బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఆమెకు ఐటమ్ సాంగ్స్‌లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ వార్2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.
‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్‌లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్ కూడా.. అయితే, ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్2 సినిమాలో శ్రద్ధా కపూర్ ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది.
అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్.. ఎన్టీఆర్, హృతిక్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment