Mosquito
-
ఐదు దోమలకు రూపాయిన్నర
మనీలా: డెంగీ వ్యాధి పేరు చెబితే ఎవరైనా హడలిపోవాల్సిందే. ప్రజాసంక్షేమానికి, తమ పౌరుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైతం డెంగీ పేరు చెబితే వణికిపోతోంది. విజృంభిస్తున్న డెంగీ కేసులు, దోమలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది మాత్రమే రంగంలోకి దిగితే సరిపోదని స్థానిక పాలకులు భావించారు. పౌరులను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా దోమలను చంపితే నజరానా ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఐదు దోమలకు ఒక ఫిలిప్పీన్స్ పేసో( 1 పేసో అంటే భారతీయ కరెన్సీలో రూ.1.50) చొప్పున డబ్బులు ముట్టజెప్తామని సెంట్రల్ మనీలాలోని బరాంగే అడిషన్ హిల్స్ గ్రామ పెద్ద కార్లిటో సెర్నాల్ స్పష్టంచేశారు. దోమలను చంపితే కూడా డబ్బులిస్తారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు వ్యంగ్య పోస్ట్‌లు చేసినా ఆయన దానిని సానుకూలంగా స్పందించారు. ‘‘ఎవరేమనుకున్నా పర్లేదు. మాకు మా పౌరుల ఆరోగ్యమే ముఖ్యం’’అని తాపీగా సమాధానమిచ్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు దోమకాటు కారణంగా డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దోమల దండుపై దండయాత్రకు గ్రామపెద్ద పిలుపునిచ్చారు. ‘‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన దోమనల్లా చంపేయండి. కేవలం నెలరోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది’’అని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఖాళీగా కూర్చోకుండా దోమల బ్యాట్‌తో రంగంలోకి దిగితే మంచి డబ్బులొస్తాయని కొందరు వెంటనే పని మొదలెట్టారు. గ్రామంలో ఇప్పటికే 21 మంది తాము చంపిన, సజీవంగా పట్టితెచ్చిన దోమలు, వారి లార్వాలను చూపించారు. వాళ్లు వందలాది దోమలు, లార్వాలను తీసుకొచ్చారు. బతికున్న దోమలను అవి డెంగీ వ్యాధికారక రకం దోమలో కాదో అతినీలలోహిత కిరణాల కింద పెట్టి పరీక్షించి నిర్ధారిస్తామని గ్రామ పెద్ద చెప్పారు. ఈ తతంగం చూసి నవ్వుకున్న కొందరు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో వ్యంగ్య పోస్ట్‌లు పెట్టారు. ‘‘పట్టుకునే, చంపే క్రమంలో దోమ రెక్క ఒకటి ఊడిపోతే దానిని లెక్కలోకి తీసుకుంటారా? లేదంటే తిరస్కరిస్తారా?’’అని ఒక వ్యక్తి పోస్ట్‌చేశారు. మెచ్చుకున్న ప్రభుత్వం స్థానిక యంత్రాంగం స్థాయిలో దోమల వ్యాప్తి కట్టడికి జరుగుతున్న కృషిని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెచ్చుకుంది. ‘‘ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిందే. పౌరులు సైతం తమ వంతు బాధ్యతగా స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ఫిలిప్పీన్స్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ ఆఫీస్‌లకు వెళ్లి డెంగీ నివారణ, దోమల వ్యాప్తి నిరోధక పద్ధతులపై అవగాహన పెంచుకోండి’’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘మా ప్రాంతంలో దోమల బెడద చాలా ఎక్కువ. ఇటీవలే 44 డెంగీ కేసులు వెలుగుచూశాయి. సొంతంగా కట్టడి చర్యలకు ఉపక్రమించాం. ఎవరేమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం. మాకు తోచినంతలో మా ప్రాంతాన్ని మేం దోమలరహితంగా మారుస్తున్నాం’’అని గ్రామ పెద్ద అన్నారు. ‘‘సెంట్రల్ మనీలాలోని 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బరాంగే అడిషన్ హిల్స్ జనాభా 70,000. డెంగీ కారక దోమలు లార్వాలను విడిచేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వ ప్రాంతాలను శుద్ధిచేయడం చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు. ఉష్ణమండల దేశమైన ఫిలిప్పీన్స్‌లో దోమల సమస్య ఎక్కువే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన 40 శాతం అధికంగా ఏకంగా 28,234 డెంగీ కేసులు నమోదైనట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. నీరు నిల్వ ఉండే టైర్లు, నిరుపయోగ డ్రమ్ములు, బకెట్లను పారేయాలని, ప్రజలు చేతులు పూర్తిగా కప్పేసేలా వస్త్రధారణ ఉండాలని సూచించింది. -
మలేరియా వచ్చిందని నా దగ్గరకు ఎందుకొచ్చావయ్య! వెళ్లి మళ్లీ ఆ దోమలతోనే కుట్టించుకో పోతుంది!
-
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న దోమలు
ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తుంటారు. ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు.వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తుందని 1897లో శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది. ప్రపంచ దోమల దినోత్సవం- 2024ను ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.దోమల నివారణకు కలుషితమైన నీటి వినియోగాన్ని నివారించాలి. దోమలు తేమగా ఉండే ప్రదేశాలలోను, నీరు నిలిచే ప్రదేశాలలోను త్వరగా వృద్ధి చెందుతాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు లాంటివి వినియోగించడం ఉత్తమం.వర్షాకాలంలో దోమల్ని తరిమికొట్టే చిట్కాలు -
దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి..ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ప్రతిచోటా దోమలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతలా దోమల నివారిణిలు వాడినా ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి. అయితే కొందరూ ఎక్కువగా దోమ కాటుకి గురవ్వతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు అబ్బా దోమలు కుడుతున్నాయని ఫిర్యాదులు చేయరు గానీ వీళ్లు మాత్రం అయ్యా..! బాబోయ్ ఈ దోమలు మమ్మల్ని బాగా కుడతున్నాయి అంటూ గొడవచేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రముఖ ఆరోగ్య నిపుణులరాలు ఊర్వశి అగర్వాల్ వివరించారు. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని అన్నారు. ఎలా ఉండటం వల్ల దోమలు ఎక్కువగా కుడతాయంటే..ఎక్కువగా దోమ కాటుకి దారితీసే కారణాలు..గట్-స్కిన్..