Rank
-
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ అభిమానిపై ప్రశంసలు కురిపించింది.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ సమంత రాసుకొచ్చింది. తన అభిమాని అయిన స్టూడెంట్ను స్టార్ హీరోయిన్ సమంత అభినందించడం చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్‌కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత
మన దగ్గర స్పూర్తిదాయక కథనాలకు కొదవే లేదు. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంత యువత మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు. ఏ ప్రాంతం, ఎంత డబ్బు ఉంది ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మొక్కవోని పట్టుదలతో ఎదిగి తామేంటో నిరూపించుకుంటున్నారు. కలల సాకారం కోసం ఒక్కసారి గట్టి నిశ్చయించు కుంటే.. తమకు ఎదురే ఉండదని నిరూపిస్తున్నారు. బిహార్‌కు చెందిన ఒక రైతు బిడ్డ సక్సెస్ స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తోంది. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని పేద రైతు సిద్ధనాథ్ సింగ్ కుమారుడు సత్యం కుమార్ 13ఏళ్లకే కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-JEE)లో సీటు సాధించి విశేషంగా నిలిచాడు. రైతు బిడ్డ సత్యం 2013లో 679 ర్యాంక్ సాధించాడు. 2010లో IIT సీటు పొందిన ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల సహల్ కౌశిక్ రికార్డును ఛేదించి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును బద్దలు కొట్టాడు. ఐఐటీ పరీక్షకు సంబంధించి కుమార్‌కి ఇది రెండో ప్రయత్నం. 2012లో 12 ఏళ్ళ వయసులోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించాడు. అయితే బెస్ట్ ర్యాంక్ కోసం 12 నెలల తర్వాత మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంలో రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మూడు ప్రాజెక్టులపై పనిచేశాడు. ఎలక్ట్రోక్యులోగ్రామ్ బేస్డ్ ఐ బ్లింక్ క్లాసిఫికేషన్ డ్యూరింగ్ EOG సిగ్నల్ అక్యుయిషన్ టైం, “వివిధ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లలో ఎలక్ట్రోడ్ స్థానాల ఆప్టిమైజేషన్” , “ఇమాజినేటివ్ స్పీచ్ బేస్డ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్” ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. ఇక్కడితో సత్యం కుమార్ విజయ్ ప్రస్థానం ముగిసిపోలేదు. తాజాగా 24 ఏళ్ల వయసులో టెక్ దిగ్గజం యాపిల్ అతణ్ని ఉద్యోగంలోకి తీసుకుంది. 2018లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి B.Tech-M.Tech ఉమ్మడి కోర్స్ పట్టా సాధించాడు సత్యం కుమార్. ప్రస్తుతం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేస్తున్నాడు. 2023 ఆగస్టు వరకు యాపిల్‌లో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పని చేశాడు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ నిపుణుడిగా ఉన్న కుమార్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పలు టెక్నాలజీలను పిల్లలకు బోధించడానికి,వారి జీవితాలను మెరుగుపరచడానికి బిహార్‌లోని తన సొంత జిల్లా భోజ్‌పూర్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పాడు ఎనిమిదో తరగత వరకు స్కూలు అంటే ఏంటో తెలియదు జూలై 20, 1999న జన్మించాడు సత్యం కుమార్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంతటి వాడు కావాలనేది డ్రీమ్. ఇంకో విశేషం ఏమిటంటే అసలు ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌కే వెళ్లలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో, స్థానిక వీర్ కుర్ సింగ్ కాలేజీలో క్లర్క్, మేనమామ పశుపతి సింగ్ సహాయంతో ఇంట్లోనే ప్రాథమిక విద్య పూర్తైంది. 2007లో రాజస్థాన్ బోర్డ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి కోటలోని మోడ్రన్ స్కూల్లో అడ్మిషన్ పొందాడు. అలా ఎనిమిదో తరగతిలో తొలిసారి పాఠశాలకు వెళ్లాడు. చాలా తొందరగా నేర్చుకునే తత్వం అసాధారణమైన జ్ఞాపకశక్తిగల విద్యార్థిగా ప్రశంసలందుకున్నాడు. రాజస్థాన్ బోర్డ్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని పదేళ్లకే పదో తరగతి, 12 సంవత్సరాల వయస్సులో XII తరగతిని క్లియర్ చేయడం విశేషం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ డ్రీమ్ అంతేకాదు తానేమీ పుస్తకాల పురుగును కాదనీ, సినిమాలు చూస్తా.. ఫుట్ బాల్ ఆడుకుంటా.. మొబైల్ చూస్తా..కానీ పూర్తి శ్రద్ధగా ఆరుం గంటలు చదువుకుంటా అని గతంలో తన స్టడీ హ్యాబిట్స్ గురించి తెలిపాడు. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి ఘనతను సాధించాలనేది కల. టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోవాలి...ఫేస్‌బుక్‌కు సమానమైనదాన్ని అభివృద్ధి చేయాలనేది అతని ఆకాంక్ష. -
పింఛను వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగువకు
ముంబై: రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం. మెర్సర్ సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ సిద్ధం చేసిన ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. ఇండెక్స్ విలువను పరిగణిస్తే మాత్రం భారత్ గత ఏడాది విలువ (44.4) కంటే ఈ ఏడాది విలువ కొంచెం పెరిగి 45.9 కి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) మెర్సర్ అధ్యయనం చేసింది. నెదర్లాండ్ 85 ఇండెక్స్ వ్యాల్యూతో అన్నింటికంటే మెరుగ్గా ఉంది. 83.5 శాతం విలువతో ఐస్‌ల్యాండ్, 81.3 శాతం విలువతో డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 42.3తో అర్జెంటీనా అన్నింటి కంటే దిగువన ఉంది. పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగులకు తగినంత ఆదాయం ఇవ్వగల సామర్థ్యం పెన్షన్ వ్యవస్థకు ఉందా? ఈ ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించగలదా? పెన్షన్ వ్యవస్థ సమగ్రతతో పనిచేస్తోందా? అన్న అంశాల ఆధారంగా మెర్సర్ ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌ను రూపొందించింది. అంటే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో రిటైర్మెంట్ తరువాత కూడా ఓ మోస్తరు జీవనశైలితో జీవితం గడిపేందుకు తగినంత పెన్షన్ లభిస్తుందన్నమాట. కాగా... ఈ ఏడాది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌లోకి బోట్స్వానా, క్రొయేషియా, కజకిస్థాన్‌లు కొత్తగా ప్రవేశించాయి. జననాల రేటు క్షీణించడం తాలూకూ ప్రభావం పలు ఆర్థిక వ్యవస్థలు, వాటి పెన్షన్ పథకాలపై పడిందని ఈ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్‌లు తమ స్కోర్‌ను పెంచకునేందుకు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది. మెర్సర్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో పెన్షన్ వ్యవస్థ గతం కంటే కొంత మెరుగైంది. తగినంత పెన్షన్, దీర్ఘకాలం ఇవ్వగలగడమన్న రెండు సూచీల్లో ఈ మెరుగుదల కనిపించింది. కానీ.. ప్రపంచ ర్యాంకింగ్‌లలో మాత్రం వెనుకబడే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా పెన్షన్ నిధికి చందాలు ఇచ్చే నిర్బంధ వ్యవస్థ లేకపోవడం భారత్ లోపాల్లో ఒకటని తెలిపింది. ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయని, రిటైర్మెంట్కు ముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే తరువాత వచ్చేది చాలా తక్కువగా ఉందని కూడా ఈ సంస్థ తెలిపింది. భారత్‌లో పెన్షన్ వ్యవస్థ తాలూకూ ఆస్తులు జీడీపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, రిటైర్మెంట్ కోసం కేటాయించే నిధులు తగినన్ని లేవనేందుకు, పొదుపు కూడా తక్కువగా ఉందనేందుకు ఇది ఒక రుజువు అని వివరించింది. -
ఆకలి సూచీలో అధోగతి!
ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ సిండీ మెకెయిన్ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్‌కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్ఐ అంటున్నది. జాబితా గమనిస్తే పాకిస్తాన్ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్‌తో ఆకలి తీవ్రత భారత్‌లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్‌తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పేరు మారి సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 అయింది. కానీ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్ స్కీమ్‌కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు. జీహెచ్ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్‌ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. జీహెచ్ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. ఒకపక్క బడ్జెట్ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి. -
వీసా లేకుండానే 57 దేశాలకు!
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. – సాక్షి, అమరావతి -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
ఏ ర్యాంక్‌కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి. -
ప్రపంచ టేస్టీ శాండ్‌విచ్‌లలో భారతీయ వంటకానికి చోటు.. ఏదో తెలుసా!
ఇరవై ఏళ్ల కిందట స్ట్రీట్ ఫుడ్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అప్పట్లో బయట తినాలంటే రెస్టారెంట్, హోటల్స్వైపే మొగ్గు చూపేవాళ్లు. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత రోజుల్లో నగరవాసులు ఉరుకుల పరుగుల మధ్య బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తాజాగా భారత స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక చిరుతిండి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా, మహారాష్ట్రలోని ప్రసిద్ధ స్నాక్స్‌లో ఒకటైన వడ పావ్ ఇప్పుడు టేస్ట్ అట్లాస్ ద్వారా ప్రపంచంలోని 13వ అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ర్యాంక్ పొందింది. ఈ ర్యాంకింగ్‌ను టేస్ట్ అట్లాస్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 వంటకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో మొదటిది టోంబిక్ అయితే, జాబితాలో చివరిది టోర్టా అహోగడాగా. ఇందులో భారతీయ స్ట్రీడ్ పుడ్ అయిన వడా పావ్ 13 స్థానంలో నిలవగా, ఈ వంటకానికి 4.4 రేటింగ్ లభించింది. ఇంతలో, భారతీయ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడ పావ్ గురించి వివరిస్తూ, టేస్ట్ అట్లాస్ తన వెబ్సైట్లో ఇలా రాసుకొచ్చింది. "ఈ ప్రసిద్ధ చిరుతిండిని 1960 నుంచి 1970 లలో దాదర్ రైలు స్టేషన్‌కు సమీపంలో పనిచేసిన స్ట్రీట్ వెండర్ (వీధి వ్యాపారి) అశోక్ వైద్య కనుగొన్నట్లు సమాచారం. అతను ఆకలితో ఉన్న సిబ్బందికి ఆహారం అందించేందుకు ఈ వంటకాన్ని కనుగొన్నాడు. ముందుగా అశోక్ తన వంటకంలో ఏం ఉండాలో నిర్ణయుంచుకుని.. అందులో తక్కువ ధర, రుచి, సులభంగా రవాణా చేయడం వంటివి పరిగణలోకి తీసుకుని ఈ వడ పావ్‌ను కనుగొన్నట్లు పేర్కొంది. చట్నీతో తింటే సూపర్ కాలక్రమేణా వడపావ్‌కు ప్రజాదరణ కూడా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వడపావ్‌కు వచ్చిన రేటింగ్‌పై చాలా మంది నెటిజన్లు సంతోషంగా లేరు. ఈ చిరుతిండిని నంబర్ వన్‌గా లిస్ట్ చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. వడ పావ్ అంటే ప్రాణం అని ఒక యూజర్ కామెంట్ చేయగా, చట్నీతో కూడిన మరొక వడ పావ్ కాంబినేషన్ టేస్ట్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్
హిడెన్ బర్గ్ నివేదికతో మూడు నుంచి ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్ -
ప్రజల భద్రతలో ఆదిలాబాద్ జిల్లా టాప్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో 5వ స్థానం దక్కింది. అలాగే రాష్ట్రంలో సురక్షిత జిల్లాగా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సర్వేలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్‌క్రైమ్, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక నేరాలు, వ్యక్తిగత భద్రత, తదితర అంశాలతో కూడిన 89 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, నాగలాండ్‌లోని మొఖోక్ జిల్లా 89.89 శాతం మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 85 మార్కులతో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పరంగా తెలంగాణకు 42 మార్కులు లభించాయి. రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా 81 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు మంచి ర్యాంకు దక్కడంపై జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్‌లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్‌తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్‌ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
Sakshi Cartoon: మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!!
మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!! -
అవినీతి సూచీలో మరింత దిగజారిన పాక్, భారత్ స్థానం ఏంటంటే..
ఇస్లామాబాద్: ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్ మరింత దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాలతో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 సీపీఐ (కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్ 140వ స్థానంలో నిలిచింది. భారత్ 40సీపీఐతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్ 147వ స్థానంలో నిలిచాయి. పాక్‌లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషిం చింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి. భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది. -
పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
న్యూఢిల్లీ: 2021లో నీట్లో ఉత్తీర్ణత సాధించిన చాలా మంది విద్యార్థులలో మోలార్‌బండ్‌లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక కూడా ఒకటి. కాకపోతే తను ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగానే పేపర్ అయ్యి మెరిట్ ర్యాంకును సాధించింది. రితిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్పూర్లో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పని చేస్తూ వారు జీవనాన్ని సాగించేవాళ్ళు. కోవిడ్ లాక్డౌన్ మూలాన రితిక తండ్రి ఉపాధిని కోల్పోయాడు.దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రితిక ఇంట్లో మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కూడా లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్, పుస్తకాలు అవసరమైన తరుణంలో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ పరిస్థితుల్లో తన పెళ్లి కోసం ఇంట్లో దాచిన నగలు అమ్మి అవి కొన్నట్లు చెప్పింది. చివరకు అన్ని కష్టాలను దాటుకొని ఆమె 500 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్‌ను సాధించింది. నీట్లో మంచి స్కోర్ (93%) సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. తను ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగా యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల నుంచి సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సహాయం చేసినట్లు చెప్పింది రితిక. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి మొత్తం 436 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణత సాధించారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది
-
హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత
సాక్షి, హైదరాబాద్: ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ ఐఎస్బీ కావడం గమనార్హం. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. ఈ ర్యాంకుల కోసం 2017కు చెందిన పీజీపీ విద్యార్థులను సర్వే చేశారు. ర్యాంకింగ్స్ కోసం ది ఫైనాన్షియల్ టైమ్స్ పరిగణనలోకి తీసుకున్న అనేక రంగాల్లో ఈ విద్యాసంస్థ మెరుగైన ప్రతిభ కనబర్చింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. సమష్టి కృషితోనే సాధ్యమైంది.. అత్యుత్తమ ప్రపంచస్థాయి విద్యను అందించడంలో ఐఎస్బీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పర్చుకుంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, బోర్డు మద్దతు, సమష్టి కృషికి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ నిదర్శనం. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యకు దేశంలోనే కలికితురాయిగా ఐఎస్బీ నిలిచింది. – ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్బీ డీన్ చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా.. -
‘ఇన్నోవేషన్’లో భారత్‌కు 52వ ర్యాంకు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) –2019లో భారత్ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్ రేట్స్ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్యా వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు స్థానం సంపాదించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ సమాచారాన్ని బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ తొలుత 25వ స్థానానికి ఆ తరువాత 10వ స్థానానికి చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో భారత్ టాప్‌లో ఉన్నట్లు తెలిపారు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల, సాంకేతిక ఉత్పాదన వృద్ధి, మేధో సంపత్తి సంబంధిత అంశాల మెరుగుదలతో పాటు సంస్థలు, మానవ మూలధనం, పరిశోధన పెరిగిన నేపథ్యంలో దేశ ర్యాంక్ మెరుగుపడింది. -
6లో హంపి... 11లో హారిక
హెంగ్షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్‌లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్‌లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్విలి (జార్జియా)పై గెలిచింది. జన్సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్‌ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్‌ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్‌లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్‌ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించారు. -
కుమారుడి దైన్యం..తండ్రి విజయం
అతడి సంకల్పబలం ముందు పేదరికం ఓడిపోయింది. మనోధైర్యమే ముందుకు నడిపింది. దివ్యాంగుడైన కొడుకుకు వైద్యం చేయించడమే లక్ష్యమైంది. లక్ష్యసాధనకు స్నేహితుడి సహకార హస్తం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. చదువే ఊపిరైంది. 16 గంటలసేపు పుస్తకాలతో గడిపేలా చేసింది. విజయలక్ష్మి తలుపుతట్టింది. డీఎస్పీ పదవిలో అలంకరించింది. ఏపీపీఎస్పీ గ్రూప్–1 –2016 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించిన జగ్గయ్యపేట బూదవాడకు చెందిన బూడిద సునీల్ విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం. జగ్గయ్యపేట: గ్రూప్స్–1లో ఎంపికైన సునీల్ విజయ యాత్రపై ఆయన మాటల్లోనే.. నాది జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం. నిరుపేద కుటుంబం లో పుట్టాను. నాన్న 11 ఏళ్ల క్రితం చనిపోవడంతో మా అమ్మ కూలీనాలీ చేస్తూ చదివించింది. ఒకటి నుంచి ఐదు వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్ జగ్గయ్యపేటలోని జేఆర్సీ కళాశాల, డిగ్రీ కూడా జగ్గయ్యపేట విశ్వభారతి కళాశాలలో బీఎస్సీ, బీజడ్సీలో 80 శాతం మార్కులు సాధించాను. కొడుకు పుట్టుకతోనే.... కొడుకు పుట్టుకే గ్రూప్స్‌కు సిద్ధం చేసింది. డిగ్రీ పూర్తవగానే ఐదేళ్ల పాటు గ్రామంలోని జేపీ సిమెంట్స్ కర్మాగారంలో ప్రైవేట్ ఉద్యోగం చేశాను. 2012లో శ్యామలతో వివాహమైంది. ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే చెవుడు, కళ్లు కనిపించని లోపంతో పుట్టాడు. కుమారుడికి మెరుగైన వైద్యం చేయించాలని నిశ్చయించుకున్నాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి గ్రూప్–1కు ప్రిపేరవుతానని సహకరించాలని కోరాను. వారు కూడా అంగీకరించడంతో పాటు తన ఇంటర్ స్నేహితుడు లాహోరు నరసింహారావు ఆర్థికంగా సహకరించడంతో ముందడుగు వేశాను. రెండేళ్లుగా హైదరాబాద్‌లో.. 2016లో గ్రూప్స్ పరీక్షలు రాసేందుకు గ్రామం విడిచి హైదరాబాద్‌కు వెళ్లిపోయాను. రెండేళ్లపాటు పిల్లలకు, భార్యకు దూరంగా ఉండి పట్టుదలతో గ్రూప్– 1కు సిద్ధమయ్యాను. రాత్రింబవళ్లు చదివా. నా కుమారుడి లోపమే కళ్లముందు కదలాడింది. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కదిలాను. నిత్యం పత్రికలు, రాజ్యసభ టీవీ కార్యక్రమాల వీక్షణతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలను రోజుకు 16 గంటలు చదివేవాడిని. 2016 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2017లో ప్రిలిమ్స్‌కు, ఆగస్టులో మెయిన్స్‌కు అర్హత సాధించడంతో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యాను. మౌఖిక పరీక్ష ఇలా.. ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలతో పాటు జిల్లా, జాతీయ, అంతర్జాతీయ కరంట్ అఫైర్స్‌పై అనేక ప్రశ్నలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వంటి అంశాలు కూడా స్పృశించారు. స్థానిక అంశాలపై కూడా ప్రశ్నలు అడిగారు. వ్యక్తిగత శ్రద్ధే విజయానికి సోపానం కోచింగ్ కేంద్రాల్లో నేర్పించే అంశాలు 15 నుంచి 20 శాతం మేర మాత్రమే ఉపయోగపడతాయి. 80 శాతం వ్యక్తిగతంగా చదువుకుంటే ఎంచుకొన్న లక్ష్యాన్ని అదిగమించవచ్చు. యువత కూడా ప్రస్తుతం చదువులో ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఆ ముగ్గురు.. నా విజయ యాత్రలో ముగ్గురున్నారు. పుట్టుక లోపం కలిగిన నా కుమారుడు, వాడిని రెండేళ్లు నేను లేని లోటు లేకుండా చూసుకున్న నా భార్య శ్యామల ఆమె కుటుంబ సభ్యులు, మూడో వ్యక్తి నా స్నేహితుడు నరసింహారావు. సునీల్ ఆదర్శం సునీల్ ఇంటర్లో పరిచయమయ్యాడు. నాకు డిగ్రీ పూర్తవగానే ఎస్బీఐలో ఉద్యోగం వచ్చింది. సునీల్ గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాడని తెలిసి ఆర్థికంగా సహాయపడ్డాను. అతడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.– లాహోరి నరసింహారావు, సునీల్ స్నేహితుడు -
టెట్‌లో జిల్లా సూపర్‌హిట్
శృంగవరపుకోట రూరల్ : ధర్మవరం మేజరు పంచాయతీకి చెందిన వేమన కుసుమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 150/139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జిటి) టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. డైట్ పోటీ పరీక్షల్లో కూడా ఈమె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురంలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా శిక్షణ పొందింది. తండ్రి అప్పలరాజు ధర్మవరంలో టైలర్‌గా పనిచేస్తుండగా తల్లి సన్నమ్మడు గృహిణి. ఈ సందర్భంగా అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని,, రెండో కుమార్తె కుసుమ చిన్నప్పటి నుంచి చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షకు అర్హత కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)లో జిల్లా అభ్యర్థులు భారీ సంఖ్యలో అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు 80 శాతం అర్హత సాధించి ఉంటారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు అధికసంఖ్యలో అర్హత సాధించారు. తాజాగా అందిన సమాచారం మేరకు పేపర్–1 కి సంబంధించి అధిక మార్కులు సాధించిన వారి వివరాలివి. వినెక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అల్లాడ లావణ్య (137), రొబ్బి జ్యోతి (132), మెయిద కృష్ణవేణి (130), బాలి కుమారి (130) ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ విద్యార్థులు అయ్యప్ప (135), హేమ (133), పిళ్లా జగదీశ్వరి (133), బి.బిందుకుమారి (131), ఎస్.విజయ (131), టి.రోజారమణి (130) ఉన్నారని శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ శ్రీనివాసరావు తెలిపారు. అధిక మార్కులు సాధించిన అభ్యర్ధుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. శ్రీసాహితీ కోచింగ్ సెంటర్, తెలుగు స్టడీ సర్కిల్లకు చెందిన అభ్యర్థుల్లో వాడపల్లి నాగమణి (132), శెట్టి తేజస్వరి (129), లోపింటి రవికుమార్ (129), జి.చిరంజీవి (119) ఉన్నారని ఆ కోచింగ్ సెంటర్ రైరెక్టర్లు రెడ్డిపల్లి రమేష్‌కుమార్, సారిపల్లి గౌరీశంకర్ తెలిపారు. పరీక్షకు హాజరయిన 1200 మందిలో శతశాతం అర్హులయ్యారని తెలిపారు. -
ట్రంప్ అల్లుడు కుష్నర్ హోదా కుదింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ హోదాను శ్వేతసౌధం తగ్గించింది. ప్రస్తుతం టాప్ సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో ఉన్న కుష్నర్ పేరును తొలగించి సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం అధ్యక్ష భవనం అధికారులకు ప్రతిరోజూ అందే అత్యంత రహస్య నివేదికలు ఇకపై ఆయనకు అందుబాటులో ఉండవు. ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు కూడా అయిన కుష్నర్.. పశ్చిమాసియా శాంతి చర్చలు, మెక్సికోతో సంబంధాలను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని విదేశీ ప్రభుత్వాలు కుష్నర్, అతని కుటుంబంతో ఆర్ధిక, వ్యాపార సంబంధాలను ప్రభావితం చేసి శ్వేతసౌధం రహస్యాలను చేజిక్కించుకునే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థలు భయపడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. -
ర్యాంకుల గుట్టు
-
మెరుగైన ర్యాంకు సాధ్యమేనా?
వినాయక్‌నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రారంభంకాని అద్దెవాహనాలు చెత్త సేకరణ కోసం కార్పొరేషన్‌కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు. కేంద్రబృందం సభ్యుడి పర్యటన స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
పోటీతత్వంలో భారత్ వెనకడుగు!
ఐఎండీ జాబితాలో 45వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జాబితాను విడుదల చేసింది. పొరుగున ఉన్న చైనా మాత్రం ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో చైనా అంకిత భావాన్ని ఇది తెలియజేస్తోందని ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్నెస్ సెంటర్ డైరెక్టర్ ఆర్టురోబ్రిస్ పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్ ఎప్పటి మాదిరిగానే మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.