ramesh jarkiholi
-
రాసలీలల సీడీ కేసు: ఆ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు..!
సాక్షి బెంగళూరు(కర్ణాటక): ఎటువంటి ఆరోపణలు లేనివారికే మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది. వీరిలో వీడియోల సీడీల నాయకులూ ఉన్నారు. రమేశ్ జార్కిహొళి సీడీలు బయటపడినప్పుడు తమ సీడీలు ఏవైనా ఉంటే ప్రసారం చేయరాదంటూ అప్పటి మంత్రులు కొందరు కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకోవడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అలాగే బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా వేరే వేరే కారణాలతో తమ పరువుకు నష్టం కలిగించే వార్తలు ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. పదవి ఇచ్చాక విడుదలైతే సమస్య.. సీడీతో పాటు ఇతరత్రా ఆరోపణలుంటే మంత్రిమండలిలోకి తీసుకోరాదని అధిష్టానం, ఆర్ఎస్ఎస్ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తే ఆ తర్వాత వారి సీడీలు ఏవైనా విడుదలయితే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సీడీ భయంతో కోర్టును ఆశ్రయించిన వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అది సర్కారు మనుగడకు ఇబ్బందికరమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వలస ఎమ్మెల్యేలు, సీడీల ఆరోపణలున్నవారి భవిత ఉత్కంఠగా తయారైంది. -
రాసలీల సీడీ కేసు: చీఫ్ లేకుండానే విచారణా?!
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీల సీడీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చట్టబద్ధమా అనే విషయంపై హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసులో బాధిత యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడల ధర్మాసనం విచారించింది. సిట్ విచారణ కొనసాగింపుపై తాము పరిశీలన చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. సిట్ చీఫ్, అదనపు పోలీసు కమిషనర్ సౌమేందు ముఖర్జీ గత మే నెల 1 నుంచి సెలవులో ఉన్నారని, ఆయన గైర్హాజరీలో జరిగిన సిట్ విచారణ చట్టబద్ధమా కాదా అనే విషయం పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆయన లేకుండానే దర్యాప్తు కొనసాగిస్తారా, దీనిపై సమాధానం ఇవ్వాలని సిట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తుది నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. కోతుల బెడదపై హైకోర్టు ఆగ్రహం బనశంకరి: ఐటీ సిటీలో సుమారు లక్షకు పైగా కోతులు ఉన్నాయని అంచనా. ఇవి ఇళ్లు, అపార్టుమెంట్లలో దూరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలువురు హైకోర్టులో కేసులు వేయగా, కోర్టు కూడా బీబీఎంపీకి అక్షింతలు వేసింది. మంగళవారం మరో అర్జీని విచారించిన హైకోర్టు, బీబీఎంపీకి చీవాట్లు పెట్టి కోతుల గోలను అరికట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగర శివార్లలో కోతుల ఉద్యానాన్ని నిర్మించి మొత్తం వానరాలను పట్టి అక్కడకు తరలించాలని బీబీఎంపీ యోచిస్తోంది. -
త్వరలోనే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం: జార్కిహోళి
సాక్షి, బెంగళూరు: వారం రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి అన్నారు. శుక్రవారం ఆయన మైసూరు నగరంలోని చాముండి కొండ వద్ద ఉన్న తప్పలిలోని సుత్తూరు శాఖ మఠానికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అక్కడ తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్ళనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే బోట్ వంటిదని, అందులో చేరాలన్న ఆలోచన కూడా లేదన్నారు. తాను రాజీనామా చేసినా బీజేపీలోనే ఉంటానని పేర్కొన్నారు. బీజేపీలో వచ్చిన తరువాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని, అనంతరం జరిగిన పరిణామాలు తనను ఎంతో తీవ్రంగా కలిచివేశాయని, వారం రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. తనకు మళ్ళీ మంత్రి కావాలనే ఆసక్తి లేదని, తన రాజకీయ గురువు ఫడ్నవీస్‌ను కలవడానికి ముంబైకు వెళ్లింది నిజమేనని అన్నారు. చదవండి: మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరి -
రాసలీలల కేసు: యువతి తండ్రి పిటిషన్ కొట్టివేత
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో బాధిత యువతి తండ్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తన కూతురు సీఆర్పీసీ 164 కింద కోర్టులో జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం చట్టవ్యతిరేకమని, దీనిని రద్దుచేయాలని యువతి తండ్రి కోరారు. అయితే అర్జీలో బలం లేదని న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తన కూతురును ఎవరో తెరవెనుక నుంచి ఆడిస్తున్నారని తండ్రి ఆరోపించడం తెలిసిందే. కాగా, సీడీ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేయాలని, సిట్ నియామకమే అక్రమమని జార్కిహొళి తరఫు న్యాయవాది మంగళవారం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగనుంది. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
Leadership Crisis: తలోమాట చెరోబాట; మావల్లే గొడవలు అన్న జార్కిహోళి!
సాక్షి, బెంగళూరు: నాయకత్వ సంక్షోభం సుడులు తిరుగుతుండగా, సీఎం యడియూరప్ప తన శక్తిని చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులతో సమావేశాలు జరుపుతూ నా బలం ఇదీ అని ప్రదర్శిస్తున్నారు. గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులు సీఎంను కలిశారు. మీరు సీఎం పదవి నుంచి తప్పుకోరాదని పట్టుబట్టారు. సీఎం నివాసం కావేరిలో హోం మంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు జే.సీ.మాధుస్వామి, అంగార, మరికొందరు యడియూరప్పను కలిసి రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. తరువాతర వీరందరూ పార్టీ ఇన్చార్జ్ అరుణ్‌సింగ్‌ను కలవాలని అనుకున్నా సీఎం వద్దని వారించారు. సెవెన్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న సీఎం రాజకీయ కార్యదర్శి ఎం.పీ.రేణుకాచార్య ఇంట్లోనూ సీఎం మద్దతుదారులైన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వారు కూడా అరుణ్‌సింగ్‌ను కలిసి యడ్డికి మద్దతుగా గొంతు వినిపించాలని అనుకున్నారు. కానీ చివరక్షణంలో భేటీని రద్దు చేసుకున్నారు. యడ్డిపై యోగీశ్వర్, యత్నాళ్ ధ్వజం యడియూరప్పపై తిరుగుబాటు వర్గంలోనున్న మంత్రి సీపీ యోగీశ్వర్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్ మరోసారి భగ్గుమన్నారు. యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కావడానికి సహకరించిన తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని, కానీ రామనగర జిల్లా ఇన్చార్జ్ ఇవ్వలేదని సీపీ యోగీశ్వర్ దుయ్యబట్టారు. రామనగరలో డీకే శివకుమార్, చెన్నపట్టణలో హెచ్డీ కుమారస్వామితో యడియూరప్పకు ఒప్పందం ఉందని, వారు అడిగిన అధికారులను నియమిస్తారని విమర్శించారు. యత్నాళ్ మాట్లాడుతూ యడ్డి ప్రభుత్వంలో అవినీతి, సీఎం తనయుడు విజయేంద్ర జోక్యం పెరిగిపోయిందన్నారు. యడ్డికి ఆరోగ్యం, వయసు మీరింది, ఆయనను మార్చాలని అన్నారు. గొడవలు మావల్లే: జార్కిహొళి మరో రెండేళ్ల పాటు యడియూరప్ప సీఎంగా కొనసాగుతారని మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో బీజేపీలో గందరగోళం నెలకొందని మంత్రి ఈశ్వరప్ప అనడంలో తప్పు లేదన్నారు. తాము యడియూరప్ప, అమిత్‌షాను నమ్ముకొని బీజేపీలోకి వచ్చామన్నారు. కోపతాపాలు ఉంటే పిలిపించి పరిష్కరించాలన్నారు. తాను సీఎం రేస్‌లో లేనని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నారని యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ ధ్వజమెత్తారు. సర్కారును రద్దు చేయాలి: సిద్ధు శివాజీనగర: అధికార బీజేపీలో అంతర్గత కలహాలతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది, అందుచేత గవర్నర్ తక్షణం యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చూడాల్సిన మంత్రులు ఆఫీసులకు వెళ్లకుండా బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తంలో రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్లయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. నా ఫోన్ ట్యాపింగ్: బెల్లద్ బనశంకరి: తన ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ పరోక్షంగా సీఎం యడియూరప్పపై ఆరోపణలు చేశారు. నగరంలో అరవింద్ బెల్లద్ విలేకరులతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం రాజస్వామి అనే వ్యక్తి ఫోన్ చేసి తనను అనవసరంగా జైలుకు పంపించారని వాపోయాడన్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై స్పీకర్, హోంమంత్రి, డీజీపీకి లేఖ రాశానన్నారు. జైలులో ఉన్న వ్యక్తికి నా ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారనేది విచారించాలన్నారు. నేను జ్యోతిష్యుణ్ని కాను దొడ్డబళ్లాపురం: బీజేపీలో ఎవ్వరూ లక్ష్మణరేఖ దాటడం లేదు. అయితే రాబోవు రోజుల్లో ఏం జరగబోతోందో నేను చెప్పలేనని, తాను జ్యోతిష్యున్ని కానని డీసీఎం అశ్వత్థనారాయణ అన్నారు. రామనగర పట్టణంలో గురువారం రోటరీ బీజీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ ఇప్పటికే నాయకత్వ మార్పునకు సంబంధించి స్పష్టం చేసారన్నారు. అరుణ్ సింగ్ రాష్ట్రానికి రావడాన్ని భూతద్దంలో చూడవద్దన్నారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్నారు. నాయకత్వ మార్పుపై తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు. చదవండి: నా పదవికి ఢోకా లేదు: సీఎం -
రాసలీలల కేసు: సీడీ కేసు విచారణ ఇలాగేనా?
సాక్షి, బనశంకరి(కర్ణాటక): మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో సిట్ సమర్థంగా దర్యాప్తు చేయడం లేదని బాధిత యువతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. జార్కిహొళిని సిట్ సక్రమంగా విచారించలేదు, రక్త పరీక్ష, తల వెంట్రుకల పరీక్షలు చేయలేదు, బీపీ, షుగర్ పరీక్షించి పంపారని ఆమె ఆరోపించింది. సిట్ చీఫ్ సౌమేందు ముఖర్జీ సెలవు పెట్టడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ కేసును సమర్థమైన çసంస్థతో విచారణ చేయించాలని ఆమె కోరింది. మరోవైపు యువతి తనకు తెలుసని, ఇద్దరి ఆమోదంతో గదిలో గడిపామని జార్కిహొళి ఇచ్చిన వాంగ్మూలం నివేదికను సిట్ హైకోర్టుకు అందజేసింది. ఇద్దరికి ముందస్తు బెయిలు.. సీడీ కేసులో నిందితులు నరేశ్‌గౌడ, శ్రవణ్‌కు మంగళవారం నగర 91 వ సీసీహెచ్ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. వీరిపై జార్కిహొళి ఫిర్యాదు చేయడంతో అరెస్టు కోసం పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో బెయిలు పొందారు. మార్చి 2 వ తేది నుంచి పరారిలో ఉన్నారు. చదవండి: మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ట్యూషన్ టీచర్.. ట్విస్ట్ ఏంటంటే.. -
రాసలీల సీడీ కేసు: నా కూతురు ఆచూకీ చెప్పండి
హుబ్లీ: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సీడీ కేసు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా తాజాగా తన కుమార్తె కనిపించలేదని బాధితురాలి తండ్రి ధార్వాడ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సీడీ కేసు వెలుగులోకి వచ్చాక తన కుమార్తె కొన్ని నెలలుగా కనిపించలేదని, ఆమె ఎక్కడ ఉందో తెలియదని, ఆమె ఆచూకీ తెలియజేయాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు యువతి తండ్రి ప్రకాశ్ వేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. చదవండి: రమేశ్‌ను అరెస్ట్ చేయాలి:కేపీసీసీ చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
రాసలీలల సీడీ కేసు: రమేశ్‌ని అరెస్టు చేయాలి
బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని సీడీ కేసులో అరెస్టు చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులోనే హోంమంత్రి బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని, కేసు వెనుక ఉన్న అందరి పాత్రలు తేలేందుకు స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కేసులో అనేక అవకతవకలు జరిగాయని పలు ఉదాహరణలను వివరించారు. రేప్ కేసులో నిందితున్ని అరెస్టు చేయకపోవడం ఇక్కడ మాత్రమే చూస్తున్నామని, సిట్ అధిపతి సౌమేందు ముఖర్జీని సెలవుపై పంపించారని సిద్ధరామయ్య ఆరోపించారు. చదవండి: రాసలీలల సీడీ కేసు అవును.. ఆమె తెలుసు..! -
రాసలీలల సీడీ కేసు: అవును.. ఆమె తెలుసు..!
సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్ విచారణలో యువతితో పరిచయం ఉందని, ఇద్దరం ఏకాంతంగా గడపడానికి మాట్లాడుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె వీడియోలు తీసి బహిర్గతం చేసిందని వాపోయారు. యువతి తరఫు న్యాయవాది జగదీశ్‌కుమార్ దీనిపై మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడైన జార్కిహొళిని అరెస్టు చేయాలని కోరారు. -
రాసలీలల సీడీ కేసు: జార్కిహొళిని అరెస్టు చేయాలి
బనశంకరి: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళీ రాసలీలల సీడీ కేసును వెనక్కి తీసుకోవాలని తమ న్యాయవాదిని ప్రలోభ పెట్టి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆ కేసులో బాధిత యువతి ఆరోపించారు. తక్షణం మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని అరెస్ట్ చేయాలని బుధవారం బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్, సిట్ ఉన్నతాధికారి కవితలకు ఆమె లేఖ రాశారు. తమ న్యాయవాదులు జగదీశ్‌కుమార్, సూర్య ముకుంద రాజ్‌లను కేసు వాదనల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని యువతి ఆరోపించారు. సాక్ష్యాల్ని నాశనం చేసి, కేసును వాపస్ తీసు కోవాలని జార్కిహొళి తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారని చెప్పారు. చదవండి: ప్లీజ్.. సాయం చేయండి: హీరోయిన్ మొర -
రాసలీలల కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: మాజీమంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించే అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు న్యాయవాదులు వేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్.ఓకా నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ల వాదనల్ని ఆలకించిన న్యాయపీఠం, సిట్ చీఫ్ సౌమేందు ముఖర్జీ అందించిన విచారణ నివేదికను పరిశీలించింది. ఈ సందర్భంగా, ఈ కేసులో నమోదైన మూడు ఎఫ్ఐఆర్లనూ తనిఖీ చేసి కేసు సీబీఐకి అప్పగించాల్సిన పని లేదని పేర్కొంటూ, తదుపరి విచారణను మే 31 కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్ అవుతోందని, టీవీ చానెళ్లలో విచారణ మాదిరిగా చర్చాగోష్టులు నడుస్తున్నాయని అర్జీదారులు వాదించారు. మీడియాను కట్టడిచేయాలని కోరారు. ఈ వాదనల్ని తిరస్కరించిన న్యాయపీఠం ఏ ఆధారంతో ప్రభుత్వం మీడియాను కట్టడి చేయాలని ప్రశ్నించింది. చదవండి: రాసలీలల కేసు: అందుకే అలా చెప్పాను! -
రాసలీలల కేసు: అందుకే అలా చెప్పాను!
యశవంతపుర: కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల కేసులో తను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు బాధిత యువతి మంగళవారం తెలిపింది. సిట్ ముందు తాను ప్లేటు ఫిరాయించలేదని తెలిపింది. హనీ ట్రాప్ అని ఒత్తిడి వల్ల చెప్పాను, మళ్లీ విచారణ చేయాలని సిట్‌ను కోరినట్లు పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. ఇక బాధిత యువతి వీడియోను సిట్ విడుదల చేయడం తగదని ఆమె న్యాయవాది జగదీశ్ మంగళవారం అన్నారు. కావాలనే హనీ ట్రాప్ వంటి వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు. తద్వారా కోర్టుని, యువతిని మోసగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిట్ అధికారుల చేతులను ప్రభుత్వం కట్టేసిందని జగదీశ్ ఆరోపించారు. చదవండి: రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి రాసలీలల వీడియో.. ఆశా కార్యకర్త సస్పెన్షన్ -
రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి
సాక్షి, బెంగళూరు: రాసలీలల వీడియో సీడీ కేసులో ఇరుక్కున్న కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆదివారం రాత్రి ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన బెళగావి జిల్లా గోకాక్‌లో ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఆయన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగంలో చికిత్స చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రవీంద్ర తెలిపారు. బీపీ, షుగర్ నియంత్రణలోకి రాలేదని చెప్పారు. మహారాష్ట్ర, బెంగళూరు పర్యటనల్లో కరోనా సోకినట్లు భావిస్తున్నారు. నిజానికి సోమవారం ఆయన బెంగళూరులో సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన సిట్ విచారణకు రాకపోవడం ఇది నాలుగోసారి. గోకాక్ ఆస్పత్రిలో లేరు: యువతి న్యాయవాది రమేశ్ జార్కిహోళి గోకాక్ తాలూకా ఆస్పత్రిలో లేరని సీడీ కేసులో బాధిత యువతి తరఫు న్యాయవాది జగదీశ్ ఆరోపించారు. తనకు తెలిసిన వారు ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ లేరన్నారు. సిట్ విచారణకు రాకుండా కరోనా, ఐసీయూ అని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నేను కిడ్నాప్ కాలేదు: యువతి రాసలీలల వీడియో సీడీ కేసులో బాధిత యువతి.. తననెవరూ కిడ్నాప్ చెయ్యలేదని కోర్టులో తెలిపింది. తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోమవారం సాయంత్రం కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుమారు 100 మంది పోలీసులతో కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటైంది. రాసలీలల కేసును సీబీఐకి ఇవ్వాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను బెంగళూరు హైకోర్టు విచారించి కేసు పురోగతి నివేదికను అందజేయాలని సిట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. మరోవైపు తమ కుమార్తె చెప్పే మాటలను పరిగణించరాదని ఆమె తండ్రి హైకోర్టులో అర్జీ వేశారు. ఆమె మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి, ప్రత్యేక విచారణ బృందానికి ఇటీవల వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండడం తెలిసిందే. -
సీడీ యువతి తల్లికి అనారోగ్యం
సాక్షి, బళ్లారి: రాష్ట్ర మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసులోని యువతి తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నఫళంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోమవారం పోలీసు భద్రతతో విజయపురలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, తన తల్లి(సీడీ యువతి అమ్మమ్మ)కి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమె బెళగావి నుంచి విజయపురకు వచ్చారు. అదే సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఇక కూతురును చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీడీ యువతి తల్లి సిట్‌ని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: రాసలీలల కేసు: మా కూతురిని చూపించండి -
రాసలీలల కేసు: మా కూతురిని చూపించండి
సాక్షి, బళ్లారి: రాసలీల సీడీలో ఉన్న యువతి నాలుగు నెలలుగా కుటుంబానికి దూరమైంది. ఆమెను తమకు చూపాలని కుటుంబ సభ్యులు సిట్‌కు విన్నవించారు. సదరు యువతి అవ్వ విజయపుర జిల్లా నిడగుందిలో ఉంటోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆ యువతి తల్లిదండ్రులు ఈనెల 1న నిడగుందికి వచ్చారు. అప్పటినుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో సిట్ అధికారులను కలిసి తమ కుమార్తెను తమకు చూపించాలని కోరుతున్నారు. సీడీ యువతికి డబ్బు పంపలేదు: మాజీ మంత్రి సాక్షి, బళ్లారి: రాసలీల సీడీలో ఉన్న యువతికి తాను నగదు ట్రాన్స్ఫర్ చేయలేదని మాజీ మంత్రి డి.సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన చిత్రదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు మాజీ మంత్రులు సీడీ యువతికి నగదు పంపినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నగదు పంపి ఉంటే ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకొనేవారమన్నారు. ఎస్ఐటీ అధికారులు తనను విచారణకు పిలిస్తే హాజరై సమాధానం చెబుతానన్నారు. తనకు మాజీ సీఎం సిద్దరామయ్య, రమేష్ జార్కిహొళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌లతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఎవరితోనూ రాజకీయ విభేదాలు లేవన్నారు. చదవండి: బెంగళూరు డ్రగ్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు? -
సీడీ కేసు: సిట్ విచారణకు రమేశ్ జార్కిహోళి గైర్హాజరు
సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసుకు సంబంధించి సిట్(ఎస్ఐటీ) చేపట్టిన విచారణకు కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా రమేష్ జార్కిహొళి విచారణకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాది శ్యామ్ సుందర్ సిట్ అధికారులకు తెలిపారు. వచ్చే సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇలా ఉండగా, సీడీ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సిట్ అధికారులపై ఎవరూ ఒత్తిడి చేయరాదని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్ స్పష్టం చేశారు. సిట్ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తారన్నారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా పని చేయాలని ప్రభుత్వం వారిని నియమించిందన్నారు. (చదవండి: యువతి, జార్కిహొళి గదుల్లో సిట్ తనిఖీలు) -
యువతి, జార్కిహొళి గదుల్లో సిట్ తనిఖీలు
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి విచారణలో తెలిపిన ప్రకారం సాక్ష్యాధారాల సేకరణలో సిట్ పోలీసులు నిమగ్నమయ్యారు. యువతి గతంలో బసచేసిన ఆర్టీ నగర పీజీ (పేయింగ్ గెస్ట్) హాస్టల్ గదితో పాటు మల్లేశ్వరంలోని రమేశ్ జార్కిహొళి ఫ్లాటులో భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. వీడియో కాల్స్, ధరించిన దుస్తులు, రికార్డింగ్‌కు ఉపయోగించి సామగ్రి కోసం గాలించారు. యువతి ఫిర్యాదు ప్రకారం ఢిల్లీలోని కర్ణాటక భవన్ నుంచి రమేశ్ జార్కిహొళి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ సమయంలో తాను గదిలో ఉన్నట్లు తెలిపింది. మాజీ మంత్రి తనను లైంగికంగా వాడుకున్నాడని, బెదిరించాడని ఆరోపణలు చేయడం తెలిసిందే. ఆమె ఆరోపణల్లో నిజానిజాల నిర్ధారణ కోసం ఇద్దరి గదుల్లో సోదాలు జరిపారు. ఆమె చెప్పిన వాటికి కచ్చితమైన సాక్ష్యాలు లభిస్తే రమేశ్ జార్కిహొళిని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక్కడ చదవండి: రాసలీలల కేసు: మంత్రితో అక్కడే తొలి పరిచయం కొత్త ట్విస్ట్: ‘ఆ పని ఆయనే చేయమన్నాడు..’ -
రాసలీలల కేసు: అజ్ఞాతంలోకి జార్కిహొళి?
సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి అరెస్టు భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇన్నిరోజులూ అజ్ఞాతంలో ఉన్న సీడీలోని యువతి మంగళవారం కోర్టులో లొంగిపోవడం, జడ్జికి వాంగ్మూలమివ్వడం తెలిసిందే. బుధవారం ఆమెను సిట్ పోలీసులు తీసుకెళ్లి విచారించారు. రెండుచోట్లా జార్కిహొళి తనను లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపులకు గురిచేశారని ఆరోపించినట్లు తెలిసింది. దీంతో రమేశ్ జార్కిహొళి అరెస్టు భయంతో ముంబయికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఎవరికీ అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకెళ్లారు. ఢిల్లీ వకీళ్లతో మంతనాలు.. తాను ఏ తప్పూ చేయలేదని, సీడీ వీడియోలన్నీ కల్పితాలని జార్కిహొళి చెబుతూ ఉన్నారు. యువతి కోర్టు, సిట్ ముందుకు వచ్చేసరికి జార్కిహొళి ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించుకుని తరుణోపాయాలపై మంతనాలు ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన నలుగురు ప్రముఖ న్యాయవాదులతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరితో చర్చించినట్లు ఉన్నట్లు తెలిసింది. తనపై ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. చదవండి: శారీరకంగా వాడుకున్నా అందుకే మౌనందాల్చా రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్! -
రాసలీలల కేసు: మంత్రితో అక్కడే తొలి పరిచయం
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతికి బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలింది. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న యువతిని భారీ పోలీసు బందోబస్తు మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్సకు వచ్చే రోగులు, ఆస్పత్రి అధికారులు, సిబ్బందికి తప్ప ఎవరినీ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. తరువాత విచారించేందుకు సిట్ ఆఫీసుకు తీసుకెళ్లారు. విధానసౌధలో తొలి పరిచయం.. కొంతకాలం కిందట తొలిసారిగా విధానసౌధకు వెళ్లినప్పుడు మంత్రి రమేశ్ జార్కిహొళిని కలిసినట్లు యువతి చెప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో తన మొబైల్లో మల్లేశ్వరం పీజీ అని మంత్రి నంబరును సేవ్ చేయించారు. తనకు సహకరించాల్సిందిగా కోరారు. రెండు, మూడుసార్లు శారీరకంగా వాడుకున్నారు. మా ప్రాంతంలో బలమైన నేత కావడంతో ఏమీ చేయలేక మౌనం దాల్చాను అని ఆ యువతి సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఎప్పుడైనా సాక్ష్యాలుగా పనికొస్తాయని రమేశ్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను వీడియోలు తీసినట్లుపేర్కొంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదని, కానీ తన క్లాస్మేట్ శ్రవణ్‌కు చెప్పినట్లు తెలిపింది. ఆ వీడియోల సీడీలను అతనితో పాటు నరేశ్ అనే మరో స్నేహితునికి ఇచ్చినట్లు, మరో కాపీని తన రూంలో ఉంచినట్లు తెలిపింది. చదవండి: (రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్!) -
రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్!
సాక్షి, బెంగళూరు: కన్నడనాట రోజూ ఉత్కంఠ రేకెత్తించిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు పురోగతి కనిపించింది. 28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి మంగళవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు ఎదుట మీడియా, పోలీసులు ఎదరు చూశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. బాధిత యువతికి సిట్‌పై నమ్మకం లేదని, అంతేకాకుండా ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్ కృష్ణ ఆమోదించారు. దీంతో న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. రహస్యంగా 2 గంటలు వాంగ్మూలం.. యువతి అత్యంత రహస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు వసంతనగరలోని గురునానక్ భవన్లో ఉన్న ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కోర్టుకి చేరుకుంది. సుమారు రెండు గంటల పాటు జడ్జి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. అక్కడ ఒక స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కోర్టు అనుమతితో సిట్ పోలీసులు యువతిని ఆధీనంలోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించారు. మంగళవారం రాత్రి వరకూ సిట్ ఆమెను విచారించి, మళ్లీ బుధవారం విచారణకు రావాలని పంపించివేసింది. సాక్ష్యాలను సమర్పించిన యువతి? ‘తాము ఇచ్చిన మాట ప్రకారం బాధిత యువతిని కోర్టు ఎదుటకు తీసుకొచ్చాము. ఇక పోలీసులు వారి పనిని చేయాలి. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలి’ అని బాధిత యువతి న్యాయవాది జగదీశ్ డిమాండ్ చేశారు. యువతి ఎలాంటి భయం లేకుండా జరిగినది మొత్తం న్యాయమూర్తి ఎదుట వెల్లడించిందని తెలిపారు. జడ్జి ముందు బాధిత యువతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. రమేశ్ బలమైన నాయకుడు కావడంతో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఆయన బెదిరించడంతో భయపడి దాక్కున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్ ఒత్తిడి చేస్తున్నారు. నా కుటుబానికి రక్షణ కల్పించాలి’ అని యువతి కోరినట్లు సమాచారం. అలాగే తనకు రమేశ్ ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించింది. మరోవైపు వైద్య పరీక్షలు చేసే వరకు తమ రక్షణలో ఉండాలని, అందుకోసం ఎనిమిది మంది మహిళా పోలీసులతో యువతికి భద్రత కల్పించినట్లు తెలిసింది. దిక్కుతోచని జార్కిహొళి.. రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఏకాకిగా మిగిలిపోయారు. ఆయనతో పాటు యడియూరప్ప సర్కారులో మంత్రులైన నేతలు దూరం పాటిస్తున్నారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి ఏకంగా జడ్జి ముందు వాదన వినిపించడంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది. జార్కిహొళి ప్రమాదకర మనిషి అని, తనను చంపినా చంపవచ్చని యువతి పలు వీడియోల్లో ఆరోపించడం తెలిసిందే. మంగళవారం జరిగిన పరిణామాలతో ఆయన న్యాయ నిపుణులతో చర్చించారు. అరెస్టు అవ్వనున్నారనే ఊహాగానాల మధ్య ముందస్తు బెయిల్‌కు రమేశ్ సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఆయన న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జార్కిహొళి మంగళవారం బెళగావిలో ఉండగా, అక్కడి ఉప ఎన్నిక నామినేషన్ల కోసం సీఎం యడియూరప్ప కూడా వచ్చారు. కానీ జార్కిహొళి సీఎంను కలవలేదు. చదవండి: జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు ‘తమ్ముడు నన్ను నమ్ము.. వార్తల్లో చూపించేది అబద్దం’ -
కొత్త ట్విస్ట్: ‘ఆ పని ఆయనే చేయమన్నాడు..’
బెంగళూరు: రాసలీలల కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ఉన్న బాధిత యువతి సంచలన ఆరోపణలు చేసింది. ‘ఆ పని ఆయన ఒత్తిడి వల్లనే చేశాను’ అని బాధిత యువతి ఆరోపించారు. దీంతో కర్నాటకలో కలకలం రేపింది. ఆమె ఆరోపణలు చేసింది ఎవరిపైనే కాదు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్‌పై. ఆయన ఒత్తిడి మేరకు తమ కుమార్తె ఆ పని చేసిందని సోమవారం ఆ యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. రమేశ్ జర్కిహోలీని ఇరికించేందుకు శివకుమార్ కథ అంతా నడిపించాడని బాధిత యువతితో పాటు ఆమె ఇద్దరు సోదరులు, కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అలా చేస్తే కొంత ముట్టజెప్తామని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ ఆరోపణలతో బీజేపీ కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడింది. డీకే శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలు వచ్చిన తెల్లారి మంగళవారం డీకే శివకుమార్ స్పందించారు. ‘నేరం చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి వెనుక ప్రభుత్వం ఉందనే విషయం అందరికీ తెలసు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు’ అని శివకుమార్ మండిపడ్డారు. ‘ఈ పరిణామం జరిగినప్పటి నుంచి మీరు చూస్తునే ఉన్నారు. ప్రభుత్వం నిందితుడికి అండగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా. ఆ కేసుతో నాకేం సంబంధం లేదు. చూద్దాం. విచారణ జరుగుతోంది కదా!’ అని శివకుమార్ పేర్కొన్నారు. ‘నేను వారిపై ఒత్తిడి చేశా అంటున్నారు దానికి సాక్ష్యాలు బహిర్గతం చేయండి’ అని సవాల్ విసిరారు. -
జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల కేసులో బాధిత యువతి సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరులో కోర్టులో లొంగిపోతుందని ఆమె న్యాయవాది జగదీశ్ ఆదివారం చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తేలింది. రమేశ్ జార్కిహొళిపై పలు ఆరోపణలను చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. లేఖలో ఏమి ఉందంటే? ‘‘రమేశ్ జార్కిహొళి ప్రమాదకర వ్యక్తి. సామాన్యులను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ అవసరం. సిట్‌తో దర్యాప్తు చేయించాలి. జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు (హైకోర్టు సీజే) న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. జార్కిహొళి ఏ సమయంలో అయినా నన్ను చంపేస్తాడు’’అని లేఖలో యువతి ఆరోపించింది. సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. జార్కిహోళి ఓ క్రిమినల్. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్‌లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జార్కిహొళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు’అని ఆరోపణలు చేసింది. మరోవైపు ఆమె హైకోర్టులో హాజరు కావడానికి అనుమతి వచ్చిందని న్యాయవాది జగదీశ్ తెలిపారు. చదవండి: (రాసలీల కేసు: అజ్ఞాతం వీడనున్న యువతి?) సిట్ ముందుకు జార్కిహొళి రమేశ్ జార్కిహొళి సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావడం ఇది మూడోసారి. ఆ యువతితో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు తెలిసింది. సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. తన తరఫు న్యాయవాదులతో కలిసిన అనంతరం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఇందుకోసం నాలుగు రోజుల సమయం అవసరమని రమేశ్ జార్కిహొళి కోరారు. యువతికి సిట్ తాజా నోటీసులు సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్‌పార్కు పోలీసుల ఎదుటహాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆ యువతికి పోలీసులు ఇప్పటివరకు ఆమెకు 8 సార్లు నోటీసులు పంపించినా ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. మా కూతురితో కొందరి రాజకీయం తమ కూతురు ఒత్తిడిలో ఉందని, ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోరాదని యువతి తల్లిదండ్రులు అన్నారు. ఆమెకు మానసిక కౌన్సిలింగ్ అవసరమని అన్నారు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలియదని, ఆమెను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేపీసీసీ నేత డీకే.శివకుమార్ చెప్పినట్లు నడుచుకుంటోందని యువతి సోదరుడు ఆరోపించారు. సీడీతో సంబంధం లేదు: డీకే బనశంకరి: సీడీ ఘటన తన కుట్రేనని సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అందించాలని యువతి తల్లిదండ్రులపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ సవాల్‌చేశారు. సోమవారం రాయచూరు ముదగల్‌లో డీకేశి మాట్లాడుతూ తనకు సీడీలోని అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ అమ్మాయి వెనుక డీకే ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఒత్తిడిలో వారు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అన్నారు. -
రాసలీల కేసు: అజ్ఞాతం వీడనున్న యువతి?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీల కేసులో బాధిత యువతి సోమవారం కోర్టు ముందు లొంగిపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సీడీ విడుదలైన మార్చి 2వ తేదీ నుంచి ఆమె పరారీలో ఉంది. తన వాదనలను వినిపిస్తూ ఇప్పటివరకు 5 వీడియోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పోలీసులు కూడా ఆమెను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఆదివారం ఉదయం సదరు యువతి న్యాయవాది జగదీశ్, తన సహోద్యోగి మంజునాథ్‌తో సోషల్ మీడియాలో జరిపిన సంప్రదింపులు ఇందుకు ఊతమిస్తున్నాయి. యువతి సోమవారం ఏదైనా కోర్టులో లొంగిపోవచ్చని జగదీశ్ తెలిపారు. ఆమె కోర్టుకు వచ్చిన తక్షణం అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. యువతి తల్లిదండ్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు హోంమంత్రి బసవరాజ బొమ్మై, సీఎం యడియూరప్ప ఆదివారం ఉదయం సమావేశమై కేసు గురించి చర్చించారు. ఇక జార్కిహొళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మద్దతుదారులు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చదవండి: (బతుకుతానో చస్తానో తెలియదు.. ఆ బాధ్యత ఆయనదే!) -
బతుకుతానో చస్తానో తెలియదు.. ఆ బాధ్యత ఆయనదే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి అజ్ఞాతంలో ఉంటూ వీడియోల ద్వారా తన వాదనలను వినిపిస్తోంది. తనకేదైనా అయి చనిపోతే అందుకు రమేశ్ జార్కిహొళిదే బాధ్యతని స్పష్టంచేసింది. శనివారం నాలుగో వీడియో విడుదల చేసింది. ‘బతుకుతానో చస్తానో తెలీదు. మీడియాకు ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఏదైనా సమాచారం లభిస్తే నిజానిజాలను పరిగణనలోకి తీసుకుని ప్రసారం చేయండి. మార్చి 2న రాసలీలల సీడీని ఎవరు విడుదల చేశారో నాకు తెలీదు. మీడియాలో రావడం చూసి నరేశ్ అన్న(విలేకరి)కి ఫోన్ కాల్ చేశాను’అని ఆమె వీడియోలో పేర్కొంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో మాట్లాడాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని నరేశ్ సూచించినట్లు తెలిపింది. శివకుమార్‌ను కలవాలని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరన్నారు. రమేశ్ సర్కార్‌ను కూల్చుతానన్నాడు రమేశ్ జార్కిహోళి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూల్చుతానని, అందరిని జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన మాటలకు అర్థమేమిటని అమ్మాయి ప్రశ్నించింది. తాను భద్రంగానే ఉన్నానని, కిడ్నాప్‌కు గురి కాలేదని, తన కుటుంబ సభ్యులను బెంగళూరుకు తీసుకెళ్లి రక్షణ కల్పించాలని మనవి చేసింది. ఒక బాధితురాలిగా తనకు న్యాయం జరగాలని, కానీ రేపటి రోజున తనను చంపినా చంపుతారని ఆందోళన వ్యక్తం చేసింది. తనను విపరీతంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒకవేళ తాను చనిపోతే రమేశ్ జార్కిహొళి పేరు రాసిపెట్టి చనిపోతానని పేర్కొంది. అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి శనివారం రాత్రి కొత్తగా ఐదో వీడియోను విడుదల చేసింది. ‘నా తండ్రికి ఏమి తెలియదు, వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వారి నోటి వెంట ఏవేవో మాట్లాడిస్తున్నారు’ అని పేర్కొంది. ఇదంతా ఆయన వల్లనే.. ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. శనివారం బెంగళూరులో నాలుగు గంటల పాటు సిట్ విచారణలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన కుమార్తెను ఒత్తిడితో ఇరికిస్తున్నారని ఆరోపించారు. మా కుమార్తెకు ఏమైనా జరిగితే దానికి డీకే శివకుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ కుమార్తెకు డబ్బులిచ్చి గోవాకు తరలించారని ఆరోపించారు. తన అక్కను అడ్డం పెట్టుకుని డీకే శివకుమార్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని యువతి సోదరుడు తెలిపారు. నాకు సంబంధం లేదు: డీకే వారి ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందిస్తూ ‘అది వారి వ్యక్తిగత విషయం. నాకు దానికి సంబంధం లేదు. నిన్న ఒక్క మాట మాట్లాడుతున్నారు.. రేపు మరో మాట మాట్లాడుతారు’ అన్నారు. పాపం రమేశ్ జార్కిహొళి ఒత్తిడిలో ఉన్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గరికి ఏ యువతీ రాలేదు అని చెప్పారు. ప్రభుత్వంలో ఉండేది బీజేపీ వారే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అని చెప్పారు. -
‘తమ్ముడు నన్ను నమ్ము.. వార్తల్లో చూపించేది అబద్దం’
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో వెలుగు చూసిన రాసలీలల సీడీ కేసు కొత్త మలుపు తీసుకుంది. తన ను ఉద్యోగం పేరుతో మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి లైంగికంగా వినియోగించుకున్నారని, ఆయ నపై తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధిత యువతి శుక్రవారం అజ్ఞాత స్థలం నుంచి ముచ్చటగా మూడోసారి మరో వీడియోను విడుద ల చేసింది. 24 రోజులుగా తనకు ప్రాణభయం ఉందని, కానీ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో తనకు ధైర్యం వచ్చిందని చెప్పింది. కమిషనరేట్‌లో ఫిర్యాదు.. బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్ శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చి రమేశ్ జార్కిహోళిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత యువతి సొంత చేతిరాతతో రాసిన ఫిర్యాదు ప్రతిని పోలీసు కమిషనర్‌కు అందించినట్లు తెలిపారు. రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నారని యువతి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. వీడియో కాల్ ద్వారా అశ్లీలంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడని, ఉద్యోగం ఇప్పించకపోగా ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు.. అశ్లీల సీడీ కేసుకు సంబంధించి బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో రమేశ్ జార్కిహోళిపై ఐపీసీ 376సీ, 354ఏ, 504, 506, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని, రమేశ్ తమను హత్య చేసేందుకు వెదుకు లాట ప్రారంభించారని బాధితురాలు ఆ ఫిర్యాదు లో పేర్కొంది. ఫిర్యాదును బాధితురాలి తరపు న్యాయవాది తొలుత నగర పోలీసు కమిషనరేట్‌లో అందజేయగా దానిని కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని కమిషనర్ కమల్ పంత్ సూచించారు. దీంతో న్యాయవాది జగదీష్ కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందజేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో రమేశ్ జార్కిహోళికి అరెస్టు భయం పట్టుకుంది. రేపటి నుంచి నా ఆట ప్రారంభం: రమేష్ జార్కిహోళి ‘రేపటి నుంచి నా ఆట ప్రారంభమవుతుంది. ఇది ఆమెకు చివరి అస్త్రం. ఇలాంటి పది ఫిర్యాదులు వచ్చినా ఎదుర్కొంటాను’ అని మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి తెలిపారు. యువతి ఫిర్యాదుపై బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్నే కూల్చానని, ఈ కేసు తనకు లెక్క కాదన్నారు. తాను కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే జైలుకు పోతానని, తానే స్వయంగా ఉరి వేసుకుంటానని, పోలీసు స్టేషన్‌కు వెళతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, ఇలా జరుగుతుందని మొదటి నుంచి తనకు తెలుసునని రమేశ్ జార్కిహోళి తెలిపారు. వీడియోలో ఉన్నది నేను కాదు సాక్షి బెంగళూరు: రాసలీలల సీడీ కేసు యువతి తన ఇంట్లో వారితో (తమ్ముడు) ఫోన్లో చేసిన సంభాషణగా చెబుతున్న ఒక ఆడియో విడుదలైంది. జార్కిహోళిపై బాధిత యువతి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఆడియో బయటకు రావడం విశేషం. 6.59 నిమిషాల నిడివి కలిగిన ఈ ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘వీడియో నిజం. కానీ అందులో ఉన్నది నేను కాదు. అదంతా గ్రాఫిక్స్, వాయిస్ మాడ్యులేషన్.. అన్ని క్లియర్ చేస్తాను. డీకే శివకుమార్ వారి వైపు కోసం ఎదురు చూస్తున్నాను. మీ మద్దతు లేకుంటే ఎలా.. తమ్ముడు.. నన్ను నమ్ము.. నేనెందుకు అలాంటి పని చేస్తాను. అందరూ నన్నే అనుమానిస్తున్నారు. వార్తల్లో చూపించేదంతా అబద్ధం. ఎవరో వాయిస్‌ను మాడ్యులేషన్ చేశారు. డీకే శివకుమార్‌కు సంబంధించిన వారు వస్తారు. మళ్లీ కాల్ చేస్తాను. అసలు వీడియో వారి వద్దే ఉంది. అమ్మ, నాన్నను నువ్వే హ్యాండిల్ చేయ్’’ అని ఉంది. చదవండి: రాసలీలల కేసు: యువతి చిన్నప్పటి విషయాలపై ఆరా -
రాసలీలల సీడీ కేసులో కీలక పరిణామం..
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల వీడియో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీడీలో ఉన్న యువతి జర్కిహోళిపై బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాది ద్వారా పోలీసులను ఆశ్రయించిన ఆమె, తనకు ప్రాణభయం ఉందని, కావున రక్షణ కల్పించాలని కోరింది. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కబ్బన్ పార్కు పోలీస్ స్టేషనులో జర్కిహోళిపై ఐపీసీ సెక్షన్లు 376సీ, 354ఏ, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి యువతి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘సీడీ యువతి ఫేస్బుక్ ద్వారా మమ్మల్ని ఆశ్రయించింది. తనకు చట్టపరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చాం. దీంతో కంప్లెంట్ రాసి మాకు పంపించింది. ఈ విషయాన్ని మేం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆమెకు భద్రత కల్పించాలని, న్యాయం చేయాలని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం’’ అని పేర్కొన్నారు. కాగా రాసలీలల సీడీ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీడీలో కనిపించిన యువతి సహా, ఇతర అనుమానితులు ఇంకా పరారీలో ఉన్నారు. దీంతో సిట్ విచారణ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా యువతి ఫిర్యాదు నేపథ్యంలో రమేష్ జర్కిహోళి కోర్టును ఆశ్రయించి, యాంటిసిపేటరి బెయిలు తెచ్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తనకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ యువతి ఇది వరకే ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు హోంమంత్రి బసవరాజ్ బొమ్మైకి సందేశం పంపించింది. చదవండి: రాసలీలల కేసు: 10 సీడీలు వచ్చినా భయపడను -
రాసలీలల కేసు: 10 సీడీలు వచ్చినా భయపడను
సాక్షి, బనశంకరి: ఇంకా పది సీడీలు వచ్చినా భయపడేది లేదు, తగిన వేళలో ఆ మహానాయకుని పేరు బహిర్గతం చేస్తాను అని రాసలీలల సీడీలో చిక్కుకున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. గురువారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత 10 రోజులుగా సీడీల గురించే చర్చ జరుగుతోంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపేవరకు విడిచిపెట్టను. దేవుని దయతో నిర్దోషిగా బయటికి వస్తాను. ఈ విషయంపై రాద్దాంతం చేస్తున్న వారిపై కూడా సీడీలు విడుదల కావచ్చు అని తెలిపారు. యువతి తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వీడియోలో కోరడం బట్టి ఇది కుట్ర అని మరోసారి రుజువైందన్నారు. తీవ్రమైన కేసు కావడంతో నేను ఎక్కువగా మాట్లాడను అన్నారు. నేను కూడా సాక్ష్యాధారాలు సేకరించాను, అన్నీ నా జేబులో ఉన్నాయి, వాటిని బహిర్గతం చేస్తే షాక్ అవుతారు, సీడీల వెనకున్న ఆ నాయకుని పేరును త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య పట్ల తనకు గౌరవం ఉండేదని, కానీ నాపై అత్యాచారం కేసు నమోదు చేయాలనడం ద్వారా గౌరవం పోయిందని తెలిపారు. ఎక్కువగా మాట్లాడరాదని న్యాయవాది సూచించడం వల్ల అన్ని విషయాలనూ బహిరంగపరచలేనని చెప్పారు. చదవండి: ‘నీ జన్మకు సిగ్గుందా?’ కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్సీ చిందులు రాసలీలల సీడీ కేసు: నిందితుడి భార్య అరెస్టు! -
రాసలీలల సీడీ కేసు: నిందితుడి భార్య అరెస్టు!
బనశంకరి/కర్ణాటక: మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి అశ్లీల సీడీ కేసులో అనుమానితుడు నరేశ్ భార్యను సిట్ బుధవారం అదుపులోకి తీసుకుంది. శిరా పోలీస్‌స్టేషన్ సీఐ అంజుమాల నేతృత్వంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సీడీ కేసులో మాజీ విలేకరి నరేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అతడు, ఇటీవల ఓ వీడియో విడుదల చేసి, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అదే విధంగా, సీడీలో ఉన్న యువతి తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరిందని, అంతేతప్ప ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని పేర్కొన్నాడు. అయితే, సిట్ సోదాల్లో భాగంగా నరేశ్ ఇంట్లో లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు నగలు కొన్నట్లు రసీదులు దొరికడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా మార్చి 2న విడుదలైన రాసలీలల సీడీలో కనిపించిన యువతి కోసం సిట్ పోలీసులు ఎంతగా గాలిస్తున్నా ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సీడీ కేసు విషయమై అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. చదవండి: రాసలీలల కేసు: యువతి చిన్నప్పటి విషయాలపై ఆరా సీడీ ముఠా ఎక్కడ.. వారికి డబ్బులెలా వస్తున్నాయి?! -
రాసలీలల కేసు: యువతి చిన్నప్పటి విషయాలపై ఆరా
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల కేసు దర్యాప్తు ఒక పట్టాన గాడిలో పడడం లేదు. మార్చి 2న విడుదలైన రాసలీలల సీడీలో కనిపించిన యువతి కోసం నాటి నుంచి సిట్ పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నా ఫలితం లేదు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. యువతి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలపై ఆరా తీశారు. బాధిత యువతి విద్యాభ్యాసం, స్నేహితులు తదితర వివరాలను సేకరించారు. కాగా, యువతి పరారయ్యాక ఇప్పటికి నాలుగు సార్లు ఫోన్ చేసిందని, గోవా, బెంగళూరు, చెన్నైకి వెళ్లినప్పుడు కాల్ చేసిందని తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిసింది. సురక్షితంగా ఉన్నానని ఒకసారి చెప్పిందని, కానీ చెన్నైకి వెళ్లిన తర్వాత భయంతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. చివరి సారి ఫోన్ చేసినప్పుడు తనను బలవంతంగా పట్టుకొచ్చారని, పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని, పూర్తి ఒత్తిడిలో ఉన్నానని కూతురు చెప్పిందని వివరించారు. సీడీ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న నిందితులు భోపాల్‌లో మకాం వేసినట్లు సిట్‌కు సమాచారం అందింది. హోంమంత్రితో సిట్ భేటీ.. మంగళవారం సిట్ అధికారులు విధానసౌధకు వెళ్లి సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మైని కలిసి కేసు విచారణ గురించి వివరించారు. సీడీ కేసులో అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులను పిలిపించినట్లు తెలిసింది. చదవండి: (సీడీ ముఠా ఎక్కడ.. వారికి డబ్బులెలా వస్తున్నాయి?!) -
సీడీ ముఠా ఎక్కడ.. వారికి డబ్బులెలా వస్తున్నాయి?!
సాక్షి, బెంగళూరు: మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి శృంగార బాగోతం సీడీ కేసులో ముఖ్య నిందితులను ఇప్పటికీ సిట్ పోలీసులు పట్టుకోలేకపోయారు. యువతితో సహా ఐదుగురి కోసం ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అన్వేషించినా ఫలితం లేదు. నిందితులు తరచుగా ప్రాంతాలు మారుస్తూ సంచరిస్తుండడంతో జాడ గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. పాత మొబైల్ నంబర్లను పక్కనపెట్టి కొత్త కొత్త నంబర్లతో కాల్స్ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం, వస్తు కొనుగోళ్లకు ఏటీఎం, క్రెడిట్ కార్డులను వాడడం లేదు. వాడి ఉంటే ఇప్పటికే ఆచూకీ తెలిసి ఉండేది. మరి ఖర్చులకు డబ్బులు ఎలా వస్తున్నాయనేది ఖాకీలకు మిస్టరీగా మారింది. నిందితులందరూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. జార్కిహొళి అసంతృప్తి?.. కేసు నత్తనడకన నడుస్తోందని మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి, ఆయన సోదరులు అసంతృప్తితో ఉన్నారు. సీడీ బాగోతం వల్ల కుటుంబ పరువు మంటగలిసిందని, త్వరగా నిజాలు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విచారణ దారితప్పిందని జార్కిహొళి సోదరులు సన్నిహితులతో వాపోయినట్లు తెలిసింది. సిట్ ఇప్పటికీ ముఖ్య అనుమానితులను పట్టుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుమూడుసార్లు తనను విచారించడం, ఆ వివరాలు లీక్ కావడంపై రమేశ్ కంగుతిన్నట్లు తెలిసింది. విచారణ తీరుపై త్వరలో హోం మంత్రి బసవరాజబొమ్మైని కలవాలని నిర్ణయించారు. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! -
రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం విడుదల చేసిన వీడియోను ఢిల్లీ నుంచే అప్లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీడియో విడుదల చేసిన అనంతరం నరేశ్‌గౌడతో పాటు మిగిలిన వారు ఢిల్లీలో తాము ఉంటున్న స్థలాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా కూడా సిట్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ కోసం ఢిల్లీని సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. చదవండి: రాసలీలల కేసు: ఢిల్లీలో బాధిత యువతి!? -
రాసలీలల కేసు: ఢిల్లీలో బాధిత యువతి!?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమే ష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం విడుదల చేసిన వీడియోను ఢిల్లీ నుంచే అప్లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీడియో విడుదల చేసిన అనంతరం నరేశ్‌గౌడతో పాటు మిగిలిన వారు ఢిల్లీలో తాము ఉంటున్న స్థలాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా కూడా సిట్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ కోసం ఢిల్లీని సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. చదవండి: (రాసలీలల కేసు: ‘ఆ యువతి తెలుసు కానీ..’) (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు) -
రాసలీలల కేసు: ‘మా అబ్బాయి చాలా మంచోడు’
దొడ్డబళ్లాపురం/కర్ణాటక: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో దొడ్డ తాలూకా లఘుమేనహళ్లికి చెందిన లక్ష్మిపతి (30) అనే యువకున్ని సిట్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. లక్ష్మిపతి పేరు టీవీల్లో చూసిన లఘుమేనహళ్లి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ సీడీని సామాజిక కార్యకర్త కల్లహళ్లి దినేశ్‌కి ఇచ్చాడనే ఆరోపణపై అరెస్టయ్యాడు. అతని కుటుంబం లఘుమేనహళ్లిలో ఒక చిన్న సిమెంట్ షీట్ల ఇంట్లో నివసిస్తోంది. తమ అబ్బాయి చాలా మంచోడని,అలాంటివాడయితే ఇలాంటి ఇంట్లో నివసించాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ ఇంట్లో కనీసం టీవీ కూడా లేదంటున్నారు. మూడు నెలల క్రితం గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు వచ్చాడని, తరువాత ఇటువైపు రాలేదని చెబుతున్నారు. ఇక పొరుగునే ఉన్న దేవనహళ్లిలో హ్యాకింగ్ స్పెషలిస్ట్, మాజీ విలేఖరి శ్రవణ్ అనే యువకున్ని కూడా ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: రాసలీలల కేసు: ‘ఆ యువతి తెలుసు కానీ..’ -
రాసలీలల కేసు: ‘ఆ యువతి తెలుసు కానీ..’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అశ్లీల సీడీల వివాదం కారణంగా మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాజీనామా చేసిన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విలేకరి నరేశ్ గౌడ చెప్పారు. నరేశ్ అజ్ఞాతంలో ఉంటూ గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. పోలీసుల ఎదుట హాజరు కాలేనని, ఏడెనిమిది రోజుల తర్వాత అజ్ఞాతం వీడతానని వెల్లడించారు. తాను ఇప్పుడే బయటకు వస్తే తనను ఈ కేసులో ఇరికిస్తారని చెప్పారు. సీడీ కేసుతో పాటు అందులో కనిపించిన యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పరిచయం ఉందని చెప్పాడు. ప్రైవేటు వార్తా సంస్థలో చాన్నాళ్లుగా పనిచేస్తూ ఎన్నో స్టింగ్ ఆపరేషన్లలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తాను విలేకరిని కావడంతో నాలుగైదు నెలల క్రితం బాధిత యువతి తనను కలిసిందన్నారు. మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి తనకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని కోరిందని నరేశ్ వెల్లడించారు. ఈ విషయమై దాదాపు 20 సార్లు ఆ యువతితో మాట్లాడానన్నారు. కేసులో తాను రూ. 5 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కనీసం రూ.5 తీసుకోలేదన్నారు. చదవండి: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’ రాసలీలల కేసు: ఎవరి ఖాతాలో ఎంత ఉంది?! అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు -
రాసలీలల కేసు: ప్రైవేటు ఉద్యోగిని.. వారితో పరిచయాలు!?
బనశంకరి/కర్ణాటక: సీడీ కేసులో ఉన్న అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. ఇప్పటికి ఐదారుమందిని పిలిపించి విచారించి సమాచారం సేకరించింది. అనుమానిత వ్యక్తి ర.26 లక్షల నగదు తీసుకున్నట్లు తేలింది. మరో వ్యక్తి విలువైన కారు కొనుగోలుకు యత్నించారని తెలిసింది. ఇప్పటికి 8 మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసింది. కొందరి ఇళ్లపై దాడిచేసి కంప్యూటర్లు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది. దొరకని సూత్రధారులు నిత్యం సిమ్‌కార్డులు మార్చడం, ప్రాంతాలు మారుతూ సంచరిస్తున్న మాజీ మంత్రి వీడియో సీడీ సూత్రధారులు పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత 4 సిట్ బృందాలు గాలిస్తున్నారు. సీడీలో ఉన్న యువతితో ఇద్దరు సూత్రధారులు కలిసి ఉన్నారని అనుమానిస్తున్నారు. గోవా, తిరుపతి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వెతికినా ఫలితం లేదు. ఒక్కో ఊరిలో కొత్త సిమ్‌లు కొని వాడి పడేస్తున్నారు. ఫోన్ చేశాక స్విచ్చాఫ్ చేస్తున్నారు. దీంతో కనుక్కోవడం కష్టమవుతోందని అన్నారు. యువతి ప్రైవేటు ఉద్యోగిని యువతికి సూత్రధారులతో మంచి పరిచయాలు ఉన్నాయని సిట్ పోలీసులు భావిస్తున్నారు. ఒక నిందితునికి ఆమె క్లాస్మేట్ అని తెలిసింది. బెంగళరులో ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.30 వేల వేతనంతో ఉద్యోగం చేసేది. కన్నడ సంఘాల్లో చురుగ్గా పనిచేసేదన్నారు. మీడియా వారితోనూ సంబంధాలు కలిగి ఉండేదని తేల్చారు. చదవండి: అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు రాసలీలల కేసు: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’ -
రాసలీలల కేసు: మాస్టర్ మైండ్‌తో రింగ్ మాస్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై రాసలీలల బాగోతంలో ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి వీడియో కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌గౌడ, డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వ్యాప్తి అయ్యింది. ఆ ఫోటోను కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్లో పోస్టు చేసి ఒకే ఫ్రేమ్‌లో మాస్టర్ మైండ్– రింగ్ మాస్టర్ ఉండటం ఏమిటి అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేశారు. కాగా, నరేశ్‌గౌడ సిట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చదవండి: (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు) -
రాసలీలల కేసు: ‘నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా’
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల వీడియో కలకలం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తానని జార్కిహోళి తనను మోసగించాడని సదరు యువతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సదరు యువతి అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెని అపహరించారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు మంగళవారం బెలగావి ఏపీఎంసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 368, 343, 346, 354, 506ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాక యువతి తల్లిదండ్రులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీనిలో వారు తమ కుమార్తె ప్రమాదంలో ఉందని.. ఆమె ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి తమ కుమార్తెను చూడలేదని తెలిపారు. యువతి తండ్రి బెలగావిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక చివరి సారి తన కుమార్తెతో మాట్లాడిన సంభాషణను కూడా వెల్లడించారు. ‘‘టీవీలో ఆ వీడియో ప్రసారం కాగానే నేను నా కుమార్తెకి కాల్ చేశాను. యువతి తండ్రి: టీవీలో ఓ వీడియో వస్తుంది.. దానిలో ఉన్న యువతి చూడటానికి అచ్చం నీలానే ఉంది. యువతి: వీడియో గురించి నాకు ఏం తెలియదు. అందులో ఉన్నది నేను కాదు.. అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు. నేను ఏ తప్పు చేయలేదు. యువతి తండ్రి: నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా. యువతి: రాలేను. అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఓ సారి ‘‘నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించకండి’’ అంటూ మెసేజ్ చేసింది. అదే తనతో చివరి సంభాషణ. ఆ తర్వాత తన మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఆ తర్వాత టీవీలో మరో వీడియో చూశాం. దానిలో నా కుమార్తె తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దాంతో మేం బెల్గాంలో మిస్పింగ్ కంప్లైంట్ ఇచ్చాం’’ అని తెలిపారు. రక్షణ కోరిన యువతి గత వారం యువతి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వీడియో స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇదే వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘వీడియో ప్రసారం కావడంతో నా పరువు పోయింది. జనాలు మా ఇంటికి వచ్చి నా గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మా అమ్మనాన్న రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశారు.. నేను 3,4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను’’ అని వీడియోలో పేర్కొంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేశారు. -
రాసలీలల కేసు: రూ.5 కోట్లు డిమాండ్ చేశారు, కానీ..
సాక్షి, బెంగళూరు: కన్నడనాట రాసలీలల సీడీ కేసు దర్యాప్తులో క్రమంగా కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. వీడియోలో కనిపించి పదవిని కోల్పోయిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని మంగళవారం సిట్ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో సుమారు రెండు గంటల పాటు విచారించి నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వీడియో సీడీ సంగతి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని రమేశ్ చెప్పినట్లు తెలిసింది. ఆ వీడియోను చూపి రూ. ఐదు కోట్లను ఇవ్వాలని తనను డిమాండ్ చేశారని తెలిపారు. కానీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర పన్నారని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చదవండి: (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు) (రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు..) -
అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు
సాక్షి, బెంగళూరు: మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల బాగోతం కేసులో యువతి ప్రియుడు ఆకాష్ సోమవారం సిట్ ముందు హాజరయ్యాడు. యువతి ప్రేమ మైకంలో మునిగిపోయానని, అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిందని అతడు చెప్పినట్లు తెలిసింది. సీడీ రికార్డింగ్ గురించి ఆమెకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పలేదు అని అన్నాడు. సీడీ చూపించి డబ్బు గుంజడానికి పథకం వేశారని తరువాత తెలిసిందన్నారు. సీసీ కెమెరాల్లో సాక్ష్యాలు.. సీడీ కేసు విచారిస్తున్న సిట్ పోలీసులు ఆమెకు ఆకాష్ అనే ప్రియుడు ఉన్నాడని గుర్తించి విచారణకు పిలిచారు. ఇక యువతి, ఆమె బృందం కదలికల ఆధారాల కోసం 70 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అతని ద్వారా ఆమె ఎక్కడెక్కడ సంచరించిందీ తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తద్వారా కీలక సాక్ష్యాలు లభించినట్లు తెలిసింది. సీడీ విడుదల కాకముందు ఆకాష్ కొందరు పాత్రికేయులను కలిసిన దృశ్యాలు లభించాయి. లాక్డౌన్ అవసరం : కుమార బనశంకరి: కర్ణాటకలో రోజురోజుకు కరోనా కేసులు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో లాక్డౌన్ చేయడం మంచిదని మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా గ్రాఫ్ పెరిగిందని ప్రస్తుతం వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. -
రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు..
సాక్షి, బెంగళూరు: కన్నడనాట మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల వీడియో సీడీలో కనిపించే యువతి కోసం సిట్ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. సీడీ విడుదల తరువాత ఆమె బెంగళూరు నుంచి ముంబయికి, అక్కడి నుంచి తిరుపతికి, ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నట్లు గుర్తించి హైదరాబాద్‌లో వెతుకుతున్నారు. విచారణకు గైర్హాజరు.. మోసగించారని, బెదిరించారని మాజీ మంత్రిపై యువతి సోషల్ మీడియా ద్వారా బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విచారణకు రావాలని బాగల్‌కోటలో ఆమె ఇంటికి నోటీసులు అతికించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేదు. ఖాతాలోకి 25 లక్షలు: ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీడీని సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందజేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.25 లక్షల నగదు జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు. వీడియోలో వినిపించిన గొంతు మీద అనుమానంతో చిక్కమగళూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. చదవండి: (రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి) -
రాసలీలల వీడియో: డీకే పేరెందుకు వస్తోంది?!
మైసూరు: మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడి కేసులో కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఆయన పేరును ప్రస్తావిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని బాధిత యువతి కోరినందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీలోనే కుట్రలు : డీకే శివమొగ్గ: జార్కిహొళి వీడియోల కేసులో బాధిత యువతి చెప్పిన వివరాలు నా దృష్టికి వచ్చాయి, విచారణ జరుగుతున్నందున ఏమీ చెప్పలేను అని కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్ అన్నారు. శివమొగ్గలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సీడీ వెనుక ఎవరున్నారో తెలియడం లేదన్నారు. బీజేపి ఎమ్మెల్యే యత్నాళ్ కూడా రాసలీల వీడియోల గురించి మాట్లాడారన్నారు. దీనిని బట్టి బీజేపీలోనే కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు సీడి కేసులో తమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని, తగిన సమయంలో స్పందిస్తానని తెలిపారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే సీడీ కేసుపై సిద్దరామయ్య శివాజీనగర: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి విడుదల చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షనేత సిద్దరామయ్య స్పందించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయటంపై అసెంబ్లీలో మాట్లాడుతానని, సీడీ కేసు వెనుక కాంగ్రెస్ నాయకులున్నారనే ఆరోపణపై అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య, దీనిపై కూడా తాను స్పందించనని, ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చదవండి: రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి -
రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతిని విచారించేందుకు ‘సిట్’ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ఆ యువతికి నోటీసులు జారీ చేశారు. విజయపుర (బిజాపుర) జిల్లా నిడగుంది పట్టణంలోని ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళాలు వేసి ఉంది. అలాగే సదరు యువతి స్నేహితులు, బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. ఇంటి యజమానికి యువతి ఫోన్ బెంగళూరులోని ఆర్టీ నగరలో అద్దె ఇంట్లో ఉంటున్న యువతి రాసలీలల వీడియోలు విడుదలయిన తరువాత గోవాకు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన ఇంటి యజమానులకు ఫోన్‌చేసి, తనవల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యాయని, తనను క్షమించాలని కోరినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని శనివారం యువతి వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. యువతికి రక్షణ కల్పించాలని హోం మంత్రిని కోరతామన్నారు. ఈ కేసు వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని యువతి చెప్పడం ఆందోళనకరమన్నారు. చదవండి: (రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి) -
రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి
సాక్షి, బెంగళూరు: బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల వీడియోల కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీడీని ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనేది సిట్ తేల్చనుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బెంగళూరు రూరల్‌లోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్లో నివాసం ఉంటున్న సురేష్ శ్రవణ్ అలియాస్ పెయింటర్ సూరి ఇంటికి మూడు వాహనాల్లో పోలీసులు చేరుకుని సోదాలు చేశారు. కొన్ని సీడీలను, ఒక కంప్యూటర్ను సీజ్ చేశారు. శ్రవణ్ గదిలో క్షుణ్ణంగా వెతికారు. వారం రోజుల నుంచి శ్రవణ్ ఇంటికి రాకపోవడంతో అతని సోదరున్ని పట్టుకెళ్లారు. రాసలీలల సీడీని శ్రవణ్ ఇక్కడే తన కంప్యూటర్లో ఎడిటింగ్ చేయడంతో పాటు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ వీడియో యూట్యూబ్‌లో రష్యా నుంచి పోస్ట్ అయినట్లు ఉండగా, శ్రవణ్ ఖాతాను ఎవరో రష్యాలో హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలిపారు. అతని కంప్యూటర్ పాస్వర్డ్ ఓపెన్ కాకపోవడంతో దానినితో పాటు పలు సీడీలను, పెన్ డ్రైవ్‌లను, ఇంటి కొనుగోలు కోసం తీసిపెట్టుకున్న రూ. 25 లక్షల డీడీని పోలీసులు తీసుకెళ్లారు. తుమకూరు జిల్లా శిరా తాలూకాలో ఉన్న భునవనహళ్లి గ్రామంలో సీడీ సూత్రధారిగా ఆరోపణలున్న నరేష్ గౌడ ఇంట్లో సోదాలు చేశారు. అతడు లేకపోవడంతో భార్యను ప్రశ్నించి వెళ్లిపోయారు. సీడీలో కనిపించిన యువతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. చదవండి: (సీడీ విషయం నాలుగు నెలల ముందే తెలుసు) ఉద్యోగం పేరుతో మోసగించాడు ►మాజీ మంత్రి రాసలీలల కేసులో యువతి ఆరోపణ సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతి ఎట్టకేలకు నోరువిప్పింది. అజ్ఞాతంలో ఉన్న ఆమె శనివారం రాత్రి తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. రమేశ్ జార్కిహొళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పాడని, పైగా ఆయనే సీడీని బయటకు విడుదల చేశారని ఆరోపించింది. వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారో తనకు తెలియదని పేర్కొంది. ‘ఆ సీడీ విడుదలతో నా మాన, మర్యాదలకు భంగం కలిగింది. ఆ ఆవేదనతో మూడు, నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. చదవండి: (కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు) నా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. నా వెనుక ఎవరూ లేరు. నాకు రాజకీయ మద్దతు కూడా లేదు. ఉద్యోగం ఇప్పిస్తా నని జార్కిహొళి మోసం చేశాడు’ అని ఆరోపిం చింది. తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. రాసలీలల సీడీ విడుదలైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన బాధిత యువతి 11 రోజుల తర్వాత వీడియోను విడుదల చేసింది. కాగా, సీడీ కేసులో సిట్ పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నాపై రాజకీయ కుట్ర రాసలీలల సీడీపై రమేశ్ జార్కిహొళి శనివారం బెంగళూరు సదాశివనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ జీవితాన్ని భంగ పరచాలని సదాశివనగరలోనే కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. కుట్ర, మోసం ద్వారా ఒక నకిలీ సీడీని సృష్టించి మానసికంగా హింసించారని తెలిపారు. దీని వెనుక చాలా మంది హస్తం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: (మంత్రి రాసలీలల వీడియోలు వైరల్) -
సీడీ విషయం నాలుగు నెలల ముందే తెలుసు
సాక్షి బెంగళూరు: ‘ఆ సీడీ నకిలీది. నేను ఏ తప్పు చేయలేదు. నకిలీ సీడీని తయారు చేసిన వారిని జైలుకు పంపే వరకు విడిచిపెట్టేది లేదు’అని రాసలీలల వీడియోలలో దొరికిన కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి వ్యాఖ్యానించారు. తన వద్దకు ఒక పని కోసం వచ్చిన యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఈ నెల 2న వైరల్ కావడం తెలిసిందే. దీంతో మంత్రి పదవికి రమేశ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి మంగళవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సీడీ విషయం తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని, సీడీ విడుదలకు 24 గంటల ముందు బీజేపీ తనకు ఫోన్ చేసి అలర్ట్ చేసిందని చెప్పారు. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడి లేదని రమేశ్ స్పష్టంచేశారు. ఈ సీడీ కుట్ర వెనక ఇద్దరు మహిళలు, ముగ్గురు జర్నలిస్టులు, నలుగురు రాజకీయ నాయకులు ఉండవచ్చని అన్నారు. తాను మానసికంగా ఎంతో వేదన చెందానని రమేశ్ కన్నీరు పెట్టుకున్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారిని వదిలిపెట్టనని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని ముగించేందుకు ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాల కంటే కుటుంబమే ముఖ్యమని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. చదవండి: (కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు) -
కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు మలుపులు తిరుగుతోంది. తాజా మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం దినేశ్ తరపున ఆయన న్యాయవాది దినేశ్ పాటిల్ కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇచ్చారు. సీడీల్లో ఉన్న యువతి జాడ తెలియరాలేదు. మరికొందరు మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దినేశ్ యూ టర్న్ చర్చనీయాంశమైంది. ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన ఘటనలతో విసిగిపోయి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు దినేశ్ తెలిపారు. తాను డీల్ కుదుర్చుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నానని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించడంతో అసహనానికి గురయినట్లు చెప్పారు. చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?) (మంత్రి రాసలీలల వీడియోలు వైరల్) (వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు) -
రాసలీలల వీడియో: వైరలవుతోన్న మెసేజ్‌లు
బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలికి, యువతికి మధ్య జరిగిన రాసలీలల వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేశ్ జర్కిహోలి ఈ ఘటనకు నైతక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తాజాగా మంత్రికి, యువతికి మధ్య జరిగిన మెసేజ్‌లు కొన్ని లీక్ అయ్యాయి. దీనిలో రమేశ్ జర్కిహోలి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. యడ్డీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడంటూ యువతికి చేసిన మెసేజ్‌లో తెలిపారు జర్కిహోలి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.. యువతి: బెల్గాంలో కన్నడ, మరాఠీ ప్రజలు బాగా కొట్టుకుంటున్నారు కదా? మంత్రి: మరాఠీలు చాలా మంచి వారు. బెల్గాం కన్నడిగులకు ఏం పని లేదు. మంత్రి: సిద్దరామయ్య చాలా మంచి వాడు. యడియూరప్ప భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. యువతి: మీరు ఢిల్లీకి వెళ్తున్నారు.. సీఎం అవుతారా? మంత్రి: ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి అవుతారు... అంటూ సాగిన సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యడ్డీ కేబినెట్లోని మినిస్టరే ఆయన పెద్ద అవినీతిపరుడని పేర్కోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డేకే శివకుమార్ ఈ మెసేజ్‌లపై స్పందిస్తూ.. ‘‘ఇది కేవలం సెక్స్ స్కాండల్ వీడియో మాత్రమే కాదు.. దీనిలో జర్కిహోలి.. ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడారు. దీనికి యడ్డీ సమాధానం చెప్పాలి. వీటిని అబద్దం అని నిరూపించాలి. ఇప్పుడు బాల్ వారి కోర్టులో ఉంది. ప్రస్తుతం బీజేపీ ఈ అంశంలో ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి మంత్రి రాసలీలలకు సంబంధించిన వీడియోలను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌కు అందజేసి.. జర్కిహోయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక హోం మినిస్టర్ బసవరాజ్ బొమ్మై జర్కిహోలిపై వచ్చిన ఆరోపణల అంశంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. చదవండి: సీఎం బంధువునని మేయర్ కాకుండా కుట్ర రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా -
మంత్రి మన్మధ
-
రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి ఓ యువతితో రాసలీలలు జరుపుతోన్న వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రమేష్ రాజీనామా చేయాలని.. అతడిపై చర్య తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక వీడియోలు లీకైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్ తాజాగా దీనిపై స్పందించారు. అది ఫేక్ వీడియో అన్నారు. కానీ నైతిక కారణాల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. "నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరం. అది ఫేక్ వీడియో.. నేను నిర్దోషిగా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. నేను నైతిక కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను.. దీనిని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను" అని రమేశ్ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఆమెను లోబచర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో సీడీలను పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. చదవండి: మంత్రి రాసలీలల వీడియోలు వైరల్ -
మంత్రి రాసలీలల వీడియోలు వైరల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన కర్ణాటక ఇరిగేషన్ మంత్రి రమేష్ జర్కిహోలి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యువతితో మంత్రి చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసులకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. బెంగళూరులోని ఆర్టీ నగరలో నివాసం ఉండే ఒక యువతి రాష్ట్రంలోని డ్యాంలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందని ఆరోపణ. ఆ రాసలీలల వీడియో పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో సంచలనం చోటుచేసుకుంది. ప్రాణభయంతోనే ఆ యువతి తన సాయం కోరిందని దినేశ్ తెలిపారు. తాజా వ్యవహారం బీజేపీ సర్కారుకు సంకటంగా మారేలా ఉంది. నేను తప్పు చేయలేదు: మంత్రి నేను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన పనిలేదని మంత్రి జార్కిహొళి అన్నారు. వీడియో బహిర్గతం అయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించారు. రాసలీలల వీడియో తను చూడలేదని, ఎవరో కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ಕಿರುಚಿತ್ರ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ನೆರವು ಕೇಳಲು ಬಂದಿದ್ದ ಸಂತ್ರಸ್ಥ ಯುವತಿಗೆ ಕೆಪಿಟಿಸಿಎಲ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಕೊಡಿಸುವುದಾಗಿ ನಂಬಿಸಿ ಲೈಂಗಿಕ ಕಿರುಕುಳ ನೀಡಿ ಬೆದರಿಕೆ ಹಾಕಿದ್ದಾರೆ ಎಂದು ದೂರಿನಲ್ಲಿ ಆರೋಪಿಸಿದ ದಿನೇಶ್ ಕಲ್ಲಹಳ್ಳಿ. #karnataka #Bengaluru #RameshJarkiholi @AamAadmiParty @AAPBangalore @AAPKarnataka @BJP4Karnataka pic.twitter.com/FGvvAejVNE — Pallavi Agara Ward Bangalore (@AgaraBlrForAAP) March 2, 2021 -
ఆమె నా కాళ్లపై పడింది.. మంత్రి వ్యాఖ్యలు
కర్ణాటక, బనశంకరి: బెళగావి జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకప్పుడు ఒకేపార్టీలో ఉండిన నేతలు పార్టీలు మారాక నోటికి పనిచెప్పారు. బెళ గావి పురపాలక అభివృద్ధి సంస్థ (బుడా) మెంబర్‌ను చేయా లని ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ఒకప్పుడు తన కాళ్లపై పడింది నిజం. లింగాయత సమాజ మహిళ అభివృద్ధి చెందాలని నేను సహాయం చేశాను అని మంత్రి రమేశ్ జార్కిహొళి అన్నారు. ఆయన బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీహెబ్బాళ్కర్ వ్యక్తిత్వం ఏమిటి అనేది బెళగావి అంతా తెలుసు. నాపై ఆమె వ్యాఖ్యలకు సమాధానమిచ్చేది లేదు. రానున్న ఎన్నికల్లో అన్నింటికీ సమాధానం చెబుతా. కుక్కర్ విషయంలో ఆమె నా నుంచి సహాయం పొందలేదని ఇంటి ఇలవేల్పు హట్టి వీరభద్రేశ్వరునిపై ప్రమాణం చేయాలి. నేను మా ఇంటి దేవత కొల్హాపురి మహాలక్ష్మీపై ప్రమాణం చేస్తాను. ఆమెకు రాజకీయం తెలియదు. నా సహాయంతోనే ఎదిగింది. నా కాళ్లపై పడటంతోనే బుడా మెంబర్ని చేశాను అని చెప్పారు. ద్వేషపూరిత మాటలొద్దు: లక్ష్మీ మంత్రి వ్యాఖ్యలపై లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పందిస్తూ మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా మాట్లాడటం సరికాదు, కుక్కర్ విషయం కోర్టులో ఉందని దీనిపై మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. కుక్కర్ ఇచ్చామని మంత్రి వద్ద ఆధారాలు ఉంటే విడుదల చేయాలన్నారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ద్వేషపూరిత రాజకీయాలు చేయడం సరికాదని, ఆయనపై న్యాయపోరాటం చేయడానికి న్యాయవాదితో చర్చించానని తెలిపారు. -
అమెరికాలో సీఎం; ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కారులో మరో సంక్షోభం తలెత్తింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుగా ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా, మరికొద్ది గంటల తర్వాత మరో ఎమ్మెల్యే రమేశ్ జర్కయాళి కూడా ఆయన బాటలో నడిచారు. వీరిద్దరి రాజీనామాలతో కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. 224 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయనగర్ నియోజకవర్గం నుంచి ఆనంద్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజవర్గంలోని ప్రభుత్వ భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆనంద్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ అందిందని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. రమేశ్ జర్కయాళి రాజీనామా లేఖను స్వీకరించేందుకు స్పీకర్ ఆఫీసు నిరాకరించింది. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తడి లేదని, ఇది తన సొంత నిర్ణయమని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ‘న్యూజెర్సీలో కాలభైరేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాను. టీవీ చానళ్లు చూస్తున్నాను. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పగటి కలలుగానే మిగులుతాయ’ని ఆయన ట్వీట్ చేశారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ సంకీర్ణ సర్కారు తనంతట తాను కూలిపోతే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఆనంద్ సింగ్ రాజీనామా తనకు షాక్ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాగా, జనవరిలో ఈగల్టన్ రిసార్టులో కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌తో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆనంద్ సింగ్ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. -
ఆ విషయంపై స్పందించను : మంత్రి
యశవంతపుర : మాజీ మంత్రి రమేశ్ జారకిహొళెని బుజ్జగించే విషయం ముగిసిన అధ్యాయమని అయన సోదరుడు, అటవీశాఖ మంత్రి సతీశ్ జారకిహొళె స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పతనమైతే విధానసభకు ఎన్నికలు అనివార్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు అశ్చర్యాన్ని కలిగించాయి. లోకసభ ఎన్నికలలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి రెండు పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సతీశ్ జారకిహొళె చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో ప్రకంపనలను రేపుతున్నాయి. ఆయన సోమవారం బెళగావి సాంబ్రా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి కొందరు మంత్రులు రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కుమారస్వామి నేతత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, మాజీ మంత్రి రమేశ్ జారకీహొళె కలవటంపై తాను స్పందించన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు..
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారన్న వదంతులపై మంత్రి రమేష్ జర్కిహోలి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌తో సంప్రదించారని మంత్రి ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదన్నారు. తామ కూటమి (కాంగ్రెస్-జేడీఎస్) అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నేతలో కాంగ్రెస్‌లో చేరికపై యత్నిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనం కలిగిందని, ఆయనను ఎవరు పరామర్శించినా అందులో తప్పులేదని మంత్రి రమేష్ అభిప్రాయపడ్డారు. కాగా, కర్ణాటక కేబినెట్లో చోటు దక్కలేదని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఢిల్లీ స్థాయిలో పంచాయితీ పెట్టిన మాజీ మంత్రి, బీదర్ జిల్లా బబలేశ్వర్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్, సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇటీవల సిద్ధరామయ్య ధర్మస్థలంలో చికిత్స తీసుకుంటున్న సమయంలో పరామర్శించడానికి కుదరలేదని, శనివారం ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు బాదామి వచ్చినట్లు పాటిల్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని పాటిల్ స్పష్టం చేశారు. -
అవును.. మంత్రి పన్ను ఎగ్గొట్టారు!
కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్ జర్కిహోలి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బల్కర్ ఇద్దరూ చాలా పద్ధతిగా ఆదాయపన్ను ఎగ్గొట్టారని ఆదాయపన్ను శాఖ తేల్చింది. వీళ్లిద్దరికి సంబంధించిన బ్యాంకు ఖాతాల గురించిన ఎంక్వైరీలు, సర్వేలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మరికొందరు బినామీల పేర్ల మీద ప్రాథమిక సహకార సంఘాల్లో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేసినట్లు గుర్తించింది. ఈ మొత్తాలను ఆ తర్వాత పంచదార ఫ్యాక్టరీలలోకి మళ్లించారని చెప్పింది. అసలు ఈ భూమ్మీద లేని వ్యక్తులను కూడా షేర్‌హోల్డర్లుగా పేర్కొని, పంచదార ఫ్యాక్టరీలలో పెట్టుబడిదారులుగా చూపించారు. బోగస్ ఆస్తులను సృష్టించడం, షుగర్ ఫ్యాక్టరీలు పెట్టడం కోసం ఎక్కడా లేని కంపెనీల నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు చెప్పడం లాంటివన్నీ ఉన్నాయని ఐటీ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రకటనలో మంత్రి పేరు గానీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పేరు గానీ ప్రస్తావించకుండా.. ఇద్దరిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలోను, మరొకరు ఒక రాజకీయ పార్టీ పదవిలోను ఉన్నారని పేర్కొంది. ఇద్దరూ షుగర్ ఫ్యాక్టరీలు పెట్టారని వివరించింది. రెండు గ్రూపుల్లోనూ అచ్చం ఒకే విధానంలో పెట్టుబడులు తీసుకొచ్చి చూపించడం ఇక్కడ అసలు విశేషం. ఇందుకు కామన్ ఎంట్రీ ప్రొవైడర్లు సాయం చేసి ఉండొచ్చని ఐటీ శాఖ అనుమానించింది. లెక్కల్లో చూపని రూ. 162.06 కోట్ల ఆదాయం కూడా ఉన్నట్లు ఈ సోదాల్లో బయటపడింది. రూ. 41 లక్షల నగదుతో పాటు 12.8 కిలోల బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో ఆదాయాలు వస్తున్నవారు, పెట్టుబడులు పెట్టినవాళ్లు కూడా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంలేదు. దాంతో ఈ మొత్తం వ్యవహారంపై ఐటీ శాఖ గట్టిగా దృష్టిపెట్టంది. ఈ కేసులో బెలగావి ఎమ్మెల్యే సోదరుడు ఇన్ఫార్మర్గా వ్యవహరించారు.