హీరోల్లో రెబల్ స్టార్‌ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే? | Ormax Media Released Lists Of The Most Popular Stars In India In December 2024 For Film Stars | Sakshi
Sakshi News home page

Most popular Stars In India: హీరోల్లో రెబల్ స్టార్‌ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?

Published Sun, Jan 19 2025 2:56 PM | Last Updated on Sun, Jan 19 2025 3:54 PM

Ormax Media December Month Most popular Stars In India

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్‌ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.

హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్‌..

హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్‌ అల్లు అర్జున్‌ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ టాప్‌-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.

హీరోయిన్లలో సమంత టాప్..

హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement