న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్‌జీ.. ‘డబ్ల్యూ’ సిరీస్ పేరుతో అధునాతన స్మార్ట్‌ఫోన్లను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డబ్ల్యూ10, డబ్ల్యూ30, డబ్ల్యూ30 ప్రో పేరిట మూడు వేరియంట్లను ఆవిష్కరించింది. జూలై 3న అమెజాన్ డాట్ ఇన్‌లో ఫ్లాష్ సేల్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు ప్రకటించింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ కలిగిన డబ్ల్యూ10 ధర రూ.8,999 కాగా.. 6.19 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (పీడీఏఎఫ్ లెన్స్), 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఫిక్స్‌డ్ ఫోకస్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఇక 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ కలిగిన ‘డబ్ల్యూ30’ ధర రూ.9,999 కాగా.. ఇందులో 6.26 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. మరో ఫోన్ ‘డబ్ల్యూ30 ప్రో’ వేరియంట్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఉండగా.. దీని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ఈ మూడు వేరియంట్లలోనూ 4,000 ఎంఏహెచ్ లి–పాలిమర్ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 9 ఆధారంగా ఇవి పనిచేస్తాయి.
10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యం..
డబ్ల్యూ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్ల సంఖ్యను త్వరలోనే ఐదుకు చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ చివరినాటికి 10 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్) అద్వైత్ వైద్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment