
Devoleena And Vishal Singh Getting Confirmed About Their Wedding: బీటౌన్‌లో ఇప్పటికీ అనేక మంది తారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్, రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ పెళ్లి పీటలు ఎక్కగా ఇటీవలే మౌనీరాయ్-సూరజ్ నంబియార్ వివాహం చేసుకున్నారు. అయితే వీరి తరహాలోనే మరో జంట వివాహం చేసుకోనుందని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది ఆ జంట.
హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 కంటెస్టెంట్ దేవొలీనా భట్టాచార్జీ, నటుడు విశాల్ సింగ్ ఇటీవల ఎంగేజ్మెంట్ అయినట్లు పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు 'ఇట్స్ అఫిషియల్' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు విశాల్ సింగ్. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు 'ఐ లవ్ యూ విషు' అంటూ రిప్లై కూడా ఇచ్చింది. దీంతో తమ అభిమానులందరూ వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారనుకోని అభినందనలు తెలిపారు. ఇలా ఒక్కసారిగా అభినందనలను వెల్లువెత్తడంతో వారిద్దరూ నిజంగా నిశ్చితార్థం చేసుకోలేదని చెప్పుకొచ్చారు దేవొలీనా, విశాల్ సింగ్.
అయితే అది ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం చేసిందని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆ ఆల్బమ్ రొమాంటిక్ ట్రాక్‌గా ఉంటుందని, దాని పేరు 'ఇట్స్ అఫిషియల్' అని విశాల్ సింగ్ తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశపడటమే కాకుండా పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 15 సీజన్ షోలో దేవొలీనా ఒక టాస్క్‌లో భాగంగా గాయపడింది. అందుకు సర్జరీ కూడా చేయించుకుంది. ఫలితంగా మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment