Upasana Attends Pushpa Singer Kanika Kapoor Wedding Ceremony, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana Attends Kanika Kapoor Marriage: ‘పుష్ప’ సింగర్‌ పెళ్లిలో ఉపాసన సందడి.. ఫోటోలు వైరల్‌

Published Sat, May 21 2022 1:05 PM | Last Updated on Sat, May 21 2022 1:40 PM

Upasana Attend Pushpa Singer Kanika Kapoor Wedding Ceremony - Sakshi

‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్‌) అంటూ తన గాత్రంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన సింగర్‌  కనికాకపూర్‌ రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని కనికా పెళ్లాడింది.

లండన్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో రామ్‌ చరణ్‌ సతీమణి, కనికా స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, కనికకు ఇంతకు ముందే పెళ్లి అయింది. 1988లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విడాకుల అనంతరం..కెరీర్‌పై దృష్టిపెట్టిన కనికా.. రాగిణి, ఎంఎంఎస్‌ సినిమా పాటలతో ఫేమస్‌ అయింది. వీటితో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా చేసింది. ఇక పుష్ప హిందీ వెర్షన్‌లోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో కనిక మరింత ఫేమస్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement