టిప్పు నిజమైన ప్రేమికుడు. ప్రేయసిని దక్కించుకోవడానికి ఎందాకా అయినా వెళతాడు. ఏమైనా చేస్తాడు. మరి... టిప్పు తన ప్రేమను గెల్చుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం - ‘టిప్పు’. కనికా కపూర్, ఫమేలా నాయికలు. ప్రముఖ చలనచిత్ర పంపిణీదారు ‘వైజాగ్’ రాజు కుమారుడు సత్య కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. జగదీశ్ దానేటి దర్శకుడు. డీవీ సీతారామరాజు నిర్మాత. ఈ వేసవికే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెబుతూ - ‘‘ఓ వినూత్న కథాంశంతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. మణిశర్మ స్వరపరచిన పాటల తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు!
Published Fri, May 1 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement