Shilpa Shirodkar
-
లావుగా ఉన్నానని ఆ పాట నుంచి తప్పించారు: శిల్ప
హీరోయిన్ల లైఫ్ అంత ఈజీగా ఉండదు. కాస్త లావెక్కినా, వయసు మీద పడుతున్నట్లు ఏమాత్రం కనిపించినా వారి కెరీర్ డేంజర్లో పడ్డట్లే! పైగా కొత్తవారు ఎంట్రీ ఇచ్చేకొద్దీ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ నిలదొక్కుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. అయినా కొన్నిసార్లు ఏవో వంకలు చెప్పి రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరిటాలీవుడ్ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్. ఆమె చెల్లి శిల్ప శిరోద్కర్ కూడా కథానాయికగా నటించింది. ఒకప్పుడు బాలీవుడ్లో ఈమె టాప్ హీరోయిన్గా చెలామణి అయింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇన్నాళ్లు ఆన్‌స్క్రీన్‌పై చూశారు.. ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో నేనెలా ఉంటానో చూపిస్తానంటూ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. సల్మాన్ ఖాన్‌కు బదులుగా..ఈ షోకు వెళ్లేముందు నమ్రతతో గొడవపడి మరీ వచ్చేశానంటూ తన సోదరిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా శిల్ప మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్‌కు బదులు కొరియోగ్రాఫర్, దర్శకనటి ఫరాఖాన్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమెను చూడగానే శిల్పకు ఓ విషయం గుర్తుకు రావడంతో దాన్ని మరో కంటెస్టెంట్‌తో పంచుకుంది. సడన్‌గా నన్ను తీసేశారుబ్లాక్బస్టర్ సాంగ్ చయ్య చయ్య (దిల్సే మూవీలోనిది) పాటకోసం మొదట నన్నే అనుకున్నారు. నా దగ్గరకు వచ్చిన ఫరా ఖాన్ నన్ను చూసి కాస్త బరువు తగ్గమని చెప్పింది. వారం పదిరోజుల తర్వాత నన్ను పక్కనపెట్టి మరో నటి(మలైకా అరోరా)ని వెతుక్కున్నారని తెలిసింది. నేను మరీ లావుగా ఉన్నానని, ఆ పాటకు సూటవనని ఫరా నాతో చెప్పింది. నిజంగా నన్ను తీసేయడానికి అదే కారణమా? ఇంకేదైనా ఉందా? అన్నది కొరియోగ్రాఫర్ ఫరా, డైరెక్టర్ మణిరత్నమే చెప్పాలి అని శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నమ్రతతో గొడవపడి బిగ్‌బాస్‌కు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. రెండు నెలలుగా హౌస్‌లో కొనసాగుతున్న ఈమె తన సోదరి నమ్రత శిరోద్కర్‌ను గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అతిథిగా విచ్చేశాడు. నీ సోదరి గురించి చెప్పు అని అనురాగ్ అడగ్గానే శిల్ప కన్నీటిపర్యంతమైంది. నమ్రతతో గొడవపడ్డా..శిల్ప మాట్లాడుతూ.. ఈ షోకి వచ్చేముందే నమ్రతకు, నాకు గొడవ జరిగింది. రెండు వారాలు మేమసలు మాట్లాడుకోనేలేదు. తనను నేను చాలా మిస్సవుతున్నాను. నాకోసం తను ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఎపిసోడ్లో సైతం నమ్రతను గుర్తు చేసుకుంది. బిగ్‌బాస్‌కు వచ్చేముందు తనను కలిసి గుడ్‌బై కూడా చెప్పలేదని బాధపడింది. ఫ్యామిలీ వీక్‌లో అయినా తనను కలవాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ హౌస్‌లో మహేశ్ బాబు మరదలు.. తెలుగులో ఓకే ఒక్క సినిమా!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వెల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అదే రోజు హిందీతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్-18 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హౌస్‌లో అడుగుపెట్టింది. నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా బిగ్‌బాస్ సీజన్ 18లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు బిగ్‌బాస్ షో అంటే విపరీతమైన అభిమానమని.. నా కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు శిల్పా శిరోద్కర్ అన్నారు. బిగ్‌బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లమని కూతురు ఎప్పుడు తనను అడుగుతుండేదని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. అందరికంటే ఎక్కువ తన కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది.(ఇది చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)1990 దశకంలో బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు శిల్పా శిరోద్కర్. బాలీవుడ్లో బందీష్, మృత్య్దండ్, హమ్, త్రినేత లాంటి సినిమాల్లో నటించారు. మోహన్‌బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూవీ ఇదే కావడం విశేషం. అంతే కాకుండా నాగార్జున నాగార్జున బాలీవుడ్లో నటించిన ఖుదాగవా సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ చేశారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా గజగామిని అనే హిందీ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
Bigg Boss: బిగ్ బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ..?
-
బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ విజయవంతంగా ప్రసారమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.ఒకప్పుడు హీరోయిన్గా..ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందట! ఈ జాబితాలో నటి శిల్ప శిరోద్కర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ షోలో ఎంట్రీ?తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్‌లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. నిజంగానే బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందా? లేదా? అనేది చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాలీవుడ్లో కరోనా కలకలం.. నమ్రత సోదరికి పాజిటివ్
దేశంలో కరోనా మళ్లీ విజృంభించింది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఐటెం బ్యూటీ నోరా ఫతేహి తదితరులు కోవిడ్ బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్‌కి కరోనా సోకింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది. -
కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి
దుబాయ్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి నటిగా బాలీవుడ్ సెలబ్రిటీ శిల్పా శిరోద్కర్ నిలిచారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న 51 ఏళ్ల శిల్పా యూఏఈలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. గోపి కిషన్’, ‘బేవాఫా సనమ్’, ‘కిషన్ కన్హయ్య’, ‘హమ్’ చిత్రాలతో బాలీవుడ్లో పాపులర్ అయినఆమె 2000వ సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపెరేష్ రంజిత్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న శిల్పా 2013లో పాపులర్ సీరియల్ ‘ఏక్ ముత్తి ఆస్మాన్’ లో నటించింది. శిల్పా శిరోద్కర్ ప్రముఖ సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) -
ఇలాంటి క్షణాలు అమూల్యమైనవి: నమ్రత
వారం రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి హీరో మహేశ్ బాబు ఫ్లైటెక్కిన విషయం తెలిసిందే కదా! మహేశ్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేసింది మరెక్కడికో కాదు.. దుబాయ్‌లో ఉంటున్న ఆయన వదినమ్మ ఇంటికే. అవును, నమత్ర అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి కుటుంబంతో సహా వెళ్లిన మహేశ్ అక్కడే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పనిలో పనిగా అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టొస్తూ ప్రతిక్షణాన్ని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో సూపర్ స్టార్ కుటుంబంతో పాటు శిల్ప, ఆమె భర్త, కూతురు ఉన్నారు. (చదవండి: విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి) "ఇల్లు కాని ఇంట్లో సేద తీరుతున్నాం. గత రాత్రి మర్చిపోలేనిది.. అసలు ముఖానికి మాస్కులే లేవు(ఫొటో వరకు మాత్రమే) దీపావళి పండగ రోజు అంతా కలిసి బయట భోజనం చేశాం. అయినా పండగను ఫ్యామిలీతో జరుపుకోడానికి మించినదేం ఉంటుంది. ఇలాంటి క్షణాలు అమూల్యమైనవి" అని నమ్రత రాసుకొచ్చారు. కొడుకు, కూతురుతో రెస్టారెంటులో భోజనం చేస్తున్న ఫొటోను సైతం ఆమె అభిమానులతో ఇదివరకే పంచుకున్నారు. కాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సక్సెస్ అందుకున్న మహేశ్ 'సర్కారు వారి పాట'తో మరో హిట్టు తన ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. సమాజానికి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వనున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది మహేశ్‌కు 27వ సినిమా. (చదవండి: మరో ఇద్దరికి ప్రాణదానం చేసిన మహేశ్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్
ముంబై: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియా పోటీ చేసిన నాటి ఓ వీడియోను ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1993లో నమ్రతా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నమ్రత తన సమాధానంతో షో జడ్జీలను మెప్పించారని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను బుధవారం శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించారు. ఈ రౌండ్లో ఏ ముగ్గురు తర్వాత రౌండ్‌కు వెళతారని సంగీతను అడగ్గా.. కచ్చితంగా నమ్రత విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక తనకు ఇష్టమైన కంటెస్టెంట్ కూడా నమ్రత అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అతడు నా అభిమాన హీరో) ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపిస్తే ఏం చేస్తారు అని అడగ్గా’.. దానికి నమ్రత.. నేను నిజంగా భయపడాతాను కానీ అప్పుడు అతనితో స్నేహం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. నమ్రతా హిందీలో ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘అల్బెలా’, ‘దిల్ విల్ ప్యార్ వయార్’ వంటి హిందీ చిత్రాలలో తన నటనకు నమ్రతా శిరోద్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 2005లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. (చదవండి: ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత) View this post on Instagram @namratashirodkar I Love you😘😘😘 #feminamissindia #1993 A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) on Jul 28, 2020 at 11:38pm PDT -
టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!
సినిమా చూస్తారా, సీరియల్ చూస్తారా అంటే... ఒక్క క్షణం కూడా తడుముకోకుండా సీరియల్ అంటున్నారు మహిళా మణులు. అందుకే చానెళ్లలో సినిమాలు రావడం కూడా తగ్గిపోయింది. శని, ఆది వారాల్లో తప్ప మిగతా రోజుల్లో సీరియల్స్‌దే హవా. ఇటీవల కొత్తగా శనివారం కూడా ఇచ్చేస్తున్నారు. ముందు ముందు ఆదివారం కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతగా సీరియళ్లు ఏలుతున్నాయి కాబట్టే... సినిమా వాళ్లు సయితం సీరియళ్ల మీద మోజు పడుతున్నారు. సినిమాల్లో చేస్తున్నవారు కాస్త హవా తగితే సీరియళ్లలోకి జంప్ చేస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కూడా అదే పని చేశారు. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన ఈమె... ఇప్పుడు జీటీవీలో ప్రసారమయ్యే ‘ఎక్ ముఠ్ఠీమే ఆస్మాన్’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంతకీ శిల్ప ఎవరో గుర్తుందిగా? ‘బ్రహ్మ’ చిత్రంలో మోహన్‌బాబుతో నటించారు. ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన’ అంటూ ఆ సినిమాలో మోహన్‌బాబు పాట పాడేది ఈమె కోసమే. నమ్రతా శిరోద్కర్‌కి అక్క, మహేశ్‌బాబుకి వదిన అయిన శిల్ప... ఒకనాడు తన గ్లామర్‌తో యువకుల కలల రాణిగా వెలిగారు. ఇప్పుడు సీరియల్లో ఓ సాధారణ ఇల్లాలిగా నటనను పండిస్తూ... తెలుగు ఇల్లాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మరి టీవీతో మొదలైన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్... ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి!