సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే? | Singer Hanshraj Raghuwanshi Marriage With His Girlfriend Komal Saklani, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Hanshraj Raghuwanshi Marriage: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Published Mon, Oct 23 2023 6:40 PM | Last Updated on Tue, Oct 24 2023 11:36 AM

Singer Hanshraj Raghuwanshi Marriage With Komal Saklani  - Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఏడడుగులు వేసి ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 'అల వైకుంఠపురములో' యాక్టర్ పద్మసూర్య కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఓ స్టార్ సింగర్ పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నాడు. 

(ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)

ఎవరా సింగర్?
బాలీవుడ్ సింగర్ హన్సరాజ్ రఘువంశీ సింగర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో 'మేరా భోలా హై బండారీ' అనే పాటతో యూట్యూబ్ లో సంచలనంగా మారాడు. ఆ తర్వాత కూడా పలు దేవుడి గీతాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా రిలీజైన 'OMG 2'లోనూ 'ఉండి ఉండి వాడి' పాట పాడింది ఇతడే. ఇప్పుడీ సింగర్.. యూట్యూబర్ కోమల్ సక్లానీని పెళ్లి చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ వేడుక జరిగింది.

ఆరేళ్ల నుంచి రిలేషన్
సింగర్ హన్సరాజ్ రఘువంశీ పెళ్లి చేసుకున్న కోమల్.. ఇతడికి చిన్నప్పటి ఫ్రెండ్. 2017 నుంచి వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి చివర్లో నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. హన్సల్ సింగర్ కాగా, కోమల్ యూట్యూబర్. ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement