
టాటా బ్రాండ్.. ర్యాంక్ తగ్గింది
ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్‌నకు మరో షాక్ తగిలింది.
• దేశంలో టాప్ బ్రాండ్ ఎల్‌జీ; టాటాకు 7వ స్థానం
• తొలి ఐదు స్థానాలూ విదేశీ కంపెనీలవే
• ఎఫ్‌ఎంసీజీలో మాత్రం పతంజలి హవా
న్యూఢిల్లీ: ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్‌నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్‌లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్‌జీ టాప్‌లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోరుుంది. టాటా బ్రాండ్‌కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలకా్ర్టనిక్స్ సంస్థ ‘ఎల్‌జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచారుు. కాగా టాప్-5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతుండటం గమనార్హం.
దేశీ దిగ్గజాలైన బజాజ్, టాటా, మారుతీ బ్రాండ్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారుు. ఎరుుర్‌టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో నిలిచారుు. ఇక ఎఫ్‌ఎంసీజీ విభాగంలోని టాప్ బ్రాండ్లను చూస్తే.. పతజలి టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో హెచ్‌యూఎల్, నిర్మా, ఇమామి, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉన్నారుు.