
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో బాధిత యువతి తండ్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తన కూతురు సీఆర్‌పీసీ 164 కింద కోర్టులో జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం చట్టవ్యతిరేకమని, దీనిని రద్దుచేయాలని యువతి తండ్రి కోరారు. అయితే అర్జీలో బలం లేదని న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తన కూతురును ఎవరో తెరవెనుక నుంచి ఆడిస్తున్నారని తండ్రి ఆరోపించడం తెలిసిందే. కాగా, సీడీ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేయాలని, సిట్ నియామకమే అక్రమమని జార్కిహొళి తరఫు న్యాయవాది మంగళవారం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment