మార్కెట్‌లోకి ఎల్‌జీ బండ ఫోన్‌ | LG X4+ launched in korea | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ఎల్‌జీ బండ ఫోన్‌

Published Fri, Jan 19 2018 7:33 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

LG X4+ launched in korea - Sakshi

మామూలు ఫోన్లు కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే కిందపడినా పగలకుండా ఉండేలా రూపొందించిన ఓ బండలాంటి ఫోన్‌ను ఎక్స్‌4+ పేరిట ఎల్‌జీ దక్షిణ కొరియాలో విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్‌ ఎమ్‌ఐఎల్‌- ఎస్‌టీడీ 810జీ పరీక్షల్లో ఎల్‌జీ ఎక్స్‌4+ నెగ్గిందని కంపెనీ ప్రకటించింది. ధృఢత్వంతో పాటూ మరిన్ని ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయని ఎల్‌జీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మిలటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీతోపాటూ ఖరీదైన ఫోన్ల కంటే అద్భుతమైన ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయని, చక్కటి ఆడియో కోసం హైఫై డాక్‌, ఎల్‌.జీ పే వంటి సౌకర్యాన్ని తక్కువ ధరతోనే ఈ ఫోన్‌లో అందుబాటులోకి తెస్తోందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ తో సెల్ఫీలు, స్క్రీన్‌ శాట్స్‌ తీసుకునే సౌకర్యం ఉందని పేర్కొంది.

మరిన్ని ఫీచర్స్‌:
*5.3 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్ ప్లే
* 2 జీబీ ర్యామ్,
* 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (2 టెరా బైట్‌ వరకూ అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం)
* బ్యాక్ 13 ఎంపీ, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాలు
* 3,000ఎంఏహెచ్ బ్యాటరీ
* ప్రాసెసర్‌ : క్వాల్‌కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 425
దీని ధర దాదాపు రూ 18,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement