‘ప్రజల్లో చైతన్యం తేవడమే యాత్ర లక్ష్యం..’ | congress party bus yatra starts in chevella | Sakshi
Sakshi News home page

‘ప్రజల్లో చైతన్యం తేవడమే యాత్ర లక్ష్యం..’

Published Tue, Feb 20 2018 3:45 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress party bus yatra starts in chevella - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ  ఈ నెల 26 నుంచి 29వరకు ప్రజా చైతన్య యాత్రను చేపట్టనుంది. కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా ఉన్న చేవేళ్ల నుంచే ఈ బస్సు యాత్ర  ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. ఈ యాత్రలో ఏఐసీసీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర తెలంగాణలో మూడు రోజులపాటు జరగనుంది. బస్సు యాత్రలో  మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యలు పాల్గొననున్నారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశ, నియంతృత్వ విధానాలను తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాక అధికార నియంతృత్వంపై ప్రజల్లో చైతన్యం తేవడమే  యాత్ర లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement