Samantha Is Ormax Most Popular Female Star In India - Sakshi
Sakshi News home page

Samantha: బాలీవుడ్‌ తారలను వెనక్కి నెట్టి.. ఏకంగా అగ్రస్థానంలో సామ్!

Published Sat, Jul 22 2023 5:00 PM | Last Updated on Sat, Jul 22 2023 5:16 PM

Samantha Gets Number One Place In Ormax All India Heroines List In June - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది.

(ఇది చదవండి: బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్‌ అడిగారు: సీరియల్‌ నటి)

బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్‌ ఇండియా  ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్‌ సంస్థ స్టార్స్‌ ఆఫ్ ఇండియా లవ్స్‌ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్‌గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్‌ వరుణ్‌ ధావన్‌తో కలిసి సిటాడెల్‌లో కనిపించనుంది. 

(ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్‌ షాకింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement