హుజూర్‌నగర్ సభలో మాట్లాడుతున్న హన్స్‌రాజ్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 8 నెలల గడువు ఉంది. అయినా ముందుగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లకు జమిలిగా ఎన్నికలు జరిగితే మోదీ ప్రభంజనంలో గెలుస్తామన్న ధైర్యం ఆయనకు లేదు. ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌కు భయం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అన్నారు. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హన్స్‌రాజ్ ప్రసంగిస్తూ, అసెంబ్లీ రద్దు కావడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ భయ భ్రాంతులకు గురవుతున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మోదీ ప్రభంజనంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్రంలో అ«భివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా ఎక్కడా మోదీ పేరు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పథకాలతో దేశవ్యాప్తంగా రోజురోజుకూ బీజేపీ పుంజుకుంటోందని, కాంగ్రెస్ నానాటికీ బలహీనమవుతోందని అన్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు కుటుంబ పార్టీలుగా మారాయని, ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తాయని కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని వర్గాలూ మోదీ వైపే చూస్తున్నాయని, ప్రత్యేకంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. రైతుల దీనస్థితిపై డాక్టర్ స్వామినాథన్ కమిటీ నివేదిక ఇస్తే నాటి యూపీఏ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా మోదీ ప్రభుత్వం వరి, పత్తి, సోయాబీన్ పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుందన్నారు.
టీఆర్‌ఎస్.. తెలంగాణ రాబందుల సమితి
టీఆర్‌ఎస్ తెలంగాణ రాబందుల సమితిగా మారి జలగల్లా ప్రజలను పట్టి పీడిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఝూటా పార్టీ అని, గత ఎన్నికలకు ముందు చెప్పిం ది ఒకటి, చేసింది ఒకటని.. రానున్న ఎన్నికలలో ప్రజలే టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని సవాల్ చేస్తున్న ఎంఐఎం పార్టీ, కేవలం 10 సీట్ల కోసం అధికార పార్టీకి లొంగిపోయిందని దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలలో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఉత్తమ్ తన నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ ప్రాంతం అనేక విధాలుగా వెనుకబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇళ్లలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు లోపాయి కారీ ఒప్పందాలతో ముందుకు వెళుతున్నారన్నారు. కాంగ్రెస్‌కి చెం దిన ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేక పోయా రన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ధర్మారావు, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షు రాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment