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ విషయమై తనకు సమాచారం అందిందని, కేవలం జన్ ధన్ నుంచే ఈ సొమ్ము మళ్లిపోయిందని వ్యాఖ్యానించారాయన. బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కుమారస్వామి అంటున్నారు. ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు భారత్‌తో సహా చాలా దేశాల్లో చట్టబద్దత లేదు. ఈ తరుణంలో శ్రీకి నుంచి సుమారు 9 కోట్ల రూపాయల విలువైన బిట్‌కాయిన్స్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించాడని శ్రీకృష్ణపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బడా నేతలు, పొలిటీషియన్ల పిల్లలు సైతం ఇన్వాల్వ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న క్రమంలో.. ఈ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అయితే బిట్‌కాయిన్ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని గురువారం ప్రధానితో భేటీ అనంతరం కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై మీడియాకు తెలిపారు. నాలుగో తరగతి నుంచే.. అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు! -
కర్ణాటక సంకీర్ణం అందుకే కూలిందా ?
న్యూఢిల్లీ: 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు మంగళవారం బీజేపీని విమర్శించారు. పెగసస్ స్పైవేర్ లిస్టులో అప్పటి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్యల కార్యదర్శులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. పెగసస్‌ను వినియోగించుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు అమిత్‌షాకు లేదని వ్యాఖ్యానించారు. -
‘ఎంపీని అడ్డుగా పడుకోబెడితే లీకేజీ బంద్’
శివాజీనగర: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ లీకేజ్ అవుతోందని, మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు. -
దయచేసి ఆ గ్రామాల పేర్లు మార్చొద్దు: మాజీ సీఎం
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దల్(సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సోమవారం లేఖ రాశారు. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. వాటి పేర్లను మార్చినప్పటికి అర్థం మారదని, పాత పేర్లతోనే వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కేరళలో నివసిస్తున్న కన్నడిగుల సంప్రదాయాలను కాపాడటం కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రుల బాధ్యత. కన్నడ గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చినప్పటికి వాటి అర్థం మాత్రం మారదు. అందుకని, వాటి పేర్లను మార్చకుండా.. పాత కన్నడ పేర్లను కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాసరగాడ్ భాషా సామరస్యానికి నిదర్శనంగా ఉంది. అక్కడ కన్నడ, మలయాళం మాట్లాడే ప్రజలు సమాన సంఖ్యలో ఉన్నప్పటికి సామరస్యంగా జీవిస్తున్నారు. భాషా ప్రాతిపదికన వాళ్లు ఎప్పుడూ గొడవలు పడలేదు. అలాంటి సామరస్యాన్ని భవిష్యత్తులో కూడా కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి : పంజాబ్‌లో మహిళలు సంతోషంగా లేరు : కేజ్రీవాల్ -
ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’
మండ్య: బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్పు విషయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుటుంబాన్ని లాగడం సరి కాదని, తాము ఎవరికీ మద్దతు కాదని తనయుడు హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మండ్య తాలూకా హనకెరెలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార కిట్లను అందజేశారు. జేడీఎస్, దేవెగౌడ పేర్లని రెండు జాతీయ పార్టీలు అనేక ఏళ్లుగా దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. చదవండి: సీఎం మార్పు కోసం ఆగని యత్నాలు -
కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం
దొడ్డబళ్లాపురం: ఇంట్లో వారికి కరోనా సోకినందున కచ్చితంగా కోవిడ్ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఆదేశించినా రాజకీయ నాయకులే పెడచెవిన పెడుతున్నారు. జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి సోమవారం రాత్రి రామనగర పట్టణంలో జరిగిన జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గత వారం కుమారస్వామి బెంగళూరులో కోర్టులో ఒక కేసు వాయిదాకు హాజరవ్వాల్సి ఉంది. అయితే తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని లాయర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇందుకు సరేనన్న జడ్జి ఈ నెల 17వ తేదీ వరకూ కుమారస్వామి ఎటువంటి సమావేశాల్లో, సభల్లో కనిపించరాదని, తాను టీవీ, పేపర్లలో చూస్తుంటానని, అలా జరిగితే అరెస్టు వారెంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. అయితే కుమారస్వామి జడ్జి హెచ్చరికలు బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా బారిన పడిన విషయం విదితమే. చదవండి: దేవెగౌడ దంపతులకు కోవిడ్ -
మీకు సిగ్గు, శరం ఉందా: మాజీ సీఎం
సాక్షి,బళ్లారి: మంత్రులకు సిగ్గు, శరం ఉంటే అనవసర విషయాలు ప్రస్తావించకూడదని(ఒకే పెళ్లి), లేదంటే గురివింద సామెతను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. ఆయన గురువారం కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మంత్రి సుధాకర్.. ‘ఏకపత్నీవ్రతుడు’ అనే విషయంపై పరోక్షంగా విమర్శలు చేయడంతో మాజీ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మంత్రుల సీడీల విషయాన్ని జనం ఏ విధంగా చర్చించుకుంటున్నారో తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం విడుదలైన సీడీతో పాటు మరికొందరి సీడీలు కూడా విడుదల అవుతాయన్న భయంతోనే కోర్టుకు వెళ్లారనే విషయం మరవకూడదని కుమారస్వామి హితవు పలికారు. తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు వెళతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎదుటి వారి తప్పులనే చూపుతారు కాని తమ తప్పులను ఎరగరన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్యుద్ధాన్ని జనం ఛీత్కరించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జనం సమస్యలను గాలికి వదిలివేశారన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటరావ్ నాడగౌడ ఆయనతో పాటు ఉన్నారు. కాగా కుమారస్వామి తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆయనకు మరో భార్య రాధిక కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. చదవండి: సీడీ కేసు: సిట్ అదుపులో నిందితుడి భార్య -
రాసలీలల వీడియో: డీకే పేరెందుకు వస్తోంది?!
మైసూరు: మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడి కేసులో కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఆయన పేరును ప్రస్తావిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని బాధిత యువతి కోరినందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీలోనే కుట్రలు : డీకే శివమొగ్గ: జార్కిహొళి వీడియోల కేసులో బాధిత యువతి చెప్పిన వివరాలు నా దృష్టికి వచ్చాయి, విచారణ జరుగుతున్నందున ఏమీ చెప్పలేను అని కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ అన్నారు. శివమొగ్గలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సీడీ వెనుక ఎవరున్నారో తెలియడం లేదన్నారు. బీజేపి ఎమ్మెల్యే యత్నాళ్ కూడా రాసలీల వీడియోల గురించి మాట్లాడారన్నారు. దీనిని బట్టి బీజేపీలోనే కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు సీడి కేసులో తమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని, తగిన సమయంలో స్పందిస్తానని తెలిపారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే సీడీ కేసుపై సిద్దరామయ్య శివాజీనగర: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి విడుదల చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షనేత సిద్దరామయ్య స్పందించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయటంపై అసెంబ్లీలో మాట్లాడుతానని, సీడీ కేసు వెనుక కాంగ్రెస్ నాయకులున్నారనే ఆరోపణపై అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య, దీనిపై కూడా తాను స్పందించనని, ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చదవండి: రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి -
అశ్లీల సీడీలు.. నన్ను కూడా ఇలాగే: మాజీ సీఎం
శివాజీనగర: నేతల అశ్లీల సీడీలు వంటివాటిని చూడడానికి నా ప్రభుత్వాన్ని కూల్చాల్సి వచ్చిందా? వారు ఇక్కడే ఉండి ప్రభుత్వాన్ని పడేయాల్సింది అని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ వీడియోలను ప్రసారం చేయరాదని ఆరుమంది మంత్రులు కోర్టుకు వెళ్లారని, అలాంటి ఐడియా ఎవరిచ్చారో? ప్రజలు వీరి గురించి ఏమనుకోవాలో? అని ఎద్దేవా చేశారు. ఇలాగ తనను కూడా అగౌరవపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. -
నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మాజీ సీఎం
బెంగళూరు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలు వివాదాస్పదమవుతున్నాయి. శాంతియుతంగా సేకరించాల్సిన విరాళాలను బెదిరింపులకు పాల్పడుతూ.. ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితి తాను ఎదుర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తననే బెదిరించారని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. రామ మందిరం పేరుతో కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. ఓ మహిళతోపాటు మరో ఇద్దరు తన ఇంటికి వచ్చారని చెప్పారు. తాను విరాళం ఎందుకు ఇవ్వడం లేదని బెదిరించారని వాపోయారు. అసలు ఆమె ఎవరు..? మా ఇంటికి వచ్చి నన్ను అడిగే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ విరాళాలు సేకరించడం సరికాదని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. తాను కూడా విరాళం ఇస్తాను. మా పార్టీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అయితే విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇంటింటికొచ్చి అడిగే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ‘రామ మందిరం హిందువుల భక్తిమనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దాని పేరుతో కొనసాగుతున్న విభజనపై నేను వ్యతిరేకం’’ అని కుమారుస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారిని నాజీలుగా పేర్కొన్నారు. జర్మనీలో హిట్లర్ చేసిన మాదిరి దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. విశ్వ హిందూ పరిషత్‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి అని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
‘ఆ పార్టీతో నగరానికి ముప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరించిన జేడీఎస్, కాంగ్రెస్‌లు కత్తులు దూస్తున్నాయి. బెంగళూర్‌లోని రాజరాజేశ్వరినగర్ అసెంబ్లీ స్ధానానికి ఇరు పార్టీలు అభ్యర్దులను బరిలో దింపి పరస్పర ఆరోపణలకు దిగాయి. ఇటీవలి బెంగళూరు అల్లర్లను ప్రస్తావిస్తూ జేడీఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు. బెంగళూర్ అల్లర్లపై బీజేపీ సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్న క్రమంలో కుమారస్వామి సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు. పార్టీ అభ్యర్థి వి కృష్ణమూర్తి నామినేషన్ వేసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అల్లర్ల వెనుక ఏం జరిగిందో ఇప్పుడు వెల్లడవుతోందని అన్నారు. రాష్ట్ర పౌరులను కాంగ్రెస్ నేతలు కాపాడలేరని, బెంగళూర్ దాడులకు వారే కుట్రదారులని కుమారస్వామి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతిలో బెంళూర్ నగర ప్రజలు సురక్షితంగా ఉండలేరని ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుసుమను పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చదవండి : శివకుమార్‌పై సీబీఐ కేసు బెంగళూర్ అల్లర్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.ఇక ప్రత్యర్ధులైన జేడీఎస్, కాంగ్రెస్‌లు 2018లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు విభేదాలను పక్కనపెట్టి జట్టుకట్టాయి. ఆపై పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కార్‌ను వీడటంతో యడ్యూరప్స సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని అప్పట్లో జేడీఎస్, కాంగ్రెస్‌లు కాషాయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
బెంగళూరు: వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
-
అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిఖిల్, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల క్రితం జాగ్వార్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. -
వారిని చంపేందుకు 29న ముహూర్తం
బెంగళూరు: కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ బెదిరింపు లేఖ ఓ ఆశ్రమానికి వచ్చింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ పేర్కొన్నారు. అయితే వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్, నిజాగుణానంద స్వామి యాక్టర్ చేతన్ కుమార్, భజరంగ్ దళ్ నాయకుడు మహేంద్రకుమార్, జర్నలిస్ట్ అగ్ని శ్రీధర్ సహా మొత్తంగా 15 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడలో ఉన్న ఈ లేఖలో ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్నవారిని హతమార్చేందుకు జనవరి 29ని ముహూర్తంగా నిర్ణయించుకున్నామని, అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని లేఖలో తెలిపారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి అనేకమంది పేర్లతో కూడిన లేఖ అందింది. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పగా, నిజగుణానంద స్వామి తిరస్కరించారు. అయితే తనను కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయంటూ మాజీ సీఎం కుమారస్వామి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
కన్నీళ్లపై పేటెంట్ మాదే!
బెంగళూరు: ‘మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్గా మారాయి’ అని మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది. మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్‌లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
జైల్లో శివకుమార్‌తో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత డికె శివకుమార్‌ను జనతాదళ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరి సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలు, వ్యక్తిగత స్నేహాలు వేరని అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత భేటీ అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ.. తాను లొంగబోయేది లేదని, తాను ఎలాంటి తప్పూ చేయనపుడు ఎందుకు తల వంచాలని డీకే శివకుమార్ తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. డీకే శివకుమార్ మానసికంగా దృఢంగా ఉన్నారని, రాజకీయ కక్ష సాధింపులపై తాము పోరాడతామని కుమారస్వామి స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ 600 కోట్ల మనీ లాండరింగ్ కేసులో గత రెండు నెలలుగా సీబీఐ, ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణ అనంతరం తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
తీహార్ జైలుకు కుమారస్వామి..
న్యూఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోమవారం తీహార్ జైలుకు వచ్చారు. అక్కడ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌ను కుమారస్వామి కలిశారు. కర్ణాటకలోని రాజకీయ అంశాలపై కుమారస్వామి, శివకుమార్‌తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన శివకుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందకు చివరివరకు ప్రయత్నించాడు. కానీ, రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
ఫోన్‌ట్యాపింగ్ దుమారం: రంగంలోకి సీబీఐ
బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలోక్ కుమార్ ప్రస్తుతం కర్ణాటక స్టేట్ రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని.. అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. ఈ రాజకీయ సంక్షోభ సమయంలో అప్పటి సీఎం కుమారస్వామి తమ ఫోన్లను ట్యాప్ చేశారని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ క్లిప్ మీడియాకు లీక్ కావడంతో ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ ఆడియో క్లిప్‌లో ఓ ఐపీఎస్ అధికారి పేరుతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తదితరులు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. విచారణను చేపట్టింది. గత కుమారస్వామి ప్రభుత్వం తనతోపాటు మరో 300 మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని అన్హరత వేటుకు గురైన జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఆరోపించడం సంచలనం రేపింది. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరుతుండగా.. దీని వెనుక ఉన్నది కుమారస్వామియేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ పలువులు రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటకలోని 300 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎమ్మెల్యేలు ఆరోపించడంతో యడియూరప్ప ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరింది. ఇలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. రెండోరోజు రాత్రి 8.30 గంటల తర్వాత కూడా విచారించారు. -
‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జేడీఎస్ కార్యకర్తలను వ్యభిచారులతో పోల్చి వివాదం సృష్టించారు సిద్ధరామయ్య. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే మూలకారకుడంటూ జేడీఎస్ కార్యకర్తలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ విలేకరి దీని గురించి సిద్ధరామయ్యను ప్రశ్నించాడు. దానికి ఆయన మండిపడుతూ.. జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ అధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం 14 నెలల తర్వాత ఈ ఏడాది జూలైలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జేడీఎస్ శ్రేణులు సిద్ధరామయ్య మీద విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం కుమారస్వామి కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని కుమారస్వామి మండిపడ్డారు. (చదవండి: నా తొలి శత్రువు సిద్ధరామయ్య) -
రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు
సాక్షి, బెంగళూరు: కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమరస్వామి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు. మాండ్య జిల్లాలోని కేఆర్ పేట రాజకీయాల్లో తమ కుటుంబ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక్కడి నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సంకీర్ణంపై తిరుగుబాటు చేసిన నారాయణ గౌడను ఉద్దేశిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మండ్య జిల్లాలోని కేఆర్‌పేటకు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోను, మీడియాతో మాట్లాడారు. కేఆర్ పేటలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కృష్ణకు కాకుండా నారాయణగౌడను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. నారాయణగౌడ గెలుపు కోసం గ్రామ గ్రామానికి తిరిగి పని చేçసి ఆయనను గెలిపిస్తే తన కుటుంబంపైనే ఆరోపణలు చేశాడని అన్నారు. అతడు క్రిమినల్ అని మండపడ్డ కుమరస్వామి, ఇదంతా మా కుటుంబం చేసుకున్న స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు తుడుచుకున్నారు. రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు తాను మనసులో ఏముంటే దానిని మాట్లాడతానన్న కుమారస్వామి...తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండిపోవాలని అనుకున్నానని అన్నారు. పదవి పోయినా బాధ పడకుండా సంతోషంగా వదిలివచ్చానని అన్నారు. దేశం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, కానీ సోషల్ మీడియాలో నిఖిల్ ఎల్లిదియప్పా అని ప్రచారం జరగడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో మంచికి కాలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తనకు రాజకీయాల్లో కొనసాగాలని అనిపించడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. -
త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటా
-
కుమారస్వామి సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కుమారస్వామి శనివారం న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావడం.. ముఖ్యమంత్రి అవ్వడం అన్ని యాదృచ్చికంగానే జరిగాయి. దేవుడి దయ వల్ల రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. ఈ 14 నెలలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాను. ఎవరినో సంతృప్తి పరచాల్సిన అవసరం నాకు లేదు. రాష్ట్రం కోసం పని చేశాను. ఆ తృప్తి చాలు నాకు. త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుందామని భావిస్తున్నాను’ అంటూ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఓ వైపు యడియూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేకపోయారు. వెలుపలి నుంచి యడియూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం గత నెల కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య గత నెల 23న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. అనంతరం బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. -
‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము 12 మందిని మంత్రులను చేస్తాం. ఆరు నుంచి ఎనిమిది మందికి చైర్మన్ పదవులు ఇస్తాం. ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తామో, వారు తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు సహకరిస్తాం. అందుకు ప్రతి ఒక్కరికి పదేసి కోట్ల రూపాయలు ఇస్తాం. రేపు సాయంత్రం వరకల్లా 12, 14 మంది ఎమ్మెల్యేలు మన వెంట ఉంటారు’ అన్న మాటలు కర్ణాటక రాజకీయాలకు సంబంధించినవంటే వెంటనే ఈ మాటలు ఎవరన్నదో కూడా మనకు స్ఫురించక తప్పదు. గత ఫిబ్రవరి నెలలో ఓ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ఎమ్మెల్యే కుమారుడితో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఫోన్లో మాట్లాడిన విషయాలు అంటూ నాడు ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా అబద్ధమని నాడు యెడియూరప్ప ఈ టేపును తీవ్రంగా ఖండించారు. ఇది ఎవరో తనపై పన్నిన కుట్ర తప్పించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర, కుతంత్రం తనకు లేనే లేదని వాదించారు. నీతి నియమాలకు కట్టుబడిన పార్టీ బీజేపీ అని కూడా చెప్పారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే నాటి ఆయన ఆడియో టేపు మాటలు నేడు అక్షరాల నిజమనిపించక తప్పదు. జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వారిలో పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు రమేశ్‌కు చెందిన ఓ ముంబై హోటల్లో మకాం పెట్టడం, హెచ్డీ కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది వీగిపోవడం, ఆయన స్థానంలో యెడియూరప్ప కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తదితర పరిణామాలు రాజకీయ నాటకంలో రసవత్తర సన్నివేశాలని తెల్సినవే. కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందంటూ పదే పదే ఆరోపణలు చేసినా, 20, 25, 30 కోట్ల రూపాయలకు కూడా ఇస్తామంటూ బీజేపీ నేతలు ఆశ పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య సభాముఖంగా ఆరోపణలు చేసినా బీజేపీ శాసన సభ్యులు మౌనం వహించడంలో మర్మమేమి ? బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులకు 1800 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు తెలియజేస్తున్న యెడియూరప్ప డైరీ ఆదాయం పన్ను శాఖ చేతికి చిక్కిందంటూ ‘ది కారవాన్’ పత్రిక (మార్చి 22న) ఓ వార్తను ప్రచురించడం, 2008, మే నెలలో యెడ్యూరప్ప తన ప్రభుత్వం సుస్థిరత కోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, జేడీఎస్ నుంచి ముగ్గురు శాసన సభ్యులను కొనుగోలు చేయడం, దాన్ని మీడియా ‘ఆపరేషన్ కమలా’గా అభివర్ణించడం తదితర పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి? ఎమ్మెల్యేల బేరసారాలతో ప్రభుత్వాలను పడగొట్టడం కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లేదా ఉన్న ప్రభుత్వాలను బలోపేతం చేసుకోవడం ఒక్క కర్ణాటకకు, ఒక్క గోవాకే పరిమితం కాలేదు. అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఇలా అడుసు తొక్కాయనే విషయం మనకు తెల్సిందే. అయితే దేశంలో నల్లడబ్బును వెలికి తీస్తామని, అవినీతి అంతు చూస్తామని, ఆదర్శ ప్రభుత్వాన్ని అందిస్తామని, తమది భిన్నమైన పార్టీ అంటూ చెప్పుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నాయకులు నేడేమయ్యారన్నదే ప్రశ్న. గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోవడం, వారిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం తెల్సిందే. గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడైన చంద్రకాంత్ కావ్లేకర్ను ‘మట్కా’ కింగని దూషించిన బీజేపీ నాయకులు, ఆయనపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా కూడా అధికారులను కోరారు. అలాంటి వ్యక్తిని పార్టీలో కలుపుకోవడమే కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడంలో అర్థం ఏమిటీ? బీజేపీలోకి తీసుకున్న గోవా మాజీ కాంగ్రెస్ నాయకుడు అతనాసియో మాన్సేర్రాట్ (బాబుష్)పై భూ ఆక్రమణ కేసులే కాకుండా ‘మైనర్ బాలికపై అత్యాచారం’ కేసులో కూడా విచారణ జరుగుతోంది. ‘సేవ్ గోవా ఫ్రమ్ బాబుష్’ అన్నది బీజేపీ గత ఎన్నికల నినాదం. ఈ రాజకీయ శక్తుల నుంచి ‘సేవ్ భారత్’ అన్న నినాదం ప్రజల నుంచి ఎప్పుడు వినిపిస్తుందో..! (చదవండి: బీజేపీకి కుమారస్వామి మద్దతు!) -
కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చూపించారు. బలపరీక్షకు ముందే కుమారాస్వామి రాజీనామాను ప్రకటించనున్నారు. సంకీర్ణ సర్కార్ భవితవ్యం తేల్చే విశ్వాస పరీక్షకు డెడ్లైన్లు మారుతూనే ఉన్నాయి. బలపరీక్ష గడువు పెంచాలన్న జేడీఎస్-కాంగ్రెస్ నేతల అభ్యర్ధనను స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలపరీక్షకు సమయం ఇచ్చిన స్పీకర్ ఇక వాయిదాలకు ఆస్కారం లేదని సంకీర్ణ నేతలకు స్పష్టం చేశారు. బలపరీక్షను వాయిదా వేయాలని ఒత్తిడి పెంచితే తానే రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను చెప్పినట్టు బలపరీక్ష చేపట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్ వినతిని ఆయన అంగీకరించలేదు. బలపరీక్షపై గందరగోళంతో సభ వాయిదా పడటంతో విరామ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు భేటీ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. బలపరీక్షకు తాను సిద్ధమని స్పీకర్ వారితో స్పష్టం చేశారు. -
క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్‌కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి. చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..? సభ 10 నిమిషాలు వాయిదా అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్‌కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు. జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
‘కర్నాటకం’లో కొత్త మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఈఆర్ రమేశ్‌కుమార్ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. బలపరీక్షపై స్పీకర్ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్ ఆదేశించారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి అన్నారు. (చదవండి: యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..) తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అన్నారు. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను స్పీకర్ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ ఏమంటారో..? డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. తన నిర్ణయాన్ని స్పీకర్ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంకీర్ణ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్రలు చేసిందన్నారు. బలపరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు మీ (స్పీకర్) ముందు ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేలా కనబడుతున్నాయి. ఎటువంటి సందర్భంలో ఈ రాజీనామాలు చేశారో గమనించాలి. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. చర్చ జరిగిన తర్వాతే నా సీటు హస్తగతం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తొందరపడకండి. ఇవాళ కాకపోతే, సోమవారం అయినా అధికారాన్ని అందుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను బీజేపీ అధినాయత్వం తొలగించినప్పుడు తనను తప్పించొద్దని రెండు చేతులు జోడించి ఆయన ప్రాధేయపడ్డారు. కానీ నేను అలా చేయను. పదవి కోసం ఎవరినీ వేడుకోను. కాంగ్రెస్ నాయకులే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు సీఎం సీటు ముఖ్యం కాదు. నా ఆలోచన అంతా భవిష్యత్ తరాల గురించే. ప్రభుత్వాలను ఇలా కూల్చడానికే స్వాతంత్ర్య సమరయోధులు మనకు ప్రజాస్వామ్యాన్ని అందించారా’ అంటూ ప్రశ్నించారు. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. తనపై అపనిందలు వేసినవారు ముందుగా తమ బతుకెంటో తెలుసోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. తన దగ్గర డబ్బు లేకపోయినా, విలువలకు కట్టుబడే నైజం ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బలపరీక్ష వెంటనే నిర్వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: అసెంబ్లీలోనే భోజనం, నిద్ర) -
కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కారుపై బలపరీక్ష చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై మధ్యాహ్నం వరకూ చర్చ కొనసాగగా....స్పీకర్ సభను భోజన విరామం కోసం మూడింటి వరకూ వాయిదా వేశారు. మరోవైపు 15మంది రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 21మంది సభకు గైర్హాజరు అయ్యారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం బీజేపీ పట్టుపట్టగా, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కుమరస్వామి సర్కార్ మైనార్టీలో పడిందన్న బీజేపీ ఎమ్మెల్యేలు...బల నిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు వాదనల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులెవరూ విప్‌పై మాట్లాడలేదన్న ఆయన సభకు హాజరు కాకుంటే రెబల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినట్లేనని అన్నారు, పార్టీ నాయకుడిగా విప్ జారీ చేసే హక్కు తనకు ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలేవరకూ విశ్వాస పరీక్ష జరపటం సరికాదని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. -
ఆస్పత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. చర్చ అనంతరం సభలో విశ్వాస పరీక్ష చేపట్టి.. బలాబలాలు అంచనా వేసే అవకాశముంది. చర్చ ఈ రోజు ముగుస్తుందా? ఈ రోజంతా కొనసాగి.. రేపటికి కూడా పొడిగించబడుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా విశ్వాస పరీక్షకు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరులోని విండ్‌ఫ్లవర్ ప్రకృతి రిసార్ట్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అనూహ్యంగా గత రాత్రి ముంబై చేరుకున్నారు. అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందంటూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఇటీవల ముంబైలోనే బస చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముంబైలోని ఆస్పత్రిలో చేరడంతో సంకీర్ణ కూటమి సంఖ్యాబలం ఇంకా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. (చదవండి: సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా: కుమారస్వామి ఉద్వేగం) -
కుమారస్వామి ఉద్వేగం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కుమారస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నది ఎవరో సభలో చెప్పాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా బీజేపీని వేలెత్తి చూపుతూ.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కుట్ర గురించి ఈ సభలో చర్చించాల్సిన అవసరముందని, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాధించినా.. సాధించకపోయినా ప్రస్తుతం విధానసభ జరిగిన తీరు తప్పకుండా పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. ఇక బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ ఒకే రోజులో విశ్వాసపరీక్షపై చర్చ పూర్తిచేసి.. బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేలు ఎంతమంది సభ్యకు హాజరయ్యారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇక, మరోవైపు విశ్వాస పరీక్షలో విజయం తమదేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ కూటమికి వంద కన్నా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. ‘మేం 101శాతం కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. వారికి వంద కన్నా తక్కువ మంది మద్దతు ఉంది. మాకు 105మంది మద్దతు ఉంది. సర్కార్ పెట్టిన విశ్వాస పరీక్ష వీగిపోతుంది’ అని స్పష్టం చేశారు. బలాబలాలివి..! అధికార కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మొత్తం 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అరెస్ట్
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను ఐఎమ్ఏ అవినీతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్ ) అదుపులోకి తీసుకుంది. ముంబయి వెళ్లడానికి సిద్ధమైన రోషన్ బేగ్‌ను సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. దీన్ని సిగ్గుమాలిన చర్యగా కుమార స్వామి వర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కుమార స్వామి ఆరోపించారు.ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు కుమారస్వామి. Today SIT probing the #IMA case detained @rroshanbaig for questioning at the BIAL airport while he was trying leave along with @BSYBJP's PA Santosh on a chartered flight to Mumbai. I was told that on seeing the SIT, Santhosh ran away while the team apprehended Mr. Baig. 1/2 pic.twitter.com/MmyH4CyVfP — H D Kumaraswamy (@hd_kumaraswamy) July 15, 2019 దీనిపై సిట్ అధికారులు స్పందిస్తూ.. ఐఎమ్ఏ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 19న హాజరు కావాల్సి ఉంటుందని బేగ్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ ఈ లోపు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయనను అదుపులోకి తీసకోవాల్సి వచ్చింది. బేగ్‌ను అరెస్ట్ చేయాలా వద్దా అనే అంశాన్ని విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయిస్తాం అన్నారు. -
ఫలించిన ట్రబుల్ షూటర్ చర్చలు
సాక్షి, బెంగళూరు : కర్నాటకలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధం కావడంతో... రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ చర్చలు ఫలించాయి. రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా శివకుమార్ శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరతో కలిసి నాగరాజ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని వీరు నాగరాజ్‌ను కోరారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... నాగరాజ్ కాంగ్రెస్‌లో ఉంటానని తమకు మాటిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకు 40ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి కుటుంబంలో కష్టనష్టాలు ఉంటాయని శివకుమార్ వ్యాఖ్యానించారు. నాగరాజ్ కాంగ్రెస్‌కి వీధేయుడని... పార్టీలోనే కొనసాగుతారని డీకే శివకుమార్ తెలిపారు. ఆయన తిరిగిరావడంతో తమకు కొండంతబలం వచ్చినట్టుందన్నారు. మరో రెబల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో చర్చించి ఇద్దరూ కలిసి వస్తామని నాగరాజ్ హామీ ఇచ్చారు. చదవండి: రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గంతోనూ శివకుమార్ టచ్‌లో ఉన్నారు. వారంతా బెంగళూరు రావాలని ఆయన ఆహ్వానించారు. తనతో ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చచెప్పే ప్రయత్నం కాగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసమ్మతిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను సమావేశాలకు తీసుకురావడానికి డీకే బ్రదర్స్ శివకుమార్, సురేశ్ రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్, ఆనంద్ సింగ్, మునిరత్నలను ఒప్పించి సభకు తీసుకు రావడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డీకే బ్రదర్స్ తమవంతు ప్రయత్నాలు చేపట్టారు. ఇప్పటికే అసమ్మతితో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడారు. అయితే వారు తమ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయినా కూడా ఏదో రకంగా వారిని ఒప్పించి తీసుకు వస్తామని సీఎంకు డీకే బ్రదర్స్ హామీ ఇచ్చారు. -
రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత శివకుమార్ శనివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నాగరాజ్‌ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డికి కూడా శివకుమార్ ఫోన్ చేశారు. కాగా కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను కోరిన విషయం తెలిసిందే. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ – జేడీఎస్ నిర్దేశించిన రిసార్టులకు కూడా వెళ్లలేదు. కొందరు ముంబయిలో ఉండగా.. మరికొందరు బెంగళూరులోనే ఉన్నారు. బల నిరూపణకు సిద్ధమని చెప్పడంతోనే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ – జేడీఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం నెలకొందన్నారు. ఈసందర్భంగా వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బుధవారం అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టుకు తరలించారు. ఈమేరకు రాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు బీజేపీ సభ్యులను తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉన్నట్లు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీ సమావేశం ముగియగానే ఎమ్మెల్యేలందరినీ రాజానుకుంటెకు ఒకే బస్సులో తరలించారు. రిసార్టు నుంచి నేరుగా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. మొత్తం 30 గదులు బుక్ చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోకూడదని బీఎస్ యడ్యూరప్ప గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. సభ ముగియగానే వారందరినీ అదే రిసార్టుకు తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టారు. మేమేం ఆపరేషన్ చేయలేదు: సిద్ధరామయ్య అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈనేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకుండా బీజేపీ రిసార్టులకు తరలిస్తోంది. సీఎంకు విశ్వాసం ఉన్నప్పటికీ ప్రతిపక్షం భయపడ్డం విడ్డూరంగా ఉంది. తాము ఎలాంటి ‘ఆపరేషన్’ చేయలేదు. రాజీనామా చేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ వేశాను. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే. రాజీనామా చేసిన కె.సుధాకర్, రామలింగారెడ్డి ముంబయి వెళ్లలేదు. రోషన్‌బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని సిద్ధు అన్నారు. గోవాకు ఆనంద్‌సింగ్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆనందసింగ్ శుక్రవారం గోవా తరలివెళ్లారు. ఈమేరకు ఆయన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లారు. ఈనెల 1వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ రోజు నుంచి రాష్ట్రం వదిలి వెళ్లలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చర్చనీయంగా మారింది. అయితే ఆనందసింగ్ ముంబయి వెళ్లి అక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత గోవా వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు సమర్పించిన రాజీనామాల విషయంపై వివరణ ఇచ్చేందుకు తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యేలు అనంద్‌సింగ్, నారాయణగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్ గైర్హాజరయ్యారు. ఒత్తిడికి గురై రాజీనామా చేశారా? లేక ఇష్టంతోనే రా జీనామాలు చేశారా అనే విషయాలపై ఆరా తీసేందుకు నిన్న సాయం త్రం 3 నుంచి 4 గంటల సమయంలో తన ముందు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. -
పార్టీ మారకుండా ఎందుకు రాజీనామా !?
సాక్షి, న్యూఢిల్లీ : అటో ఇటో తొందర్లోనే తేలిపోతుందనుకున్న కర్ణాటక సంక్షోభం అనూహ్యంగా ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో యథాతధా స్థితిని కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తాను సభా విశ్వాసానికి సిద్ధమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించడం విశేషమే. అప్పటి వరకు సందిగ్ధత కొనసాగక తప్పదు. బీజేపీ ప్రలోభాల వల్లనే 14 మంది శాసన సభ్యులు రాజీనామా చేశారంటూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రెబల్స్ బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయినట్లయితే రాజీనామా చేయడానికి బదులు అవిశ్వాసం తీర్మానం సందర్భంగా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చుగదా? అన్న సందేహం కలుగుతుంది. పార్టీ విప్‌లను ఉల్లంఘించినందుకు బర్తరఫ్‌తో అసెంబ్లీ సభ్వత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయమా? రాజీనామా చేసినా సభ్యత్వం ఎలాగు పోతుందికదా! అవినీతి కేసుల కారణంగా కాకుండా పార్టీల ఫిరాయింపుల కింద అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అలాంటి సమయాల్లో తదుపరి జరిగి ఉప ఎన్నికల్లో మరో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలవచ్చు. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా రాజీనామానే ఎందుకు చేశారు? 14 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడం వల్ల శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 210కి, పాలకపక్షం సభ్యుల సంఖ్య 104కు పడిపోతుంది. 105గా ఉన్న బీజేపీ బలం స్వతంత్ర అభ్యర్థి, మరో పార్టీ ఏకైక అభ్యర్థి మద్దతులో 106కు చేరుకుంటుంది. అంటే మెజారిటీ సభ్యుల బలం బీజేపీకి ఉంటుంది. అదే అవిశ్వాసానికి వెళ్లినట్లయితే 14 మంది బీజేపీకే వేస్తారన్న నమ్మకం బీజేపీకి లేదు. అందులో ముగ్గురు, నలుగురు సభ్యులు పాలకపక్షం వెంట ఉన్నా ఆ ప్రభుత్వం పడిపోవడం కష్టం. పైగా కుమారస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని అనుమతిస్తారా, లేదా? అన్నది కూడా అనుమానమే కనుక రెబల్స్‌కు బీజేపీ రాజీనామాల దారినే చూపింది. ఇప్పుడు కుమారస్వామియే అవిశ్వాసానికి సిద్ధమవడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది. -
విధానసౌధలో బీజేపీ ఆందోళన
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ జవాబిచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు. మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప ‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్ రమేశ్ కుమార్‌తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్ కార్యాలయంలోకి సుధాకర్‌ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్ భార్య వజూభాయ్‌వాలాకు ఫోన్ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. దీంతో కమిషనర్ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్‌భవన్‌కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది. అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్‌కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందన్నారు. -
8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరణ!
సాక్షి, బెంగళూరు : కన్నడ రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా విషయమై స్పీకర్ రమేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 14 మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలను మంగళవారం ఆయన తిరస్కరించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో ముగ్గురికి ఈనెల 12న, మరో ఇద్దరికి 15న అపాయింట్మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఎమ్మెల్యేల రాజీనామా విషయమై స్పీకర్ రమేష్ మాట్లాడుతూ.. పోస్టులో పంపిన రాజీనామాలను ఆమోదించనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు... ‘పోస్టులో పంపిన రాజీనామాలను పంపితే స్పీకర్ కార్యాలయంలో నేనెందుకు. వారిలో ఏ ఒక్క ఎమ్మెల్యే నన్ను సంప్రదించలేదు. ఎవరైనా సరే నన్ను నేరుగా కలవొచ్చు. నేను రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక స్పీకర్ రాజీనామాలు ఆమోదించకుండా.. తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొంత సమయం దొరికినట్టు అయింది. ఈ క్రమంలో మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించి తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబై వెళ్లారు. ముంబైలో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక, రెబెల్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మరోవైపు ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. దీంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిందని, వెంటనే కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది. -
కర్ణాటకలో ఏం జరగబోతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌కు శుక్రవారం రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో కుమార స్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలి పోతుందా ? కూలిపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా ? అసలు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా ? ఆమోదించకపోతే ఏమవుతుంది ? రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుంటారా ? కర్ణాటక అసెంబ్లీ భవిష్యత్తు ఏమిటీ ? చదవండి: తెరపైకి కాంగ్రెస్ ప్లాన్-బీ.. మంత్రులంతా రాజీనామా 2018, మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకుగాను బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఏడు సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు, జనతాదళ్ (సెక్యులర్)కు 37 సీట్లు వచ్చాయి. బీజేపీని అధికారంలోకి రాకుండా నివారించడం కోసం కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు అంగీకారానికి వచ్చి ఒక బీఎస్పీ సభ్యుడు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకురావడంలో జేడీఎస్ నాయకుడైన కుమార స్వామి ఒత్తిడికి గురవుతున్నారు. కేబినెట్ బెర్తుల కోసం కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో వారు ఏ మాత్రం సహకరించడంలోదని కుమార స్వామి బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి పదవుల కోసం సొంత పార్టీ శాసన సభ్యుల నుంచి కూడా ఒత్తిళ్లు ఉండడంతో ఆయన ఎవరికి న్యాయం చేయలేకపోయారు. ఏలోగా లోక్‌సభ ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి కూడా అఖండ విజయాన్ని సాధించడంతో ప్రభుత్వంలో కొనసాగడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని భావించిన ఇరు పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి చర్య వెనక బీజేపీ ప్రలోభాలు కూడా ఉండవచ్చు. డబ్బుల ఆశ చూపినట్లు ఇప్పటికే ఇద్దరు శాసన సభ్యులు బహిరంగంగానే ఆరోపించిన విషయం తెల్సిందే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి చెందిన ఓ విమానంలో ముంబైకి వెళ్లిన పది మంది తిరుగుబాటు శాసన సభ్యులు అక్కడ హోటల్లో మకాం వేయడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఏం జరగబోతోంది? 14 మంది శాసన సభ్యుల రాజీనామాలపై శుక్రవారం నాడు ఎలాంటి నిర్ణయం తీసుకోని స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం నాడు తాను ఆఫీసుకు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తానని చెప్పారు. వారి రాజీనామాలు నిర్ణీత ఫార్మైట్‌లో వాటిని ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో గత్యంతరం ఉండదు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆయన వాటిని తొక్కిపట్టి ఉంచవచ్చు. ఈ విషయంలో కోర్టులు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవు. అలాంటప్పుడు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని ప్రస్తుతం ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానం కోరవచ్చు. అప్పుడు కుమార స్వామి అసెంబ్లీ విశ్వాసాన్ని పొందడం కష్టం అవుతుంది. ఒకవేళ 14 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించినట్లయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య మొత్తం 110. అవుతుంది. అప్పుడు జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 104కు పడిపోతుంది. బీజేపీకి 105 స్థానాలు ఉన్నాయి కనుక ఇంకా ఒక్కరి మద్దతు అవసరం అవుతుంది. బీజేపీకి ఏకైక బీఎస్పీ సభ్యుడు మద్దతు ఇవ్వడానికి గానీ, బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా సంకీర్ణ పక్షాల చర్చలకు అవకాశం ఇవ్వడానికి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. రెబెల్స్‌కు పదవులను ఆఫర్ చేయడం ద్వారా వారిని రాజీనామాల ఉపసంహరణకు అటు కాంగ్రెస్–ఇటు జేడీఎస్ పార్టీలు సంప్రతింపులు జరుపుతున్నాయి. -
రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంతో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రాంతంలో వీరు సమావేశం కావడం విశేషం. కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి, బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డిని శనివారం రాత్రి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే రామలింగారెడ్డి తనకు జరిగిన అన్యాయంతో పాటు పార్టాలో నెలకొన్న సమస్యలనూ చెబుతూ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో వేణుగోపాల్ నిరాశతో వెనుదిరిగారు. ఈ సమావేశంలో రామలింగారెడ్డి డీసీఎం పరమేశ్వర్‌పైన ఆరోపణలు గుప్పించినట్లు తెలిసింది. మరోవైపు పార్టీలో జరుగుతున్న అనూహ్య మార్పులు తనను ఆవేదనకు గురి చేశాయని, దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, పార్టీకి కాదని, 46ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తూనే ఉన్నానని రామలింగారెడ్డి అన్నారు. పార్టీ కూడా తనకు అనేక పదవులు ఇచ్చిందని, అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, సీఎం కుమారస్వామికి వివరించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుంతో చెప్పలేనని రామలింగారెడ్డి పేర్కొన్నారు. చదవండి: బుజ్జగింపుల పర్వం షురూ -
రసవత్తరం కర్ణాటకం..
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి. సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు. మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ. కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్‌ప్లాన్‌లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు. రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం.. ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ! 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు -
కుమారస్వామి రాజీనామా చేస్తారా?
సాక్షి బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం డోలాయమానంలో పడడంతో రాష గవర్నర్ వజూభాయ్‌వాలా తదుపరి ఏం చేస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ఆపరేషన్ పక్కాగా నిర్వహిస్తున్న యడ్యూరప్ప, ఇతర బీజేపీ కేంద్రమంత్రులు, సీనియర్లు దీనిపై నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన తప్పదా? అనేది సస్పెన్స్‌గా మారింది. సీఎం కుమారస్వామి బెంగళూరుకు రాగానే ఏం చేస్తారనేది తెలుస్తుంది. చదవండి: కన్నడ సంక్షోభం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న అసమ్మతి ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు లేఖలు అందుకున్న గవర్నర్ వజూభాయ్‌వాలా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది అనేది కీలకంగా మారింది. సంకీర్ణ సర్కారును బలం నిరూపించుకోమంటారా?, అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి అవకాశమిస్తారా? అనేదానిపై రాజకీయ పండితు లు సైతం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నారు. నైతికంగా బాధ్యత వహించి ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారా? లేక కొనసాగుతారా? అనేది చర్చనీయంగా మారింది. మాకు సంబంధం లేదు: యడ్డి కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో తనకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలవనని, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి కార్యాలయానికి మంత్రి డీకే శివకుమార్ వెళ్లి ఒక ఎమ్మెల్యే రాజీనామా పత్రం చింపివేయడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. యడ్యూరప్పే సీఎం : డీవీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే యడ్యూర ప్ప సీఎంగా బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు. అసమ్మతి నేపథ్యంలో నైతిక బాధ్యతగా కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు. కాంగ్రెస్ మంతనాలు కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో మంత్రులు కృష్ణభైరేగౌడ, యూటీ ఖాదర్, కేజే జార్జి, దేశపాండే, డీకే శివకుమార్‌తో రాజీనామా చేయించి వారి స్థానంలో అసంతృప్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని తీర్మానించినట్లు సమాచారం. అయితే మంత్రులు రాజీనామా చేస్తారా? దీంతో సద్దుమణుగుతుందా? అనేది తేలాల్సి ఉంది. కాగా, దీనంతటికీ కారణం సిద్ధరామయ్యేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో సిద్ధరామయ్య అనుచరులుగా పేరుపొందిన వారు ఎక్కువ మంది ఉండటం విశేషం. -
ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా?
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు ఈ నాలుగు అంశాలే కారణంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు మంత్రి హెచ్డీ రేవణ్ణ అన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడం. దేవెగౌడ కుటుంబసభ్యుల కనుసన్నల్లో పరిపాలన ఉండడం. కుమారస్వామి మంత్రులు, ఎమ్మెల్యేల ఎవరి అభిప్రాయాలు వినడం లేదు. తనదైన శైలిలో సాగిపోతున్నారు. దేవెగౌడ, కుమారస్వామి ఆలోచనల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం ప్రకటించడంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. వీరితో సిద్ధరామయ్యకు పొసగడం లేదు. దళపతికి గోపాలయ్య షాక్ బెంగళూరులో మహలక్ష్మీ లేఔట్ జేడీఎస్ ఎమ్మెల్యే కె.గోపాలయ్య.. దళపతి దేవెగౌడకు అత్యంత స న్నిహితుడు. అయితే ఆయన కూడా రెబెల్‌గా మారి రాజీనామా చేయడంతో దేవెగౌడకు షాక్ తగిలింది. ఓడిన నాయకులకు పార్టీ పదవినిచ్చి తనను పట్టించుకోలేదనే గోపాలయ్య రాజీనామా చేశార ని సమాచారం.కె.గోపాలయ్యను రెండు రోజుల క్రితం దేవేగౌడ రాష్ట్ర జేడీఎస్ సి నియర్ ఉపాధ్యక్షునిగా నియమించారు. మునిరత్న లేఖను చించేసిన డీకే రాజరాజేశ్వరినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న కూడా రాజీనామా చేయాలని విధానసౌధకు వెళ్లారు. ఆయన రాజీనామా లేఖను గమనించిన మంత్రి డికే శివకుమార్ లేఖను తీసుకుని చించేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జతలో మంత్రి రాజీసూత్రంపై చర్చలు జరిపారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. కావాలంటే మునిరత్న పోలీసులకు ఫిర్యాదు చేసినా పర్వాలేదని, తనపై ఇప్పటికే ఉన్న అనేక కేసుల్లో ఇదొకటి అవుతుందని డీకే అన్నారు. వారికెంత ముట్టిందీ తెలుసు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి డికే శివకుమార్ తెలిపారు. రాజీనామాల వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. అందుకే బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలకు రియల్ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుండి ఎంత డబ్బులు ముట్టిందీ తనకు తెలుసన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. బాధగా ఉన్నా.. తప్పడం లేదు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడం చా లా బాధగా ఉంది, కానీ తప్పడం లేదు, నాకు కాంగ్రెస్ నేతలపై అసంతృప్తి లేదు అని మాజీ హోం మంత్రి, బీటీఎం లేఔట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. శనివారం రెబెల్ ఎమ్మెల్యేల తో కలిసి ఆయన విధానసౌధలో మీడియాతో మా ట్లాడారు. మొదటి నుంచి కూడా పార్టి కోసం కృషి చేశానని, కానీ ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యధ్యక్షుడు ఈశ్వర్‌ఖండ్రే తనను కలిసి పార్టీకి పెద్దద్ద దిక్కుగా ఉన్న వారు మీరే రాజీనామా చేస్తే ఎలా అని అన్నారని చెప్పారు. తాను రాజీనామా చేయడంపై పార్టీ పెద్దలకు చాలా సార్లు వివరణనిచ్చానని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడడానికీ కన్నీళ్లు వస్తున్నా గత్యంతరం లేదన్నారు. తాను మాత్రం రాజీనామా చేస్తున్నానని, కూతురు సౌమ్యారెడ్డి విషయం నాకు తెలియదని అన్నారు. అనుమానాస్పదంగా దేవనహళ్లి ఎమ్మెల్యే తీరు శనివారం రాజధాని బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా పేరుతో హైడ్రామాకు తెరలేపగా ఇటు బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి జేడీఎస్ ఎమ్మెల్యే నిసర్గ నారాయణస్వామి హఠాత్తుగా మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ దొరక్కుండా వెళ్లిపోయారు. ఇటు నిసర్గ నారాయణస్వామి కూడా రాజీనామా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సంకీర్ణప్రభుత్వంపై ఆయన కూడా తీవ్ర అసంతప్తితో ఉన్నారు. మొదట నిసర్గ నారాయణస్వామిని బెంగళూరు విమానాశ్రయం అభివద్ధి మండలి అధ్యక్షుడిగా నియమించి కేవలం ఒకటిన్నర నెల రోజుల్లోనే ఆ పదవిని వెనక్కు లాక్కున్నారు. ఇది చాలదన్నట్టు దొడ్డబళ్లాపురం ఎమ్మెల్యే (కాంగ్రెస్) వెంకటరమణయ్యకు అదే బయాప అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో నిసర్గ నారాయణస్వామి అసంతప్తితో రగిలిపోయారు. దీంతో ఆయనకు బీజేపీ గాలం వేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసిపోయారా? అని నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. -
సంక్షోభం దిశగా కర్ణాటక ప్రభుత్వం
-
పింఛన్లు పెంచుతాం
రాయచూరు : భవిష్యత్తులో దివ్యాంగులకు రూ.2500, వృద్ధులకు రూ.2 వేల వరకూ పింఛన్ పెంచుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన బుధవారం మాన్వి తాలూకా కరేగుడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా మాన్వి తాలూకా కరేగుడ్డలో ముఖ్యమంత్రి పాఠశాల గదిలో నిద్రించారు. రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు వెంకట్రావ్ నాడగౌడ, శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, అమరేగౌడ, హులిగేరిలు పాల్గొన్నారు. -
‘రోడ్డు మీద కూడా పడుకోగలను’
బెంగళూరు : 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలేం అక్కర్లేదు.. అవసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి. శుక్రవారం నుంచి గ్రామాల్లో పర్యటన నిమిత్తం ‘గ్రామ వాస్తవ్య 2.0’ కార్యక్రమాన్ని యాద్గిర్ నుంచి ప్రారంభించారు కుమారస్వామి. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేయబోయే ఓ లాడ్జీలోని బాత్రూమ్ని రిన్నోవేట్ చేశారు అధికారులు. దాంతో విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం గ్రామ పర్యటన చాలా విలాసవంతంగా సాగుతుందని.. ఆయన కోసం 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించాయి. ఈ విమర్శలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఓ చిన్న బాత్రూంను నిర్మిస్తే ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నాయి. రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోతాను. ఫ్రెష్ అవడానికి చిన్న బాత్రూం ఏర్పాటు చేశారు. అది కూడా తప్పేనా. దానికే 5 స్టార్ హోటల్ రేంజ్ ఏర్పాట్లు అంటూ విమర్శించడం సరికాదు. పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. అది కూడా సాధరణ పౌరుడిలానే బస్సులో వచ్చాను. నేను ప్రయాణం చేసింది ఓల్వో బస్సు కాదు సాధరణ బస్సులో. గుడిసేలో కాదు అసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను’ అన్నారు. అంతేకాక ‘మా నాన్న ప్రధానిగా ఉన్నప్పుడు రష్యాలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలేస్‌లో బస చేశాను. ఇప్పుడు అవసరమైతే రోడు మీద కూడా పడుకోగలను. జీవితంలో అన్ని రకాల ఎత్తు పల్లాలు చూశాను. ఇప్పుడు బీజేపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ కుమారస్వామి ఘాటుగా స్పందించారు. అనంతరం పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోగల్గుతున్నానని.. వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కుమారస్వామి. -
కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు : సీఎం కుమారస్వామి
బెంగళూరు : కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ బాంబు పేల్చిన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను మాట్లాడింది అసెంబ్లీ ఎన్నికల గురించి కాదని, స్థానిక ఎన్నికల గురించి మాత్రమేనని స్పష్టతనిచ్చారు. తాను ఉన్నది కేవలం జేడీఎస్‌ను బలోపేతం చేసేందుకేనని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని, నాలుగేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాగా తన తనయుడు కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పెత్తనం చెలాయిస్తుందని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు కలిసి ఉంటామని చెప్పి..ప్రస్తుతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో దేవెగౌడ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఘోర పరాభవం చెందడం, బీజేపీ ఆపరేషన్ కమలానికి తెరతీసిందంటూ వార్తలు వెలువడటంతో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ వర్గాల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఓటమిపై ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవెగౌడ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తన తండ్రి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడితే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి : నా కొడుకు సీఎం కావాలని కోరుకోలేదు : దేవేగౌడ -
‘ప్రభుత్వాన్ని నడపడం గండంగా మారింది’
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వాన్ని నడపడం దినదిన గండంగా మారిందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక బాధలు, సంకీర్ణ సమస్యల నడుమ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. సీఎంగా తప్పని పరిస్థితుల్లో ఈ పదవిలో కొనసాగుతున్నానని, ప్రభుత్వాన్ని నడపడం సవాలుగా మారిందని సంకీర్ణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా తన విధిని నిర్వర్తించడంలో రోజూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కాగా సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి ఇదివరకే అనేకసార్లు బహిరంగ వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌తో కూడిన కూటమితో జేడీఎస్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న అసంతృప్తులు కూమరస్వామిని గద్దేదించే ప్రయత్నం చేస్తూన్నారంటూ జేడీఎస్‌లో అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త సభ్యుల చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నట్టు సమాచారం. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, బళ్లారి ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు మరికొందరు ఢిల్లీలో బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని.. ఓ వర్గం నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఈ పరిణామం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. -
అదో రాజకీయ సమస్య, దాన్ని వదిలేయండి..
సాక్షి బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై శనివారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సమాధానమిచ్చారు. ‘‘ అదో రాజకీయ సమస్య, దాన్ని వదిలేయండి. మేము చూసుకుంటాము. మీరు కంగారుపడాల్సిన అవసరంలేద’’ ని అన్నారు. అయితే.. జనతాదళ్ రెండు, కాంగ్రెస్ తరఫున ఒకరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నా- రెండు పార్టీలూ చెరో స్థానాన్ని మాత్రమే భర్తీచేశాయి. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లను కేబినెట్లోకి తీసుకోవటం గమనార్హం. ఈ మేరకు కొత్త మంత్రులచే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ వీఆర్ వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఇద్దరు కొత్త మంత్రులు దేవుడి పేరుమీదుగా ప్రమాణం చేశారు. అయితే శాఖలు కేటాయించలేదు. ఆర్.శంకర్ హావేరి జిల్లా రాణిబెన్నూరు నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా హెచ్.నగేశ్ కోలార్ జిల్లా ముళబాగిలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. కాగా సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్ కోటాలో ఇంకా ఒక బెర్తు ఖాళీగా ఉంది. మైత్రి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ 22, జేడీఎస్ 12 మంత్రి పదవులను పంచుకున్నాయి. ఇందులో భాగంగా జేడీఎస్ నుంచి 10, కాంగ్రెస్ 21 మంది మంత్రులు ఉన్నారు. తాజాగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం మొత్తం 33 మంది మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ కోటా భర్తీ అయింది. కేవలం జేడీఎస్ నుంచి మాత్రమే ఒకరికి కేబినెట్ అవకాశం ఉంది. అయితే కేబినెట్ విస్తరణపై రెండు పార్టీల్లోనూ అసమ్మతి నెలకొంది. రెండు పార్టీల అధ్యక్షులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అంతేకాకుండా పలువురు కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తు ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త సమస్య రానుంది. కార్యక్రమానికి సీఎం హెచ్డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు. కాగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలే అయినా.. కేబినెట్ విస్తరణ రెండుసార్లు చేపట్టారు. కాంగ్రెస్ బెర్తులు ఫుల్.. పార్టీలో అసమ్మతి మైత్రి ఒప్పందంలో భాగంగా సంకీర్ణ ప్రభుత్వంలోని కేబినెట్లో కాంగ్రెస్ కోటాలోని 22 బెర్తులు భర్తీ అయ్యాయి. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే కేబినెట్ బెర్తును ఆశించిన చాలామంది సీనియర్ నేతలు అసమ్మతితో ఉన్నారు. కేబినెట్లో తమకు చోటు దక్కలేదని భావిం చి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు రామలింగారెడ్డి (బీటీఎం లేఅవుట్), రమేశ్ జార్కిహోళి (గోకాక్), చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, మహేశ్ కుమటళ్లి (అథణి), ప్రతాప్‌గౌడ పాటిల్ (మస్కి), నాగేంద్ర (బళ్లారి రూరల్) తదితరులు కేబినెట్ బెర్తు ఆశించి భంగపడ్డ వారి జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరందరు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి ఆర్.శంకర్ హావేరి జిల్లా రాణిబెన్నూరు నుంచి గత 2018 విధానసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆర్.శంకర్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్లో చేరారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనంతరం కేబినెట్ విస్తరణలో ఆయనను తొలగించారు. కాగా మాజీ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆర్.శంకర్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్య తరలివెళ్లి కేబినెట్ బెర్తు ఇస్తామని.. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఎం ఫరూక్‌కు జేడీఎస్ మొండిచెయ్యి జేడీఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న హెచ్.విశ్వనాథ్‌కు కేబినెట్ బెర్త్ వస్తుందనే ప్రచారం సాగింది. అదేవిధంగా విధాన పరిషత్ సభ్యుడు బీఎం ఫరూక్‌కు జేడీఎస్ తరఫున ముస్లిం కోటాలో మంత్రి పదవి ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే జేడీఎస్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గానూ ఒక్క స్థానాన్ని స్వతంత్ర ఎమ్మెల్యేకు కట్టబెట్టారు. మరో స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఎవరికి ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జేడీఎస్ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన హెచ్.విశ్వనాథ్ (హుణసూరు ఎమ్మెల్యే) కేబినెట్ బెర్తు ఆశించారు. అయితే చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన బీజేపీలోకి చేరుతారనే వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుల డుమ్మా సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి.. కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు హాజరు కాలేదు. ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చనీయంగా మారింది. అయితే జేడీఎస్ అధ్యక్షుడు విశ్వనాథ్ ఇటీవల రాజీనామా చేశారు. ఇంకా ఆమోదం తెలపలేదు. అదేవిధంగా దినేశ్ గుండూరావును కేపీసీసీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది.