పానిక్ బటన్‌తో ఎల్‌జీ స్మార్ట్ ఫోన్
ధర రూ.13,990
న్యూఢిల్లీ: ఎల్‌జీ కంపెనీ పానిక్ బటన్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ కే10 2017ను తో మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.13,990 ఎల్‌జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఈ పానిక్ బటన్‌ను నొక్కితే ఎమర్జెన్సీ నంబర్ 112కు కాల్ వెళుతుందని వివరించారు. 5.3 అంగుళాల డిస్‌ప్లే, 1.5 గిగా హెట్జ్ ఆక్టా–కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, వెనక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. పానిక్ బటన్‌తో అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ బాగా ఉండగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మహిళల కోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించడం లేదని, విద్యార్ధులకు, ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని వివరించారు. రిటైల్ అవుట్‌లెట్స్ విస్తరణపై దృష్టి పెట్టామని, ఈ ఏడాది చివరికల్లా తమ మొబైల్ ఫోన్లు 8,000–10,000 రిటైల్ పాయింట్లలో లభ్యమవుతాయని వివరించారు. కాగా ఈ ఫోన్ ఆవిష్కరణ సభలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మొబైల్ పరిశ్రమలోనే మొదటగా ఎల్‌జీ కంపెనీ పానిక్ బటన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
పానిక్ బటన్ తప్పనిసరి...
భారత్‌లో అమ్ముడయ్యే అన్ని మొబైల్ ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనికి గడువు తేదీని ఈ నెల 28న ప్రభుత్వం నిర్దేశించింది. నిర్భయపై అత్యాచారం నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్‌ను జత చేయాలనే సూచన వ్యక్తమైంది.