lokyukta
-
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
బన్నీ ఉత్సవంలో రక్తపాతం వద్దు..
కర్నూలు(అగ్రికల్చర్): తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో కొట్టుకుంటూ నిర్వహించే బన్నీ ఉత్సవాలపై అధికారు కీలక ఆదేశాలను వెలువరించారు. దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి రక్తపాతానికి తావులేకుండా శాంతి యుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. నెరణికి గ్రామస్థులు, దేవస్ధానం అధికారులను కోరారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్హాల్లో బుధవారం దేవరగట్టు బన్ని ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. బన్ని వేడుకల్లో రింగులు తొడిగిన కర్రలు వాడొద్దని సూచించారు. ఈమేరకు భక్తులను చైతన్యపరిచేలా కళాజాతలలో ప్రచారం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవం నిర్వహించే రోజు మద్యం, నాటు సారా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. సమీక్షకు హాజరైన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... బన్నీ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటున్నదని, గత ఏడాది పోలీసులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎవ్వరికి గాయలు లేకుండా బన్ని ఉత్సవం ముగిసిందనానరు. ఈ సారి కూడా గ్రామస్థులు, దేవాలయం అధికారులు సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, వివిధ శాఖల అధికారులు, నెరణికి గ్రామ నేతలు గాదేగౌడు, రామలింగంగౌడు, శేకన్న న్యాయవాది మల్లికార్జునగౌడు, దేవాలయ చైర్మన్ కుమారగౌడు తదితరులు పాల్గొన్నారు.