
రమేశ్ జార్కిహొళి, లక్ష్మీ హెబ్బాళ్కర్
కర్ణాటక, బనశంకరి: బెళగావి జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకప్పుడు ఒకేపార్టీలో ఉండిన నేతలు పార్టీలు మారాక నోటికి పనిచెప్పారు. బెళ గావి పురపాలక అభివృద్ధి సంస్థ (బుడా) మెంబర్‌ను చేయా లని ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ఒకప్పుడు తన కాళ్లపై పడింది నిజం. లింగాయత సమాజ మహిళ అభివృద్ధి చెందాలని నేను సహాయం చేశాను అని మంత్రి రమేశ్ జార్కిహొళి అన్నారు. ఆయన బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీహెబ్బాళ్కర్ వ్యక్తిత్వం ఏమిటి అనేది బెళగావి అంతా తెలుసు. నాపై ఆమె వ్యాఖ్యలకు సమాధానమిచ్చేది లేదు. రానున్న ఎన్నికల్లో అన్నింటికీ సమాధానం చెబుతా. కుక్కర్ విషయంలో ఆమె నా నుంచి సహాయం పొందలేదని ఇంటి ఇలవేల్పు హట్టి వీరభద్రేశ్వరునిపై ప్రమాణం చేయాలి. నేను మా ఇంటి దేవత కొల్హాపురి మహాలక్ష్మీపై ప్రమాణం చేస్తాను. ఆమెకు రాజకీయం తెలియదు. నా సహాయంతోనే ఎదిగింది. నా కాళ్లపై పడటంతోనే బుడా మెంబర్‌ని చేశాను అని చెప్పారు.
ద్వేషపూరిత మాటలొద్దు: లక్ష్మీ
మంత్రి వ్యాఖ్యలపై లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పందిస్తూ మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా మాట్లాడటం సరికాదు, కుక్కర్ విషయం కోర్టులో ఉందని దీనిపై మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. కుక్కర్ ఇచ్చామని మంత్రి వద్ద ఆధారాలు ఉంటే విడుదల చేయాలన్నారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ద్వేషపూరిత రాజకీయాలు చేయడం సరికాదని, ఆయనపై న్యాయపోరాటం చేయడానికి న్యాయవాదితో చర్చించానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment