LG
-
కొత్త బిజినెస్‌లోకి దిగిన ఎల్జీ.. విద్యార్థులే టార్గెట్!
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఎల్జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్‌ను కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్‌తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు. -
నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్ లాంచ్ చేసిన ఎల్జీ
పచ్చబొట్లకు ఫ్యాషన్ ప్రపంచంలో విపరీతమైన గిరాకీ ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా టాటూ స్టూడియోలు కళకళలాడుతుంటాయి. అయితే, టాటూ వేయించుకోవాలంటే ఖర్చును, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కోరుకున్న డిజైన్లలో పచ్చబొట్టు వేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. కోరుకున్న డిజైన్లలోని పచ్చబొట్లను చిటికెలో ముద్రించే ఈ టాటూ ప్రింటర్‌ను కొరియన్ బహుళజాతి సంస్థ ఎల్జీ ఇటీవల రూపొందించింది. చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉన్న ఈ టాటూ ప్రింటర్ శరీరంపైనే కాకుండా, దుస్తులపై కూడా కోరుకున్న డిజైన్లను క్షణాల్లోనే ముద్రిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టాటూ ప్రింటర్‌ను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. యాప్ ద్వారా డిజైన్లను ఎంపిక చేసుకుని, టాటూను ముద్రించదలచుకున్న చోట దీన్ని ఉంచి, ఆన్ చేసుకోవడమే తరువాయిగా రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్లలో టాటూలను ముద్రించుకోవచ్చు. ‘ఎల్జీ హెచ్ అండ్ హెచ్ ఇంప్రింటు’ పేరుతో రూపొందించిన ఈ టాటూ ప్రింటర్‌ను ఎల్జీ కంపెనీ ఈ ఏడాది లాస్ వేగస్‌లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ప్రదర్శించనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్‌లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు. డిస్ప్లే సమస్యలే కారణమా? ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఫోన్ల డిస్ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లిమిటెడ్ ఫోన్లకే డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ఫోన్ల డిస్ప్లే బెజెల్స్ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్ల డిస్ప్లేలను ఎల్జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
కొత్త టెక్నాలజీతో ఎల్జీ ఫ్రిజ్.. ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ మేకిన్ ఇండియా నినాదంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పుణెలో సైడ్ బై సైడ్ (ఎస్ బీ ఎస్) ఫ్రిజ్ ల తయారీ కోసం కొత్త యూనిట్ ప్రారంభించింది. రూ. 200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ భారత విభాగం ఎండీ హోంగ్ జు జియోన్ తెలిపారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 2 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. తాజాగా దేశీయంగానే వీటిని తయారు చేయడం వల్ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. గతేడాదే దేశీయంగా విండో ఏసీల తయారీని ప్రారంభించినట్లు జియోన్ చెప్పారు. భారత్ లో ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల విభాగంలో తమకు 50 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఫ్రిజ్ ల విభాగంలో తమకు 34 శాతం, వాషింగ్ మెషీన్ల విభాగంలో 37 శాతం వాటా ఉండగా అన్ని విభాగాల్లోనూ మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జియోన్ చెప్పారు. ఎల్జీకి దేశీయంగా పుణె, గ్రేటర్ నోయిడాల్లో ప్లాంట్లు ఉన్నాయి. పుణె ప్లాంటుపై 2004 నుంచి గతేడాది వరకూ రూ. 1,619 కోట్లు, నోయిడా ప్లాంటుపై 1997 నుంచి గతేడాది వరకు రూ. 1,778 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. కొత్త ఫ్రిజ్‌ల శ్రేణి.. 2023కి సంబంధించి ఎల్జీ కొత్త ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల శ్రేణిని ఆవిష్కరించింది. ఎల్జీ థింక్యూ టెక్నాలజీతో వీటిలో టెంపరేచర్ సెట్టింగ్ వంటి ఫీచర్లను ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ లలో 15 మోడల్స్ ఉండగా ధరలు రూ. 1,20,699 నుంచి రూ. 2,29,099గా ఉంటాయని వివరించింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో గేమింగ్‌కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
ఎగబడి కొంటున్న జనం.. మూడు సార్లు ధరలు పెంచినా, రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
వరల్డ్‌లో తొలి, ఏకైక అద్భుత టీవీ: మరి ధర సంగతేంటి?
హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్జీ ప్రకటించింది. కస్టమర్లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్‌లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రోలబుల్ టీవీ ప్రత్యేకత అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
దేశీయ మార్కెట్లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!
సౌత్ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్లెట్లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముంబై క్రోమా స్టోర్‌లో ఎల్జీ సంస్థ ఎల్ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హ్యాక్ హ్యయిన్ కిమ్ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. టీవీ స్పెసిఫికేషన్లు టీవీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫ్ లైట్నింగ్ ఫిక్సెల్ టెక్నాలజీ, ఎల్జీ ఏ9 జనరేషన్ ఏఐ ప్రాసెసర్, డొల్బే అట్మాస్ స్పాటల్ సౌండ్ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. -
మార్కెట్లోకి ఎల్జీ కొత్త ఉత్పత్తుల శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఇండియా తాజాగా 2022కి సంబంధించి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు మొదలైన వాటికి సంబంధించి 270 పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ గృహోపకరణాలు వీటిలో ఉన్నాయి. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్లు, ఇన్‌స్టావ్యూ ఫ్రిజ్‌లు, ప్యూరికేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫయర్, విరాట్ ఏసీలు మొదలైనవి వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ (హోమ్ అప్లయెన్స్, ఎయిర్ కండీషనర్స్) హ్యూంగ్ సుబ్జీ తెలిపారు. ఈ ఏడాది 2022లో 30 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. పటిష్ట డిమాండ్, కొత్త ప్రొడక్టుల విడుదల నేపథ్యంలో హోమ్ అప్లయెన్సెస్, ఏసీ బిజినెస్ వేగవంత పురోగతిని సాధించే వీలున్నట్లు పేర్కొంది. గతేడాది (2021) ఈ విభాగాలలో 20% వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. దేశీయంగా అమ్మకాలలో 70% వాటా ఈ విభాగానిదేనని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ పేర్కొన్నారు. 2021లో ఈ విభాగం అమ్మకాలు రూ. 15,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఓఎస్ ఫోన్లలో ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది. అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్ 1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: ఆపిల్: iPhone 6, iPhone 6s plus, iPhone SE ఎల్ జి: Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q. హువావే: Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2. శామ్ సంగ్: Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2. జడ్ టీఈ: Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo. సోనీ: Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S. Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి -
శాంసంగ్‌కు చెక్‌పెట్టేందుకు పెద్దప్లానే వేసిన ఎల్జీ...!
ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్ కంపెనీల రాకతో మార్కెట్లలో ఎల్జీ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోలేకపోయింది. పలు మొబైల్ కంపెనీల దెబ్బకు ఎల్జీ స్మార్ట్ఫోన్ల బిజినెస్‌ను వీడింది. స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులను నిలిపివేసిన స్మార్ట్ఫోన్లకు ఉపయోగపడే టెక్నాలజీని మాత్రం ఎల్జీ వీడలేదు. తాజాగా శాంసంగ్ మొబైల్స్‌కు చెక్ పెట్టేందుకు ఎల్జీ సరికొత్త ప్లాన్‌తో ముందుకురానుంది. ఎల్జీ కంపెనీలలో ఒకటైన ఎల్జీ కెమ్ (LG Chem) భవిష్యత్తులో వాడే స్మార్ట్ఫోన్లకు కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్‌తో ముందుకు వచ్చింది. ఈ కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్ అధిక ధర గల శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీని ప్రభావితం చేసే అనేక సమస్యలను పరిష్కరిస్తోందని ఎల్జీ భావిస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! మన్నిక ఎక్కువ..! ప్లాస్టిక్ లాగా... ఎల్జీ కెమ్ తయారు చేసిన ఫోల్డబుల్ స్క్రీన్ అత్యంత శక్తివంతంగా, మన్నికగా, గాజు తరహాలో అనుభూతిని కలిగించే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ మెటిరియల్ ప్లాస్టిక్ గుణాన్ని పోలీ ఉండనుంది. ఈ స్క్రీన్‌ను రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌గా ఎల్జీ పిలుస్తోంది. స్క్రీన్ మెటీరియల్‌ని టెంపర్డ్ గ్లాస్‌తో ఎల్జీ పోల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్జీ తన కంపెనీ నుంచి రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనే ప్రణాళికలను నిలిపివేసింది.ఎల్జీ స్మార్ట్ఫోన్ల తయారీ నుంచి వైదొలిగినా.. గూగుల్, ఆపిల్, షావోమీ, వన్‌ప్లస్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ దారులకు తన స్క్రీన్లను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఎల్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గే అవకాశం..! శాంసంగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయగా , ఆ స్మార్ట్ఫోన్ల ధర గణనీయంగా ఉన్నాయి. ఎల్జీ కెమ్ తయారుచేసిన స్క్రీన్‌తో ఫోల్డబుల్ ఫోన్ల ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందనీ ఎల్జీ తెలిపింది. ఎల్జి కెమ్ స్క్రీన్ మెటీరియల్ తక్కువ మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మన్నిక విషయానికి వస్తే ఈ స్క్రీన్‌ను సుమారు 2 లక్షల సార్లు మడత పెట్టవచ్చునని ఎల్జీ పేర్కొంది. ఎల్జీ కెమ్ వచ్చే ఏడాది నుంచి రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌ను భారీ సంఖ్యలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
జనాలు ఈ 'టీవీ' బ్రాండ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ నిలిచింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీ అవార్డు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. -
అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా
కరోనా కారణంగా ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్‌లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్‌ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే 8గంటల పాటు పనిచేస్తుంది. పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్‌లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్‌లో దీని ధర రూ.32.200గా ఉంది. -
ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్‌పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్‌తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్‌పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి. 2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్‌కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్‌రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ
ఎల్జీ మనదేశంలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించారు. గేమింగ్ కోసం ఆటో లో-లాటెన్సీ మోడ్‌తో తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడీ 48సీఎక్స్ టీవీ ధర రూ.1,99,990గా ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీలో వేగవంతమైన గేమ్ ప్లేతో పాటు అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలో ఏఎమ్ డీ ఫ్రీసింక్, ఎన్విడియా జి-సింక్ సపోర్ట్ ఉంది. ఈ 48 అంగుళాల టీవీ ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆడియో కోసం ఎఐ ఎకౌస్టిక్ ట్యూనింగ్‌తో పాటు 'హెచ్‌డిఆర్ 10 ప్రో' సపోర్ట్‌ను అందిస్తుంది. ఎల్జీ పేర్కొన్నట్లు 4కే రిజల్యూషన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇందులో 48 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో ఎక్కువ ఫ్రేం రేట్, వీఆర్ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ఈఆర్క్, హెచ్డీఎంఐ 2.1 స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీఆర్ఆర్ ఫీచర్ ద్వారా మీరు కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్కు తగినట్లు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఇందులో సెల్ప్ లిట్ పిక్సెల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మంచి కలర్‌ను టీవీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఎల్జీ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లి తమ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
షియోమీ మరో సంచలనం
గత కొన్ని నెలలుగా మొబైల్ పరిశ్రమలో పెద్ద పెద్ద కంపెనీలు రోలబుల్ ఫోన్ తీసుకోని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో షియోమీ కూడా చేరబోతోంది. త్వరలో షియోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ లవర్స్ కి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నపటికీ, దీనిని భారీ ఎత్తున తీసుకురావడానికి షియోమీ ప్రయత్నిస్తుంది. సాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది సాంసంగ్. ఎల్జీ ఇదివరకే డ్యూయెల్ డిస్‌ప్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. త్వరలో మరో మోడల్ ని కూడా తీసుకురాబోతుంది. (చదవండి: డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) టిసిఎల్ మరియు ఒప్పో తీసుకొస్తున్ రోలబుల్ డిస్ప్లే ఫోన్ల మాదిరిగానే షియోమి ఫోన్ కూడా అలాంటి డిజైన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. షియోమీ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ మరియు ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో రోలబుల్ ఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పేటెంట్ లో చూపినట్లుగా దీనిని రోల్ చేస్తే స్మార్ట్‌ఫోన్ లాగా కనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అకా కాన్సెప్ట్ క్రియేటర్ షియోమీ రోలబుల్ పేటెంట్ల ఇమేజెస్ సహాయంతో షావోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్ రెండర్ క్రియేట్ చేశాడు. ఇది చూడటానికి మి మిక్స్ ఆల్ఫా కాన్సెప్ట్ లాగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ డిజైన్ కేవలం స్కెచ్ మాత్రమే. డివైజ్ తయారైన తర్వాత దీనికి భిన్నంగా కూడా ఉండొచ్చు. ఈ మొబైల్ వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో రావచ్చు. -
సరికొత్త డిజైన్‌తో ఎల్జీ 'వెల్వెట్' లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ, సౌత్‌కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ కొత్త స్మార్ట్ ఫోను లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. ధర లభ్యత ఎల్జీ వెల్వెట్ ప్రారంభం ధర 36,990 రూపాయలు. అయితే డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీ మోడల్ ధర 49,990 రూపాయలు. ఇది అక్టోబర్ 30 నుండి అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లలో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ అరోరా సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్జీ వెల్వెట్ ఫీచర్లు 6.8 అంగుళాల స్క్రీన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 విత్ ఎల్జీ యుఎక్స్ 9 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 2 టీబీదాకా విస్తరించుకునే అవకాశం 48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎల్జీ బాలకృష్ణన్- ఇప్కా ల్యాబ్స్ జూమ్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్జీ బాలకృష్ణన్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్జీ బాలకృష్ణన్ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ బాలకృష్ణన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఇప్కా ల్యాబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఇప్కా ల్యాబ్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్ బిజినెస్‌లో గ్లోబల్ ఫండ్ నుంచి మద్దతు లభించడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్ నివేదికలో రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఎల్జీ అద్భుత ఆవిష్కారం: త్వరలో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్జీ తన ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది. ఎల్జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్‌సెట్‌ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్జి మొబైల్ గ్లోబల్ ఫేస్బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి. ఎల్జీ వింగ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ ప్లే 1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్ స్నాప్‌డ్రాగన్ 765 జి సాక్ 8జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ధర సుమారు రూ. 73,000