పాన్‌ ఇండియాలో మోస్ట్‌ క్రేజీ స్టార్స్‌.. తొలి స్థానంలో ఎవరంటే? | Ormax Media Released List Of Most Popular Male Stars Across India In June 2024, Deets Inside | Sakshi
Sakshi News home page

Most Popular Stars: మొదటి స్థానంలో రెబల్‌ స్టార్‌.. అల్లు అర్జున్‌ ప్లేస్ ఎంతంటే?

Published Sun, Jul 21 2024 6:53 PM | Last Updated on Mon, Jul 22 2024 10:42 AM

Ormax Media Released Most Popular male Stars Across India In June 2024

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన జాబితాలో యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలిస్థానంలో నిలిచారు. జూన్ నెలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్‌ జాబితాను తాజాగా ‍ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్‌ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ప్లేస్‌లో షారుక్ ఖాన్‌ నిలిచారు.

ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన జాబితాలో దళపతి విజయ్ మూడోస్థానం, అల్లు అర్జున్‌ నాలుగు, జూనియర్ ఎన్టీఆర్‌ ఐదోప్లేస్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా.. మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఉన్నారు.

కాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement