మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం
బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్
మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం
రాష్ట్రంలో ముఖ్యమంత్రే కుట్ర చేసి రైతుబంధు ఆపించాడు
కామారెడ్డి, మెదక్ రోడ్ షోల్లో కేసీఆర్ ప్రసంగం
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. బీజేపీ దోపిడీదారులు, పెట్టుబడిదారులకే కొమ్ముకాసే పార్టీ. దాని ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవు..’అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో కూడా మాట్లాడారు.
అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చే దిన్ వచ్చినయ్
‘ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్ మాటలు చెబుతాడు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’అని చెప్పి సత్తె నాశనం చేశాడు. ఎగుమతులు బందయి, దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావో..బేటీ బచావో, జన్‌ధన్ యోజన ఇవేవీ దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు. అవేవీ ప్రజలను ఆదుకోలేదు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చేదిన్ వనయ్. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు.
అంతటా రూ.15 లక్షలు ఇస్తామన్నారు? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ రూ.30 లక్షలు ఇచి్చండ్రా? (లేదంటూ సభికులు కేకలు పెట్టారు) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడా రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రంటూ మోదీ ప్రతిసారీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. పేదలకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయడమే దండుగ. ఆ పారీ్టకి 400 సీట్లు రానేరావు. మళ్లీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 దాటిపోతాయి..’ అని కేసీఆర్ అన్నారు.
ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు
‘ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అసమర్థులు, పరిపాలన సాగించలేని తెలివితక్కువ వాళ్ల చేతుల్లోకి వెళ్లి ఐదు నెలల్లోనే ఆగమైంది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఈ నెల 9 లోపు రైతుబంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర చేసి ఆపించాడు.
ఐదెకరాలకు ఇస్త అంటడు. ఆరెకరాలు, ఏడెకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? తొమ్మిదేళ్లు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగనే కరెంటుకు ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదు? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు రీయింబర్స్‌మెంటు చేయడం లేదు, 125 గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి..’అని మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగైతే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి?
‘రేవంత్‌రెడ్డి ఒట్లు పెట్టుకోవడం, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు రాజ్యమేలితే ఇలాగే ఉంటుంది. కృష్ణా నదిని కేఆర్‌ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు.. గోదావరి నదిని తమిళనాడుకు అప్పగిస్తోంది. ఉన్న ఒక్క గోదావరి నదీ జలాలు తమిళనాడుకు వెళితే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి? మేం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఉద్యమాల్లో రాటుదేలిన, చైతన్యవంతమైన కామారెడ్డి, మెదక్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
పార్లమెంటు ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో మనం గెలిస్తే రాష్ట్రం మెడలు వంచి హామీలు అమలు చేయించుకుందాం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 12, 13 స్థానాలు గెలిస్తే మనమే కీలకంగా మారతాం. కామారెడ్డితో పాటు ఇతర జిల్లాలు పోకుండా ఉండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలి. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మన అభ్యర్థులను గెలిపించాలి..’అని బీఆర్‌ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, మెదక్, జహీరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్ రెడ్డి, గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
చిన్నారులకు పకోడీలు తినిపించిన కేసీఆర్
ఇందల్వాయి ( నిజామాబాద్ రూరల్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం చిన్న పిల్లలు, రైతులతో కాస్త సరదాగా గడిపారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళుతూ 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆగారు. అక్కడి హోటల్‌లో ఉల్లిగడ్డ పకోడి తిని టీ తాగారు. అక్కడ ఉన్న చిన్నారులకు పకోడీలు తినిపించారు. తనను కలిసేందుకు వన రైతులకు ఇచ్చారు. మరోవైపు హోటల్ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్ సరదాగా సంభాíÙంచారు. హోటల్ యజమాని వెంకట రమణయ్యతోనూ ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment