Bigg Boss OTT Fame Millind Gaba Marriage With His Girlfriend Pria Beniwal, Pics Viral - Sakshi
Sakshi News home page

Millind Gaba: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, పెళ్లి ఫొటోలు చూసేయండి

Published Sun, Apr 17 2022 5:28 PM | Last Updated on Sun, Apr 17 2022 5:38 PM

Bigg Boss OTT Fame Millind Gaba Marriage With His Girlfriend Pria Beniwal, Pics Viral - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్‌ మిలింద్‌ గాబ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు ప్రియ బెనివాల్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రుల సమక్షంలో ఢిల్లీలో ఘనంగా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో వధువు పసుపు, మెరూన్‌ రంగులో ఉన్న గాగ్రాను ధరించగా వరుడు కూడా అదే రంగుల కలయికలో ఉన్న షేర్వానీలో మెరిశాడు.

మరో ఫొటోలో మిలింద్‌ తన అర్ధాంగి ప్రియ నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టాడు. కాగా పెళ్లికి ముందు జరిపిన సంగీత్‌ వేడుకకు ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేశారు.మైకా సింగ్‌, గురు రంధావా, సప్న చౌదరి, భూషణ్‌ కుమార్‌, క్రికెటర్‌ సురేశ్‌ రైనా, బుల్లితెర తారలు ప్రిన్స్‌ నరుల, సుయ్యశ్‌ రాయ్‌ తదితరులు సంగీత్‌లో సందడి చేశారు. కాగా మిలింద్‌ హిందీలో పలు హిట్‌ సాంగ్స్‌ పాడాడు. అతడు బిగ్‌బాస్‌ ఓటీటీలోనూ పాల్గొన్నాడు.

చదవండి: మెగా ఫ్యాన్స్‌ సమక్షంలో హైదరాబాద్‌లో ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement