సాక్షి, న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఎల్‌జీ కే7ఐ పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ దక్షిణ కొరియా కంపెనీ కే సీరీస్‌లో ఈ స్పెషల్ మొబైల్ ను లాంచ్ చేసింది. దోమల్ని తరమేసే స్మార్ట్‌ఫోన్ (మస్కిటో అవే)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఎల్‌జీ ప్రటించింది. బడ్జెట్ ధరలో ఈ ఆండ్రాయిడ్ డివైస్‌ను లాంచ్ చేసింది. వెనక భాగంలో స్పీకర్‌కు కున్న ఒక ప్రత్యేకమైన కవర్ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా దోమలను దూరంగా తరిమేస్తుంది. 30కెహెచ్‌జెడ్ ధ్వనులను ఈ డివైస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దోమలకుమాత్రమే హానికరమని ఎల్‌జీ చెప్పింది. దీని వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చింది.
యూనిక్ ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలో ఎల్‌జీ ఎపుడూ ముందువరసలో ఉటుందని ఎల్‌జీ ప్రధాన మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. అలాగే ఎలాంటి హానికారక కెమికల్స్‌ను ఇదులో వాడలేదని భరోసా ఇచ్చారు. దీని రూ. 7,990 గా నిర్ణయించింది. ఈ ఎల్‌జీ కే7ఐ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఎల్‌జీ కే7ఐ ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
ప్రస్తుతం బ్రౌన్ కలర్ ఆప్షన్ లో ఫ్‌లైన్ అవుట్లెట్ల ద్వారా లభిస్తుంది.