
మైసూరు: టిప్పు ఒక దేశద్రోహి, టిప్పు చేసిన నీచ కృత్యాలకు సంబంధించి తాము సాక్ష్యాధారాలతో సహా సేకరించిన పత్రాలను, టిప్పు అరాచకాలపై చరిత్ర కారులు రచించిన పుస్తకాలను సీఎం సిద్దరామయ్యకు పోస్ట్ ద్వారా పంపించినట్లు మాజీ మంత్రి రామదాసు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.టి ప్పు అరాచకాలు, నీచ కృత్యాలపై సాక్ష్యాధారాలతో సహా పంపించిన పుస్తకాలు, పత్రాలను చదవిన అనంతరం టిప్పును దేశభక్తుడిగా వర్ణిస్తున్న సీఎం సిద్దరామయ్యకు నిజంగా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామన్నారు. టిప్పు వంటి నీచుడి జయంతి వేడుకలు నిర్వహించే ముందు సీఎం సిద్దరామయ్య చరిత్రకారులతో చర్చించాల్సిందన్నారు.
టిప్పు జయంతిపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా సీఎం సిద్దరామయ్య పోలీసు, భద్రత బలగాలతో టిప్పు జయంతిని నిర్వహించారంటూ విమర్శించారు. ఇక ఇదే సందర్భంగా ఓట్లు గల్లంతైన మూడు నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణరాజ నియోజవర్గ పరిధిలోని మతదారర నడిగె బూత్‌కడెగె కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment