బిగ్‌బాస్‌ షోలో నమ్రత సోదరి ఎంట్రీ! | Buzz: Namrata Sister Shilpa Shirodkar Participate Salman Khan Bigg Boss 18 | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో ఒకప్పటి హీరోయిన్‌, నమ్రత సోదరి ఎంట్రీ?

Published Mon, Sep 23 2024 4:48 PM | Last Updated on Mon, Sep 23 2024 7:46 PM

Buzz: Namrata Sister Shilpa Shirodkar Participate Salman Khan Bigg Boss 18

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్‌ విజయవంతంగా ప్రసారమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్‌ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్‌ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది.

ఒకప్పుడు హీరోయిన్‌గా..
ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందట! ఈ జాబితాలో నటి శిల్ప శిరోద్కర్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! భ్రష్టాచార్‌(1989) సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్‌ కన్హయ్య, త్రినేత్ర, హమ్‌, ఖుదా గవా, ఆంఖెన్‌, గోపి కిషన్‌, మృత్యునాద్‌, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. 

బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ?
తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్‌ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్‌ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్‌ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్‌లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. నిజంగానే బిగ్‌బాస్‌ షోలో అడుగుపెడుతుందా? లేదా? అనేది చూడాలి!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement