బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి.
మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.
ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టు
నాకు భయం లేదు
ముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment