CM Siddaramaiah
-
MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్
బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. Karnataka CM Siddaramaiah''s wife Parvathi decides to return 14 controversial sites to MUDA— Press Trust of India (@PTI_News) September 30, 2024 -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
సోషల్ మీడియాకు సీఎం సిద్ధరామయ్య ఖర్చెంత?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ప్రతీనెలా సోషల్ మీడియాకు ఎంత ఖర్చు చేస్తారనేది వెల్లడై వైరల్‌గా మారింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆర్టీఐ కార్యకర్త మారలింగ గౌర్ మాలీ పాటిల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడానికి ఎంత ఖర్చచేస్తారనేదానికి సమాధానం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక స్టేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ (ఎంసీఏ) సమాధానం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 25 నుంచి మార్చి 2024 వరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్‌మీడియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం సీఎంఓ ప్రతి నెలా దాదాపు రూ.53.9 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో 18 శాతం జీఎస్టీ కూడా ఉంది. సిద్ధరామయ్య ఖాతాలను నిర్వహించే పాలసీ ఫ్రంట్ అనే కంపెనీకి ఈ చెల్లింపు జరిగింది. ఈ కంపెనీలో 25 మంది సభ్యులు ఉన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే, సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువ ఖర్చు చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. -
అవినీతి మరక లేకపోతే ఎందుకు భయం ?
మైసూరు: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను శుద్ధంగా ఉన్నానని వందసార్లు చెప్పిన సీఎం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడకుండా శుభ్రంగా ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ నిలదీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకి కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించారని, ఈడీ రంగంలోకి దిగగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నారన్నారు. పెట్రోల్ బంకులతో పాటు వివిధ వనరుల నుంచి రాష్ట్రానికి చెందిన డబ్బు తెలంగాణ ఎన్నికలకు తరలించారన్నారు. వాల్మీకి కుంభకోణం గురించి సీఎంకు చాలా సమాచారం ఇచ్చానని, అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్.అశోక్ మండిపడ్డారు. ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా జేడీఎస్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ముడా కుంభకోణంపై మీ సొంత పార్టీ అధ్యక్షుడు మరిగౌడ ఈడీ అధికారులకు లేఖ రాశారు కదా అని గుర్తు చేశారు. అలా అయితే మీ పార్టీ నేత అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. జనాందోళన సభకు కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అశోక్ విమర్శించారు. -
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్‌లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. -
నీటి కొరత లేదు.. పరిష్కారం ఉంది: సీఎం సిద్ధరామయ్య
జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉంది. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు (సోమవారం) ప్రకటించారు. తాగునీటికి కొరత లేదని దీనికోసం బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తగినన్ని నిధులు సమకూరుస్తున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నగర పాలక సంస్థ అధికారులతో సమావేశం వెల్లడించారు. బెంగళూరులోని 14,000 బోర్‌వెల్స్‌లో 6900 ఎండిపోయాయి. నగరంలో ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ నీటి కొరతను తీర్చడానికి కావలసినన్ని జలాలు ఉన్నాయి. బెంగళూరులో మాత్రమే కాకుండా చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకు కూడా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. కబినీ, కేఆర్ఎస్ డ్యామ్‌లలో సరిపడా నీరు ఉంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఇప్పుడు నీటి కొరతను నియంత్రించడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికోసం 313 కొత్త బోర్లు వేయనున్నట్లు స్పష్టం చేశారు. క్రియారహితంగా ఉన్న 1200 బోర్లను పునరుద్ధరిస్తామని చెప్పారు బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్ణీత ధరలకే నీటిని సరఫరా చేయాలని రెండు వారాల క్రితం ప్రభుత్వం ప్రైవేటు ట్యాంకర్లను ఆదేశించింది. దీని కోసం దాదాపు 1700 వాటర్ ట్యాంకర్లను రిజిస్టర్ చేశామని, ప్రైవేట్ బోర్వెల్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు. -
ఐదేళ్లూ కుర్చీ.. మడత పేచీ
బనశంకరి: అధికార హస్తం పార్టీలో తరచూ ఏదో ఒక వివాదం పుట్టుకొస్తోంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని మాగడి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ.బాలకృష్ణ డిమాండ్ చేయడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిక సీట్లు గెలిస్తే సీఎం సిద్దరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని ఆయన కుమారుడు యతీంద్ర ప్రకటించడంతో అధికార పార్టీలో వేడి రగుల్కొంది. ఇది ప్రతిపక్షాలకు కూడా విమర్శలకు అవకాశమిచ్చింది. సీఎం పదవిని తలా రెండున్నరేళ్లు పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సర్కారు ఏర్పాటు సమయంలో జోరుగా ప్రచారం సాగింది. కానీ సీఎం, డీసీఎంల అనుచర ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది. హైకమాండ్ పదే పదే చెప్పినా.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఎవరూ చర్చించరాదని, గ్యారంటీ పథకాల అమలు, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా హైకమాండ్ పెద్దలు పదేపదే హెచ్చరికలు జారీచేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నోటికి పనిచెబుతూనే ఉన్నారు. మంగళవారం యతీంద్ర చేసిన ప్రకటన మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది. ఆయన ప్రకటనపై మంత్రులు, సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. యతీంద్రవి వ్యక్తిగత వ్యాఖ్యలని, దీనికి పార్టీకి సంబంధం లేదని చాలామంది తప్పించుకున్నారు. కానీ బీజేపీ నేతలు హస్తంలో లుకలుకలు తీవ్రమైనట్లు ఆరోపణలు గుప్పించారు. డీకేశిని చూస్తే జాలేస్తోంది: సింహా మైసూరు: సీఎం కుర్చీలో పూర్తికాలం పాటు కొనసాగాలని సీఎం సిద్ధరామయ్య పథకమేశారని, డిప్యూటీ సీఎం డీకేశిని చూస్తే పాపమనిపిస్తోందని ఎంపీ ప్రతాప సింహా ఎద్దేవా చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికసీట్లు గెలిస్తే మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉంటారని యతీంద్ర చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత సీఎం కావాలని కలలు కంటున్న డీకే శివకుమార్‌ను ఇప్పుడు తలుచుకుంటే జాలి వేస్తోందని వ్యంగ్యమాడారు. డీకే సీఎం అవుతారని ఆయన వర్గీయులు ఓట్లు వేశారని, అయితే వారందరికీ మోసం జరిగిందని అన్నారు. సిద్ధరామయ్య అందరి మధ్య గొడవలు పెట్టి పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని విమర్శించారు. కోలారులో రాముని ఫ్లెక్సీని దుండగులు చింపేయడంపై ఎంపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రామునికి గౌరవం దక్కదని ఆరోపించారు. యతీంద్ర పదవీ బాధ్యత లేని నేత, తమ నాయకునికి శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పుపట్టే పని లేదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. మా నాన్న ఐదేళ్లూ సీఎం ఉండాలనేలా యతీంద్ర మాట్లాడడాన్ని బుధవారం కుమారకృప వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా డీకే మాట్లాడారు. తమ ప్రభుత్వం కొనసాగుతుందని, సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అన్నారు. సిద్దరామయ్య సీఎంగా, నేను కేపీసీసీ అధ్యక్షునిగా ఇద్దరూ కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. అందులో ఎలాంటి అనుమానం లేదని, ఆశపడటం, శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పులేదు, నేను కూడా మా ప్రజలను ఇలాగే అడుగుతానంటూ వివాదాన్ని సద్దుమణిగేలా మాట్లాడారు. -
బస్సులు ఫుల్, చార్జీలు డబుల్
కర్ణాటక: రాష్ట్రంలో ఆర్టీసీ కోసం కొత్తగా 5,675 కొత్త బస్సులు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించాం, కొనుగోలు ప్రక్రియనే త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శక్తి వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరిగింది, రద్దీని తట్టుకొనేలా బస్సులను అందుబాటులోకి తేవాలన్నారు. వాహన తనిఖీల ద్వారా రూ.83 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. బనశంకరి: దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు స్వంత ఊర్ల బాటపట్టగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు టికెట్ బుకింగ్ ధరలు గణనీయంగా పెరిగాయి. లగ్జరీ/ ఏసీ బస్ చార్జీలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాంతినగరలో గల కేఎస్ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రైవేటు బస్సులు యజమానులు సైతం ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నిర్వహించారు. సొంతూర్లకు నగరవాసులు దసరా వల్ల శనివారం నంచి మంగళవారం వరకూ వరుసగా సెలవులు రావడంతో ఐటీ, బీటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. లక్షలాది మంది బస్సులు, క్యాబ్‌లు, సొంత కార్లలో బయల్దేరడంతో నగరంలో ప్రధాన రోడ్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలామంది శుక్రవారం సాయంత్రమే కుటుంబసమేతంగా బయలుదేరి వెళ్లారు. అలాగే మైసూరు రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు, అనేకల్ రోడ్లలో ట్రాఫిక్రద్దీ ఏర్పడింది. బెంగళూరులో మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాటిలైట్ బస్టాండు, శాంతినగర, జయనగర బస్టాండ్లు కిటకిటలాడాయి. సాధారణ బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట ఏర్పడింది. రైళ్లు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే తిరిగి వచ్చేవారి కోసం అక్టోబరు 24 నుంచి 29 మధ్య ఇతర నగరాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు వేశారు. టికెట్‌పై రూ. వెయ్యి వరకూ పెంపు శనివారం ఉదయం నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు చైన్నె, కేరళ, హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయాణాలు మొదలయ్యాయి. టికెట్ ధరను రూ.500 నుంచి 1000 పెంచారు. పండుగ సాకుతో బస్సుల యజమానులు దోచేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రైవేటు బస్సుల్లో బెంగళూరు నుంచి కొచ్చికి టికెట్ చార్జి రూ.3,500 , హైదరాబాద్ –బెంగళూరు, ముంబై–బెంగళూరుకు రూ.3,500గా నిర్ణయించారు. పండుగలకు ఊళ్లకు వెళ్లనివారు కొడగు, చిక్కమగళూరు, ఊటి, మైసూరు, పుదుచ్చేరి తదితర టూర్లకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఒకరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ప్యాకేజీలు ఉన్నట్లు ట్రావెల్‌ఏజెంట్లు తెలిపారు. -
అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు
మైసూరు: వ్యవసాయం పేరిట అప్పులు చేసి ఆ సొమ్ముతో ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం నిలిపేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. పేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోకూడదని, ఎంత మంచం ఉంటే అంతలోనే కాళ్లు చాపుకోవాలని హితవు పలికారు. బుధవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ మలై మహదేశ్వరబెట్ట దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని మాట్లాడారు. పేదలు, మధ్యతరగతి వారు అప్పులు చేసి ఘనంగా పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం ఆ అప్పులు తీర్చుకుంటూ ఉంటున్నారని, ఇది సరికాదని సూచించారు. నూతన దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మలై మహదేశ్వర బెట్టలో ఉన్న రాష్ట్రపతి భవన్‌ను ఇకనుంచి తపోభవనం అని పిలవాలని సూచించారు. మాదప్పకు సీఎం పూజలు మలె మహదేశ్వర స్వామిని సీఎం దర్శనం చేసుకున్నారు. దండిగా వర్షాలు కురిపించి కరువు, కావేరి వివాదం నుంచి గట్టెక్కించాలని పూజలు చేసినట్లు తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు వీరు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. కావేరిపై సుప్రీంను ఆశ్రయిస్తాం తమిళనాడుకు మరో 15 రోజుల పాటు రోజూ 3 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉందని, దీన్ని ప్రశ్నిస్తు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటప్పుడు నీటిని వదలాలనే నిర్ణయం సరికాదని అన్నారు. చామరాజనగరకు వచ్చిన సీఎం కొన్నినెలల్లోనే పదవిని పోగొట్టుకుంటారనే ప్రచారాన్ని ప్రస్తావించగా, గతంలో చామరాజనగరకు వచ్చి ఐదేళ్ల పాటు పాలన సాగించామని, ఈ అపవాదును తొలగించామని సీఎం తెలిపారు. -
ఎమ్మెల్యేలతో సీఎం వరుస భేటీలు
శివాజీనగర: పార్టీ ఎమ్మెల్యేలతో రెండో రోజూ మంగళవారం కూడా సీఎం సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఉదయం సీఎం నివాసం కృష్ణాలో రాయచూరు, విజయపుర, కొప్పళ జిల్లాల ఇన్చార్జి మంత్రుల, ఎమ్మెల్యేలతో సమావేశం జరిపారు. సోమవారం తుమకూరు, యాదగిరి, చిత్రదుర్గ, బాగలకోట, ధారవాడ జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించారు. మంగళవారం సమావేశంలో పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకంగా మీడియా ముందు అధికారిక వ్యాఖ్యలు చేయరాదని, నియోజకవర్గ నిధులతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ఇంతకు ముందు బదిలీల విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంపై సీఎల్పీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపి, అసంతృప్తిని పక్కకుపెట్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కల్యాణ కర్ణాటక ఎమ్మెల్యేలు చేసిన విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి అధిక నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. -
అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య రికార్డు.. 14 వ సారి
కర్ణాటక: రాష్ట్ర శాసనసభా సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానుండగా, అధికార, విపక్షాల మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఐదు గ్యారంటీల పథకాల అమల్లో గందరగోళం, కరెంటు చార్జీల పెంపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మత మార్పిడి చట్టం, ఏపీఎంసీ చట్టం రద్దు చేసే విషయాలతో పాటుగా పలు విషయాలు అసెంబ్లీలో సెగలు పుట్టించే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశం కాగా, నెల కిందట తొలి అసెంబ్లీ సమావేశం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, నూతన సభాధ్యక్షుల ఎంపికకు పరిమితమైంది. మూడు పక్షాల వ్యూహాలు ఇక నేడు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ హామీలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ రెడీగా ఉన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షంలో సీనియర్లు సన్నద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో పలు అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వాటిపై దర్యాప్తు కు ఆదేశించినట్లు చెబుతూ అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేయడానికి కాచుకుంది. గ్యారంటీలపై బీజేపీ దృష్టి ముఖ్యంగా గ్యారంటీలపైనే బీజేపీ దృష్టి సారించింది. వీటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, తాము అసెంబ్లీ లోపల, బయటా ఆందోళనలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అసెంబ్లీ లోపల కూడా పోరాటం చేపట్టేందుకు కాషాయం సిద్ధమైంది. జేడీఎస్ కూడా గ్యారంటీల మీదే ఎగువ, దిగువ సభల్లో గళమెత్తనుంది. అందుచేత ఈ సమావేశాలు వేడెక్కే అవకాశాలే అధికం. బీజేపీ ప్రభుత్వ అవధిలో జారీ అయిన మతమార్పిడి నిషేధ చట్టం, ఏపీఎంసీ చట్టాల రద్దు బిల్లులను అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టనుంది. అలాగే గతంలో సవరణలు ముందున్న ఏపీఎంసీ చట్టాన్నే మళ్లీ అమలులోకి తెస్తూ బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే గోహత్య నిషేధం చట్టంపైనా చర్చ జరగవచ్చు. జూలై 7న సిద్దరామయ్య బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక శాఖ కూడా ఆయనే వద్దనే ఉంది. ఇప్పటివరకు ఆయన 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించారు. ఇది 14వ సారి అవుతుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఒక రికార్డుగా ఉంది. నేడు గవర్నర్ ప్రసంగం తొలిరోజైన సోమవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధారణంగా సంవత్సర ఆరంభంలో సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. అదే ప్రకారంగానే గత ఫిబ్రవరిలో సమావేశాల్లో ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కావడంతో గవర్నర్ ప్రసంగంతోనే ఆరంభించాలని నిర్ణయించారు. -
సీఎం గారూ.. మా బాధలు పట్టించుకోండి
కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య గారు.. కొంచెం విషం ఇవ్వండి.. ప్రాణాలు తీసుకుంటాం అంటూ చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన బాధను వీడియో రూపంలో విన్నవించుకొన్నారు. శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీలు లేవన్నారు. ఆటోల్లో ప్రయాణించేవారు తక్కువయ్యారని, బా డుగలు లేక ఇంటికి వెళ్లలేకపోతున్నామన్నారు. చేతులెత్తి మొక్కుతున్నా.. ఇలాంటి చిత్రహింస ఎవ్వరికీ వద్దు, ఆటో డ్రైవర్లపై కరుణ చూపించాలని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇవే చివరి ఎన్నికలు
మైసూరు: ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, ప్రజల సేవ కొనసాగిస్తానన్నారు. శనివారం ఆయన మైసూరు, వరుణలో పర్యటించారు. బిళిగెరె గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానన్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పారు. ప్రజలు బీజేపీని ఓడించి చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. జూలైలో 3 గ్యారంటీలు మైసూరు జిల్లాలో గ్యారంటీ పథకాలైన అన్నభాగ్య, బెళగావిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. సుత్తూరు దేశికేంద్రస్వామిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూలై 1న కలబురిగిలో గృహజ్యోతి, అదేరోజు పది కేజీల బియ్యాన్ని ఇచ్చే అన్నభాగ్యను మైసూరులో, అలాగే జూలై 16లో బెళగవిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 2022–23లో ఉత్తీర్ణులైన డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు 24 నెలల్లో పని లభించకపోతే నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. ఎస్ఐ నియామకాల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. -
‘గోవధ నిషేధ చట్టం’ తొలగిస్తారా? సిద్ధరామయ్య ఏమ్ననారంటే..
బెంగళూరు: గోవధ నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రకటన ఇవ్వడంతో.. నిరసనలను ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమైంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే.. ఈ చట్టాన్ని ఎత్తేసే అంశంపై ఏదైనా అడుగుపడిందా? అని మీడియా అడగ్గా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘కేబినెట్లో ఈ అంశంపై చర్చించాల్సి ఉంది. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు’’ అని చెప్పారాయన. అంతకు ముందు కర్ణాటక పశుసంవర్థక శాఖ మంత్రి కే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దున్నపోతుల్ని వధించినప్పుడు.. గోవుల్ని ఎందుకు వధించకూడదు? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గత బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అందులో దున్నపోతుల్ని వధించొచ్చని చెప్పింది. కానీ, గోవుల్ని మాత్రం వధించడానికి వీల్లేదని చెప్పింది. ఈ అంశంపై మేం చర్చించి.. నిర్ణయిస్తాంఅని పేర్కొన్నారాయన. అలాగే.. వయసుపైబడిన ఆవుల్ని వధించడం వల్ల రైతులకు ఉపశనమే తప్పా నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విటర్లో మండిపడగా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 1964 చట్టం ప్రకారం(రద్దైన చట్టం).. 12 ఏళ్లు పైబడిన గోవులను, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడని గోవులను వధించేందుకు వీలుంది. మంత్రి వెంకటేష్ చెప్పాలనుకుంది కూడా అదే. కానీ, ఆయన సరిగా వివరించలేకపోయారు అని సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ మినిస్టర్‌ను సమర్థించారు. కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్‌ను 2020లో తీసుకొచ్చింది కర్ణాటక బీజేపీ సర్కార్. ఆ మరుసటి ఏడాది నుంచి అది అమలు అవుతోంది. దీని ప్రకారం.. కర్ణాటకలో పశువుల్ని వధించడం నిషేధం. ఆవుల్ని, లేగల్ని, ఎదుల్ని పశువుల జాబితాలో చేర్చారు. అయితే.. జబ్బు బారినపడిన పశువుల్ని, 13 ఏళ్ల వయసు పైబడిన గేదెలను(అదీ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే) మాత్రమే వధించడానికి అనుమతి ఇస్తారు. వాటిని వధించేందుకు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. కాదని గోవ వధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా.. కర్ణాటక ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా చేరింది. ఇదీ చదవండి: అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా! -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
సిద్దరామయ్యకు షాక్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్ తగిలింది. ఒకవైపు ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వగా.. మరోవైపు ఆయన పోటీచేసిన చాముండేశ్వరి నియోజకవర్గంలోనూ పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రారంభ ట్రెండ్స్‌లో సీఎం సిద్దూ వెనుకబడ్డారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆరంభం నుంచి సిద్దూకు ఎదురుగాలే వీచింది. ఇక్కడ ఆయనపై జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ మొదటిరౌండు నుంచి ఆధిక్యం కనబర్చారు. మొత్తానికి 25,861 ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్యపై ఆయన గెలుపొందారు. అటు బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మొదట ఆధిక్యం కనబచ్చారు. అయితే, లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. సిద్దరామయ్య మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ నియోజకవర్గంలో శ్రీరాములు, సిద్దరామయ్య మధ్య హోరాహోరి నెలకొంది. బాదామిలో 160 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్ర మాత్రం వరుణ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా సాగుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
బీజేపీకి 60 నుంచి 65 సీట్లే
సాక్షి, బెంగళూరు: ఇలా పోలింగ్ ముగిసిందో లేదో.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైపోయింది. దాదాపు ప్రధాన ఛానెళ్ల పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడే అవకాశాలే ఉన్నాయని తేల్చి చెప్పేశాయి. అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న ధీమాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తం చేస్తున్నారు. ‘వచ్చే రెండు రోజులు ఎగ్జిట్ పోల్స్ వినోదాన్ని పంచబోతున్నాయి. నదిని ఈదలేనోడు లోతు లెక్కలు చూసుకుని మురిసిపోయాడంట. చివరకు తప్పుడు అంచనాతో నీటిలో మునిగిపోతాడు. కొందరికి(బీజేపీని ఉద్దేశించి) అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది. కాబట్టి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బాధపడాల్సిన పని లేదు. మీ వారాంతాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది’ అంటూ సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మానసికంగా కుంగిపోయి ఉన్నారని, అందుకే 17వ తేదీ ప్రమాణం చేస్తానని ఏదో మాట్లాడుతున్నారంటూ సిద్ధరామయ్య సెటైర్లు పేల్చారు. బీజేపీకి 60-65 సీట్ల కన్నా ఎక్కువ రాబోవని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలు అందుతుండగా, స్పష్టమైన గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసలు గుప్పించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండటానికి కారణం నరేంద్ర మోదీనే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిద్ధరామయ్య ఏంటి? హఠాత్తుగా మోదీని పొగడటం ఏంటనుకుంటున్నారా?.. అసలు విషయం... మంగళవారం మళవల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నరేంద్ర స్వామి తరపున సిద్ధూ ప్రచారం చేస్తూ ‘గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సౌకర్యం, స్కూళ్లు ఇలా అభివృద్ధి పనులకు కారణం నరేంద్ర మోదీనే’ అని పేర్కొన్నారు. వెంటనే ప్రజల్లో కొందరు గట్టిగా అరవగా.. స్టేజీపైనే ఉన్న నరేంద్ర స్వామి ఆయన్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే సిద్ధరామయ్య తన పొరపాటును సవరించుకుంటూ.. ‘నరేంద్ర అనేది చాలా ముఖ్యమైన పదం. స్వామీ ఇక్కడ ఉన్నారు. మోదీ గుజరాత్లో ఉంటారు. నరేంద్ర మోదీ కల్పితం, నరేంద్ర స్వామి సత్యం’ అంటూ తన ప్రసంగం కొనసాగించారు. రెండోసారి కూడా... ఆ తర్వాత కొద్దినిమిషాలకే సిద్ధరామయ్య మరోసారి నోరు జారారు. ఈసారి ఏకంగా నరేంద్ర మోదీకి ఓట్లేయ్యండని ప్రజలను కోరారు. ‘నరేంద్ర మోదీకి మీరు వేసే ప్రతీ ఓటు. నాకు వేసినట్లే. ఆయన్ని ఆఖండ మెజార్టీతో గెలిపించండి’ అని వ్యాఖ్యానించారు. ఈసారి కార్యకర్తలు గోల చేయటంతో సిద్ధరామయ్య సారీ చెప్పి ప్రసంగం కొనసాగించారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఆయన చేసిన తప్పిదం తాలూకు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘సిద్ధరామయ్య మైండ్‌లో మోదీ ఎంత బలంగా నాటుకు పోయాడో ఇదే నిదర్శనం’ అంటూ కొందరు, ‘బీజేపీ-కాంగ్రెస్ నేతలు దొందూ దొందే’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. గతంలో అమిత్ షా కూడా మీడియా సమావేశంలో యెడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అని వ్యాఖ్యానించగా.. పక్కనే కూర్చున్న యెడ్డీ నివ్వెరపోయారు. ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ట్రోల్ చేసింది. సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైనం -
సిద్దరామయ్యను నేను ఓడిస్తా..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఓడించేందుకే బాదామి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నానని బీజేపీ నేత బళ్లారి శ్రీరాములు తెలిపారు. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఓటమి భయంతోనే 21 నెలల తర్వాత సోనియాగాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారని అన్నారు. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలు విజ్ఞులని, స్థానిక సమస్యల పరిష్కారానికే తెలుగు ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. బీజేపీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను విభజించే కుట్రలో భాగంగానే లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని శ్రీరాములు విమర్శించారు. -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు. -
కర్ణాటక ప్రచార హోరులో పేలుతున్న మాటల తూటాలు!
వారం రోజుల్లో పోలింగ్ జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతల మధ్య మాటలు పదునెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీఎస్ నేత కుమారస్వామిల మాటలు ఈ ప్రచార పోరులో తూటాల్లా పేలుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత రాజకీయ మర్యాదలు, సంప్రదాయాలకు అతీతంగా అసంబద్ధ రీతిలో వారి వ్యాఖ్యలు వేడిపుట్టిస్తున్నాయి. ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచే విధంగా రాహుల్ ప్రవర్తించారని మోదీ గురువారం విమర్శించారు. దీనికి రాహుల్,‘‘మోదీజీకి భయం పుట్టినప్పుడల్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతారు. ఆయన అందరికీ ప్రధాని కాబట్టి నేను ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయను. ఆయనకూ, నాకూ మధ్య ఉన్న తేడా ఇదే,’’ అని రాహుల్అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు మారుపేరు. కొందరు నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కుతాయి,’’ అని యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. ఆయనకు సిద్దరామయ్య దీటైన జవాబు ఇస్తూ, ‘‘యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర గతంలో పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాఘవేంద్ర ఎవరి కుమారుడు? అతను యడ్యూరప్ప కొడుకు కాదా?’’అంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, ‘‘ కాంగ్రెస్ కార్యకర్తలు చెమటలు కక్కుతూ ప్రచారం చేస్తుంటే, ముఖ్యమంత్రి 2+1 సూత్రం అనుసరిస్తూ, తాను రెండు సీట్ల నుంచి పోటీచేస్తూ, మరో సీటులో కొడుకును నిలబెట్టారు. మంత్రులు 1+1 సూత్రంతో కొడుకుల లేదా కూతుళ్లతో కలిసి పోటీచేస్తున్నారు,’’ అనగానేసిద్దరామయ్య వెంటనే, ‘‘బళ్లారి రెడ్డి సోదరులపై సీబీఐ కేసుల మూత గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలుపునకు 2+1 సూత్రం గురించి చెప్పారు. ఇద్దరు రెడ్లు+ఒక యడ్డీ ఫార్ములా అమలు చేస్తున్నారు,’’ అంటూ గాలి జనార్దన్ రెడ్డి అన్నదమ్ములు సోమశేఖర్, కరుణాకర్ రెండు సీట్ల నుంచి అసెంబ్లీకి బీజేపీ టికెట్ పై పోటీచేయడం గురించి ఎద్దేవా చేశారు. ఎవరి మధ్య రహస్య ఒప్పదం? జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఓ ప్రైవేటు విమానంలో అమిత్ షాతో కలిసి చేసిన ప్రయాణానికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, తగిన సమయంలో ఫోటోలు విడుదల చేస్తానని సిద్ధూ ఇటీవల ప్రకటించారు. దీనిపై వెంటనే స్పందించిన కుమారస్వామి, ‘‘వరుణలో సీఎం కొడుకు యతీంద్ర పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్‌కు రహస్య ఒప్పందం ఉన్న కారణంగానే మొదట అక్కడ కాషాయపక్ష అభ్యర్థిగా ప్రకటించిన యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్రను నిలబెట్టలేదు. సీఎంవి ఆధారరహిత, బాధ్యతలేని ప్రకటనలు. ఈ మాటల వల్ల ఆయన తాగుబోతులా మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు,’’ అని జవాబిచ్చారు. ‘‘కర్ణాటక అందరికీ శాంతివనంలా ఉండాలన్న ప్రసిద్ధ కన్నడ కవి కువెంపు మాటలు సిద్ధూ చదివి ఉంటే లింగాయతులకు మైనారిటీ మత హోదా ఇవ్వాలని సిఫార్సు చేసేవారు కాదు,’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించగా, ‘‘కువెంపు రాసిన ఈ కన్నడ రాష్ట్ర గీతంలోని రెండో వాక్యంలోహిందువులు, మస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులకు అంటే అన్ని మతాలకు ఉద్యానవనంలా ఉండాలని చెప్పారు. అమిత్‌షా ఇది కూడా చదవాల్సింది,’’అని సీఎం గట్టిగా జవాబిచ్చారు. అమిత్ షా జైనా? హిందువా? ‘‘సిద్దరామయ్య హిందువులను సైతం చీల్చడానికి ప్రయత్నిస్తున్న విషయం రాహుల్‌గాంధీ గమనించాలి. సీఎంకు ‘అహిందా’(కన్నడంలో దళిత, బీసీ, మైనారిటీ వర్గాల నేత అనడానికి సంక్షిప్త రూపం) నేత అనే పేరుంది. వాస్తవానికి ఆయన అహిందా నేత కాదు అహిందువు.’’ అన్న అమిత్ షా వ్యాఖ్యపై స్పందించిన సిద్ధూ, అమిత్ షా జైన మతస్తుడని, తాను హిందువో కాదో ఆయనే వివరణ ఇచ్చుకోవాలని సవాల్‌చేశారు. వెంటనే, తాను జైనుడిని కాదనీ, హిందూ వైష్ణవుడినని షా జవాబిచ్చారు. ప్రధాని మోదీ అవినీతి గురించి మాట్లాడడాన్ని సిద్ధూ ఆహ్వానిస్తూ, ‘‘ఈ విషయంపై మాట్లాడడం మంచిదే. ముందు మీ మాటలను ఆచరణలో చూపించండి. మీరు ముందు లోక్‌పాల్ నియమించండి, జడ్జీ లోయా మృతిపై దర్యాప్తు జరిపించండి, అమిత్ షా కొడుకు జై షా శరవేగంతో పెంచుకున్న సంపదకు కారణాలు విచారించండి, మచ్చలేని నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించండి,’’అని సవాలు విసిరారు. దీనికి యడ్యూరప్ప జవాబిస్తూ, ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్, మనం దిల్లీవైపు వేలు చూపే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. రాష్ట్రంలో మీరు లోకాయుక్త అధికారాల్నింటికీ కత్తెరేసి శక్తిహీనుడిని చేయలేదా?’’అని ప్రశ్నించారు. ‘‘ మేం 22.5 లక్షల మందికి చేసిన రుణ మాఫీని కేంద్ర మంత్రులు చులకనచేసి మాట్లాడుతున్నారు. రైతు రుణాల మాఫీకి తన దగ్గర అచ్చు యంత్రం లేదని యడ్డీ అంటున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్కంపెనీలకు రూ. 2.7 లక్షల కోట్ల రుణాలు మాఫీచేశాయి. కోట్లాది మంది రైతులను విస్మరించి మోదీ కొందరు పారిశ్రామికవేత్తలకు ఎందుకు మేలు చేస్తున్నారు?’’ అని సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రెండు చోట్లా సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. బాదామీ స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థిగా దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దరామయ్యకు రెండో సీటు కేటాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేవరాజ్‌కు ఇప్పటివరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారని సీఎం కార్యాలయం వెల్లడించింది. చాముండేశ్వరి స్థానానికి సిద్దు ఇప్పటికే నామినేషన్ వేయడం విదితమే. కర్ణాటకలో పెద్ద నోట్ల వరద న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే.. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలు క్యాష్ లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆ రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేపట్టగా రూ.4.13 కోట్ల నగదు పట్టుబడింది. ఇందులో 97 శాతం రూ.2000, రూ.500 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు వెల్లడించారు. ‘ఇటీవల కర్ణాటకలో చేపట్టిన సోదాల్లో రూ.4.13 కోట్ల నగదు, రూ.1.32 కోట్ల విలువైన 4.52 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదు మొత్తంలో రూ.2000, రూ.500 నోట్లే రూ.4.03 కోట్లు ఉన్నాయి’ అని ఐటీశాఖ తెలిపింది. మార్చి 27న కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చాముండేశ్వరిలో చావోరేవో..
చాముండి అమ్మవారి పాదాల సాక్షిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య చావో రేవో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఓడిపోతారంటూ అంతర్గత సర్వేలు హెచ్చరించినా, కుల సమీకరణాలు అనుకూలంగా లేవని తేటతెల్లమైనా, సీఎంను ఓడించడానికి జేడీఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతున్నా సరే సిద్దరామయ్య వెనక్కు తగ్గలేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం రాజకీయ జూదంలో పావులు కదపడం మొదలు పెట్టారు. దీంతో కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టీ చాముండేశ్వరి నియోజకవర్గం మీదే పడింది.దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూరు చాముండేశ్వరి అమ్మవారు కొలువైన ఈ నియోజకవర్గంలో సంకుల సమరానికి తెరలేచింది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చాముండేశ్వరిలో పన్నెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దరామయ్య డూ ఆర్ డై పోరుకి సిద్ధమయ్యారు. తనకు ఎంతో సురక్షితమైన వరుణ నియోజకవర్గాన్ని కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేసిన సిద్దరామయ్య ఓ రకంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారనే చెప్పాలి. చాముండేశ్వరి నియోజకవర్గంలో తొలినుంచీ జేడీఎస్ ప్రాబల్యం ఎక్కువ. ఇక బీజేపీ ఉనికి ఈ ప్రాంతంలో నామమాత్రమే. దీంతో ఈ నియోజకవర్గంలో సిద్దరామయ్య, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మధ్య మాత్రమే పోరు నెలకొంది. వాస్తవానికి చాముండేశ్వరి నియోజకవర్గం సిద్దరామయ్యకు కొత్త కాదు. ఇప్పటివరకు ఆయన అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచే గెలిచి మరో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాక 2006లో ఎన్నికల్లో మాత్రం కేవలం 257 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2008లో వరుణ నియోజకవర్గానికి మారిపోయారు. కులసమీకరణాలే ప్రధానం ఈ నియోజకవర్గంలో కులసమీకరణాలే అత్యంత ప్రధానం. వొక్కలిగలు, ఓబీసీ ఓటర్లు ఎక్కువ. మొత్తం ఓటర్లలో 60 శాతం వొక్కలిగలే. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ వొక్కలిగకు చెందినవారే కావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. ఇక సిద్దరామయ్య సామాజిక వర్గమైన కురు» ప్రాబల్యం ఒకప్పుడు బాగా ఉండేది. 2004లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కురుబ జనాభా ఉన్న చాలా ప్రాంతాలు వరుణ నియోజకవర్గంలో కలిసిపోయాయి. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జేడీఎస్‌కు మద్దతునిస్తూ ఉండడంతో ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ వెంట నడిచే అవకాశాలు న్నాయి. మరోవైపు దశాబ్దకాలంగా సిద్దరామయ్య ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో జేడీఎస్ దానిని తనకు అనుకూల అస్త్రంగా మార్చుకుంది. అయితే సిద్దరామయ్య తనకున్న వ్యక్తిగత చరిష్మా, తాను చేసిన అభివృద్ధే గెలిపి స్తాయన్న ధీమాతో ఉన్నారు. అలాగే తనకు ఇవే ఆఖరి ఎన్నికలనీ, రాజకీయంగా తొలి చాన్స్ ఇచ్చిన ప్రజలు, చివరి అవకాశాన్నీ ఇవ్వాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. బాదామీలో పోటీచేయాలని అడుగుతున్నారు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాల్సిందిగా ఉత్తర కర్ణాటక నాయకులు ఇప్పటికీ తనను కోరుతున్నారంటూ సిద్దరామయ్య కొత్త ఊహాగానాలకు తెరలేపారు. చాముండేశ్వరితోపాటు బాదామీ నుంచి కూడా పోటీ చేయాలని తొలుత సిద్దరామయ్య భావించినప్పటికీ మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు మోకాలడ్డారు. ఆ స్థానం నుంచి పోటీకి దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించినా ఆయనకు ఇంకా బీ–ఫామ్ అందజేయలేదు. బాదామీలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే చిమ్మనకట్టి కూడా దేవరాజ్ పాటిల్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలవడమే తమకు ప్రధానమనీ, ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని గెలిచిన తర్వాతే నిర్ణయిస్తామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జి.పరమేశ్వర స్పష్టం చేశారు. జేడీఎస్ దూకుడు చాముండేశ్వరిలో సిద్దరామయ్యను ఎలాగైనా ఓడించాలని, నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతున్న జేడీఎస్ పకడ్బందీ వ్యూహాలే రచిస్తోంది. సిద్దరామయ్యను ఓడించడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ నేతలు వీరశైవ మఠాలు, దళిత కాలనీల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుమారుడు హరీశ్ గౌడ తండ్రి గెలుపు కోసం ఏడాది క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాముండి నియోజకవర్గంలో పల్లెపల్లెకూ తిరుగుతున్నారు. ప్రతి పల్లెతోనూ వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ జేడీ(ఎస్)కు కలిసొచ్చే అంశాలనే భావన వ్యక్తమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు
దొడ్డబళ్లాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఆయన ఫొటో చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్య మంత్రి బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. పట్టణంలోని భగత్‌సింగ్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకపోగా ఎన్నికల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తాను 50 మంది పౌర కార్మికులను ఇంటికి పిలిచి సన్మానించానన్నారు. దేశానికి రైతు, చేనేత కార్మికుడు రెండు కళ్లలాంటివారన్నారు. సీఎం సిద్ధరామయయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఎన్నికల సర్వే ఫలితాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. మొళకాల్మూరు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మాట్లాడుతూ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికుల అన్ని రుణాలనూ మాఫీ చేస్తారన్నారు. ఇదే సందర్భం గా చలనచిత్ర నిర్మాత, జేడీఎస్ సీనియర్ నాయకుడు సారథి సత్యప్రకాశ్ వందలాదిమంది మద్దతుదారులతో కలిసి యడ్యూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ పుట్టస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆ సర్వేలో నిజం లేదు
సాక్షి, బళ్లారి: ఓటమి భయంతోనే సీఎం సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో పస లేదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొనడంలో నిజం లేదు అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు అబద్ధమని తేలిపోయినట్లు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తారని సర్వేలు చెప్పలేదని, అదే మాదిరిగా ఈసారి కూడా యడ్యూరప్ప కర్ణాటకలో సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు అనంతరం సిద్దూ ఇంటికే పరిమితం అవుతారని, కాంగ్రెస్ ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా తాము ఒంటరిగా 150 సీట్లతో గద్దెనెక్కుతామని జోస్యం చెప్పారు. శ్రీరాములే పోటీ చేసి గెలుస్తారు మొళకాల్మూరు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారంటే అది శ్రీరాములు ఆశీస్సులే, గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌సీపీ తరుపున తిప్పేస్వామికి శ్రీరాములు టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపునకు కృషి చేయడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నది మరువకూడదని శెట్టర్ హితవు పలికారు. శ్రీరాములుపై తిప్పేస్వామి తిరుగుబాటు చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరించారని, ఎట్టి పరిస్థితుల్లోను మొళకాల్మూరు నుంచి శ్రీరాములే పోటీ చేస్తారని, ఆయనే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. తిప్పేస్వామి రాజకీయ సమీకరణలు నిజం కావన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమో లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అనవసర గొడవలకు దిగితే జనమే బుద్ధి చెబుతారన్నారు. శ్రీరాములుకు మొళకాల్మూరులో గెలిచే శక్తి ఉందన్నారు. ఆయన అక్కడే కాకుండా రాష్ట్రంగా పలు జిల్లాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని చెప్పారు. -
కింగ్ మేకర్‌ను కాదు.. కింగ్‌నే !
సాక్షి, మైసూరు: కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం వెడెక్కింది. శాసనసభ ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదని, కింగ్‌గానే అవతరిస్తానని.. జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. మైసూర్‌లోని ఇలవాలలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చాముండేశ్వరి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే చెప్పిన సర్వే తప్పుడమయమన్నారు. ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడం వృథా ప్రయాసని.. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలు మరోరకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ వంద స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని, ఇది కన్నడ ప్రజల తీర్పని కుమారస్వామి అన్నారు. ఇదే విషయాన్ని బాండ్ పేపర్‌పై కూడా రాసిస్తానని మీడియా ముందు కుమార స్వామి సవాల్ విసిరారు. ఇండియా టుడే సర్వే ఎవరు, ఎందుకు చేయించారు అనే విషయం తనకు తెలుసని.. సీఎం సిద్ధరామయ్య సలహాదారుడు దినేష్ అమిన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సర్వేను ప్రజలు నమ్మొద్దని అన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన విషయం మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని, తెలుగు, కన్నడిగులను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. -
కర్ణాటక ఓటర్ల నాడి ఎలా ఉంది ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న బీజేపీ కన్నడ నేలపై విజయం సాధించడం ద్వారా దక్షిణాదిన పాగా వెయ్యాలని తహతహలాడుతుంటే, అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక సై్థర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది. మరి ఓటర్ల నాడి ఎలా ఉంది ? సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు ? గత అయిదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేరుస్తాయా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,244 మందితో మాట్లాడారు. 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య ఈ సర్వేని నిర్వహించారు. ఏయే సంక్షేమ పథకంపై ప్రజలు ఏమంటున్నారు? సంక్షేమం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది దివంగత నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితలే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వారిని స్ఫురణకు తెచ్చేలా గత అయిదేళ్లలో భాగ్య పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమమే ఓట్లు రాలే అంశంగా మారితే కనుక కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రారంభించిన అన్నభాగ్య పథకానికి ఈ సర్వేలో అనూహ్య స్పందన వచ్చింది. దారిద్య్రరేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యాన్ని ఇచ్చే ఈ పథకం అద్భుతమైనదంటూ 79 శాతం మంది కితాబు ఇచ్చారు. మరో 14 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తే, 6శాతం మంది ఆ పథకాన్ని వినియోగించలేదని వెల్లడించారు. స్కూలు డ్రాపవుట్లను తగ్గించడం కోసం అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లను ఇచ్చే సైకిల్ భాగ్య పథకంపట్ల 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 2006 నుంచి అమల్లో ఉన్న ఈ పథకాన్ని ఇప్పటికీ సిద్దరామయ్య ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాన నీటిని సంరక్షించి సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడుల్ని పెంచే కృషి భాగ్య పథకంపై 58 శాతం రైతులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఇక 25 శాతం మంది పెదవి విరిచారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించే అనిల్ భాగ్య పథకంపై కూడా ప్రశంసల వర్షం కురిసింది. ఏకంగా 66శాతం మంది ఈ పథకాన్ని భేష్ అన్నారు. వెనుకబడిన మైనార్టీ వర్గాలకు చెందిన నవ దంపతులకు 50 వేలరూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే షాదీ భాగ్య పథకంపై కూడా 45 శాతం మంది సంతృప్తి ప్రకటించారు. తమిళనాడులో అమ్మ కేంటిన్ల స్ఫూర్తితో గత ఏడాది ఆగస్టులో ఇందిర కేంటీన్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సబ్సిడీ రేట్లకే సామాన్యుడి కడుపు నింపే ఈ పథకం ఆశించినంతగా ప్రజాదరణ పొందలేదని ఈ సర్వేలో తేలింది. 36 శాతం మంది ఈ కేంటీన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే 31 శాతం మంది ఈ కేంటీన్లు వచ్చాక సంతృప్తిగా భోజనం చేస్తున్నామని చెప్పారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత నెలలో 2వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఆరోగ్య భాగ్య పథకం ఈ సర్వే పరిధిలో లేకపోయినా దానికి కూడా మొదట్లోనే మంచి స్పందన కనిపిస్తోంది. కర్ణాటకలో సంక్షేమ పథకాలు ఆరోగ్య భాగ్య అన్నభాగ్య కృషి భాగ్య సైకిల్ భాగ్య అనిల్ భాగ్య షాదీ భాగ్య క్షీర భాగ్య వసతి భాగ్య ఇందిరా కేంటీన్లు 10కి 7 మార్కులు ఈ సర్వేలో సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు 10కి 7 మార్కులు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అత్యధికులు వివిధ రంగాల్లో సిద్దరామయ్య ప్రభుత్వానికి మంచి మార్కులే వేశారు. పాఠశాలల నిర్వహణ (7.85), విద్యుత్ సరఫరా (7.83), ప్రజా రవాణా (7.61), అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువులపంపిణీ (7.35), ఉద్యోగ అవSకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో సిద్దరామయ్య ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. మొత్తంగా సిద్దరామయ్య భాగ్యాన్ని ఈ భాగ్య పథకాలే నిర్ణయిస్తాయా ? ఇంకో నెల వేచి చూడాల్సిందే మరి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉత్తర–దక్షిణాది ఘర్షణ తప్పదా ?
రాబోయే రోజుల్లో ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో తమ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదనే భావనలో దక్షిణాది నాయకులున్నారు. రాష్ట్రాలకు 1971 జనాభా లెక్కలకు బదులు 2011 జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర పన్నుల రాబడిని ( సెంట్రల్ టాక్స్ రెవెన్యూ) పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేయడం మళ్లీ మాటల యుద్ధానికి తెర లేపింది. కేంద్రం సిఫార్సు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని, దీనిని తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నేతలు అడ్డుకోవాలంటూ శుక్రవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌ను ఆయా రాష్ట్రాల సీఎంఓలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా ఆయన ట్యాగ్ చేశారు. ఇదే సెంటిమెంట్‌ను వ్యక్తం చేస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పది బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. పదహేనో∙ఆర్థిక సంఘం పరిశీలనలోని కొన్ని పరిశీలనాంశాలు (టీఓఆర్) లోపభూయిష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటి వల్ల రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడి సమాన ంగా∙పంపిణీ చేయడం పై ప్రభావం పడుతుందని, ఈ రాష్ట్రాలకు మున్సిపాలిటీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కలతో నష్టం ? కేంద్ర పన్నుల రాబడి (టాక్స్ రెవెన్యూ)ని ప్రతీ అయిదేళ్లకు వివిధ రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే అంశాన్ని రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన కేంద్ర పన్నుల్లో 42 శాతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తారు. మిగతా 58 శాతాన్ని జాతీయ అవసరాల కోసం కేంద్రం వినియోగిస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేటాయించే 42 శాతం నిధులపై ఆర్థికసంఘం నిర్ణయిస్తుంది. గతేడాది నవంబర్ 27న ఎన్కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థికసంఘాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఫైనాన్స్ కమిషన్ 2020–25 కాలానికి సంబంధించిన పన్నుల కేటాయింపుపై వచ్చే ఏడాది అక్టోబర్ 30 లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా కమిషన్ సిఫార్సు చేస్తుందని టీఓఆర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇందుకు 1971 సెన్సస్ వివరాలను ( ఈ జనాభా లెక్కల తర్వాతే దేశంలో కుటుంబనియంత్రణ విధానాలు వేగవంతం చేయడంతో) ప్రామాణికంగా తీసుకునేవారు. ఈ డేటా ప్రకారమే 1976లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచారు. నియోజకవర్గాల సంఖ్య మార్చకుండా 2008లో పునర్విభజన జరిగింది. 2026 తర్వాత(2031) జరిగే జనాభా లెక్కల ఆధారంగానే మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 2011 జన గణన ప్రకారం సమకాలీన భారత్‌లో ఉత్తర,దక్షిణ రాష్ట్రాల మధ్య తేడాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఆర్థికాభివృద్ధి రేటు, నాణ్యమైన జీవనం, ప్రభుత్వపాలన, జనాభా, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. 1991లో సరళీకర ఆర్థిక విధానాల అమలు మొదలయ్యాక ఆ తర్వాతి ఇరవై ఏళ్లలో ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి 25 శాతం జనాభా పెరుగుదల రికార్డయింది. అదే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళల్లో కలిపి 12 శాతమే జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాల్లో కేరళలో 5 శాతం జనాభా వృద్ధి కాగా బిహార్‌లో ఎన్నోరెట్లు పెరిగింది. జాతీయ సగటు, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సగటు కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికశాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమైంది. దక్షిణాదిపై చిన్నచూపా ? 1971–91 సంవత్సరాల మధ్య ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు పెరిగిందని, తమ రాష్ట్రాల్లో క్రమేణా తగ్గుతూ వస్తోందనేది దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం లెక్కిస్తే రాష్ట్రాలకు కేంద్రనిధులు గణనీయంగా తగ్గిపోతాయన్నది సిద్ధరామయ్య, స్టాలిన్ వంటి నేతల «నిశ్చితాభిప్రాయం. సంతానోత్పత్తి శాతాన్ని తగ్గించేందుకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్య పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నందుకు కేంద్రం శిక్షిస్తున్నట్టుగా ఇది ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 1971–2011 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 138. 02 శాతం, జమ్మూ,కశ్మీర్లో 171.82 శాతం జనాభా వృద్ధితో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని,అదే తమిళనాడులో 56 శాతం, కేరళలో 75 శాతమే వృద్ధి చెందిందని గణాంకాలు ఉటంకిస్తున్నారు. యూపీ, బిహార్‌లతో పోల్చితే కేరళ, తమిళనాడు మహిళా అక్షరాస్యత గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల యూపీలో రూ. 36 వేల కోట్లతో రైతు రుణమాఫీని ప్రకటించడంతో (ఆ రాష్ట్రం రూ.50 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా) దీనిని అమలు చేసేందుకు అవసరమైన రుణాలకు కేంద్రమే పూచీ ఉండాల్సి రావడాన్ని ఎత్తిచూపుతున్నారు. అయితే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల వాటాలో పెద్దగా ప్రభావం పడదని ఆర్థికసంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ చెబుతున్నారు. పదిహేనో ఆర్థికసంఘం పరిశీలనాంశాల (టీఓఆర్)ను సమర్థిస్తూ జనాభా వృద్ధిని అదుపు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ రాష్ట్రాల లెక్క సరిచేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కొత్త మతం!
తమను ఎస్సీ, ఎస్టీ లేదా బీసీలుగా గుర్తించాలని దేశవ్యాప్తంగా వివిధ కులాల నుంచి బలంగా డిమాండ్లు వినబడుతున్న తరుణంలో కర్ణాటక మంత్రివర్గం లింగాయత్ సామాజిక వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ సోమవారం చేసిన తీర్మానం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. దానిపై అనుకూల, వ్యతిరేక వాదనలు మొదలయ్యాయి. బసవణ్ణ సిద్ధాంతాలను అనుసరించే వీరశైవుల్ని కూడా మైనారిటీ మతంగా గుర్తించాలని కేబినెట్ తీర్మానించింది. కర్ణాటక కేబినెట్‌ది తుది నిర్ణయమేమీ కాదు. ఆ ప్రతిపాదన కేంద్ర హోంశాఖకు చేరుతుంది. ఆ ప్రతిపాదన జనాభా గణన వ్యవహారాలను చూసే రిజిస్ట్రార్ జనరల్‌కు వెళ్తుంది. తాజా నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది గనుక సహజంగానే ఆ తర్వాత అది మూలనబడుతుంది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తెలియక కాదు. కానీ బంతిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టి తాను చేయగలిగిందంతా చేసినట్టు చూపించాలి. బీజేపీకి పెట్టని కోటగా ఉంటున్న లింగాయత్‌లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలి. ఇదీ ఆయన వ్యూహం. అయిదేళ్ల క్రితం బీజేపీపై అలిగి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమ యంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అది అసాధ్యమని యూపీఏ ప్రభుత్వం ప్రత్యుత్తరమిచ్చింది. యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి ప్రవేశించాక దాని ఊసెత్తలేదు. తాజా నిర్ణయం ఆయన్ను రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. ప్రస్తుతం ఆ వర్గానికి ఆయన తిరుగులేని నేత. నిజానికి లింగాయత్‌లను ప్రత్యేక మతవర్గంగా గుర్తించడంపై కాంగ్రెస్‌లోనే విభేదాలు న్నాయి. ఈ నెల 8న జరిగిన కేబినెట్ తొలిసారి దీన్ని చర్చించినప్పుడు లింగా యత్లకు ప్రాతినిధ్యంవహించే మంత్రులు, వీరశైవ వర్గానికి చెందిన మంత్రులు కత్తులు దూసుకున్నారు. ఈ రాజకీయపుటెత్తుల సంగతలా ఉంచితే తమను ప్రత్యేక మతవర్గంగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండు ఈనాటిది కాదు. స్వాతంత్య్రం రావడానికి ముందే 1942లో ఈ డిమాండు మొదలైంది. 1871 మైసూర్ జనాభా లెక్కల్లో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించినట్టు దాఖలాలున్నాయి. అయితే ఆ తర్వాత 1881లో జరిగిన జనగణనలో వారిని హిందూ మతంలో ఒక కులంగా వర్గీకరించారు. ఈ మార్పునకు కారణమేమిటో అందులో నమోదు చేయలేదు. వాస్తవానికి చాన్నాళ్లనుంచి ఆ డిమాండును భుజాన వేసుకుని, దానికోసం కృషి చేసిన వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ప్రముఖ సాహితీవేత్త, హంపీ విశ్వవిద్యా లయ మాజీ వైస్ చాన్సలర్ కల్బుర్గీ ఒకరు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఎం జాందార్. కల్బుర్గీని గుర్తు తెలియని దుండగులు మూడేళ్లక్రితం కాల్చిచంపారు. లింగాయత్‌లది ప్రత్యేక మతమని, వారిని అలా గుర్తించడమే సరైందని కల్బుర్గీ గట్టిగా వాదించేవారు. అదే సమయంలో లింగాయత్ సిద్ధాం తాన్ని ప్రతిపాదించిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడి బోధనలను లింగాయత్ మఠాలు సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించేవారు. మాజీ ఐఏఎస్ అధికారి జాందార్ చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. లింగాయత్‌లు ప్రత్యేక మతవర్గమని రుజువు చేసేందుకు తగిన ఆధారాలను ఆయన ఎంతో శ్రమకోర్చి సేకరించారు. 2011లో జనగణన జరిగిన సందర్భంలో లింగాయత్లెవరూ హిందువులుగా నమోదు చేసుకోవద్దంటూ లింగాయత్ మఠాలనుంచి ప్రకటనలొచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుడు ఈ డిమాండు ఊపందుకుంది. బీదర్, బెళగావి, లాతూర్, కలబురగి తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. వీటన్నిటికీ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది లింగాయత్‌లు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో బెంగళూరులో జాతీయ సదస్సు జరిపారు. ఆ సదస్సు తర్వాతే లింగాయత్‌ల డిమాండు పరిశీలించడం కోసం రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీని ఏర్పాటు చేశారు. లింగాయత్ సిద్ధాంతానికి మూల కారకుడైన బసవేశ్వరుడు సంఘ సంస్కర్త. 12వ శతాబ్దిలో తన బోధనలతో ప్రస్తుతం కర్ణాటకగా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కాదు... దక్షిణాదినంతటినీ తీవ్రంగా ప్రభావితం చేశాడు. పల్నాడు, గురజాల రాజ్యాల్లో కీలకపాత్ర పోషించిన బ్రహ్మనాయుడు ‘చాపకూడు’ సిద్ధాంతం వెనక బసవేశ్వరుడి ప్రభావమే ఉంది. సమాజంపై కులమతాల పట్టు బలంగా ఉన్నప్పుడూ, ఆచారాలు సంప్రదాయాల పేరిట అసమానతలు రాజ్యమేలుతున్న ప్పుడు బసవేశ్వరుడు వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. సమూహాలను కూడ గట్టాడు. కుల వ్యవస్థను, వైదిక ఆచారాలను వ్యతిరేకించాడు. విగ్రహారాధాన సరైందికాదన్నాడు. ఆయన సిద్ధాంతాల ప్రచారం కోసం ఎన్నో మఠాలు వెలిశాయి. అయితే వైదిక ఆచారాలను పాటించే వీరశైవులు, లింగాయత్‌లు ఒకటేనన్నది యడ్యూరప్ప వంటివారి వాదన. వీరశైవుల్ని, లింగాయత్‌లనూ ఒకటిగా పరిగణించి ఆ వర్గాన్ని మైనారిటీ మతంగా గుర్తించాలని వీరశైవ మహాసభ కోరుతోంది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవుల ప్రభావం చాలా బలమైనది. 224మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు లింగాయత్ లేదా వీరశైవ వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉండే లింగాయత్‌లు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అధికం. ఆ వర్గం దాదాపు వంద నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించే స్థితిలో ఉంది. బసవణ్ణ మఠాల ఆధ్వర్యంలో కర్ణాటకలో పలుచోట విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీరశైవ మహాసభ ఏం నిర్ణయిస్తే దానికి తాను కట్టుబడి ఉంటానని బీజేపీ నేత యడ్యూరప్ప చెబు తున్నారు. మొత్తానికి సిద్దరామయ్య కదిపిన తేనెతుట్టె కర్ణాటక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బీజేపీని ఎంతవరకూ ఇరకాటంలోకి నెడుతుందో, కాంగ్రెస్‌కు ఏమేరకు లాభిస్తుందో చూడాల్సి ఉంది. -
ప్రత్యేక మతం.. సీఎం సతమతం
సాక్షి, బెంగళూరు : లింగాయత్ ప్రత్యేక మతం అంశం రోజురోజుకు ప్రభుత్వానికి కొరకరాని కొయ్మగా మారుతోంది. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించాలని వద్దని కొంతమంది మంత్రులు, స్వామీజీలు రెండు వర్గాలుగా విడిపోవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డోలాయమానంలో పడిపోయారు. లింగాయత్‌లకు ప్రత్యేక మతానికి సంబంధించి నాగమోహన్‌దాస్ నివేదికను అమలుచేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని బాగల్‌కోటెలోని విరక్తి మఠాధీశుడు చంద్రశేఖర శివాచార్య స్వామీజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యేక లింగాయత్ మతం రాజుకుంటోంది. ఇక లింగాయత్ వర్గానికి చెందిన స్వామీజీలే రెండు వర్గాలు విడిపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగమోహన్‌దాస్ రెండు నెలల్లోనే నివేదికలు అందిచడం చూస్తుంటే వాటిలో ఏముందో స్పష్టమవుతోందంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సర్కారును విమర్శించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా లింగాయత్ ప్రత్యేక అంశానికి అనుకూలంగా మంత్రులు ఎం.బీ.పాటిల్,శరణప్రకాశ్ పాటిల్,వినయ్ కులకర్ణి, బసవరాజరాయరెడ్డిలు, వ్యతిరేకంగా మల్లికార్జున, ఈశ్వరఖండ్రెలు తీవ్రంగా గొంతెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రముఖ వీరశైవ, లింగాయత్ మఠాధిపతులదీ ఇదే తీరు. అందరూ కయ్యానికి సిద్ధమనడంతో ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులేస్తున్నారు. అందులో భాగంగా లింగాయత్ ప్రత్యేక అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా,ప్రకటనలు కూడా చేయకుండా సీఎం సిద్దరామయ్య జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు చేయడంతో అందరితో కలసి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ పరిస్థితి నుంచి బయటపడ్డట్లు సమాచారం. మంత్రుల ఆగ్రహం నేపథ్యంలోనే బుధవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం సిద్ధరామయ్య వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. -
ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ టికెట్..!
సాక్షి, యశవంతపుర: బాహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూర్‌లో జరిగిన ప్రధాని మోదీ ర్యాలీపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఏదోక విషయంపై స్పందిస్తూనే ఉంటారు. ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సాహితీవేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిసిన వారు కలిశారు. ఆ సమయంలో అతినికి రాజ్యసభ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రయోజనం కలుగుతుందన్నారు. వామపక్షాల పోరాటంలో ముందజలో ఉన్న ప్రకాశ్‌కు టికెట్ ఇస్తే కాంగ్రెస్‌కు కలిగే లాభాలపై సీఎంతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఏఐసీసీ వద్ద కూడా ఈ ప్రస్థావన తెచ్చినట్లు సమాచారం. -
‘ప్రజల్లో చైతన్యం తేవడమే యాత్ర లక్ష్యం..’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26 నుంచి 29వరకు ప్రజా చైతన్య యాత్రను చేపట్టనుంది. కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా ఉన్న చేవేళ్ల నుంచే ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. ఈ యాత్రలో ఏఐసీసీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర తెలంగాణలో మూడు రోజులపాటు జరగనుంది. బస్సు యాత్రలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యలు పాల్గొననున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశ, నియంతృత్వ విధానాలను తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాక అధికార నియంతృత్వంపై ప్రజల్లో చైతన్యం తేవడమే యాత్ర లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. -
ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు!
బెంగళూరు : ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తాయిలాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 6.2లక్షల మంది ఉద్యోగుల వేతనాలను 30 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే ఆమోదం తెలుపనున్నారు. జీతాల పెంపుతోపాటు నాలుగో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. చిన్న మెలిక : జీతాల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.10,800 కోట్ల అదనపుభారం పడుతుందని, అయినాసరే పెంపునకు వెనుకాడబోమని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే, నాలుగో శనివారం సెలవుపై మాత్రం ప్రభుత్వం చిన్న మెలికపెట్టింది. నెలలో పని గంటలు తక్కువ కాకుండా ఉండేలా.. మొదటి, మూడో శనివారాల్లో ఉద్యోగులు అదనంగా పనిచేయాల్సిఉంటుంది. జనవరి 31 డెడ్‌లైన్ : జీతాల పెంపు అంశంపై గత బడ్జెట్ సెషన్లో సీఎం సిద్ధూ చెప్పిన మాట ప్రకారం.. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస మూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. జీతాల పెంపు ఎంత శాతం ఉండాలనేదానిపై మూర్తి కమిటీ సిఫార్సు చేయనుంది. ‘‘మా నివేదిక దాదాపు పూర్తయింది. జనవరి 31 డెడ్‌లైన్ అని సీఎం చెప్పారు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో నివేదికను అందజేస్తాం’ అని శ్రీనివాసమూర్తి చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాలు మాత్రం 30 నుంచి 35 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఇది ఆరంభం, ఇక వలసల వెల్లువే
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, త్వరలో జరిగే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గె లుపొంది అధికారంలో వస్తామని అన్నారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల చేరిక సందర్భంగా యడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్నికల్లోపు మరింతమంది బీ జేపీలోకి వలస వస్తారని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నం దున పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం చట్టవిరుద్ధమని యడ్డి అన్నారు. మూడు నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించారు. గత బడ్జెట్లో కనీసం 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఎన్నికల ముందు ఈ మూడు నెలల్లో ఏకంగా రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జేడీఎస్‌లో మాకు ప్రాధాన్యం లేదనే రాజీనామా శాసనసభ స్పీకర్ కేబీ కోళివాడ్ అందుబాటులో లేకపోవడంతో గురువారం శాసనసభ కార్యదర్శి ఎస్.మూర్తికి జేడీఎస్ ఎమ్మెల్యేలు వజ్జల్, పాటిల్ తమ రాజీనామా లేఖలను అందజేశారు. గడిచిన ఏడాది కాలంగా జేడీఎస్ అధినాయకత్వం తమను పక్కన పెట్టిందని వారిద్దరూ ఆరోపించారు. చాలా కార్యక్రమాల్లో తమ ఇద్దరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము జేడీఎస్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. రాజీనామా పత్రాలపై హైడ్రామా రాజీనామా లేఖల విషయంలో భారీ హైడ్రామా చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను అందుకునేందుకు శాసనసభ కార్యదర్శి మూర్తి సంశయించారు. నియమాల ప్రకారం రాజీనామా లేఖలను స్పీకర్‌కే సమర్పించాలని వారిద్దరికీ సూచించారు. అయితే గత రాత్రే తాము స్పీకర్‌తో మాట్లాడినట్లు, స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు వారు చెప్పినా మూర్తి ఒప్పుకోలేదు. దీంతో వారు బలవంతంగా మూర్తికి రాజీనామా లేఖలు సమర్పించి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 4న బెంగళూరుకు ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ కర్ణాటక ఇన్చార్జి పి.మురళీధర్‌రావు చెప్పారు. ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పలువురు హిందూ కార్యకర్తలు దారుణ హత్యలకు గురయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పనేనని తెలిపారు. బెంగళూరులో ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని రావ్ తెలిపారు. -
సీఎం.. చింపాంజి
హుబ్లి (సాక్షి, బెంగళూరు): సీఎం సిద్ధరామయ్యను చింపాంజితో పోలుస్తూ హుబ్లి–ధారవాడ మహిళా కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ మోహన హిరేమని షేర్ చేసిన మార్ఫింగ్ చేసిన ఫో టో చర్చనీయాంశమైంది. ఏకంగా సీఎం ఫోటోను అదే పార్టీ నాయకురాలు పార్టీ గ్రూప్‌లోనే పోస్ట్ చేయడంతో ఆమెపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు డీ.కే.శివకుమార్, వినయ్ కులకర్ణి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ తదితరులు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఈ ఫోటో పెట్టడం విశేషం. దీనిపై హుబ్లి–ధారవాడ నగర జిల్లాధ్యక్షుడు అల్తాఫ్ స్పందిస్తూ కార్పొరేటర్ మోహన హిరేమని తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేం పెట్టలేదు : తమ నాయకుడైన సిద్ధరా మయ్య అవహేళనకరంగా ఉన్న ఫోటోను తాము పోస్ట్ చేయలేదని, ఈ ఘటనతో త మకు సంబంధం లేదని కార్పొరేటర్ మోహన హిరేమని చెబుతున్నారు. -
బాహుబలి విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయండి
సాక్షి,బెంగళూరు: శ్రవణ బెళగోళలో ఉన్న దిగంబర బాహుబలి విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలంటూ ప్రభు పాత్రికేయుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కన్నడ సంస్కృతికశాఖ మంత్రి ఉమాశ్రీకు బుధవారం లేఖ రాశారు. సాంకేతికంగా, సామజిక మార్పుల పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో తొమ్మిదవ శతాబ్దంలో దిగంబరుడిగా ఉన్నారనే కారణంగా నేటికి కూడా బాహుబలిని దిగంబరుడిగానే ఉంచడం సమంజపం కాదంటూ లేఖలో విన్నవించారు. అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయం అప్పటికి సరైనదేనైనా ప్రస్తుత కాలానికి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనివల్ల ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో మూఢనమ్మకాలు మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా దిగంబరుడిగా ఉన్న బాహుబలి విగ్రహాన్ని చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలని లేఖలో విన్నవించారు. -
బీజేపీ, బజరంగ్ దళ్‌పై సిద్దూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మాదికేరి (కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి హిందూత్వ సంస్థలపై మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్‌లో ఉగ్రవాద శక్తులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అతివాద ఎస్డీపీఐ అయినా, బజరంగ్ దళ్ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఆదమరిచి నిద్రించిన సిద్దూ..! కర్ణాటక సీఎం సిద్దరామయ్య బుధవారం ఉదయం మదికేరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై ఆదమరిచి నిద్రిస్తూ మీడియా కంటికి చిక్కారు. ఓవైపు కార్యక్రమం జరుగుతున్నా.. అదేమి పట్టనట్టు ఆయన కునుకుతీశారు. ఆయన నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియలో దర్శనమివ్వడంతో ఆయనపై నెటిజన్లు సెటైర్లు, జోకులు వేస్తూ.. పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. -
అమిత్ షాది కాలం చెల్లిన మ్యాజిక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి భారతీయ జనతాపార్టీ చీఫ్ అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షావి కాలం చెల్లిన వ్యూహాలని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ విజయం తరువాత కర్ణాటక మీద బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ పాగా వేసేందుకు కమల దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం బెంగళూరు వచ్చారు. అమిత్ షా బెంగళూరు రావడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. అమిత్ షాది కాలం చెల్లిన వ్యూహాలని ఆయన మీడియాతో అన్నారు. అమిత్ షా మ్యాజిక్కు కాలం చెల్లిందని.. ఇప్పుడు అది పనిచేయదని సిద్దరామయ్య అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ద రామయ్య బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. నవంబర్లోనూ బీజేపీ చీఫ్‌పై సిద్దరామయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన అమిత్ షాను.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక పర్యాటకుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: సీఎం
మైసూరు: అనేకమంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, వారి పేర్లు వివరాలను ఇప్పుడే వెల్లడించలేం అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. శనివారం మైసూరులో రామకృష్ణనగర్లోనున్న స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వారి విజయావకాశాలపై స్పష్టత వచ్చాకే వారిని పార్టీలోకి ఆహ్వానించాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం నుంచే నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నా. డిసెంబర్ 13 నుంచి నిరంతరంగా పర్యటిస్తా’ అన్నారు. సిద్దరామయ్యకు వరుణ నియోజకవర్గం గురించి పూర్తిగా తెలియదంటూ కేంద్రమంత్రి సదానందగౌడ చేసిన విమర్శలపై స్పందిస్తూ ఆయనకు వరుణ నియోజకవర్గం గురించి తెలిసిఉంటే వచ్చే ఎన్నికల్లో వరుణ నుంచి బరిలో దిగాలని సవాల్ విసిరారు. ఇక పాత్రికేయుడు రవి బెళగెరెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తనకు తెలియదని, దీనిపై పూర్తి సమాచారం అందిన తరువాతే స్పందిస్తానని చెప్పారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో తమతో పాటు హాజరైన ఎంపీ ప్రతాప సింహాకు మీ పద్ధతి మార్చుకోవాలని సూచించామన్నారు. చాముండేశ్వరి నుంచే చివరిసారి పోటీ ఉప ఎన్నికల్లో తమకు రాజకీయ పునర్జన్మనిచ్చిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నది తన చిరకాల వాంఛ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తనకు ఇవే చివరి ఎన్నికలని ఆయన చెప్పారు. ఈ నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాల వల్లే కర్ణాటక దేశంలో అన్ని రంగాల్లోనూ మొదటిస్థానంలో ఉందన్నారు. కేఆర్ఎస్, కబిని జలాశయాల నుంచి చాముండేశ్వరి నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటిని అందించామన్నారు. కత్తితో మాట్లాడుతుంటా బీజేపీ మాజీ మంత్రి ఉమేశ్ కత్తితో తమకు చాలా కాలంగా స్నేహం కొనసాగుతోందని సీఎం అన్నారు. తామిద్దరం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటామని, ఇందులో రాజకీయ ప్రస్తావన ఉండదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరతానని ఆయన, చేరాలని తాము ఎప్పుడూ చర్చించలేదన్నారు. ఉమేశ్ కత్తి సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. -
బ్లూ ఫిల్మ్ అంటే నీలిచిత్రాలు
సాక్షి, బెంగళూరు: బ్లూ ఫిల్మ్ అంటే తెలుసా?.. ఇలా ప్రశ్నించింది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. నగరంలో విజయనగర నియోజకవర్గంలో రూ.64 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ‘యడ్యూరప్పకు వయసైపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. గతంలో జరిగినవన్నీ మరిచిపోతున్నారు. యడ్యూరప్ప, ఆయన పార్టీ సీనియర్లు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చారు. కొంతమంది మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో బ్లూ ఫిల్మ్‌లు చూసి పదవులు పోగొట్టుకున్నారు. బ్లూ ఫిల్మ్‌లు అంటే తెలుసా? నీలి చిత్రాలు’ అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అవినీతిపై బహిరంగ చర్చకు యడ్యూరప్ప, బీజేపీ నాయకులతో సిద్ధమని సిద్ధరామయ్య ప్రకటించారు. మేయర్ సంపత్‌రాజ్ మాట్లాడుతూ... సిద్ధరామయ్యను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. ‘సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. అయితే చాలా మంది వాటిని మరిచిపోయారు. అదే విధంగా సిద్ధరామయ్య కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టినా చాలా వాటిని మరిచిపోయార’ ని అన్నారు. మంత్రి కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణలు ఈ సభలో పాల్గొన్నారు. -
ఇవిగో టిప్పు అరాచకాలు
మైసూరు: టిప్పు ఒక దేశద్రోహి, టిప్పు చేసిన నీచ కృత్యాలకు సంబంధించి తాము సాక్ష్యాధారాలతో సహా సేకరించిన పత్రాలను, టిప్పు అరాచకాలపై చరిత్ర కారులు రచించిన పుస్తకాలను సీఎం సిద్దరామయ్యకు పోస్ట్ ద్వారా పంపించినట్లు మాజీ మంత్రి రామదాసు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.టి ప్పు అరాచకాలు, నీచ కృత్యాలపై సాక్ష్యాధారాలతో సహా పంపించిన పుస్తకాలు, పత్రాలను చదవిన అనంతరం టిప్పును దేశభక్తుడిగా వర్ణిస్తున్న సీఎం సిద్దరామయ్యకు నిజంగా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామన్నారు. టిప్పు వంటి నీచుడి జయంతి వేడుకలు నిర్వహించే ముందు సీఎం సిద్దరామయ్య చరిత్రకారులతో చర్చించాల్సిందన్నారు. టిప్పు జయంతిపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా సీఎం సిద్దరామయ్య పోలీసు, భద్రత బలగాలతో టిప్పు జయంతిని నిర్వహించారంటూ విమర్శించారు. ఇక ఇదే సందర్భంగా ఓట్లు గల్లంతైన మూడు నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణరాజ నియోజవర్గ పరిధిలోని మతదారర నడిగె బూత్కడెగె కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
.. అయితే కన్నడ నేర్చుకో..!?
సాక్షి, బెంగళూరు : కన్నడ జాతీయోద్యమం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే కర్నాటకకు ప్రత్యేక జెండా కావాలని ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలో ఉండేవారంతా.. తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని స్పష్టం చేశారు. కర్నాటక 62వ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దరామయ్య.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటక లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కన్నడ భాషను తప్పనిసరిగా నేర్పించాలని పిలుపునిచ్చారు. కన్నిడిగుడిగా జీవించాలన్నా.. కర్నాటకలో ఉండాలన్నా.. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ కన్నడ నేర్చుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. తన నిర్ణయం దేశంలోని ఏ వర్గానకో, మతానికో వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. నేను ఇతర భాషలను నేర్చుకోవాన్ని, మాట్లాడడాన్ని వ్యతిరేకించను.. అయితే కన్నడ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అని సిద్దరామయ్య పేర్కొన్నారు. దేశంలోని భాషల్లో హిందీ ఒకటని.. అది జాతీయ భాష కాదని చెప్పిన సిద్దరామయ్య... కన్నడిగులపై హిందీని ఎవరూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని అన్నారు. అయితే సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాక్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. -
మోదీ దండగ
సాక్షి, బెంగళూరు: అనాలోచితంగా పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఒక అసమర్థుడు అని... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించడానికని నోట్లను రద్దు చేసిన ప్రధాని ఇప్పటివరకు ఎంత నల్లధనాన్ని నిర్మూలించారో, ఎంత వెలికి తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులకు ఎటువంటి నష్టం, కష్టం వాటిల్లలేదని ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయం వల్ల కేవలం పేదలు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం రూ.28వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసులో, విధానసభలో నివేదికలు అందించడానికి ముందే తాము చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉపేంద్ర పార్టీపై స్పందన.. నటుడు ఉపేంద్ర స్థాపించిన కొత్త పార్టీ కేపీజేపీపై స్పందిస్తూ.. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని అందుకు ఉపేంద్ర మినహాయింపేమి కాదన్నారు. కార్యక్రమంలో మంత్రి జార్జ్,కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారు'
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ కాలం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర ఖజానాను లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు.ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికార కాలం మరో ఆరు నెలల మాత్రమే ఉంది. దీంతో సీఎం, ఆయన మంత్రి వర్గ సహచరులు కలిసికట్టుగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి మొండీ సీఎంను రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్ర మంత్రి జార్జ్ తో రాజీనామా చేయించాల్సింది పోయి ఆయనపై జార్జీ షీట్ వేసే వరకు ఆగడం సరికాదని హితవు పలికారు. జార్జ్ కూడా నైతికత వహించి తన పదవీకి రాజీనామా చేసి నిరూపించుకోవాని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అంతేకాక మంత్రుల అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని తెలిపారు. ఈ విధమైన వాటిని సీఎం సమర్ధించుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో డీకేశీ అక్రమార్గాలు ఎంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకునేందుకు సీఎం, డీకేశీలు ఇద్దరూ దొందూ దొందేనన్నారు. విజయశంకర్ రాజీనామా విషయంపై కూడా ఆయన స్పందించారు. పార్టీ అన్ని విధాలుగా ఆయనకు పదవులు ఇచ్చిందని, అయితే రాజీనామా చేశారని ఈ విషయం తనకు పూర్తిగా తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం ఖాయమని యడ్యూరప్ప అన్నారు. -
కామ్‌కి సర్కార్ కాదు.. లూటీకి సర్కారు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామ్‌కి సర్కార్ కాదని లూటీకి సర్కారంటూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గర్భిణీలు, పేదలు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాల నిధులను సీఎం ప్రభుత్వం లూటీ చేసిందంటూ ఆరోపించారు. నగర వ్యాప్తంగా 34వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అందులో కేవలం 11 వేల మంది పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తోందని ఆరోపించారు. పేదల కోసమని ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ నిర్మాణాల్లో కూడా అవినీతికి పాల్పడిందని ఎంపీ అన్నారు. అంతేకాకుండా స్వచ్ఛభారత్ కోస కేంద్రం నుంచి విడుదలైన నిధులను కూడా స్వాహా చేశారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి రమేశ్‌కుమర్ ప్రమేయం లేకుండానే మాతృపూర్ణ పథకం టెండర్లను ఆహ్వానించి తమ వారికే టెండర్లు దక్కేలా వ్యవహరించారని పేర్కొన్నారు. మాతృపూర్ణ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రజనీశ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీకి విడుదల చేసిన నిధులను కూడా దుర్వినియోగ పరచడంతో కేంద్రప్రభుత్వం నిధులను వెనక్కు తీసేసుకుందన్నారు. వీటన్నింటిపై సీఎం సిద్ధరామయ్య సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలి మంగళూరుతో పాటు కరావళి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరడంతో ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరనున్నట్లు తెలిపారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన కేఎఫ్‌డీ,పీఎఫ్ఐ తదితర సంస్థలను నిషేధించాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన సీఎం
కృష్ణరాజపురం : ట్రాఫిక్ జంజాటంతో సామాన్యులు మాత్రమే బాధితులవుతుండగా బుధవారం మొదటిసారి సీఎం సిద్ధరామయ్య కూడా ఇక్కట్ల పాలయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి సీఎం సిద్ధరామయ్య బుధవారం నగరంలో పర్యటించారు. ఈ క్రమంలో కె.ఆర్.పురం పరిధిలోని రామ్మూర్తినగర్‌లో పర్యటించడానికి వెళుతుండగా అదే సమయంలో అటుగా వెళుతున్న బీఎంటీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తి మొరాయించింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే మార్గంలో వెళుతున్న సీఎం సిద్ధరామయ్య కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. బీఎంటీసీ అధికారులు హూటాహుటీన బస్సుకు మరమ్మత్తులు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
పోటీ పరీక్షలు కన్నడలో కూడా నిర్వహించాలి
సీఎం సిద్ధరామయ్య మైసూరు: బ్యాంకుల్లో నియామకాల కోసం జరుగుతున్న పరీక్షలను కన్నడ భాషలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆదివారం మైసూరు నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో నియమితులయ్యే అధికారులు బ్యాంకులకు వచ్చే వారితో కన్నడ భాషలోనే సంభాషించాల్సి ఉన్న కారణంగా వారికి కన్నడ భాషలో కూడా పరీక్షలు రాయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. క జూన్, జులై నెలల్లో పూర్తిగా ముఖం చాటేసిన వర్షాలు ఆగస్ట్ నెల నుంచి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కురవడంతో రాష్ట్రంలో తాగు,సాగు నీటి సమస్య తీరిపోయిందన్నారు. ఇక బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి కారుపై చెట్టు కూలడంతో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలతో పాటు కాలువలో కొట్టుకుపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలంటూ మంత్రి కే.జే.జార్జ్‌కు సూచించామన్నారు. ఇక గుర్తు తెలియన దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసును తీవ్రంగా పరిగణించామని, కేసుపై జరుగుతున్న విచారణ గురించి ఇప్పుడే మీడియాకు వెల్లడించలేమన్నారు. గౌరీలంకేశ్ హత్య దృష్ట్యా ప్రాణహాని ఉన్న అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, పాత్రికేయులకు రక్షణ కల్పించామన్నారు. ఇక మైసూరు నగరంలోనున్న కర్ణాటక ఓపెన్ యూనివర్శిటీకి యూజీసీ నుంచి గుర్తింపు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసామన్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఇదే విషయమై మరోసారి సంబంధిత అధికారులు, మంత్రిని కోరతామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహదేవప్ప, కలెక్టర్ డీ.రందీప్ పాల్గొన్నారు. -
గౌరీ లంకేశ్ హత్య కేసుపై సిట్
-
గౌరీ లంకేశ్ హత్య కేసుపై సిట్
♦ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం ♦ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, జర్నలిస్టుల నిరసనలు ♦ ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు పూర్తి సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటుచేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తునకు ఇంటెలిజెన్స్ ఐజీ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశామని మీడియాతో చెప్పారు. గౌరి కుటుంబ సభ్యులు కోరినట్లుగా సీబీఐ విచారణకూ తాము సిద్ధమేనని చెప్పారు. ఆమె హత్యపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. మిన్నంటిన ఆందోళనలు లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు, పౌర సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. బెంగళూరు, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాయి. గౌరీ హత్య పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన దాడి అని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే వారిని భయపెట్టడమే అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. లంకేశ్ హత్యను అమెరికా ఖండించింది. బుధవారం టీఆర్ మిల్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు జరిగాయి. సీఎంసహా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం గౌరీ లంకేష్ హత్యతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగింది. దేశంలో స్వేచ్ఛావాదులు, జర్నలిస్టులు, హేతువాదులకు రక్షణ లేకుండా పోయిందని, అసమ్మతి తెలియజేసినా, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిపై దాడులకు తెగబడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలు నిరాధారం, బాధ్యతారాహిత్యమని, కేంద్రానికి, బీజేపీకి, తమ పార్టీకి చెందిన ఏ సంస్థకూ ఈ హత్యతో సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. గౌరీ లంకేశ్ హత్యను ముందుగా పసిగట్టడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందంటూ జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ ఆరోపించారు. లంకేశ్ ముప్పును ముందే ఊహించారా? లంకేశ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే ఊహించినట్లు ఆమె ట్వీటర్ పోస్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. ఆమె హత్యకు కొద్దిగంటల ముందు తన ట్వీటర్ ఖాతాలో ‘మనలో కొందరికి నకిలీ ఖాతాలతో నకిలీ పోస్ట్‌లు, బెదిరింపులు వస్తున్నాయి. వాటికి భయపడాల్సిన పని లేదు’ అని ఆమె పోస్ట్ చేశారు. నెలరోజులుగా తనకు కొంత మంది ఫోన్‌చేసి హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె తమ సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. కాగా, లంకేశ్ హత్యోదంతం వెనక ఉన్నది మావోయిస్టులా లేక మత ఛాందసవాదులా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటకలో నక్సల్స్‌ను జనజీవన స్రవంతి లోకి తీసుకురావడం కోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌరి లంకేష్ తమను బలహీనపరిచేలా ప్రవర్తిస్తున్నారని భావించిన నక్సలైట్లు చంపేశారని ప్రచారం సాగుతోంది. -
బీజేపీ ఒక పనిచేయని ఎద్దు: సీఎం
కర్ణాటక: బీజేపీ పనిచేయని ఎద్దులాంటిదని, రైతులు, దళితుల విషయంలో బీజేపీ నాయకులవి దొంగ ఏడుపులని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం దేవనహహళ్లి తాలూకా దొడ్డచెరువులో రూ.883 కోట్లతో చేపట్టిన సాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రసంగం ఆద్యంతం సీఏం సిద్ధరామయ్య బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం బెంగళూరు రానున్న నేపథ్యంలో ఆయనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్‌షా ఆటలు ఏమున్నా గుజరాత్, యూపీలో మాత్రమేనని, కర్ణాటకలో సాగవన్నారు. ఆయన వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో బీజేపీకి ఒరిగేదేం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రేయింబవళ్లు మిషన్-150 అంటూ కలలు కంటున్నారని ఆ కల ఎప్పటికీ నెరవేరదన్నారు. యడ్యూరప్పకు నిజంగా దళితులపై అంత ప్రేమ ఉంటే దళిత కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని లేదంటే తమ కులం కుర్రాడికి ఎవరికైనా దళిత యువతిని ఇచ్చి వివాహం చేసి ఆప్రేమను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకూ రైతుల రుణమాఫీపై గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల రూ.50వేల లోపు రుణాలు మాఫీ చేయగానే గప్‌చుప్ అయ్యారని, దమ్ముంటే మోదీతో మాట్లాడి జాతీయ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయించి తమ రైతు ప్రేమను రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘రోడ్డు పేరు మార్పు’ పై మాజీ ప్రధాని లేఖ
మంగళూరు: కర్ణాటకలో ‘రోడ్డు పేరు మార్పు’ వివాదంపై మాజీ ప్రధాని దేవేగౌడ.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మంగళూరు పట్టణంలోని ఓ రోడ్డుకు విజయా బ్యాంక్ మాజీ చైర్మన్, దివంగత సుందర్ రామ్శెట్టి పేరును ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. మంగళూరులోని అంబేద్కర్ సర్కిల్ నుంచి క్యాథలిక్ క్లబ్ వరకు ఉన్న లైట్ హౌజ్ హిల్ రోడ్డు ను ‘సుందర్ రామ్ శెట్టి మార్గ్’ గా మార్చవద్దంటూ ఆ వర్గాలు నిరసనలు చేపట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం పేరు మార్పు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాశారు. ‘అన్ని వర్గాల పురోగతి కోసం పాటుపడిన ఆయన(సుందర్ శెట్టి) విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పేరు వెనక్కి తీసుకోలన్న మీ(ప్రభుత్వ) నిర్ణయం ఆయన్ని అవమానించినట్లే అవుతుంది’ అని దేవగౌడ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి దీనిపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొన్నామధ్యే యూపీలో మొగల్‌సరై రైల్వేస్టేషన్ పేరును దీన్ దయాల్ ఉఫాధ్యాయ్ పేరిట మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ యత్నించటం, దానిపై అసెంబ్లీలో దుమారం రేగటం తెలిసిందే. ఆ వివాదం ఇంకా సర్దుమణగకముందే తాజాగా కర్ణాటకలోనూ పేరు వివాదం రాజుకోవడం గమనార్హం. -
లింగాయత్లంటే పార్టీల్లో గుబులు
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్‌లో గతవారం లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ బహిరంగ సభను నిర్వహించడం ఇటు పాలకపక్ష కాంగ్రెస్‌లోనూ అటు ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలోనూ గుండెల్లో గుబులు రేపింది. దాదాపు ఆరున్నర కోట్ల మంది జనాభా కలిగిన రాష్ట్రంలో లింగాయతీలు 12 నుంచి 19 శాతం వరకు ఉండడం, వచ్చే ఏడాది అంటే, 2018 మొదట్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరాగాల్సి ఉండడం అందుకు కారణం. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన లింగాయత్‌లు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సంప్రదాయంగా ఓటువేస్తూ వస్తున్నారు. అందుకనే రాష్ట్రంలో వారి సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప సీఎం అయ్యారు. లింగాయత్‌లు తమకు వ్యతిరేకంగా ఐక్య వేదికపైకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవని పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలసుకోవాలంటే ముందు లింగాయత్‌లు అంత పెద్ద బíß రంగ సభను ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరిపోతుంది. తమను హిందువుల్లో భాగంగా చూడవద్దని, తమకో ప్రత్యేకమైన సంస్కతి, సంప్రదాయాలు ఉన్నందున తమను ఓ ప్రత్యేక మతంగా పరిగణించాలని లింగాయత్‌లు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే వారు భారీ బహిరంగ సభను నిర్వహించారు. వారిని ప్రత్యేక మతంగా పరిగణిస్తే మైనారిటీ మతం కింద ఇతర మైనారిటీలు, వెనకబడిన వర్గాలకు వర్తించే రిజర్వేషన్లన్నీ వారికి వర్తిస్తాయన్నది వారి విశ్వాసం కావచ్చు. కానీ వారు మాత్రం తమది ప్రత్యేక సంస్కతి, సంప్రదాయమనే ఎప్పుడు వాదిస్తారు. కొంత మంది చరిత్రకారులు చెబుతున్నట్లుగా వీరశైవులు, తాము ఒక్కటి కాదన్నది వారి వాదన. హిందూ దేవుళ్ల సమూహానికి మూల పురుషుడు శివుడు ఒక్కడేనన్నది వారి మూల సిద్ధాంతం. అందుకని వారు శివుడిని ఒక్కడినే పూజిస్తారు. మెడలో శివ లింగాన్ని ధరిస్తారు. ఉత్తర కర్ణాటకలోని కల్యాణలో 12వ శతాబ్దంలో నివసించిన బసవన్నను తమ కమ్యూనిటి వ్యవస్థాపకుడిగా లింగాయతులు భావిస్తారు. పౌరానిక పాత్రయిన రేణుకాచార్యతో తమ కమ్యూనిటీ అంకురించిందని వారు విశ్వసిస్తారు. ఎనిమదవ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిన ఓ భక్తి ఉద్యమంలో నుంచి లింగాయత్‌లు పుట్టుకొచ్చారు. బసవన్న హయాంలో ఈ ఉద్యమం ఉధతంగా సాగింది. ఆధ్యాత్మికతకు కులం ఎప్పుడూ అడ్డుకాకూడదని బసవన్న బోధించిన కారణంగా తాము అన్ని కులాలను సమానంగానే చూస్తామని, తమకు తమ సంస్కతి, తమ మతమే ముఖ్యమని లింగాయత్ నేతులు చెబుతుంటారు. శివుడు సష్టించిన ఈ జగతిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికే వేదాలు వచ్చాయని బసవన్న వాదించారు కనక తాము వేదాలను వ్యతిరేకిస్తామని వారు చెబుతారు. వీర శైవులు వేద సంప్రదాయాలనే కాకుండా కొన్ని స్థానిక సంప్రదాయాలను కూడా వ్యతిరేకించారని చరిత్రకారుడు ఏకే రామానుజం ‘స్పీకింగ్ ఆఫ్ శివ’ అనే తన పుస్తకంలో చెప్పారు. స్థానిక సంస్కతిలో భాగమైన జంతు బలులను వారు వ్యతిరేకిస్తారు. వారు పూర్తి శాకాహారులు. అయితే లింగాయతులు, వీరశైవులు సమానార్థాలని, ఇరువురు ఒక్కటేనని రామానుజం అభిప్రాయపడ్డారు. హిందూ మతంలో ముఖ్య దేవుడైన శివుడిని లింగాయత్‌లు పూజించడమే కాకుండా కర్మ, పునర్జన్మలుంటాయని విశ్వాసిస్తారు కనుక వారు హిందూ మతంలో భాగమేనని లింగాయత్‌లపై పలు పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు విలియం మాక్ కార్మ్యాక్ లాంటి వారు చెప్పారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా లింగాయత్‌లు హిందువుల్లో భాగమేనని పార్టీ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని మొన్నటి నుంచి చెబుతున్నారు. హిందువుల నుంచి లింగాయత్‌లు విడిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ కర్ణాటక నాయకులు చెబుతున్నారు. లింగాయత్లంతా మూకుమ్మడిగా తీర్మానంచేసి పట్టుకొస్తే వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్ నాయకులకు మాటిచ్చారు. ఇటీవలి వారి బహిరంగ సభకు 50 వేలకుపైగా జనం రావడమే ఆయన మాటకు కారణమైని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులకు దగ్గరగా ఉండే బౌద్ధులను మైనారిటీ మతంగా గుర్తిస్తున్పప్పుడు తమను గుర్తించడానికి అడ్డం ఏమిటని లింగాయత్ నేతలు వాదిస్తున్నారు. -
బదిలీలు.. ప్రభుత్వ వ్యవహారం- సీఎం
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో అవినీతి బయటకు రావడం, ఐపీఎస్ బదిలీల నుంచి దృష్టి మళ్లించడానికే జెండా తతంగమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. పరిపాలన కోసమే బదిలీ చేశామని, ఏ అధికారిని ఎక్కడికి, ఏ సమయంలో బదిలీ చేయాలో ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. అందులో ప్రతిపక్షాలు తల దూర్చడమేంటని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సీఎం సమర్ధించుకున్నారు. బుధవారం ఆయన రాష్టానికి చెందిన సివిల్స్ ర్యాంకర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ జెండాను అవమానిస్తోందని బీజేపీ, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. జాతీయ జెండాకు ఎటువంటి అవమానం కలిగించకుండానే దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించకుండానే రాష్ట్ర పతాకానికి రాజ్యాంగ బద్దత కల్పించాడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ విమర్శించారు. రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండకూడదంటూ లేదా ఉండాలంటూ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. ‘అన్ని రాష్ట్లాల్లోనూ జాతీయ గీతం ఆలపించడానికి ముందు ఆయా రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. దీని వల్ల జాతీయ గీతానికి ఎటువంటి అవమానం కలగదు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా కలిగి ఉండడం జాతీయ జెండాను ఎలా అవమానించినట్లువుతుంది' అని సీఎం ప్రశ్నించారు. సీనియర్ సాహితీవేత్త పాటిల్ పుట్టప్ప సలహా మేరకు రాష్ట్ర జెండాకు రాజ్యాంగబద్దత కల్పించడానికి ఎదురయ్యే చిక్కులు తదితర అంశాలపై నివేదికలు అందించడానికి సీనియర్ సాహితీవేత్తలతో సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమితి తమకు నివేదికలు అందించిన అనంతరం సాదకబాధలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సీఎం పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా..
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచిన వ్యక్తిని బెంగళూరు సైబర్‌క్రైం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండ్యకు చెందిన మధుసూదన్ చాలా కాలం నుంచి బెంగళూరుకు వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను సీఎంపై ద్వేషంతో 2016లో ట్విట్టర్ ఖాతా తెరిచి అందులో అవహేళనకరంగా పోస్టులు చేస్తున్నాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం ఒక అపార్ట్మెంట్లో ఉన్న మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. -
నాకు సీఎం కావాలనే ఆశ లేదు..
– లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయి? – అవినీతిలో నంబర్–1 కాంగ్రెస్ సర్కార్ – కేంద్రం నిధులతో రాష్ట్రం సోకులు – టికెట్ల పంపిణీ బాధ్యత ఆయనదే – మాజీ సీఎం యడ్యూరప్ప బళ్లారి: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ల పంపిణీ విషయం తన చేతుల్లో లేదని మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ విషయాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. మంగళవారం జిల్లాలోని జన సంపర్క అభియానలో పాల్గొనేందుకు వచ్చిన సందర్బంగా స్థానిక ప్రభుత్వ అతిధిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కొందరు లోక్‌సభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు టికెట్లు ఆశిస్తున్నారని, అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా అమిత్ షాదే తుది నిర్ణయమన్నారు. ఇప్పటికే సర్వేలు చేస్తున్నారని, సర్వే ఆధారంగా టికెట్ల పంపిణీ జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విజయాల గురించి ప్రజలకు తెలుపుతాం. ఒకే అజెండాతో రాష్ట్ర సంక్షేమానికి ఎవరు పాటు పడతారో వారికే ఓటు వేయాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతుకు కూరుకుపోయారని విమర్శించారు. లక్షన్నర కోట్ల మేర అప్పులు చేసిన సీఎం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. తాము ఐదేళ్ల అధికార వ్యవధిలో రూ.46 వేల కోట్ల అప్పులు చేయగా, సిద్ధరామయ్య లక్షా 28 వేల 361 కోట్ల మేర అప్పులు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన లక్ష కోట్ల నిధులతో ఎక్కడెక్కడ అభివృద్ధి చేపట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో కేవలం నీటిపారుదల రంగానికి రూ.36 వేలకోట్లతో మాత్రమే పనులు చేపట్టారని ఆవేద వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత నల్లధనం వెలికితీతకు ఎంతో ప్రయత్నం చేశారన్నారు. యుద్దం లేకుండానే పొరుగు దేశం పాకిస్థాన్ గుండెలో దడ పుట్టించారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దళితుల సంక్షేమానికి బీజేపీ ఎంతో పాటుపడుతోందని, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలతోపాటు మొత్తం రాష్ట్రంలో 150 కు పైగా స్థానాలలో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కుర్చీపూ తనకు ఆశ లేదని, అయితే పార్టీని అధికారంలోకి తేవడమే తేన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈశ్వరప్పకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అందర కలిసి కట్టుగా అహర్నిశలు పని చేసి బీజేపీని అధికారంలోకి తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. -
అతిథి పాత్రలో సీఎం..
బెంగళూరు: రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడప్పుడు ఆటవిడుపుగా సినిమాలు చూస్తుంటారు. ఈసారి రాజకీయాల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్తగా తెరకెక్కుతున్న కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. కవితా లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమ్మర్ హాలిడేస్ అనే చిన్న పిల్లల చిత్రంలో సీఎం పది నిమిషాల నిడివి కలిగిన అతిథి పాత్రకు అంగీకరించారు. గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేసే పిల్లలకు సహాయం చేసే ముఖ్యమంత్రి పాత్రలో సిద్ధారామయ్య కనిపించనుండడం విశేషం. అదే విధంగా కన్నడ సినీ నటుడు రమేశ్ నేతృత్వంలో ఓ ప్రైవేటు కన్నడ ఛానల్లో ప్రసారమవుతున్న వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో కూడా సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలో అబ్బయ్య నాయుడు స్టూడియోలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షూటింగ్ సాగింది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కే.జే. జార్జ్ సీఎంతో పాటు స్టూడియోకు వచ్చారు. ఈ సందర్భంగా స్టూడియో చుట్టుపక్కల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తుగ్లక్ పాలన
► మోదీ సర్కార్‌పై సీఎం సిద్ధు ఆగ్రహం ►పేర్లు మార్చి పథకాలు కాపీ ►ఇన్నాళ్లూ దళితులు గుర్తుకు రాలేదా ? బెంగళూరు : ‘ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోంది. అధికారంలోకి రాకముందు ఒకలా అధికారంలోకి వచ్చిన అనంతనం మరొకలా మాటలు మారుస్తూ ప్రధాని మోదీ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారు.’ అని సీఎం సిద్ధరామయ్య వాగ్భాణాలు సంధించారు. నగరంలోని కేపీసీసీ కార్యాయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు కేంద్రలో అధికారంలోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును, ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియను అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. అయితే 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాగానే జీఎస్టీ బిలు, ఆధార్‌కార్డు అనుసంధానం ప్రక్రియలను అమలు చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప బీజేపీ సాధించిందేమి లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల భారత్‌ను స్వచ్ఛభారత్‌గా, రాజీవ్‌గాంధీ విద్యుద్ధీకరణ పథకాన్ని... దీన్‌దయాళ్ పథకంగా ఇలా అన్ని పథకాలకు పేర్లను మార్చారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను పూర్తిగా కనుమరుగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మూడేళ్లలో సృష్టించిన ఉద్యోగాల సంఖ్య కేవలం నాలుగు లక్షలేనని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విదేశాలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు. నల్లధనాన్ని నిర్మూలించే ప్రధాన ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఓ మహా నాటకమని, అది కేవలం కొన్ని బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. ఇక రాష్ట్ర బీజేపీ నాయకులకు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దళితులు గుర్తుకొచ్చారని ఎన్నికల్లో ఓట్ల కోసం దళితులపై ప్రేమ కురిపిస్తున్నారంటూ విమర్శించారు. వ్యక్తిగతంగా ఎప్పుడూ దళితుల ఇంట్లోకి ప్రవేశించని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఓట్ల కోసం దళితుల ఇంట్లో అల్పాహారం అంటూ నటిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కే.వేణుగోపాల్ మాట్లాడుతూ... కేంద్ర బీజేపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కేవలం ప్రకటనలకే పరిమితమైందని స్వచ్ఛభారత్ పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్, కార్యదర్శి దినేశ్ గుండూరావ్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలపై ఆసక్తి లేదు- సీఎం
మైసూరు: దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తమకు రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లిందని వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం తప్ప తమకు ఎటువంటి ఆశలు లేవంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శనివారం మైసూరు నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తాము రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసామన్నారు. 1991వ సంవత్సరంలో జనతాదళ అభ్యర్థిగా కొప్పళ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో 2.10లక్షల ఓట్లు పొందినా కూడా పది వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం అన్ని పదవులు అలంకరించామని అదేవిధంగా 2013లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాలు విజయంతంగా పూర్తి చేసుకోబోతున్న తమకు ఎటువంటి పదవులపై ఆశ లేదంటూ స్పష్టం చేసారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తమకున్న ఏకైక ఆశని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. అదేవిధంగా జంకతల్ మైనింగ్ కేసుల విషయమై తాము కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి,జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ.కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయంటూ విమర్శించారు. గతంలో తమతో పాటు మంత్రి హహదేవప్ప లాంటి నాయకులు ఉన్న సమయంలోనే జేడీఎస్ పార్టీ బలోపేతం కాలేకపోయిందని తాము చేసిందే చట్టమనే రీతిలో సాగుతున్న జేడీఎస్ పార్టీ ఇక ఎప్పటికీ బలోపేతం కాలేదంటూ తమదైన శైలిలో విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తామే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో చులకన అవుతున్నారంటూ విమర్శించారు. సుప్రీంకోర్టులో, లోకాయుక్తల్లో 29 కేసులను నెత్తిపై పెట్టుకున్న యడ్యూరప్ప తమ ప్రభుత్వంపై అవినీతి ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరువు పర్యటనలో భాగంగా దళితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు బీజేపీ ఆడిన నాటకం బట్టబయలైందన్నారు. దళితులు ఇచ్చిన ఆహారాన్ని తిరస్కరించి హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని తింటూ దళితులు ఇంట్లో తిండి తిన్నామని ప్రజలను మభ్య పెట్టడానికి బీజేపీ చేసిన కుటిల యత్నాలు రాష్ట్ర ప్రజలంతా పసిగట్టారన్నారు. గతంలో తాము చెప్పిన విధంగా జాతి సమీక్ష నివేదికలు అందిన అనంతరం దళితులకు 72 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా చివరిసారిగా వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించడం ద్వారా ఇక ముందు జరిగే ఎన్నికల్లో పోటీ చేయనంటూ గతంలో చేసిన ప్రకటనపై సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు.. కన్నడిగుల రక్షణకు చర్యలు... బద్రినాథ్ దుర్ఘటనలో చిక్కుకున్న కన్నడిగులను రక్షించడానికి సత్వర చర్యలు తీసుకోవాలంటే ఢిల్లీలోని కర్ణాటక హైకమీషనర్‌కు సూచించామన్నారు. కన్నడిగుల రక్షించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ కమీషనర్‌కు సూచించామన్నారు. అవసరమయితే రాష్ట్రం నుంచి అధికారుల బృందాన్ని సహాయక చర్యలకు పంపించాలంటూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి తీసుకెళ్లామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి మృతిపై విచారణకు తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసామన్నారు. -
ఎట్టకేలకు బాంబు నాగ పట్టివేత
బెంగళూరు: పాతనోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న బెంగళూరు మాజీ రౌడీషీటర్ బాంబ్‌నాగ అలియాస్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాష్ట్ర పోలీసులు తమిళనాడు వేలూరు జిల్లాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గత నెల మూడోవారంలో బెంగళూరు శ్రీరామపురలోని అతని నివాసంపై పోలీసులు దాడులు చేయగా రూ.14.80 కోట్ల పాతనోట్లు దొరికిన విషయం తెలసిందే. అతడు మాత్రం తప్పించుకు పారిపోయి.. అజ్ఞాతంనుంచి సీడీలు విడుదల చేస్తూ సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు గుప్పించాడు. తాను చనిపోతే అందుకు ముఖ్యమంత్రే కారణమని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడులో వేలూరు జిల్లాలో బాంబ్‌నాగ తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న నగర పోలీసులు అక్కడ మాటు వేశారు. గురువారం వేలూరు జిల్లాలోని ఆర్కాట్ సమీపంలోని మంబాకం ప్రాంతంలో బాంబ్‌నాగ కారులో వెళుతున్నట్లు గుర్తించి వెంబడించగా పోలీసులను గమనించిన బాంబ్‌నాగ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాంబ్‌నాగను అరెస్ట్ చేశారు. బాంబ్‌నాగను తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. కాగా పట్టుకునే క్రమంలో పోలీసులు బాంబ్‌నాగపై కాల్పులు జరపగా అతని కాలుకు గాయాలయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. బాణసవాడి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. నేను చనిపోతే దానికి సీఎంయే భాద్యులు.. -
అంబులెన్స్ డ్రైవరా మజాకా!
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణించే మార్గంలో వెళ్తున్న అంబులెన్స్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవటం వివాదాస్పదమైంది. అయితే, అసలు విషయం వేరేలా ఉంది. అంబులెన్స్‌లో ఉన్నది రోగి కాదు.. మృతదేహం అన్న అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ఆ ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. స్థానిక జయదేవ ఆస్పత్రిలో దొడ్డమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ ఈనెల 2వ తేదీన చనిపోయింది. ఆమెను సొంతూరు కుణిగల్‌కు తరలించేందుకు కుటుంబీకులు దేవరాజు అనే అంబులెన్స్ నిర్వాహకుడిని ఆశ్రయించారు. అతడు దొడ్డమ్మ మృతదేహాన్ని తన అంబులెన్స్‌లో వేసుకుని ఈనెల 4వ తేదీన సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలోనే సైరన్ మోగించుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని టౌన్‌హాల్ సమీపంలో ఆపేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో రావటంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్‌ను తీసుకెళుతున్నా సహించరా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ మేరకు దేవరాజును హలసూరు గేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
స్టైలిష్ పొలిటీషియన్స్..
బెంగళూరు: దక్షణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు డ్రెస్‌కోడ్ ఏదీ అంటే తెల్ల ఖద్దరు చొక్కా, తెల్ల పంచె లేదా తెల్ల ప్యాంట్ అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అంతలా ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిన మన రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ ప్రముఖులు ఇక్కడి పర్యటనకు వచ్చినపుడు, ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమాలకు మన రాజకీయ నాయకులు సహజశైలి వస్త్రధారణకు భిన్నంగా సూట్లు, కోట్లు ధరిస్తూ మార్పును స్వాగతిస్తుంటారు. ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల పంచెలో కనిపించే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్తున్నప్పుడు సూట్ ధరించి కొత్త లుక్‌లో కనిపించారు. సీఎం సిద్ధరామయ్య మేకోవర్‌పై సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. సీఎం సిద్ధరామయ్య సూట్లో కంటె పంచెకట్టులోని హుందాగా ఉంటారని అధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి సదానందగౌడ, జగదీశ్‌శెట్టర్, ఎస్.ఎం.కృష్ణ, ధర్మసింగ్, అంబరీశ్, ప్రియాంక్ ఖర్గె, దినేశ్ గుండూరావ్ తదితర నాయకులు తమ సహజశైలి వస్త్రధారణకు భిన్నంగా సూట్లు, కోట్లు ధరించి అప్పుడప్పుడూ స్టైలిష్‌లుక్‌లో కనిపించినవారే. అందరికంటే ముఖ్యంగా గ్లామరస్ సూట్లో దర్శనమిచ్చింది ఎస్.బంగారప్ప. ‘కొన్ని ముఖ్యమయిన సమావేశాలు, విదేశీ పర్యటనల్లో రాజకీయ నాయకులు సూట్, కోట్లను ధరించడం తప్పనిసరి. రాష్ట్ర నాయకుల్లో ఎన్.ఏ.హ్యారిస్, దినేశ్ గుండూరావ్లకు సూట్లు బాగా నప్పుతాయి’. -
నేను చనిపోతే దానికి సీఎంయే భాద్యులు..
బనశంకరి: బెంగళూరులో ఇటీవల రౌడీషీటర్ వి.నాగరాజు అలియాస్ బాంబ్ నాగ ఇంట్లో రూ. 14.80 కోట్ల పాత నోట్లు దొరికిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో అప్పటినుంచి పరారీలోనున్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు. నాలుగు నిమిషాల వీడియోలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు, సీఎం సిద్ధరామయ్యతో పాటు మంజునాథ్, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. మంగవారం మరో సీడీ ని బాంబ్ నాగ విడుదల చేశాడు. ఆ సీడీలో రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ చెబితే పదినిమిషాల్లో పోలీసుల ముందు లొంగిపోతానంటూ రౌడీ నాగరాజ్ అలియాస్ బాంబ్ నాగ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మంగళవారం లాయర్ శ్రీరామరెడ్డితో రెండవ సీడీ విడుదల చేయించాడు. ఆ సీడీలో కొన్ని సంచలనం రేకేత్తించే విషయాలు బాంబ్‌నాగ చెప్పాడు. మంత్రి పరమేశ్వర్‌కు మాత్రమే తన భాద అర్థమైందని రౌడీ నాగ సీడీలో అన్నాడు. నేను చనిపోతే దానికి సిద్ధరామయ్యనే భాద్యులని తెలపారు. విదానసౌధ ముందు చనిపోతానని తన చావుకు సిద్ధరామయ్య కారణమన్నారు. విధానసౌధ వద్దకు వచ్చి ఏ అఘాయిత్యానికైనా పాల్పడాతనని తెలిపారు. చెడు ఐపీఎస్ అధికారులను సీఎం తొలగించాలని అన్నాడు. రౌడీనాగ పట్ల సీబీఐ విచారణ చేపడితే రాష్ట్రం పరువు పోతుందని పేర్కొన్నాడు. మీరు సీఎం రాష్ట్రం పరువు పోకుండా కాపాడాలని బాంబు నాగ మనవి చేశారు. తాను తమిళనాడులో పుట్టడమే నేరమని, బెంగుళూరు తమిళులు తనకు మోసం చేశారని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించకుండా మోసం చేశారని వాపోయారు. వచ్చే 2018 ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు. ప్రస్తుతం తను ఈ పరిస్థితిలో ఉండటానికి తమిళులే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై 40 నుంచి 50 కేసులు ఉన్నాయని మీడియాలో వార్తలు రావటం అవాస్తవం అన్నారు. కానీ తనపై ఎలాంటి కేసుల లేవని, రూ. 100, 200 జరిమానా చెల్లించిన కేసులు అని స్పష్టం చేశారు. తనకు రౌడీ అనే పదానికి అర్థమే తెలియదన్నారు. కొంతమంది సీనియర్ అధికారలు పాతనోట్ల దందాలో భాగస్వాములుగా ఉన్నారిని బాంబ్‌నాగ ఆరోపించారు. పోలీసులు జీతాలు చాలకపోవడంతో దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడంతో బాంబ్ నాగ కేసు సవాల్‌గా మారింది. బాంబ్‌నాగ కేసులో చట్టం తన పని తాను చేపుకుపోతుందని హోంమంత్రి పరమేశ్వర్ మంగళవారం స్పష్టం చేశారు. -
బీజేపీపై సిద్దూ రివర్స్ పంచ్
బెంగళూరు : ప్రతిపక్ష బీజేపీ తనపై సంధిస్తోన్న అవినీతి ఆరోపణలకు రివర్స్ పంచ్ విసిరారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బీజేపీ అంటేనే అవినీతిపరుల పార్టీ అని, పదవుల్లో ఉండగా జైలుకు వెళ్ళిన వారు, మున్ముందు వెళ్లబోయేవారు తప్ప ఆ పార్టీలో మరెవ్వరూ లేరని విమర్శించారు. ఆదివారం హుబ్బలి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అదికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. కర్ణాటకలో తీవ్రమైన కరువు ఉన్నదని తెలిసి కూడా కేంధ్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ఎన్డీఏ సర్కారు కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఆరోపించారు. మహాదాయి నీటి విషయంలో గోవా పప్రభుత్వంపై మరోసారి చర్చలు జరుపుతానని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. -
నోట్ల దందాలో సీఎం పీఏ హస్తం!
కన్నడనాట పాతనోట్ల ప్రకంపనలు నోట్ల దందాలో సీఎం సిద్ధరామయ్య పీఏ మంజున్నాథ్ హస్తం!! మంజునాథ్ ఎవరో తెలియదన్న సీఎం సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఇటీవల రౌడీషీటర్ వి.నాగరాజు అలియాస్ బాంబ్ నాగ ఇంట్లో రూ. 14.80 కోట్ల పాత నోట్లు దొరికిన కేసు శనివారం అనూహ్య మలుపు తిరిగింది. బెంగళూరు శ్రీరాంపురలోని అతని ఇంట్లో ఈ నెల 14న పోలీసు దాడుల్లో నోట్లు పట్టుబడగా.. అప్పటినుంచి పరారీలోనున్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు. నాలుగు నిమిషాల వీడియోలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు, సీఎం సిద్ధరామయ్యతో పాటు మంజునాథ్, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. వీడియోలో అతడు ఏం చెప్పాడంటే.. ‘నా ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు నేను అక్కడ లేను. పోలీసులే శ్రీరాంపురలో నేను నిర్వహిస్తున్న స్నేహ సమితి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో తాళాలు పగులగొట్టి సొమ్మును పెట్టారు. ఆ సమయంలో నా ఇంట్లో ఉన్న కొత్త నోట్లను పోలీసులు దోచుకున్నారు. ఆ రోజు నన్ను ఎన్కౌంటర్ చేయడానికే పోలీసులు వచ్చారు. ఇందుకు రూ. 10 కోట్లు చేతులు మారాయి. ఇందుకు కారణం లేకపోలేదు. పాత నోట్లు మార్చాలంటూ ఫిబ్రవరి 14 నుంచి కిషోర్, మధు, ఉమేష్, నవీన్, గణేష్ అనే వ్యాపారులు, రియల్టర్లు వందసార్లు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఎం సిద్దరామయ్య పీఏ మంజునాథ్‌కు చెందిన కోట్ల రూపాయల సొమ్మును నేను మార్చాను. ఐపీఎస్‌లకు చెందిన సొమ్మును కూడా మార్చాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి కుదరదని చెప్పడంతో నాపై కక్ష కట్టారు. దీంతో హెణ్ణూరులో నాపై ఉమేష్ ద్వారా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆ స్టేషన్‌కు చెందిన ఓ ఇన్స్పెక్టర్, పోలీస్ కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్ల ద్వారా నన్ను ఎన్కౌంటర్ చేయడానికి స్కెచ్ వేశారు. నేను తమిళుడిగా పుట్టడమే తప్పయ్యింది’ అని పేర్కొన్నారు. చట్ట ప్రకారం చర్యలు: హోంమంత్రి పరమేశ్వర్ ఈ వీడియో టీవీ చానెళ్లలో ప్రసారమైన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్, పీసీసీ అధ్యక్షుడు, హోం మంత్రి పరమేశ్వర్‌ను కలసి విషయం వివరించారు. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ... బాంబ్‌నాగ ఎక్కడ ఉన్నాడో తెలియదని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తారన్నారు. పీఏ మంజునాథ్ ఎవరో తెలియదు: సీఎం బాంబ్‌నాగ ఆరోపణల విషయమై సీఎం సిద్ధు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏ మంజునాథ్ ఎవరో తనకు తెలియదన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు. -
విద్యార్థిపై దాడి.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
బెంగళూరు: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడి ఘటన పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారని, దాడికి కారణమైన నిందితుడిని అరెస్టు చేశారని ఆయన సోమవారం సాయంత్రం ట్విట్టర్లో పేర్కొన్నారు. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హిగియో గుంటెయ్ అనే విద్యార్థిపై అతని ఇంటి యజమాని హేమంత్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతడితో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మార్చి 6న చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అతనికి బెయిల్ లభించడంతో సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. బాధితుడు హిగియో క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈశాన్య భారత విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సైతం తీవ్రంగా ఖండించారు. -
శశికళకు కిత్తూరు రాణి చెన్నమ్మ రాష్ట్ర అవార్డు
బళ్లారి : నగరానికి చెందిన ప్రగతి సమాజ సేవా సంఘం అధ్యక్షురాలు, మాజీ ఉప మేయర్ శశికళ కృష్ణమోహన్‌కు కిత్తూరు రాణి చెన్నమ్మ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు అవార్డులను ప్రదానం చేశారు. బెంగళూరులోని రవీంద్ర కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా శశికళ కిత్తూరు రాణి చెన్నమ్మ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉమాశ్రీ, కేకే జార్జ్, ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఆమెకు అవార్డు లభించడంపై నగరంలోని పలువురు అభిమానులు, మద్దతుదారులు అభినందనలు తెలిపారు. -
అస్త్రశస్త్రాలతో సిద్ధం
21 నుంచి బెల్గాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సమస్యలపై ప్రశ్నలు సంధించనున్న విపక్షాలు దీటుగా ఎదుర్కోవడానికి సహచరులకు సీఎం దిశానిర్దేశం బెంగళూరు : రెండో రాజధాని బెల్గాంలో ఈసారి శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీ వేడిగా జరుగనున్నారుు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారుు. అరుుతే వీటిని దీటుగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య తన సహరులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 2 వరకూ బెళగావిలోని సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా కరువు కాటకాల్లో మునిగిపోరుున రైతులను ఆదుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతు సంఘం నాయకులు సమావేశాల మొదటి రోజు సువర్ణసౌధ ముట్టడికి ఇప్పటికే పిలుపునిచ్చారు. చెరకు బకారుుల సత్వరం చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు నష్టపరిహారం, ఇక సహకార రుణాలు మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. సమావేశాల మొదటి రోజును సభను స్తంభింప చేయాలని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చారుు. అరుుతే కరువు తాలూకాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రుణాలు రద్దు చేసి కొంత వరకు రైతు సంఘం నాయకులు శాంతింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కావేరి వివాదంపై చర్చించడానికి రెండుసార్లు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహదారుు వివాదం పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ ప్రాంతానికి చెందిన విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇక వేసవి మొదలు కాకుండానే తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉత్పన్న మవుతున్న విషయానికి సంబంధిం విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అవసరమైన గణాంకాలను సేకరిస్తున్నారుు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై... ఇక రాష్ట్రంలో శాంతిభద్రత విషయంపై కూడా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలతో బీజేపీ శ్రేణులు మండిపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే సిద్ధు సర్కార్‌పై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇక మంత్రి తన్వీర్ వ్యవహారం, ఎంఈఎస్ ప్రాబల్యం ఉన్న బెల్గాంలో ఈ సారి శీతాకాల సమావేశాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదు. -
రేపటిదాకా తమిళనాడుకు నీళ్లివ్వం
- చట్టసభల్లో నిర్ణయం తీసుకుంటాం: కర్ణాటక - సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ - బెంగళూరులో దేవెగౌడ దీక్ష సాక్షి, బెంగళూరు: కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకు తమిళనాడుకు వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం మీడియాకు వెల్లడించారు. ‘గత నెల 23 నాటికి నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరుండేది. దాంతో తాగునీటి అవసరాలకే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం 32.7 టీఎంసీల నీరుంది. నీటిని మా సాగునీటి అవసరాలకు వదలాలో, వద్దో సోమవారం ఉభయసభల భేటీలో నిర్ణయం తీసుకుంటాం’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. కాగా, తమిళనాడుకు కావేరి నీరివ్వాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలంటూ కర్ణాటక సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే, ఈనెల 4 నాటికల్లా కావేరి జల నిర్వహణ బోర్డును నియమించాలంటూ కేంద్రానికి జారీ చేసిన ఆదేశాలనూ సమీక్షించాలని కోరింది. మోదీ మధ్యవర్తిత్వం వహించాలి..: ప్రధాని మోదీ మధ్యవ ర్తిత్వం వహించి కావేరి సమస్యను పరిష్కరించాలని, కర్ణాటక లకు న్యాయం చేయాలనే డిమాండ్లతో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడబెంగళూరులో శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నేత ఖర్గే భేటీ అయిన సందర్భంలో దేవెగౌడ భావోగ్వేగంతో కన్నీరు కార్చారు. మధ్యవర్తిత్వం వహించే విషయమై మోదీని ఒప్పిస్తామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హామీ ఇవ్వడంతో రాత్రి ఆయన దీక్ష విరమించారు. -
ప్రస్తుతం నీటి విడుదల కష్టం: సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకూ వదిలేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ‘కావేరి జలాల’ కేసు విచారణలో భాగంగా తమిళనాడుకు శనివారం నుంచి రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పన ఈనెల ఆరు వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అఖిల పక్షం నిర్వహించి ఆయన అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మంత్రి మండలి సమావేశం నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘ఈనెల 3న (సోమవారం) ఉభయసభల సమావేశం నిర్వహించనున్నాం. అటుపై మాత్రమే నీటి విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నాం. అంతేకాకుండా ఈనెల 23న జరిగిన ఉభయసభల సమావేశంలో కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరు మాత్రం ఉండేది. అందువల్ల అప్పుడు ఆ నీటిని తాగునీటికి మాత్రమే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం నీటి లభ్యత 32.7 టీఎంసీలకు పెరిగింది. అందువల్ల పెరిగిన నీటిని కర్ణాటకలోని రైతులకు సాగుకోసం వదలాలా లేదా అన్న విషయంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నాం. కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పునఃపరిశీలన అర్జీ వేయనున్నాం.’ అని పేర్కొన్నారు. అఖిల పక్షంలో కూడా అదే మాట... అఖిల పక్షలో ఒక్కరూ కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు వదలకూడదని తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. కాగా, సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కావేరి నీటి నిర్వహణ మండలి విషయంలో బీజేపీ నాయకులు కర్ణాటకలో ఒక రకంగా, ఢిల్లీలో మరోరకంగా వాదనలు చేయడమే కాకుండా ప్రధానిపై ఒత్తిడి తేవడానికి వెనుకాడుతున్నారని చిక్కోడి పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్ హుక్కెరి పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్‌కు చెందిన దాదాపు అందరు నాయకులతో పాటు పలువురు జేడీఎస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున జగదీష్‌శెట్టర్, శోభకరంద్లాజే తదితరులు పాల్గొనగా జేడీఎస్ తరఫున కుమారస్వామి, వై.ఎస్.వీ దత్త తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు సెప్టెంబర్ 30న కావేరి నీటి విడుదలతో పాటు కావేరి నీటి నిర్వహణమండలి బోర్డు విషయమై ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ పునఃపరిశీలన అర్జీ కూడా వేయనున్నామన్నా ప్రభుత్వ ప్రతిపాదనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించనట్లు సమాచారం. నిర్వహణ మండలి వద్దేవద్దు... శనివారం జరిగిన అఖిల పక్షం సమావేశంలో కావేరి నీటి నిర్వహణ మండలిపైనే ఎక్కువ సేపు చర్చ జరిగింది. ఈ మండలిని ఏర్పాటు చేస్తే ప్రతి నీటి చుక్కకోసం కేంద్రం వైపు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని అందరు నాయకులు ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ విషయమై సమావేశం అనంతరం మీడియాతో జగదీష్‌శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ...‘కావేరి నీటి నిర్వహణ మండలి’ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకువస్తాం. అంతేకాకుండా కావేరి నదీ జలాల పంపకం విషయంలో మధ్యవ్యర్తిత్వం వహించాల్సిందిగా కోరుతాం.’ అని పేర్కొన్నారు. ఇక వై.వీఎస్ దత్త కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కావేరి నీటిని తమిళనాడుకు వదలకూడదని తాము ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. అంతేకాకుండా నీటిని వదలకూడదనే విషయానికి సంబంధించి రాష్ట్రంలోని అందరు ప్రజాప్రతినిధులు సుప్రీం కోర్టులో వ్యక్తిగత అఫిడవిట్లు దాఖలు చేయాలనే సలహాకూడా ఇచ్చామన్నారు. కావేరి నిర్వహణ మండలికి కర్ణాటక తరఫున సభ్యుల పేర్లు సూచించకూడదని తెలిపారు. నారిమన్ పై విరుచుకపడిన విపక్షాలు... కర్ణాటక తరఫున వాదనలు వినిపిస్తున్న ఫాలీ నారిమన్ వ్యవహార శైలిపై అఖిల పక్ష సమావేశంలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో శుక్రవారం ఆయన వాదనలు వినిపించకపోవడం సరికాదన్నారు. అందువల్లే కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు చెప్పడంతో పాటు పదేపదే కర్ణాటకకు తీర్పు వ్యతిరేకంగా వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఆయన్ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం సిద్ధు కలుగజేసుకుని ఈ సమయంలో ఫాలీనారిమన్ను తప్పించడం సరికాదన్నారు. -
సుప్రీం తీర్పు అమలు కష్టమే: సీఎం
రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 27వ తేదీ వరకు ప్రతిరోజూ తమిళనాడుకు కావేరీ జలాలను వదలాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులైతే ఇచ్చింది గానీ, మన దగ్గరే నీళ్లు లేవు కాబట్టి దాన్ని అమలుచేయడం చాలా కష్టమని ఆయన విలేకరులతో చెప్పారు. వాస్తవానికి పర్యవేక్షక కమిటీ సూచన ప్రకారం అయితే 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీం మాత్రం తన ఉత్తర్వుల్లో 6వేల క్యూసెక్కుల నీరు పంపాలని తెలిపింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రజలను సీఎం సిద్దు కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం ఉదయం ఈ అంశంపై కేబినెట్ సమీక్ష ఉంటుందని, అందులో తాము చర్చిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందాల్సి ఉందని, ఈలోపు న్యాయసలహా కూడా తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష సమావేశం కూడా బుధవారమే నిర్వహిస్తామని అందులోనూ ఉత్తర్వుల గురించి చర్చిస్తామని అన్నారు. మేమే కష్టాల్లో మునిగిపోయాం సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాండ్యా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే తమ పొలాలకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్లన్నీ తమిళనాడుకు ఇచ్చేస్తే ఇక తమ పొలాలు ఎడారులుగా మారిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కుదుటపడుతున్న బెంగళూరు
-
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిద్దరామయ్య
బెంగళూరు: కావేరీ జలాల వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భేటీకానున్నారు. మరోపక్క, కావేరీ జలాలపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరారు. దీనిపై ఇప్పటి వరకు పీఎంవో స్పందించలేదు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వస్తే సిద్ధరామయ్య వెళ్లనున్నారు. సెప్టెంబర్ 9నే ప్రధానికి లేఖ రాశామని, అయినా వారు జోక్యం చేసుకోలేదని కర్ణాటక అధికారి ఒకరు చెప్పారు. అల్లర్లకు ముందు కూడా పరిస్థితి సున్నితంగా ఉందని కూడా చెప్పామన్నారు. కావేరి జలాల విషయంలో తక్షణం పరిష్కారం చూపాలని కోరినట్లు వివరించారు. కాగా, కావేరి జలాల వివాదం విషయంలో ఎట్టకేలకు బెంగళూరులో పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి. చాలా చోట్లు కర్ఫ్యూను సడలించారు. బెంగళూరులో దాదాపుగా అన్ని కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థలన్నీ తిరిగి ప్రారంభమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరిస్థితి సున్నితంగా ఉండటంతో సెక్యూరిటీని కొనసాగిస్తున్నామని చె్పారు. అల్లర్లలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా లాఠీఛార్జీ భయంతో భవనంపై నుంచి దూకి మరొకరు చనిపోయారు. -
ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి !
నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం వక్కలిగల సంబరాలు బెంగళూరు : ఎట్టకేలకు విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే, వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.కృష్ణప్ప అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్ వాలా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూన్ 19న జరిగిన మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి లభిస్తుందని అందరూ భావించారు. అయితే చివరి క్షణంలో ఆయన పేరును తొలగించడంతో కృష్ణప్ప నియోజక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కలిగ సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. చివరికి సీఎం సిద్ధరామయ్య కృష్ణప్పకు సమీప భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తానని మాట ఇవ్వడంతో నిరసనలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల విషయమై హైకమాండ్‌తో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్యకు మొదట ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి ఇవ్వాలని సూచింది. ఈ నేపథ్యంలో దీంతో నేడు ఎం.కృష్ణప్ప నేడు అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే ఆయన మద్దతుదారులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కాగా, కృష్ణప్పకు గృహ నిర్మాణ, సమాచార శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న కే.జే. జార్జ్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాన్ని తిరిగి అతనికే కేటాయించనున్నారు. మరోవైపు పశుసంవర్థకశాఖ మంత్రి ఏ.మంజు, గనుల శాఖ మంత్రి వినయ్కులకర్ణీకు క్యాబినెట్ హోదా లభించనుంది. ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి కేటాయించడం పట్ల కృష్ణప్ప ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శనివారం సాయంత్రం కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. అంబికి నిరాశ : మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయిన అంబరీష్‌కు మంత్రి మండలిలో తిరిగి సభ్యత్వం లభించనుందని వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు అంబరీష్ కూడా పరోక్షంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పుకొంటూ వచ్చారు. అయితే తాజా పరిణామంతో అంబి ఆశలు ఆవిరయ్యాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. -
జార్జ్‌ను బలిపశువు చేస్తున్నారు
జీవవైవిధ్య ఉద్యానవనం ప్రారంభోత్సవంలో సీఎం బెంగళూరు(బనశంకరి) : డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయితే విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. నాగవారలోని హెణ్ణూరు చెరువు వద్ద జీవ వైవిధ్య వనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. 99 కేసుల్లో నిందితులు తప్పించుకున్న పర్వాలేదని, అయితే ఓ నిరపరాది శిక్షపడకూడదనే చట్టం ఆశయమని తెలిపారు. అయితే గణపతి ఆత్మహత్య విషయంలో ఎలాంటి సంబంధం లేని జార్జ్‌ని రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికే విపక్షాలు సంధించిన ప్రశ్నలంటికీ సమాధానమిచ్చామని, విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తామన్నారు. ప్రారంభించిన ఉద్యానవనానికి బసవలింగప్ప ఉద్యానవనంగా పేరుపెట్టామన్నారు. గతంలో అటవీశాఖామంత్రిగా ఉన్న బసవలింగప్ప ఈ ప్రదేశాన్ని రక్షించారని గుర్తు చేశారు. బెంగళూరు నగరం సౌందర్యం పెంచడానికి చెరువులు, ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. కబ్జాకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంద ని తెలిపారు. హెణ్ణూరు చెరువు 34 ఎకరాల విస్తీర్ణం ఉందని దీనిని ఆదర్శ ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామన్నారు. 21 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచే అవసరముందన్నారు. నగరాబివృద్ధి శాఖామంత్రి కేజే.జార్జ్ మాట్లాడుతూ.....గణపతి ఆత్మహత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అటవీశాఖమంత్రి రామనాథ రై, మేయర్ మంజునాథరెడ్డి, ఎమ్మెల్యే బీఏ.బసవరాజు, పరిసరాల మాలిన్య నియంత్రణ మండలి అద్యక్షుడు లక్ష్మణ్, ప్రభుత్వ కార్యదర్శి విజయభాస్కర్, బీబీఎంపీ సభ్యులు ఆనంద్, రాదమ్మవెంకటేశ్, ఎస్జీ.నాగరాజ్, కాంగ్రేస్ నేతలు సునీల్‌కుమార్, సొణప్ప, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై న్యాయ విచారణ
డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై శాసనసభలో సీఎం సిద్ధరామయ్య ప్రకటన జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదని స్పష్టీకరణ సీబీఐ విచారణకే పట్టుబట్టిన ప్రతిపక్షాలు ఉభయసభల్లో నిరవధిక దీక్షకు బీజేపీ, జేడీఎస్‌ల నిర్ణయం బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై జ్యడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు జార్జ్‌ను మంత్రి మండలి నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేంతవరకూ ఉభయసభల్లో నిరవధిక దీక్షకు దిగుతామని బీజేపీ, జేడీఎస్ నేతలు హెచ్చరించారు. వివరాలు.... డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రభుత్వం తరఫున బుధవారం మాట్లాడారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సీఐడీ విచారణపై ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నప్పటికీ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఈ కమిషన్ తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని చెప్పారు. కాగా, విపక్షాలు మాత్రం న్యాయ విచారణ నిర్ణయాన్ని అంగీకరించబోమని, ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని పట్టుబట్టాయి. సీఎం సిద్ధరామయ్య ప్రకటనను విపక్ష నేత జగదీష్ శెట్టర్ తప్పుపడుతూ....‘జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన కేసులేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. బీడీఏ ఆర్కావతి లే అవుట్లో అవకతవకలకు సంబంధించిన విచారణ కోసం ఏర్పాటు చేసిన కెంపణ్ణ కమిషన్ విచారణను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయింది. అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించి తీరాల్సిందే. అప్పటి దాకాా మా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు’ అని జగదీష్ శెట్టర్ హెచ్చరించారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ధర్నాకు దిగారు. దీంతో స్పీకర్ సభా కార్యకలాపాలను ఐదు గంటలకు వాయిదా వేశారు. అనంతరం బీజేపీ, జేడీఎస్ నేతలు జగదీష్ శెట్టర్, హెచ్.డి.కుమారస్వామిలు మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేసులోని నిజానిజాలు వెలుగు చూడకుండా ఉండేందుకు గాను ముందు సీఐడీ విచారణ అన్నారు. ఇప్పుడిక జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించే వరకు మా పోరాటాన్ని ఆపబోము. ఉభయసభల్లో నిరవధిక దీక్ష చేపట్టనున్నాం’ అని ప్రకటించారు. అనంతరం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే శాసనసభలో బీజేపీ, జేడీఎస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ శాసనసభ కార్యకలాపాలను గురువారానికి వాయిదా వేశారు. జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదు.... అంతకుముందు బుధవారం ఉదయం శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై సీఎం సిద్దరామయ్య సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గణపతి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్, ఇద్దరు పోలీసు ఉన్నత స్థాయి అధికారులను సైతం సీఎం సిద్దరామయ్య వెనకేసుకొచ్చారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అనంతరం జరిగిన ఘటనలను ఒక్కొక్కటిగా సీఎం సిద్ధరామయ్య సభ ముందు ఉంచారు. ‘మంగళూరు డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో మంత్రి జార్జ్‌తో పాటు ఇద్దరు పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. గణపతిని మంత్రి జార్జ్, పోలీసు అధికారులు ఇబ్బందులకు గురి చేసినట్లు గానీ, అతనిపై పగ తీర్చుకునేలా ప్రవర్తించినట్లు కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూను ‘డయింగ్ డిక్లరేషన్’ కాబోదు. అందువల్ల మంత్రి కె.జె.జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. జార్జ్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘మన అధికారులపై మాకు నమ్మకం ఉంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని కుంగదీసేలా మేము ఏ చర్యలు తీసుకోబోము. సీబీఐ అంటే మాకేదో భయం అని, అందుకే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే సీబీఐ అంటే మాకెలాంటి భయం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి డి.కె.రవి ఆత్మహత్య ఘటనతో సహా మొత్తం 8 కేసులను సీబీఐకి అప్పగించాం. ఇదే సందర్భంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్రమ గణుల కేటాయింపుతో సహా ఏ ఒక్క కేసును సీబీఐకి అప్పగించలేదు’ అంటూ మండిపడ్డారు. -
'బీజేపీ మంత్రులంతా అసమర్థులు'
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్య సదానంద అసమర్థత వల్లే అప్రధాన్య శాఖ బెంగళూరు: కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులంతా అసమర్థులేనని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా బుధవారమిక్కడి విధానసౌధ ఎదుట ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రనికి చెందిన సదానందగౌడకు అప్రధాన్యమైన శాఖను కేటాయించడంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘సదానందగౌడ అసమర్థత కారణంగానే న్యాయశాఖ వంటి ప్రధానమైన శాఖ నుంచి ఆయనకు అప్రధానమైన ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ శాఖను కేటాయించారు. సదానందగౌడ మాత్రమే కాదు బీజేపీలోని మంత్రులంతా అసమర్థులుగానే తయారయ్యారు’ అని విమర్శించారు. ఇక మైసూరు జిల్లా కలెక్టర్ శిఖాను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య వెల్లడించారు. ‘తనను కొంతమంది వ్యక్తులు బెదిరించిన విషయంపై కలెక్టర్ శిఖా ఇప్పటికే కేసు దాఖలు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. జేడీఎస్‌తో మైత్రి లేదు..... శాసనమండలి సభాధిపతి ఎంపిక విషయమై ఇప్పటి వరకు జేడీఎస్‌తో చర్చించలేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేపీసీసీ వర్కింగ్ ప్రసిడెంగ్ దినేష్ గుండూరావ్, ఎంపీ చంద్రప్ప, మంత్రులు ఆంజనేయ, హెచ్.సి.మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీఎం బుగ్గపై ముద్దుపెట్టిన మహిళ
బెంగళూరు: ఓ ప్రజా కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుగ్గలపై ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగింది. సీఎం సిద్ధరామయ్య కురుబా కులానికి చెందినవారు కావడంతో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్మగ్లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను ఆయన సన్మానించారు. సన్మానం ముగిసిన వెంటనే ఆమె ఆయన కుడిబుగ్గపై ముద్దుపెట్టారు. దీంతో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు. ఈ ఘటనపై ఆయన స్పందించేలోగా ఆమె వేదిక నుంచి దిగిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు. ఆయనను నేను తొలిసారి కలిశాను. ఆ సంతోషంలో ఆయనకు ముద్దుపెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. తనది సిద్ధరామయ్య నియోజకవర్గమేనని, తనకు పెళ్లి అయిందని ఆమె తెలిపారు. -
ఖర్గే మంత్రాంగం !
పునర్ వ్యవ స్థీకరణపై అనుమానాలు ? తెరపైకి ‘సీనియర్ల అస్త్రం’ వలసొచ్చిన వారి మంత్రి పదవులు తొలగించు : సిద్ధుకు ఖర్గే హితవు సీనియర్లను తొలగిస్తే పార్టీకి నష్టం : మేడంకు విన్నపం బెంగళూరు : కర్ణాటక మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ విషయమై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే చక్రం అడ్డు వేశారు. మంత్రి మండలి నుంచి తొలగించాల్సిన పేర్లతో కూడిన జాబితాలో తన వర్గానికి చెందిన వారిని రక్షించుకోవడానికి ‘పార్టీకి సీనియర్ల అవసరం ఎంతో ఉంది’ అన్న అస్త్రాన్ని మల్లికార్జున ఖర్గే తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పునర్ వ్యవస్థీకరణపై సందిగ్దత నెలకొంది. మంత్రి మండలిలోకి యువ కులను చేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిద్ధరామయ్య రూపొందించిన తొలగింపు జాబితాలో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లే కాక, మల్లికార్జున ఖర్గే అనుచరులుగా గుర్తింపు పడిన మంత్రులు ఖమరుల్ ఇస్లాం, శ్యామనూరు శివశంకరప్ప, కిమ్మెనరత్నాకర్, బాబురావ్ చించన్సూర్, అభయ్‌చంద్రజైన్ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తనను కలిసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మల్లికార్జున ఖర్గే కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను అనుభవిస్తున్న వారిని మొదట మంత్రి మండలి నుంచి తొలగించు. అటుపై మిగిలిన వారి సంగతి చూద్దాం. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సీనియర్లను తొలగిస్తే పార్టీ చాలా నష్టపోతుంది. అందువల్ల పార్టీలో చాలా కాలంగా ఉన్న వారు మంత్రులుగానే కొనసాగడం ఉత్తమం.’ అని సూచించారు. అంతేకాకుండా మల్లికార్జున ఖర్గే సోనియాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సీనియర్లను తొలగించడం వల్ల రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మండలి పున ర్ వ్యవస్థీకరణ విషయమై అనుమతి లభించలేదు. ఒకేసారి 12 మంది మంత్రులను తొలగించడం సరికాదని సోనియాగాంధీ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో శుక్రవారం జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) మరోసారి సిద్ధరామయ్య, సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఒకవేళ మండలి పునర్ వ్యవస్థీకరణకు నేడు అనుమతి లభించకపోతే సోనియా గాంధీ విదేశీ పర్యటన ముగిసేంతవరకూ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ విషయమై సోనియాగాంధీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ...‘పునర్వ్యవ స్థీకరణ విషయంపై శుక్రవారం మేడం సోనియాగాంధీతో సూత్రప్రాయంగా చర్చించాను. ఈ విషయమై మేడంను శనివారం మరోసారి కలుస్తాను.’ అని పేర్కొన్నారు. -
ఇంటికెళ్తారు జాగ్రత్త!
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అధికారులపై సీఎం సిద్ధరామయ్య గరం గరం పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు బెంగళూరు: అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతామని ఘాటుగా హెచ్చరించారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలో రోడ్లు, డ్రెయినేజీ ఇతర సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం నగరంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. క్యాంపు కార్యాలయం కృష్ణా నుంచి బయల్దేరిన ఆయన తొలుత మైసూరు రోడ్డులోని బాలగంగాధర నాథస్వామి ఫ్లైఓవర్ ద్వారా విక్టోరియా ఆస్పత్రికి వెళ్లేందుకు ఆంబులెన్స్‌ల కోసం చేపట్టిన ప్రత్యేక రహదారి పనులను పరిశీలించారు. అనంతరం మైసూరు రోడ్డులోని 42 కిలోమీటర్ల పొడవునా ఉన్న రాజకాలువలో పూడికను తీయడం, ప్రహరీ గోడ నిర్మాణం పనుల వివరాలను మేయర్ మంజునాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గాలి ఆంజనేయ స్వామి ఆలయంలోకి వర్షపు నీరు ప్రవేశించకుండా రూ.5కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఇదే సందర్భంలో గాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయండనహళ్లి జంక్షన్, హెణ్ణూరులోని ట్రీ పార్క్, కె.ఆర్.పురం ప్రాంతాల్లో పర్యటించారు. హెణ్ణూరు జంక్షన్లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గత నెలలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు పనులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అదే దశలో ఉన్నాయి, ఎందుకు పనులు వేగవంతంగా సాగడం లేదు? భూ స్వాధీన ప్రక్రియ ఎందుకు ఇంత ఆలస్యంగా సాగుతోంది’ అంటూ బీడీఏ భూస్వాధీన అధికారి వసంతకుమార్‌పై సిద్ధరామయ్య మండిపడ్డారు. పనులకు అవసరమైన భూ స్వాధీన ప్రక్రియను మరో నెల రోజుల్లోగా పూర్తి చేయకపోతే అధికారిని విధుల నుండి తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే 13 మంది నుంచి భూమిని సేకరించామని, మరికొంత మంది మాత్రం తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని వసంత్‌కుమార్ సమాధానమిచ్చారు. కాగా, సీఎం నగర పర్యటన కారణంగా మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
అది లంచం కింద ఇచ్చిన వాచ్
► ఏసీబీలో సీఎంపై ఫిర్యాదు బెంగళూరు: ముగిసిపోయిందనుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అవినీతి పరులైన అధికారులను రక్షించినందుకు గాను లంచంగా ఆ వాచ్ సీఎం చేతికి వచ్చి చేరిందంటూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం ఏసీబీలో సీఎం సిద్ధరామయ్య పై ఫిర్యాదు చేశారు. పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.రఘు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు ఎల్.లక్ష్మణ్‌కు సీఎంకు ఆ వాచ్‌ను అందజేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్.రఘు, ఎల్.లక్ష్మణ్‌లపై లోకాయుక్తలో కేసులు ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు లంచంగా ఆ వాచ్‌ను సీఎం సిద్ధరామయ్యకు అందజేశారని ఆరోపించారు. వీరిద్దరూ సీఎం వర్గానికి చెందిన వారు కావడంతో స్వజాతి ప్రేమతో ఇదంతా చేశారని, అందువల్ల తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.