మైసూరు: మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడి కేసులో కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఆయన పేరును ప్రస్తావిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని బాధిత యువతి కోరినందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీలోనే కుట్రలు : డీకే
శివమొగ్గ: జార్కిహొళి వీడియోల కేసులో బాధిత యువతి చెప్పిన వివరాలు నా దృష్టికి వచ్చాయి, విచారణ జరుగుతున్నందున ఏమీ చెప్పలేను అని కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ అన్నారు. శివమొగ్గలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సీడీ వెనుక ఎవరున్నారో తెలియడం లేదన్నారు. బీజేపి ఎమ్మెల్యే యత్నాళ్ కూడా రాసలీల వీడియోల గురించి మాట్లాడారన్నారు. దీనిని బట్టి బీజేపీలోనే కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు సీడి కేసులో తమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని, తగిన సమయంలో స్పందిస్తానని తెలిపారు.
తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే
సీడీ కేసుపై సిద్దరామయ్య
శివాజీనగర: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి విడుదల చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షనేత సిద్దరామయ్య స్పందించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయటంపై అసెంబ్లీలో మాట్లాడుతానని, సీడీ కేసు వెనుక కాంగ్రెస్ నాయకులున్నారనే ఆరోపణపై అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య, దీనిపై కూడా తాను స్పందించనని, ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment