Ormax Media
-
హీరోల్లో రెబల్ స్టార్ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్..హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ టాప్-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.హీరోయిన్లలో సమంత టాప్..హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/cRd7Jb4WsI— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 Ormax Stars India Loves: Most popular male film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/Tniww2cO7Z— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
మోస్ట్ పాపులర్ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరిట టాప్ టెన్ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/wAxa5GF5DP— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 Ormax Stars India Loves: Most popular male film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/ei4bfglzlm— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 -
టాలీవుడ్లో మోస్ట్ అవైటేడ్ చిత్రాలివే.. మొదటిస్థానంలో ఆ సినిమానే!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ దేవర, బన్నీ మూవీ పుష్ప-2 ది రూల్ ముందువరసలో ఉన్నాయి. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడంతో అందరి చూపు దేవరపైనే ఉంది. దీంతో ఈ ఏడాదిలో అందరి దృష్టి ఈ రెండు సినిమాలపైనే ఉంది. ఆ తర్వాత ప్రభాస్ స్పిరిట్, పవన్ కల్యాణ్ ఓజీ, జై హనుమాన్ తర్వాత వరుసలో ఉన్నాయి.టాలీవుడ్లో మోస్ట్ అవేటైడ్ చిత్రాల జాబితాను ప్రముఖ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన లిస్ట్‌లో పుష్ప-2 అధిగమించి దేవర ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఇది కేవలం ఆగస్టు 15 వరకు సేకరించిన డేటా మాత్రమేనని తెలిపింది. అంతేకాకుండా అక్టోబర్ నుంచి రిలీజ్ కాబోయే చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మరీ మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పేయండి.#OrmaxCinematix Most-awaited Telugu films, as on Aug 15, 2024 (only films releasing Oct 2024 onwards whose trailer has not released yet have been considered) pic.twitter.com/LU7wSUcWw2— Ormax Media (@OrmaxMedia) August 20, 2024 -
పాన్ ఇండియాలో మోస్ట్ క్రేజీ స్టార్స్.. తొలి స్థానంలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిస్థానంలో నిలిచారు. జూన్ నెలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ప్లేస్‌లో షారుక్ ఖాన్ నిలిచారు.ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన జాబితాలో దళపతి విజయ్ మూడోస్థానం, అల్లు అర్జున్ నాలుగు, జూనియర్ ఎన్టీఆర్ ఐదోప్లేస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా.. మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఉన్నారు.కాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/ghuiir9wgG— Ormax Media (@OrmaxMedia) July 21, 2024 -
శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్‌ను ప్రకటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్‌లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
తెలుగులో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే.. లిస్ట్ ఇదే!
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ తారలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి టాప్ టెన్‌లో ఉన్న హీరోల జాబితాను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు.మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ పేరిట ఈ జాబితాను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పవన్ కల్యాణ్, నాని, రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండ టాప్‌టెన్‌లో నిలిచారు. ప్రభాస్ తొలిస్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రెబల్ స్టార్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/XNWOfiaDaA— Ormax Media (@OrmaxMedia) July 15, 2024 -
టాప్ వన్‌లో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే..?
వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. (ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ను గెలికిన కంగనా) అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు. తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్‌తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9), మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్‌కు జూన్ నెలలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్ పొజీషన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత రోండో స్థానంలో అలియా భట్ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్ టెన్‌లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm — Ormax Media (@OrmaxMedia) July 21, 2023 -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
నెంబర్ వన్ స్థానం కోసం భారీ మొత్తంలో డబ్బులిచ్చా: సమంత
సినీ సెలబ్రిటీలలో సమంత రూటే సపరేటు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి వెళ్లి రెండు భాషల్లోనూ కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత. ది ఫ్యామిలీ మెన్–2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బోల్డ్ పాత్రలో నటించి ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొన్నారు. వర్కౌట్స్, గ్లామర్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉంటారు. నాగ చైతన్యతో పెళ్లి, విడాకుల తరువాత ఆమె క్రేజ్ తగ్గుతుందని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ఆమె స్టార్డం మరింత పెరిగింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి వివాదాల్లో కెక్కారు. (చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్) ఆర్ మాక్స్ అనే సంస్థ భారతీయ సినీ హీరోయిన్లలో అత్యంత పాపులారిటీ కలిగిన వారెవరన్నది గురించి చేసిన సర్వేలో నటి సమంతనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత స్థానాల్లో బాలీవుడ్ నటి అలియా భట్, నయనతార, కరీనాకపూర్, పూజా హెగ్డే తదితరులు నిలిచారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంతను ఆర్ మాక్స్ సంస్థ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు అన్న బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రశ్నకు నిజం చెప్పనా అంటూ తాను ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు బదులిచ్చారు. ఆమె కామెడీగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీశాయి. అంతేకాకుండా నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే..
Top 10 OTT Originals Of The Week By Ormax Media: ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్, మూవీస్‌కు జై కొడుతున్నారు మూవీ లవర్స్. ఇంతకుముందు కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు. థియేటర్లలో రిలీజైన వెంటనే చూసేందుకు పోటీపడేవారు ప్రేక్షకులు. ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలను చూస్తూనే ఓటీటీల్లో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఓ సర్వే చేసి ఒక జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాలో టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ అందించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలిపింది. మే 6 నుంచి 12 వరకు ఎక్కువ బజ్ ఉన్న వెబ్ సిరీస్, సినిమాల ఆధారంగా సర్వే నిర్వహించి ఈ జాబితాను ప్రవేశపెట్టింది. ఇందులో ఇప్పటికే విడుదలైనవాటితోపాటు వచ్చే వెబ్ సిరీస్‌లు, ఒక సినిమాను పేర్కొంది. చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. 1. మూన్ నైట్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 2. గిల్టీ మైండ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 3. పంచాయత్ సీజన్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో) (మే 20) 4. మాయి (నెట్‌ఫ్లిక్స్) 5. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 (నెట్‌ఫ్లిక్స్) (మే 27) 6. లండన్ ఫైల్స్ (వూట్) 7. రుద్ర (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. గుల్లక్ సీజన్ 3 (సోనీ లివ్) 9. హోమ్ శాంతి (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 10. థార్ (నెట్‌ఫ్లిక్స్) Ormax Stream Track: Top 10 OTT originals in India, including upcoming shows/ films, based on Buzz (May 6-12) #OrmaxStreamTrack #OTT pic.twitter.com/edep0uTvxa — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ హాలీవుడ్ అపరిచితుడు మాములోడు కాదు.. -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022