ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీలు ఇక భారత్‌లో తయారీ | LG Ultra HD TV are manufacturing in India | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీలు ఇక భారత్‌లో తయారీ

Published Fri, Jun 20 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీలు ఇక భారత్‌లో తయారీ

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీలు ఇక భారత్‌లో తయారీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ నూతన శ్రేణి అల్ట్రా హెచ్‌డీ టీవీలను భారత్‌లోనే తయారు చేయనుంది. ఖరీదైన ఈ మోడళ్లను ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న ప్లాంట్ల నుంచి కంపెనీ తెప్పిస్తోంది. ఇక్కడి వ్యాపారావకాశాలను దృష్టిలో పెట్టుకుని పునే సమీపంలోని ప్లాంటులో వీటి తయారీని చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెటింగ్ హెడ్ రిషి టాండన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన గ్యాడ్జెట్ ఎక్స్‌పోలో అల్ట్రా హెచ్‌డీ విభాగంలో కొత్త మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. 49 అంగుళాల ఈ మోడల్ ధర రూ.1.55 లక్షలు. దీనితోపాటు వెబ్ ఓఎస్ ఆధారిత మోడళ్లను కూడా కంపెనీ విడుదల చేసింది.
 
2014లో 50 వేల యూనిట్లు..
ఈ ఏడాది భారత్‌లో అల్ట్రా హెచ్‌డీ టీవీలు 50,000 యూనిట్లు విక్రయమవుతాయని అంచనా. 40 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు రిషి టాండన్ తెలిపారు. 55 అంగుళాలుపైగా సైజున్న టీవీలను కొనేవారు వీటిపట్ల మొగ్గు చూపుతున్నారని చెప్పారు. 40 అంగుళాల సైజులో అల్ట్రా హెచ్‌డీ మోడల్‌ను పరిచయం చేస్తామన్నారు. మొత్తంగా ఈ ఏడాది అన్ని విభాగాల్లో కలిపి 50 దాకా మోడళ్లు రానున్నాయని చెప్పారు. ఫ్లాట్ ప్యానెల్ టీవీల మార్కెట్ పరిమాణం దేశంలో 85 లక్షలుంది. ఇందులో ఎల్సీడీల వాటా 5 లక్షలు. క్రమంగా ఎల్సీడీల విభాగం తన ప్రస్థానాన్ని కోల్పోతోందని చెప్పారు. సాధారణ టీవీలతో పోలిస్తే అల్ట్రా హెచ్‌డీ టీవీల పిక్చర్ నాణ్యత నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎల్‌జీతోపాటు సోని, శాంసంగ్ కూడా వీటిని తయారు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement