టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో పాల్గొంది. రెండు నెలలుగా హౌస్‌లో కొనసాగుతున్న ఈమె తన సోదరి నమ్రత శిరోద్కర్‌ను గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అతిథిగా విచ్చేశాడు. నీ సోదరి గురించి చెప్పు అని అనురాగ్ అడగ్గానే శిల్ప కన్నీటిపర్యంతమైంది.
నమ్రతతో గొడవపడ్డా..
శిల్ప మాట్లాడుతూ.. ఈ షోకి వచ్చేముందే నమ్రతకు, నాకు గొడవ జరిగింది. రెండు వారాలు మేమసలు మాట్లాడుకోనేలేదు. తనను నేను చాలా మిస్సవుతున్నాను. నాకోసం తను ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఎపిసోడ్‌లో సైతం నమ్రతను గుర్తు చేసుకుంది. బిగ్‌బాస్‌కు వచ్చేముందు తనను కలిసి గుడ్‌బై కూడా చెప్పలేదని బాధపడింది. ఫ్యామిలీ వీక్‌లో అయినా తనను కలవాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment