సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ కాలం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర ఖజానాను లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు.ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికార కాలం మరో ఆరు నెలల మాత్రమే ఉంది. దీంతో సీఎం, ఆయన మంత్రి వర్గ సహచరులు కలిసికట్టుగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఇలాంటి మొండీ సీఎంను రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్ర మంత్రి జార్జ్ తో రాజీనామా చేయించాల్సింది పోయి ఆయనపై జార్జీ షీట్ వేసే వరకు ఆగడం సరికాదని హితవు పలికారు. జార్జ్ కూడా నైతికత వహించి తన పదవీకి రాజీనామా చేసి నిరూపించుకోవాని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అంతేకాక మంత్రుల అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని తెలిపారు. ఈ విధమైన వాటిని సీఎం సమర్ధించుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
విద్యుత్ కొనుగోలు విషయంలో డీకేశీ అక్రమార్గాలు ఎంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకునేందుకు సీఎం, డీకేశీలు ఇద్దరూ దొందూ దొందేనన్నారు. విజయశంకర్ రాజీనామా విషయంపై కూడా ఆయన స్పందించారు. పార్టీ అన్ని విధాలుగా ఆయనకు పదవులు ఇచ్చిందని, అయితే రాజీనామా చేశారని ఈ విషయం తనకు పూర్తిగా తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం ఖాయమని యడ్యూరప్ప అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment