
హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, సింగర్ అఫ్సానా ఖాన్ ప్రియుడు, గాయకుడు సాజ్‌ను పెళ్లాడింది. శనివారం చండీఘడ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రాఖీ సావంత్, హిమాన్షి ఖురానా, రష్మీ దేశాయ్, ఉమర్ రియాజ్, యువిక చౌదరి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారితో కలిసి ఫొటోలు దిగుతూ పెళ్లి మండపంలో సందడి చేశారు.
వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన అఫ్సానా.. తన వేలు పట్టుకుని నడిచిన భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని క్యాప్షన్ జోడించింది. కాగా వీరి పెళ్లి, మెహందీ, సంగీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే అఫ్సానా, సాజ్ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. వీరిద్దరూ కలిసి పాడిన కొత్త సాంగ్ 'బెహ్రి దునియా' ఇటీవలే రిలీజవగా ఇందులో నిక్కీ తంబోలి నటించింది.
Comments
Please login to add a commentAdd a comment