Hansraj
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఏడడుగులు వేసి ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 'అల వైకుంఠపురములో' యాక్టర్ పద్మసూర్య కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఓ స్టార్ సింగర్ పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) ఎవరా సింగర్? బాలీవుడ్ సింగర్ హన్సరాజ్ రఘువంశీ సింగర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో 'మేరా భోలా హై బండారీ' అనే పాటతో యూట్యూబ్ లో సంచలనంగా మారాడు. ఆ తర్వాత కూడా పలు దేవుడి గీతాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా రిలీజైన 'OMG 2'లోనూ 'ఉండి ఉండి వాడి' పాట పాడింది ఇతడే. ఇప్పుడీ సింగర్.. యూట్యూబర్ కోమల్ సక్లానీని పెళ్లి చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ వేడుక జరిగింది. ఆరేళ్ల నుంచి రిలేషన్ సింగర్ హన్సరాజ్ రఘువంశీ పెళ్లి చేసుకున్న కోమల్.. ఇతడికి చిన్నప్పటి ఫ్రెండ్. 2017 నుంచి వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి చివర్లో నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. హన్సల్ సింగర్ కాగా, కోమల్ యూట్యూబర్. ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్) View this post on Instagram A post shared by Hansraj Raghuwanshi (@baba_hans_raghuwanshi) View this post on Instagram A post shared by KOMAL SAKLANI (@komal_saklani) View this post on Instagram A post shared by Hansraj Raghuwanshi (@baba_hans_raghuwanshi) -
బీజేపీ కార్యాలయం ముందు కాల్పులు
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ హంస్ కార్యాలయం బయట దుండగుడు సోమవారం కాల్పులు జరిపాడు. తన కారులోనే నుంచే దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిణీ మిశ్రా మాట్లాడుతూ కాల్పులు జరిపిన దుండగుడు ఎరుపురంగు కుర్తా పైజామా ధరించి ఉన్నాడని , నిందితుడిని గుర్తించామని తెలిపారు. కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించినట్లు డీసీపీ తెలిపారు. -
మోదీ అంటే కేసీఆర్‌కు భయం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 8 నెలల గడువు ఉంది. అయినా ముందుగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లకు జమిలిగా ఎన్నికలు జరిగితే మోదీ ప్రభంజనంలో గెలుస్తామన్న ధైర్యం ఆయనకు లేదు. ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌కు భయం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అన్నారు. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హన్స్‌రాజ్ ప్రసంగిస్తూ, అసెంబ్లీ రద్దు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ భయ భ్రాంతులకు గురవుతున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మోదీ ప్రభంజనంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్రంలో అ«భివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా ఎక్కడా మోదీ పేరు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పథకాలతో దేశవ్యాప్తంగా రోజురోజుకూ బీజేపీ పుంజుకుంటోందని, కాంగ్రెస్ నానాటికీ బలహీనమవుతోందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు కుటుంబ పార్టీలుగా మారాయని, ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తాయని కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని వర్గాలూ మోదీ వైపే చూస్తున్నాయని, ప్రత్యేకంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. రైతుల దీనస్థితిపై డాక్టర్ స్వామినాథన్ కమిటీ నివేదిక ఇస్తే నాటి యూపీఏ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా మోదీ ప్రభుత్వం వరి, పత్తి, సోయాబీన్ పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుందన్నారు. టీఆర్ఎస్.. తెలంగాణ రాబందుల సమితి టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల సమితిగా మారి జలగల్లా ప్రజలను పట్టి పీడిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఝూటా పార్టీ అని, గత ఎన్నికలకు ముందు చెప్పిం ది ఒకటి, చేసింది ఒకటని.. రానున్న ఎన్నికలలో ప్రజలే టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని సవాల్ చేస్తున్న ఎంఐఎం పార్టీ, కేవలం 10 సీట్ల కోసం అధికార పార్టీకి లొంగిపోయిందని దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలలో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఉత్తమ్ తన నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ ప్రాంతం అనేక విధాలుగా వెనుకబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇళ్లలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు లోపాయి కారీ ఒప్పందాలతో ముందుకు వెళుతున్నారన్నారు. కాంగ్రెస్‌కి చెం దిన ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేక పోయా రన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ధర్మారావు, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షు రాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమనీ, క్రమంగా ఈ భావన ప్రజల్లో బలపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగరాం అహిర్ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర పదాదికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో బీజేపీని నంబర్ వన్‌గా నిలిపేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణలో బీజేపీ కంటే ముందున్న కాంగ్రెస్, టీడీపీ ఇపుడు వెనుకంజలో ఉన్నాయన్నారు. బీజేపీ బయట ఉండి.. మంచి చరిత్ర, నడవడిక, ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావాలని సూచించారు. ఏళ్ల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం నాయకత్వం కొరవడిం దన్నారు. సోనియా, రాహుల్‌పై కాంగ్రెస్ నేతలకు ప్రేమ, విశ్వాసం, నమ్మకం లేదని, దేశంలోని ఇతర పార్టీల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. మే 23న అమిత్ షా రాక.. కాగా, రాష్ట్రంలో మే 23, 24, 25వ తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ పదాదికారులను ఉద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన, పేదల కోసం అంకితభావంతో పనిచేయడంతో.. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లు, పసుపు రైతుల సమస్యలు తదితరాలపై ఇటీవల పార్టీ చేసిన ఆందోళనలు, ఉద్యమాలకు మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని.. ఇతర పార్టీలు ద్వంద్వ నీతి పాటిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడంపై కేంద్రంలో రాజకీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.