బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్‌బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.
'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్‌లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్‌గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను.
నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్‌లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్‌గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్‌గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్‌లో శిల్పా శిరోద్కర్‌కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.
నమ్రతను కలిసిన శిల్ప
తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment