
సౌదీ అరేబియా గిగా ప్రాజెక్ట్
63 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
టాటా, ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ/దావోస్: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్‌లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్‌జెరిల్లో పేర్కొన్నారు.
సిటీ ఆఫ్ ఎర్త్‌గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్‌సహా గోల్ఫ్ కోర్స్, కేఫ్‌లు, యూనివర్శిటీలు, కల్చరల్ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment