Tippu
-
ఇవిగో టిప్పు అరాచకాలు
మైసూరు: టిప్పు ఒక దేశద్రోహి, టిప్పు చేసిన నీచ కృత్యాలకు సంబంధించి తాము సాక్ష్యాధారాలతో సహా సేకరించిన పత్రాలను, టిప్పు అరాచకాలపై చరిత్ర కారులు రచించిన పుస్తకాలను సీఎం సిద్దరామయ్యకు పోస్ట్ ద్వారా పంపించినట్లు మాజీ మంత్రి రామదాసు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.టి ప్పు అరాచకాలు, నీచ కృత్యాలపై సాక్ష్యాధారాలతో సహా పంపించిన పుస్తకాలు, పత్రాలను చదవిన అనంతరం టిప్పును దేశభక్తుడిగా వర్ణిస్తున్న సీఎం సిద్దరామయ్యకు నిజంగా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామన్నారు. టిప్పు వంటి నీచుడి జయంతి వేడుకలు నిర్వహించే ముందు సీఎం సిద్దరామయ్య చరిత్రకారులతో చర్చించాల్సిందన్నారు. టిప్పు జయంతిపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా సీఎం సిద్దరామయ్య పోలీసు, భద్రత బలగాలతో టిప్పు జయంతిని నిర్వహించారంటూ విమర్శించారు. ఇక ఇదే సందర్భంగా ఓట్లు గల్లంతైన మూడు నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణరాజ నియోజవర్గ పరిధిలోని మతదారర నడిగె బూత్కడెగె కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు!
టిప్పు నిజమైన ప్రేమికుడు. ప్రేయసిని దక్కించుకోవడానికి ఎందాకా అయినా వెళతాడు. ఏమైనా చేస్తాడు. మరి... టిప్పు తన ప్రేమను గెల్చుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం - ‘టిప్పు’. కనికా కపూర్, ఫమేలా నాయికలు. ప్రముఖ చలనచిత్ర పంపిణీదారు ‘వైజాగ్’ రాజు కుమారుడు సత్య కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. జగదీశ్ దానేటి దర్శకుడు. డీవీ సీతారామరాజు నిర్మాత. ఈ వేసవికే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెబుతూ - ‘‘ఓ వినూత్న కథాంశంతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. మణిశర్మ స్వరపరచిన పాటల తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. -
కార్తీక్ పెద్ద హీరో అవుతాడు
‘‘పంపిణీదారునిగా ‘వైజాగ్’ రాజుకి మంచి పేరుంది. కార్తీక్ రాజు హీరోగా, సంగీతంలో రారాజైన మణిశర్మ స్వరసారథ్యంలో వైజాగ్ రాజు తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన డీవీ సీతారామరాజు (వైజాగ్ రాజు) తన కుమారుడు సత్య కార్తీక్ రాజుని హీరోగా పరిచయం చేస్తూ, నిర్మించిన చిత్రం ‘టిప్పు’. జగదీష్ దానేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు సీడీని ఆవిష్కరించి రాఘవేంద్రరావుకి ఇచ్చారు. పచార చిత్రాలూ, పాటలు బాగున్నాయనీ కార్తీక్ మంచి హీరోగా నిలదొక్కుకోవాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కార్తీక్ నటించిన కొన్ని సీన్స్‌ని ఓ ప్రముఖ దర్శకుడు చూసి, మంచి భవిష్యత్తు ఉందని అభినందించారని వైజాగ్ సత్యానంద్ చెప్పారు. కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘వైజాగ్ రాజుతో నాది 40 ఏళ్ల స్నేహం. ఆయనో సినిమా పంపిణీ చేస్తే, కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. ఈ చిత్రంతో ఆయన తనయుడు పెద్ద హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెప్పారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బి. గోపాల్, ఆర్. నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ కోసం పోరాటం
వైజాగ్ ఏరియా పంపిణీదారునిగా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రాజు తనయుడు సత్య కార్తీక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘టిప్పు’. వారియర్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. జగదీష్ దానేటి దర్శ కత్వంలో ఆదిత్య ఫిలింస్ పతాకంపై డీవీ సీతారామరాజు ఈ చిత్రం నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. వైజాగ్ సత్యా నంద్గారి దగ్గర శిక్షణ పొందిన సత్య కార్తీక్‌కి హీరోగా మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేయస్ రామారావు అన్నారు. సత్య కార్తీక్ మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు కాబట్టి, అందరికీ దగ్గరవుతాడనీ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ ప్రచార చిత్రం చాలా బాగుందని సి. కల్యాణ్ చెప్పారు. సినిమాలంటే సత్య కార్తీక్‌కి చాలా ఇష్టమని దర్శకుడు వీయన్ ఆదిత్య పేర్కొన్నారు. హీరోగా తన పరిచయ చిత్రానికి మంచి కథ కుదిరినందుకు సత్య కార్తీక్ సంతోషం వెలి బుచ్చారు. ఈ నెలాఖరున పాటలనూ, వచ్చే నెల చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి కెమెరా: రాజ శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివరామి రెడ్డి.