ముడా కేసులో ఆయనపై విచారణ జరగాలి
గవర్నర్ అనుమతి సబబే
కర్నాటక హైకోర్టు తీర్పు
సీఎంగా రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
మోదీ ప్రభుత్వ కుట్ర: సిద్ధూ
బెంగళూరు: ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతించడం తెలిసిందే. ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ‘‘గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవడం రివాజే అయినా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఇది అలాంటి కేసే’’ అని అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో లబి్ధదారు స్వయానా పిటిషనర్ కుటుంబానికి చెందిన వ్యక్తే. కనుక అభియోగాలపై విచారణ అవసరమన్నది నిస్సందేహం’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు.
గవర్నర్ ఏమాత్రం ఆలోచన లేకుండా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బాగా ఆలోచించిన మీదటే దర్యాప్తుకు అనుమతిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ముడా కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆగస్టు 16న అనుమతించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.
విచారణకు తానేమీ వెనకాడటం లేదన్నారు. అయితే, ‘‘నేనెందుకు రాజీనామా చేయాలి? అవినీతి ఆరోపణల్లో బెయిల్‌పై తిరుగుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామా చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ కేసు నాపై, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాల్లో భాగం. అందుకోసం గవర్నర్ అధికారాలను కూడా దురి్వనియోగపరుస్తున్నారు’’ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకు దన్నుగా ఉందని చెప్పారు.
రాజీనామా చేయాలి: బీజేపీ
హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మీ అబద్ధాల సామ్రాజ్యం కుప్పకూలింది. గౌరవప్రదంగా రాజీనామా చేయండి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలు కలి్పంచండి’’ అని పార్టీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆయన రాజీనామా చేయబోరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘‘ఇదో కుట్ర. సిద్ధరామయ్య నిర్దోíÙత్వాన్ని నిరూపించుకుంటారు’’ అన్నారు.
ఏమిటీ ముడా వివాదం?
సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.
‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.
ఇది కచి్చతంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదించారు. ఈ ఆరోపణలపై జూలైలో సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసిచ్చారు. అనంతరం విచారణకు అనుమతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment