అమెరికాలోకి ఎల్జీ ఎంట్రీ లెవల్ ఫోన్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల తయారీదారి ఎల్జీ, కొత్త ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను అమెరికాలో ఆవిష్కరించింది. ఎల్ జీ కే3 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర 80 డాలర్లు(రూ.5,500). బూస్ట్ మొబైల్, వర్జిన్ మొబైల్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.
ఎల్జీ కే3 ఫీచర్లు...
ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో
4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే
స్నాప్ డ్రాగన్ 210 ఎస్ఓసీ
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
32 జీబీ విస్తరణ మెమెరీ
5 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
0.3 మెగా పిక్సెల్ ముందు కెమెరా
1940 ఎంఏహెచ్ బ్యాటరీ
బ్లూటూత్, జీపీఎస్, వైఫై, 3జీ, 4జీ, మైక్రో యూఎస్ బీ
ఇటీవలే ఎల్ జీ తన ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, ఎక్స్ పవర్, ఎక్స్ స్టైల్, ఎక్స్ మ్యాక్స్, ఎక్స్ మ్యాక్ లను ఆవిష్కరించింది. వచ్చే నెల నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే వీటి ధరలను ఎల్జీ వెల్లడించలేదు.