దోమల ఆకర్షణలో ప్రేగు ఆరోగ్యం ఆశ్చర్యకరమైన పాత్ర పోషిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్ చర్మంలోని మైక్రోబయోమ్‌ను సానుకూలంగా ఉంచుతుంది. దోమలు తక్కువ ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మ అవరోధాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తం పీల్చే దోమల వంటి ఇతర జీవులనుఆకర్షించే కొన్ని రకాల సమ్మేళనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.ఎక్కువగా తినే వాటిని బట్టి...మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టే దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవ్వుతాయి. చక్కెర, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహ పరిచేలా శరీరం నుంచి ఒకవిధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులుశరీరం నుంచి వచ్చే వాసన..శరీరం వాసన అనేది జన్యుశాస్త్రం, ఆహారంకి సంబంధించింది. ఇది ఒకరకంగా మీ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియాతో సహా శరీరం ఉత్పత్తి చేసే సమ్మేళనాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు కారణమవ్వడమే దోమలకు ప్రీతికరంగా అనిపించేందుకు కారణమువుతంది. అధిక జీవక్రియ రేటు..ఎక్కువ కార్బన్డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తే దోమలు దూరం నుంచే గుర్తిసాయిట. సహజంగా శక్తిమంతంగా ఉన్నా లేదా అధిక జీవక్రియ రేటుని కలిగి ఉంటే ఈ దోమ కాటుకి గురవ్వాల్సి వస్తుంది.వాపు, రోగనిరోధక పనితీరుదీర్ఘకాలిక వ్యాధులు బారినపడిన వారిలో రోగనిరోధక స్థితి బలహీనంగా ఉంటుంది. ఇది దోమల ఆకర్షణకు కారణమవుతుంది. అలాగే శరీరం అసమతుల్యత స్థితిలో ఉంటే దోమలను ఆకర్షించే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. దోమ కాటుకి గురవ్వకూడదంటే..గట్ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చేలాక ఫైబర్, పులియబెట్టిన ఆహారాలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. చక్కెర , ఆల్కహాల్‌ను పరిమితం చేయండి: ఈ పదార్ధాలు తీసుకోవడం తగ్గిస్తే శరీరంలో జరిగే రసాయనిక చర్యను నియంత్రిస్తుంది. . శరీర దుర్వాసనను నియంత్రించండి: రెగ్యులర్ షవర్లు, సహజమైన డియోడరెంట్లను ఉపయోగించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వంటివి చేయాలి.(చదవండి: వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?) -
ఇజ్రాయెల్‌ను వణికిస్తున్న ‘వెస్ట్ నైల్ ఫీవర్’, లక్షణాలు, జాగ్రత్తలు
ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ ఆందోళన రేపుతోంది. మే ప్రారంభంలో దేశంలో వ్యాప్తి చెందినప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెస్ట్ నైల్ ఫీవర్’ తో దేశంలో31 మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్‌లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.జిన్హువా వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం అక్కడ కొత్తగా 49 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 405కి చేరుకుంది. 2000 నాటి వార్షిక రికార్డు గరిష్ట స్థాయి 425 కేసులకు చేరువలో ఉంది. దీంతో అప్రమత్తమైన, ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. దోమలు పెచ్చరిల్లే వాతావరణం కారణంగా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.70 అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులతోపాటు పిల్లలు కూడా వైరస్‌తో బాధపడుతున్నారని పేర్కొంది.గత రెండు నెలల్లో 159 పక్షులు వైరస్ బారిన పడ్డాయని, మొత్తం 2023లో పక్షులలో కేవలం మూడు ఇన్ఫెక్షన్లు మాత్రమే సంభవించాయని ఇజ్రాయెల్ యొక్క చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, తమీర్ గోషెన్ మీడియాకు తెలిపారు.వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? వెస్ట్ నైల్ ఫీవర్ వెస్ట్ నైల్ వైరస్ వల్ల వస్తుంది. ఇది దోమకాటు ద్వారా జంతువలనుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ మనుషులు, పక్షులు, దోమలు, గుర్రాలు , కొన్ని ఇతర క్షీరదాలకు సోకుతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ చెబుతోంది.వెస్ట్ నైల్ ఫీవర్‌లో సాధారణంగా, తేలికపాటి ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), మెదడు , వెన్నుపాము లైనింగ్ (మెనింజైటిస్), మెదడు దాని చుట్టుపక్కల పొర (మెనింగోఎన్సెఫాలిటిస్) వాపునకు కారణమవుతుంది.ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా మారవచ్చు. వెస్ట్ నైలు జ్వరం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోఇన్వాసివ్ వ్యాధికి దారితీస్తుంది. గందరగోళం, మూర్ఛ, కండరాల బలహీనత , అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం పోలియో కూడా సంభవించవచ్చు.వెస్ట్ నైల్ వైరస్ కోరియోరెటినిటిస్ , ఆప్టిక్ న్యూరిటిస్ (రెటీనా వాపు, నరాల) కంటి సమస్యలను కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపును శాశ్వతంగా కోల్పోవచ్చు..మయోకార్డిటిస్‌కు దారితీసే గుండెపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. గుండె కండరాల వాపు, గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. కిడ్నీ వాపు నెఫ్రైటిస్కు కారణం కావచ్చు.నివారణ చర్యలుచుట్టుపక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడటం చాలా అవసరం. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిపెరిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. తాగు నీరు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఏ కొద్ది అనుమానం వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బెంగళూరులో జికా వైరస్ కలకలం
బెంగళూరు: బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. 'రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్‌గా నమోదైంది.' అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. గత డిసెంబర్లో కర్ణాటకాలోని రాయ్‌చూర్ జిల్లాలో ఐదేళ్ల బాలునికి జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
పగటి దోమ కాటు ప్రాణాంతకమే!
పగటిపూట కుట్టే దోమ ప్రాణాంతకంగా పరిణమించింది. డెంగీ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమలతో జ్వర బాధితులు పెరుగుతున్నారు. డెంగీ కారక దోమల బెడద నుంచి రక్షించుకోవడమే శ్రేయస్కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారణమయ్యే నిల్వ నీరు లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ వానలు కురిసి తగ్గిన తర్వాత సీజన్లో సాధారణంగా డెంగీ వ్యాపిస్తుంది.. కానీ ఈ వ్యాధి ప్రస్తుతం నగరవ్యాప్తంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకుపైగా డెంగీ కేసులు నమోదైతే.. అందులో సగానికి పైగా నగరంలో నమోదవడం వ్యాధి తీవ్రతకు నిదర్శనం. గత ఆగస్టు నుంచి నెలకు 10 రెట్ల చొప్పున కేసులు పెరుగుతున్నాయని ఆసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. డెంగీ జ్వరం వస్తే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపధ్యంలో దోమల నివారణకు నగర ప్రజలు ప్రాధాన్యమివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏడిస్ ఈజిప్టి దోమ కాటేసే వేళలివే.. డెంగీకి దోహదం చేసే ఏడిస్ ఈజిప్టి అనే దోమనే ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో దోమలు కుట్టకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయని గ్రహించాలి. వీలుంటే ఆయా శరీర భాగాల్లో మనకు మార్కెట్లో లభించే దోమల నివారణ లేపనం పూయాలి. నిల్వ నీరే స్థావరాలు నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో ఈ దోమలు విపరీతంగా గుడ్లను పొదుగుతాయి. అవి మూడేళ్ల వరకు జీవించగలవు. కాబట్టి ఇంట్లో లేదా మరెక్కడైనా సరే మూలల్లో తడిగా, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు మొక్కల కుండీల్లో నీటిని వదిలేస్తారు. అది కూడా ఈ దోమలకు స్థావరంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. దోమను ఎలా గుర్తించాలంటే.. ఏడిస్ ఈజిప్టి దోమను గుర్తించడానికి సులభమైన మార్గం వాటి నలుపు రంగు. కాళ్లపై తెల్లటి మచ్చలుంటాయి. దోమలను బయటకు తరిమికొట్టేందుకు ఇప్పుడు మార్కెట్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో చాలా వరకూ పరోక్షంగా ఆరోగ్యానికి హాని కలిగించేవే. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -
పాపం సినబాబు.. ఉత్త అనుమానాలతో నవ్వులపాలు
‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు🦟 కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు.. ఇది టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు. ఓ రిమాండ్ ఖైదీ మరణాన్ని తెరపైకి తెచ్చి.. దోమలతో🦟 చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారాయన. అయితే.. రాజమండ్రి జైళ్ల శాఖ ఇప్పటికే లోకేష్ అనుమానాల్ని నివృత్తి చేసింది. మరోవైపు చినబాబు దోమల రాజకీయంపైనా విమర్శలు, అదే టైంలో సెటైర్లు పేలుతున్నాయి. 🦟సోషల్ మీడియాలో నారా లోకేష్ తాజా చీప్ స్టేట్మెంట్పై సెటైర్లు పేలుతున్నాయి. స్కిల్ స్కాంలో సిల్లీ ఆరోపణలతో నవ్వులపాలవుతున్నారాయన. దోమలతో తన తండ్రిని చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడమే తర్వాయి.. యెల్లో మీడియా వాటిని హైలైట్ చేస్తూ కథనాలు ప్రచురించింది. పైగా ఓ దోపిడీ కేసులో రిమాండ్ ఖైదీ మృతిని ప్రముఖంగా ప్రచురించింది. బహుశా.. ఆ దోపిడీ దొంగను చంద్రబాబుతో సమానంగా చూస్తోందేమో!. 🦟 స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ ప్రజల్లో మొదటి నుంచి సానుభూతి కనిపించడం లేదు. కనీస సంఘీభావానికి సైతం టీడీపీ కార్యకర్తలు సైతం దూరంగా ఉంటున్నారు. రెండేళ్లపాటు విచారణ తర్వాత పక్కా ఆధారాలతో అరెస్ట్ అయ్యాక.. అరెస్ట్ అక్రమం అంటున్నారే తప్పా, తాము తప్పు చేయలేదని ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా సాంకేతిక కారణాలను చూపిస్తూ.. రాజకీయ కక్షతోనే అరెస్ట్ జరిగిందనే లైన్ మీదే ఉంటున్నారు. అంటే.. దొంగ తప్పు ఒప్పుకున్నట్లే కదా అని బలంగా ఫిక్సయిపోయారంతా. ఇక ఇప్పుడు దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాకపోగా.. లోకేష్ నవ్వులపాలవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 🦟దోమా.. దోమా.. మా నాన్నోరి ఎందుకు కుడతావ్ అంటే.. మా జోలికి వస్తే కుట్టమా? అందట. కొంపదీసి అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర చేసినందుకు దోమలు పగబట్టాయా?.. లేకుంటే ఆ మధ్య లోకేష్ మాట్లాడుతూ.. ఊ.. ఆ అంటే అని అలవాటులో పొరపాటుగా డెంగీ బదులు.. ‘బీప్ పదం’ ఒకటి ఉపయోగించాడు.. బహుశా ఆ విషయంలో దోమలు హర్ట్ అయ్యి ఉంటాయేమో. అందుకే నారా వారి మీద పగ బట్టాయేమో అనే సెటైర్లు పడుతున్నాయ్. జైళ్ల శాఖ చెప్పినా వినరా? బాబు భద్రతపై ఎలాంటి ఆందోళన ఆందోళన అవసరం లేదని రాజమండ్రి జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు భద్రత గురించి టీడీపీ, ఆ పార్టీ నేత నారా లోకేష్ అభ్యంతరాలను ఖండించింది. సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు. జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక సూపరింటెండెంట్ రవికిరణ్ స్పందిస్తూ.. జైల్లో దోమల నివారణ కోసం సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని... ఫాగింగ్ చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు. జైల్లో దోమల లార్వాల ఆనవాళ్లేమీ లేవని చెప్పారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడం పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు బ్యారక్ లో కూడా దోమలు ఉన్నాయి ఆయన ఆరోగ్యం పై అనుమానాలున్నాయని అంటున్నారు. దోపిడీ కేసులో అరెస్టై జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూతో మృతి చెందాడు. సత్యనారాయణ ఆరో తేదీన జైలుకు వచ్చారు. వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ లో ఫీవర్ తో బాధపడుతున్నట్టు తేలింది. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించాము ...ఈనెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతి చెందారు. చంద్రబాబుతో పాటు జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే మా లక్ష్యం’’ అలా అయితే టీడీపీ వాళ్లనే అనుమానించాలి! చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని ట్వీట్ చేశారాయన. అలాగే.. లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారమని, అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అనే అనుమానాల్ని వ్యక్తం చేశారాయన. లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్లరా? మరోవైపు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌సైతం సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదని ఎద్దేవా చేశారు. ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా?. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది. చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
రాష్ట్రానికి డెంగీ ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈనెల సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్‌కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్‌లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్‌కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్‌ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్‌కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్‌కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్‌తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్‌లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్‌గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్‌ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్‌లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి. సీఎం సమీక్ష ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్‌లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు. జరిమానా పెంపు ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. -
దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి
సువాసన అంటే కేవలం మనుషులు మాత్రమే ఇష్టపడతారు అనుకుంటే పొరపాటే!. ఎందుకంటే దోమలు కూడా వివిధ రకాల సువాసన గల పువ్వులను ఇష్టపడతాయట. అందువల్ల మనం ఉపయోగించే సువాసన గల సబ్బులే దోమలు కుట్టడానికి ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ మేరకు వర్జీనియా టెక్ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రకాల సువాసన గల సబ్బులు దోమలను బాగా ఆకర్షిస్తే.. కొన్ని సబ్బుల వాసనకు దోమలు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు. It may have something to do with your body's natural odor, your diet, and even your choice of soap. https://t.co/zpf9WuWZUS — @wideopenspaces (@wideopenspaces) June 9, 2023 పరిశోధకుల బృందం ఈ విషయమై వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమల ఆకర్షణ గురించి అధ్యయనం చేసింది. ఈ పరిశోధనల్లో కొన్ని రకాల సబ్బులు దోమల ఆకర్షణని పెంచితే మరికొన్ని తగ్గించాయి. మన శరీరం నుంచి వచ్చే సహజ వాసనలు, ఈ సబ్బుల నుంచి వచ్చే సువాసనల మధ్య జరిగే చర్య ఫలితంగా మరింతగా మన శరీరం నుంచి వాసన వెదజల్లుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో దోమలు ఈ వాసనకు ఆకర్షించబడి కుడుతున్నట్లు తేల్చారు. Research Revealed Scented Soaps Attract Mosquitoes Learn more: https://t.co/P7t1krTH6e Credit: @virginia_tech @USDA @USDA_NIFA #mosquitobites #ScentedSoaps #soapchemicals #healthcare #meded #eMednews — eMedEvents (@eMedEvents) June 12, 2023 ఈ మేరకు పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో పువ్వులు, పండ్ల వాసనతో కూడిన సోప్‌లకు దోమల ఎక్కువగా ఆకర్షించబడుతున్నట్లు తేలింది. వాటికి ఆహారమైన రక్తం లభించనప్పుడు మొక్కల్లో ఉండే తేనెతో ఆకలిని భర్తీ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మనం వాడే సబ్బుల కారణంగా వాటి నుంచి వచ్చే సువాసనకు దోమలు ఎట్రాక్ట్ అయ్యి కుడుతున్నట్లు వెల్లడించారు. ఐతే కొబ్బరి సువాసన గల సబ్బుని దోమలు ఇష్టపడవని, అందువల్ల వాటితో స్నానం చేస్తే దోమలకు దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. అదీగాక కొబ్బరినూనె సహజ నిరోదకం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరి సువాసన వచ్చే నూనె లేదా సబ్బులను ఉపయోగించవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో వెల్లడించారు. (చదవండి: నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..) -
మస్కిటో జాపర్ - దోమల బెడదకు గుడ్ బై.. ధర రూ. 824 మాత్రమే
కాలాలతో సంబంధం లేకుండా చీకటి పడేసరికి చాలా ఇళ్లల్లో.. దోమలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి చెక్ పెట్టడానికి దోమల చక్రాలు, దోమల అగరొత్తులు, ఆల్ ఔట్స్ వంటి ప్రొడక్ట్స్ వాటడం సర్వసాధారణం. అయితే కొన్ని మొండి దోమలు కాసేపటికే ఆ మత్తు నుంచి తేరుకుని.. తమ ప్రతాపాన్ని చూపెడుతుంటాయి. అందుకే చాలా మంది దోమల బ్యాట్ అందుకుని యుద్ధం చేస్తుంటారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) ఈ డివైస్ ఇంట్లో ఉంటే.. బ్యాట్ తీసుకుని మూల మూలకు తిరగాల్సిన పనిలేదు. వాటంతట అవే ఆ మెషిన్ దగ్గరకు వచ్చి చటుక్కున చస్తాయి. దీని హైసింథైన్ ఎల్ఈడీ లైట్.. ఇరువైపుల నుంచి ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతూ దోమలను, కీటకాలను ట్రాప్ చేసి తనవైపు రప్పిస్తుంది. క్షణాల్లో లోపలకు లాగి.. లోపలున్న బాస్కెట్లో వేసేస్తుంది. ఇది రసాయనాలు, విషపదార్థాలు, రేడియేషన్స్ జోలికి వెళ్లదు. ఈ మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు.. పిల్లలు, పెంపుడు జంతువులు పొరబాటున తగిలినా.. విద్యుదాఘాతం వంటి ప్రమాదాలేం జరగవు. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. ఇది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. మరునాడు ఉదయాన్నే బాస్కెట్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర 10 డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 824. (ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?) ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
అంతా ఓకే కుటుంబం.. ఆరుగురి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్
న్యూఢిల్లీ: ఏ నిమిషానికి ఏం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేరు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని మస్కిటో కాయిల్ పెట్టుకున్న ఓ కుటుంబం.. చివరికి ప్రమాదవశాత్తు శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఓ కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరు ఎప్పటిమాదిరిగానే గురువారం రాత్రి కూడా దోమలను నివారణకు మస్కిటో కాయిల్ అంటించి పడుకున్నారు. రాత్రి సమయం, పైగా దోమల బెడద కారణంగా ఆ ఇంటి కిటీకీలు, తలుపులు అన్నీ మూసివేసి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో అంటించిన మస్కిటో కాయిల్ ప్రమాదవశాత్తు పరుపుపై పడి మెల్లగా అంటుకుంది. ఈ క్రమంలో కుటుంబం నిద్రపోతున్న గది మొత్తం పొగ అలుముకుంది. ఈ పరిస్థితిని కుటుంబ సభ్యులు గమనించారు. అయితే అప్పటికే విషపూరిత వాయువులు గది మొత్తంగా వ్యాపించి ఉండడంతో బయటపడేందుకు ప్రయత్నిస్తుండగానే వారు స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో కొందరు ఊపిరాడక చనిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లోని తొమ్మిది మందిని జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. కాగా, 15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో 22 ఏళ్ల వ్యక్తి ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. -
అదిరిపోయే గాడ్జెట్.. ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు
దోమల నివారణకు చాలా పరికరాలే అందుబాటులో ఉన్నాయి. అవి మహా అయితే గదిలోని దోమలను పారదోల గలవేమో! ఆరుబయట పిక్నిక్ల వంటి వాటికి అవి పెద్దగా ఉపయోగపడవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం ఉంటే, ఆరుబయటి దోమలు, ఇతర కీటకాలు కూడా క్షణాల్లో పరారైపోతాయి. ‘థర్మాసెల్’ అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ‘థర్మోసెల్ ఈఎల్55’ అనే పరికరం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. గదిలోనే కాదు, ఆరుబయట కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దోమలను పారదోలడంతో పాటు ఇది లాంతరులా కూడా పనిచేస్తుంది. ఇతర పరికరాల మాదిరిగా ఇందులో ఎలాంటి రసాయనాలను వాడనవసరం లేదు. కాబట్టి ఇబ్బందికరమైన వాసనలేవీ దీని నుంచి వెలువడవు. దీని ధర 49.99 డాలర్లు (రూ.4,126) మాత్రమే! -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
గాలిని శుభ్రం చేసే ఈ డబుల్ ధమాకా గాడ్జెట్ గురించి మీకు తెలుసా
ఈ ఫొటోలో గోడకు ఏదో అమర్చినట్లు కనిపిస్తోంది కదూ! గోడకు ఏమీ అమర్చలేదు గాని, ప్లగ్‌లో పెట్టిన చిన్న సాధనమిది. ఇదొక డబుల్ ధమాకా పరికరం. దీనిని ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు, గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, దోమలనూ పారదోలుతుంది. ఈ ‘2022 ఎయిర్ ప్యూరిఫయర్స్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్’ పరికరాన్ని అమెరికన్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ‘కార్నర్షాప్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ప్యురిఫయర్ కమ్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్ పరికరం వివిధ దేశాల్లోని వాల్‌మార్ట్ స్టోర్స్‌లోనూ దొరుకుతుంది. దీనిని ఆన్ చేశాక ప్రతి 40 సెకండ్లకు ఒకసారి కొద్దిసేపు దీని నుంచి సన్నని ధ్వని వెలువడుతుంది. ఈ పరికరం గాలిలోని దుర్వాసనను పోగొడుతుంది. గాలిలోని హానికరమైన జీవ రసాయనిక కణాలను తొలగిస్తుంది. -
దొంగను పట్టించిన దోమ!
వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమేనండోయ్! ఇంతకీ విషయం ఏమిటంటే.. తూర్పు చైనాలోని ఫూజియాన్ ప్రావిన్సులో ఉన్న ఫుజోలో ఓ దొంగ ఇటీవల ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఖాళీగా ఉన్న ఇంటిని ఎంచుకొని బాల్కనీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే బాగా ఆకలితో ఉండటంతో ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, న్యూడుల్స్ కనబడటంతో ఎగ్ న్యూడుల్స్ చేసుకొని లాగించేశాడు. ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు. కానీ ఇల్లంతా దోమలమయం కావడంతో అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ఓ మస్కిటో కాయిల్ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుడుతుండటంతో కొన్నింటిని టపీటపీమంటూ చంపేశాడు. తెల్లవారుజాము దాకా ఇంట్లోనే ఉండి అందినకాడికి దోచుకెళ్లాడు. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డీఎన్ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం చాయ్ అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్న అతను ఆ ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు కూడా చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. -
ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?
వాషింగ్టన్: కరోనా వైరస్ చూసి ప్రపంచమంతా భయపడుతున్న వేళ..ఇతర రకాల వైరస్ల సామర్థ్యంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వైరస్లు ఇతర జీవుల చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగల శక్తి ఉందని తాజాగా తేలింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, గున్యా జ్వరాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్‌ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథేయిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్ గుర్తించారు. వైరస్ బాధిత జీవి చర్మంపై తయారయ్యే అసిటోఫెనోన్ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా దోమలు బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు. పేగులు, చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియానే అసిటోఫెనోన్ తయారీలో కీలకం. డెంగ్యూ, జికా వైరస్లు చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియా రెల్మా అనే కణ తయారీని అడ్డుకుని అసిటోఫెనోన్ను పెంచుతోంది. ప్రయోగంలో చివరిగా వైరస్ బాధిత ఎలుకలకు ఎల్మాను ప్రేరేపించే విటమిన్ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు. -
మలేరియా లేని ప్రపంచం కోసం...
చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్ 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. దీనిని ‘ప్లాస్మోడియం’ జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అనే ఐదు రకాల పరాన్నజీవుల వలన మానవులకు మలేరియా సోకుతోంది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ద్ధరించారు. ఇందుకుగానూ ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ‘అనాఫిలస్’ జాతికి చెందిన ఆడ దోమల వలన మలేరియా వ్యాధికారక క్రిమి వ్యాప్తి చెందుతుంది. మలేరియా వ్యాధి తీవ్రతను అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో ‘‘ఆఫ్రికా మలేరియా డే’’ ఆచరించింది. అదే స్ఫూర్తితో 2008 నుండి ఏప్రిల్ 25ను ‘వరల్డ్ మలేరియా డే’గా ఆచరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల మంది మలేరియా వ్యాధి బారినపడగా, 6 లక్షల 27 వేల మంది చనిపోయారు. ఇక మనదేశం విషయానికివస్తే 2021లో అధికారికంగా 1,58,326 మలేరియా కేసులు గుర్తించగా, 80 మరణాలు సంభవించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణల్లో కనుగొన్న నూతన ఆవిష్కరణల ఫలితంగా గత 10 సంవత్సరాల్లో మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలు, దీర్ఘకాలం వినియోగించ గలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాల వలన ఇది సాధ్యమైంది. దీన్ని సాధించడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు చేసిన కృషి ఎనలేనిది. 2030 నాటికి భారత దేశం నుండి మలేరియా వ్యాధిని పూర్తిగా తొలగించడానికి పథక రచన చేశారు. – తలతోటి రత్న జోసఫ్ రిటైర్డ్ ఏడీ; ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ -
Wildlife: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..!
ఒక ఈగను పెట్టి ఓ రివేంజ్ స్టోరీ డైరెక్ట్ చేశాడు రాజమౌళి. అదే డైరెక్టర్ ఈ దోమను చూసి ఉంటే మాత్రం కచ్చితంగా ఓ అద్భుతమైన లవ్‌స్టోరీని తీసేవాడు. ఆ దోమ అంత అందమైంది మరి. దోమ అందంగా ఉండటం ఏంటీ? అని చిరాకుపడకండి. మనుషుల్లోనూ అందమైన ముఖం కలిగిన వారు ఉన్నట్లు.. దోమల్లోనూ అందమైన రూపం కలిగిన దోమలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య అమెరికా ఉష్ణమండల అడువుల్లో కనిపించే ‘సబెథెస్ దోమ’. ఈ జాతి దోమలకు అందమైన కాళ్లు, చక్కటి శరీర ఛాయ ఉంటుంది. అంతేకాదు.. వాటి కాళ్లకు ఉన్న చిన్న చిన్న ఈకల కారణంగా ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా కనిపిస్తుంది. మొదట ఇతర దోమలను ఆకర్షించడానికి, సంభోగంలో పాత్ర పోషించడానికి, ఇవి ఈ ఈకలను ఉపయోగిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు తేల్చినా, తర్వాత వాటి ఈకలను తొలగించి పరిశీలిస్తే.. అవి చక్కగా సంభోగంలో పాల్గొంటున్నాయని తేలింది. దీంతో, ప్రస్తుతం వీటికున్న ఆ అద్భుతమైన కాళ్ల కారణం ఏంటో తెలియదు కానీ, దీనిని మాత్రం అత్యంత అందమైన దోమగా శాస్త్రవేత్తలు పరిగణించారు. ఎంత అందమైన దోమ అయితేనేం.. ఇది కూడా జ్వరం, డెంగ్యూ వంటి వ్యాధుల కారకమే కదా! చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
‘డెంగీ’ఉంది..‘జ్వర’భద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పెరుగుదలతో పాటు డెంగీ వ్యాప్తి అత్యధికంగా ఉన్నందున జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని అది డెంగీనా లేక కరోనా అన్నది నిర్ధారించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అయితే ఇదే సమయంలోనూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రధానంగా డెంగీ, కరోనాలకు సంబంధించిన లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నందున కచ్చితమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వేడుకలు అంటూ విపరీతంగా తిరిగేస్తున్నారని, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లోనూ ఇలా ఏదైనా సమూహంలో గడిపి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులుంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలోని ఒకరికి వస్తే సహజంగానే అందరూ దాని బారిన పడుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు పెరుగుతున్నందున వాటి లక్షణాలు, కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు చేయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’తో పల్మనాలజిస్ట్ డా.వి.వి.రమణప్రసాద్, కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... డెంగీ వచ్చిన వారిలో కూడా కరోనా పాజిటివ్ లక్షణాల మాదిరే దగ్గు, జ్వరం, గొంతునొప్పి ఉంటున్నాయి. వీరి పరీక్షల్లో తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు డెంగీ పాజిటివ్‌గా ఉంటోంది. సీజనల్ ఫ్లూ, వైరల్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించి డెంగీ ఇతర సీజనల్ వ్యాధులను నిర్ధారించుకోవాల్సి ఉంది. ముందుగా కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. డెంగీ లక్షణాలు ఉండి, ఆర్టీపీసీఆర్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఐదురోజుల తర్వాత దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే సీటీ స్కాన్‌తో నిర్ధారించాల్సి వస్తోంది. డెంగీకి ర్యాపిడ్టెస్ట్ మాదిరి ఎన్సెస్ వన్ యాంటీజెన్, డెంగీ సీరోలజీ టెస్ట్‌లు చేసి నిర్ధారిస్తున్నాము. ప్రస్తుతం డెంగీ సీజన్ కావడంతో ఈ కేసులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, గొంతునొప్పి, ఇతర వైరల్ లక్షణాలున్న సీజనల్ వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మళ్లీ టీబీ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. డా.వి.వి.రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ప్రతీరోజు వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగీకి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని కోవిడ్ కేసులుంటున్నాయి. గతానికి భిన్నంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కోవిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, అన్నీ చలిజ్వరంతో వస్తున్నాయి. ఒళ్లు, కంటి నొప్పులు, ఎముకలు చిట్లేంత నొప్పులు, కీళ్లు, కండరాలు, కంటి వెనక నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో జ్వరాలు వస్తుండటంతో వైద్యపరీక్షలతో నిర్ధారించుకోవాల్సి వస్తోంది. ఈ జ్వరాలతో రోగులకు విపరీతమైన బలహీనత, తట్టుకోలేని నొప్పులతోపాటు కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. వర్షాకాలంలో నీటిలో కాలుష్యం పెరగడం, దోమలు, ఈగలు పెరిగిపోవడం, ప్రధానంగా ఆహారం, మంచినీరు వంటివి కలుషితం కావడంతో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతోపాటు పొట్టలో రక్తస్రావం అయ్యి, కాళ్ల రక్తనాళాల రంగుమార్పు, నల్లటిరంగులో మలవిసర్జన వంటివి జరుగుతాయి. వీటిని బట్టి ఎక్కడో రక్తస్రావం అవుతుందని గ్రహించాలి. అవసరమైన డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్లేట్లెట్ల సంఖ్యను జాగ్రత్తగా గమనిస్తూ, చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రతీ జిల్లాలో ప్లేట్లెట్ల యూనిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలి. – డా. ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ సరైన సమయంలో చికిత్సతోనే... ఒకరోజు అకస్మాత్తుగా గొంతునొప్పితో కూడిన చలిజ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత మా కుటుంబవైద్యుడి దగ్గరకు వెళ్లాను. వైరల్ జ్వరం అనే అనుమానంతో అన్ని వైద్యపరీక్షలు చేయించారు. డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స తీసుకున్నాను. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కూడా ఇవే లక్షణాలతో జ్వరం వచ్చింది. వారుకూడా ఫోన్లోనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడారు. ఇప్పుడు అందరూ కోలుకున్నారు. –అప్పరాజు అనిల్ కృష్ణ, మణికొండ -
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. ఇక డెంగీ దోమలు మీ దగ్గరే!
సాక్షి, హైదరాబాద్: ఆ మొక్క పేరు మనీ ప్లాంట్. ఇంటి ఆవరణలో ఇది పెంచితే సంపద సంప్రాప్తిస్తుందని కొందరి నమ్మకం. డబ్బు మాటేమోగానీ ఈ ప్లాంట్‌తో డెంగీ దోమలు కచ్చితంగా వచ్చి తీరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం, ఆహ్లాదం కోసం సిటీజనులు పెంచుతున్న పూలు, తీగజాతి మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయడంలో అతిశయోక్తి లేదేమో. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎ క్కువగా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ 30 శాతం కేసులు అక్కడే.. ► ప్రస్తుతం హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నమోదైన కేసుల్లో 30 శాతం సంపన్నులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌లలో నమోదైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ►పేద, మధ్య తరగతి ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటారు. వీటికోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ► వీటిలో డెంగీ దోమలు గుండ్లు పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం.. గుర్తించినట్టు.. పెన్సిల్‌తో రాసి.. ► దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని సిటీజన్లు ఆరోపిస్తున్నారు. ► వారానికోరోజు కూడా ఫాగింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. మంచినీటి ట్యాంకుల్లో మందు చల్లకుండానే చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్‌తో రాసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ►రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు.నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. దోమలకు నిలయాలివే.. ► ఇంటి ఆవరణలోని పూల కుండీలు ► మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు ► టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు ► ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు ► కొత్త నిర్మాణాలు, సెల్లార్లు ► తాళం వేసిన నివాసాలు ► విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు ► ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు గాందీలో 40 మంది డెంగీ బాధితులకు చికిత్స గాంధీ ఆస్పత్రి: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మారి కరోనాకు తోడుగా డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 40 మంది డెంగీ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో సింహభాగం చిన్నారులే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా డెంగీ లక్షణాలతో వచ్చిన మరో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ముగ్గురుకి డెంగీతోపాటు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గాంధీ పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి మూడు రోజుల క్రితం డెంగీ షాక్ సిండ్రోమ్‌తో మృతి చెందింది. అందుబాటులో ప్లేట్లెట్లు, మందులు గాంధీ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణకు అన్నిరకాల మందులు, ప్లేట్లెట్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. సుమారు 40 మంది డెంగీ బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, వారం రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు డెంగీ కేసులు హైదరాబాద్ 537 రంగారెడ్డి 140 మేడ్చల్ 120 వికారాబాద్ 45 -
World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం..
కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన రమాదేవికి ఈనెల 13న జ్వరం వచ్చింది. మొదటి కోవిడ్‌గా అనుమానించి నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలు చేయగా సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్‌గా నిర్ధారణ అయింది. దోమ కాటు వల్ల వచ్చిన జ్వరంతో నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోగా.. రూ.10 వేల వరకు ఖర్చఅయింది. హైరిస్క్ ప్రాంతాలు.. నగరంలోని ఖాన్‌పురా, రాంనగర్, కార్ఖానగడ్డ, మార్కండేయనగర్, వావిలాలపల్లి, కట్టరాంపూర్తో పాటు దుర్శేడ్, అన్నారం, ఇందుర్తి, వెలిచాల, గర్శకుర్తి, గద్దపాక, జోగినపల్లి గ్రామాలను సీజనల్ వ్యాధులు సంభవించే హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన వంగల హన్మండ్లు(60) డెంగీతో జూన్ 30న మృతి చెందారు. మరో 10 డెంగీ కేసుల్లో కరీంనగర్లో 6, గ్రామాల్లో 4 కేసులు గుర్తించారు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు క్రమంగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతక డెంగీ, మలేరియా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లాలో మొత్తం 11 కేసులు డెంగీ కేసులు నిర్ధారణ కాగా.. ఒకరు మరణించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు విషజ్వరాలతో చిన్న జ్వరం వచ్చినా జనాలు ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అక్కడ సాధారణ జ్వరానికి కూడా డెంగీ బూచిచూపి మరోవైపు టెస్టుల పేరుతో వారు దోపిడీకి తెరలేపుతున్నారు. మొత్తానికి చిన్న జ్వరం వచ్చినా.. జనాలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషజ్వరాలకు ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం, దోమల స్వైరవిహారం. జిల్లాల్లో ఇప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో ఓపెన్ డ్రైనేజీ, మురికి కుంటలు, పందుల స్వైర విహారం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలి వర్షాలతో కుంటలు నిండి దోమల అమాంతం పెరిగాయి. వాస్తవానికి జిల్లాల్లో దోమల సమస్య ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలోనూ కరీంనగర్ జిల్లా డెంగీ కేసుల్లో ముందున్న విషయం తెలిసిందే. కరోనా తరువాత ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పదే పదే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన తాగునీరు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసంచారం మీద ఆంక్షలతో డయేరియా, జ్వరాలు, చర్మవ్యాధులు గణనీయంగా తగ్గడం గమనార్హం. నెమ్మదిగా సెకండ్ వేవ్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్న వేళ విషజ్వరాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. శుక్రవారం(ఆగస్టు 20) ‘ప్రపంచ మస్కిటో దినోత్సవం’ సందర్భంగా దోమల వల్ల కలుగుతున్న ప్రాణాంతక జ్వరాలు, వాటి వెనక ఉన్న కారణాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పెరిగిన ఓపీ..! సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే జ్వరాలతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారం రోజులుగా జ్వరబాధితుల కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీలకు వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 150 మించి ఉండని ఓపీ సేవలు ప్రస్తుతం 300 వరకు ఓపీ పెరిగింది. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇందులో ఏది డెంగీ, మలేరియా అన్న ఆందోళనతో జనాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కానరాని వైద్య శిబిరాలు.. జ్వర పీడితులు పెరుగుతున్న పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో, గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. వ్యాక్సినేషన్, కోవిడ్ నిర్ధారణ పరీక్షల పేరుతో వైద్య సేవలను మరిచినట్లు తెలుస్తోంది. కొంత మంది మధ్యాహ్నం లోపే విధులకు డుమ్మాకొట్టి వెళ్తుండగా, మరికొంత మంది వివిధ కారణాల చూపుతూ ఆరోగ్య కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంత మంది వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఫీవర్ సర్వేతో వెలుగుచూస్తున్న వ్యాధులు.. జిల్లాలో ఇప్పటికే కోవిడ్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతుండగా తాజాగా.. జిల్లా వ్యాప్తంగా సాధారణ వ్యాధులు పెరుగుతూ మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఫీవర్‌సర్వేలో సీజనల్ జ్వరాలు బయటపడుతున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తుండడంతో వ్యాధుల తీవ్రత తెలుస్తోంది. గడిచిన 8 నెలల్లో కరీంనగర్ జిల్లాలో 11 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఒకరు డెంగీ మరణించడం కలకలం రేపుతోంది. ఈ కేసులు ఎక్కువగా పట్టణాల పరిధిలోనే నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మలేరియా కేసులు ఈ యేడాది కేవలం 2 మాత్రమే నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
దోమల చక్రం బస్తాలకు అంటుకోవడంతో సజీవ దహనం..
-
దోమల చక్రం బస్తాలకు అంటుకోవడంతో సజీవ దహనం..
గుంటూరు: లంకెవాని దిబ్బ రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్నఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని నిర్దారణ అయ్యింది. వీరంతా రాత్రి పడుకునేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ బస్తాలపై దోమల చక్రం పెట్టి నిద్ర పోవడంతో అది అంటుకోవడంతోనే సజీవ దహనం అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాయిల్ ద్వారా బ్లీచింగ్ పౌడర్ బస్తాలకు మంటలు అంటుకునే వారు మృతిచెందినట్లు స్పష్టత వచ్చింది. తొలుత ఈ ఘటనకు విద్యుత్ షాక్ కారణమని భావించారు. కానీ ఆ తర్వాత అధికారులు దోమల చక్రంతో ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా, ప్రమాద స్థలానికి బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని విలపిస్తున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అదేవిధంగా మృతులు ఒడిశాలోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెరువు యజమాని, సూపర్వైజర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. -
దోమల కోసం పొగ వేస్తే.. ఊపిరాడక మహిళ మృతి
తిరువొత్తియూరు: చెన్నై పమ్మల్ పొన్నియమ్మన్ వీధికి చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. అతని భార్య పుష్పలక్ష్మి బుధవారం రాత్రి ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో నిప్పులతో పొగ వేసి, ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పుష్పలక్ష్మి మృతి చెందింది. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో పోరాడుతున్నారు. గురువారం ఉదయం చాలాసేపు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి తలుపు తెరచి చూడగా పుష్పలక్ష్మి మృతి చెందగా, మిగతా వారు స్ప్పహ తప్పి ఉన్నారు. వారిలో చొక్కలింగం, కుమార్తె మల్లిక, కుమారుడు విశాల్‌ను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
తెల్ల దోమలపై యుద్ధానికి బదనికల సైన్యం
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన సర్పిలాకార తెల్లదోమ (రూగోస్ వైట్ ఫ్లై) ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను వణికిస్తోంది. దేశంలోని కొబ్బరి తోటలతో పాటు 200 రకాలకు పైగా పంటలపై వేగంగా విస్తరిస్తూ సాగుదారులను నష్టాలకు గురి చేస్తోంది. ఈ కొత్త రకం తెల్లదోమ నియంత్రణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. సర్పిలాకార తెల్లదోమలను సమర్థవంతంగా ఎదుర్కొనే మిత్ర పురుగులను తయారు చేయడమే కాకుండా.. వాటి ఉత్పత్తి కోసం రాష్ట్రంలో రెండుచోట్ల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కడియంలో కనబడి.. దేశమంతా విస్తరించింది సర్పిలాకార తెల్లదోమ విదేశీ మొక్కల ద్వారా దేశంలోకి చొరబడిన కొత్త రకం దోమ. 2016లో కడియం నర్సరీలలో దీనిని గుర్తించినప్పటికీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గడచిన రెండేళ్లుగా చాపకింద నీరులా దేశమంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉద్యాన పంటలను దెబ్బతీస్తోంది. మన రాష్ట్రంతోపాటు కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న కేరళ, గోవా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బిహార్, అస్సోం వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొబ్బరితో పాటు అంతర పంటల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. కొబ్బరిలో 25–30 శాతం, ఆయిల్‌పామ్‌లో 35 శాతం, అరటి ఇతర పంటల్లో 15 నుంచి 25 శాతం విస్తీర్ణంలో వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. ఎలా దాడి చేస్తోందంటే.. సర్పిలాకార తెల్లదోమ రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఐదు దశల్లో వృద్ధి చెందే ఇది మామూలు తెల్లదోమ కన్నా ఐదు రెట్లు (దాదాపు 2.5 మి.మీ.) పెద్దది. దీని జీవితకాలం 40–45 రోజులు. ఇవి ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీల్చేసి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల ఏర్పడే లెప్టోగైజఫియమ్ అనే బూజు కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ దోమలు ఆకుల కింద తెల్లటి వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి ఉధృతి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, ఆకులే కాదు రెమ్మ, మొదళ్లు, పువ్వులు, కాయలు సైతం తెల్లని దూది లాంటి పదార్థంతో నిండిపోతాయి. ఈ ప్రభావం వల్ల 20–30 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. నియంత్రణకు ఏం చేయాలంటే.. సర్పిలాకార తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించేందుకు ఆముదం పూసిన పసుపు రంగు అట్టలను కాండంపై ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి తక్కువగా ఉంటే మిత్రపురుగు డైకో క్రైసా ఆస్టర్‌కు చెందిన 100–150 గుడ్లు, ఎక్కువగా ఉంటే 300–500 గుడ్లు చొప్పున విడుదల చేయాలి. తగిన మిత్ర పురుగులు లేకపోతే ఒక శాతం వేపనూనెకు 10 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ఫలించిన ‘ఉద్యాన’ పరిశోధనలు తెల్లదోమను ఎదుర్కొనేందుకు ‘సూడో మల్లడా’ అనే మిత్ర పురుగులు సమర్థవంతంగా పని చేస్తాయని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరు నుంచి ఇసారియా అనే ఫంగస్, తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి ‘ఎన్కార్సియా’ అనే మరో మిత్ర పురుగును తీసుకొచ్చారు. వీటి తయారీలో ఆర్బీకే సిబ్బందికి, కోనసీమ ప్రాంత రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా కోనసీమలో తెల్లదోమపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు. ఈ మిత్ర పురుగులు, ఫంగస్ తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో రూ.27 లక్షలతో జీవ నియంత్రణా పరిశోధనా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు (ఎంవోయూలు) కూడా చేసుకున్నారు. జీవ నియంత్రణా పద్ధతులతోనే నివారణ సాధ్యం తెల్లదోమ సోకిన మొక్కలను ఒకచోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. జీవ నియంత్రణా పద్ధతుల ద్వారా సామూహికంగా దీన్ని నియంత్రించగలం. ఇప్పటికే 30 లక్షల మిత్ర పురుగులను తయారు చేశాం. పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా ఇవి ఏమాత్రం సరిపోవు. అందుకే వీటి తయారీ కోసం 5 కంపెనీలతో ఉద్యాన యూనివర్సిటీ ఒప్పందాలు చేసుకుంది. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, శాస్త్రవేత్త, కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట -
మద్యం బాటిళ్లలో బొద్దింకలు
సాక్షి, చెన్నై : టాస్మాక్ మద్యం దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిల్లో బొద్దింకలు, చీమలు ఉంటున్నట్లు టాస్మాక్ షాపు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో ఫ్యాక్టరీలలో 50 శాతం మంది ఉద్యోగులు పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మద్యం ఫ్యాక్టరీలలో ఉత్పత్తి విభాగంలో పనిచేసే ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను శుభ్రపరిచే పనులు, వాటి పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఏర్పడినట్లు సమాచారం. కొన్ని రోజులుగా టాస్మాక్ దుకాణాలకు దిగుమతిచేసే మద్యం బాటిళ్లలో బొద్దింకలు, చీమలతో పాటు ఫంగస్ ఉంటున్నట్లు దుకాణాల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. (ప్రేమకు లాక్డౌన్ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య.. ) దీనిపై కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ మద్యం ఉత్పత్తి ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్ విభాగంలో ఆటోమేటిక్ యంత్రాలతో బ్లెండింగ్ పూర్తి చేసుకుని లేబుళ్లు అతికించడానికి ఒక నిమి షానికి ముందు 240 బాటిళ్లను 8 మంది ఉద్యోగులు చెక్ చేస్తారని, అందులో ఏమైనా ఉంటే బాటిళ్లను తొలగిస్తారని తెలిపారు. ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను సక్రమంగా పరిశీలించడం లేదని, ప్రస్తుతం టాస్మాక్ దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిళ్లలో ఈ విధంగా క్రిమి కీటకాదులు ఉంటున్నట్లు తెలిపారు -
దోమ.. తరిమేద్దామా..!
బుట్టాయగూడెం: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు వర్షాకాలంతో దోమల ద్వారా ప్రబలే వ్యాధులను నియంత్రించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పక్కా ప్రణాళికతో ఇప్పటికే పలు గ్రామాల్లో పనులను పూర్తిచేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇక్కడ మలేరియా, డెంగీ, కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇందుకు దోమలు ప్రధాన కారణం కావడంతో ఏజెన్సీ అధికారులు ప్రతి ఇంట్లో మలాథియాన్ స్ప్రేయింగ్ పనులు చేయిస్తున్నారు. 171 గ్రామాల్లో పనులు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు గిరిజన మండలాల్లోని 171 గ్రామాలను మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా అ«ధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో సుమారు 45 వేల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 1 నుంచి వచ్చేనెల 15 వరకు మొదటి విడత స్ప్రేయింగ్ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 40 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో ఆల్ఫా–సైఫర్ మెత్రీన్ (ఏసీఎం) అనే మందును పిచికారీ చేస్తుండగా బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో మలాథియాన్ స్ప్రేయింగ్ పనులు చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సబ్బులు, శానిటైజర్లు అందిస్తున్నారు. ఏడాదికి మూడు దశల్లో.. మలేరియా, డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఏటా మూడు దశల్లో 171 గ్రామాల్లో 12,684 ఇళ్లల్లో దోమల మందు స్ప్రేయింగ్ పనులు చేస్తుంటారు. జూన్ 1 నుంచి జూలై 15వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెండో విడత, అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో స్ప్రేయింగ్ చేయగా, విలీన మండలాల్లో రెండు దశల్లో పనులు చేస్తారు. స్ప్రేయింగ్ పనులకు సుమారు 35 టన్నుల దోమల మందును వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మన్యం.. కేసులు తగ్గుముఖం పశ్చిమ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో మలేరియా, డెంగీ జ్వరాల వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇటీవల కేసుల నమోదు తగ్గింది. సీజనల్ వ్యాధులపై అవగాహన కరోనాతో పాటు వర్షాలతో గిరిజన ప్రాంతంలో వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దోమలు పెరగకుండా ప్రతి ఇంట్లో దోమల మందు స్ప్రేయింగ్ పనులు చేయిస్తున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి.–ఆర్వీ సూర్యనారాయణ,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, కేఆర్ పురం 40 గ్రామాల్లో పనులు పూర్తి గిరిజన ప్రాంతంలో 171 గ్రామాలను మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆయా గ్రామాల్లో దోమల నివారణకు మలాథియాన్ స్ప్రేయింగ్ పనులు చేపట్టాం. ఇప్పటివరకు 40 గ్రామాల్లో మొదటి విడత పనులు పూర్తయ్యాయి. మిగిలిన గ్రామాల్లో పనులు పూర్తి చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం –పీఎస్ఎస్ ప్రసాద్,జిల్లా మలేరియా అధికారి, కేఆర్ పురం -
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
దోమను చూస్తే... ఇంకా దడదడే!
దేశంలో మలేరియా కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆగ్నేయాసియాలో మొదటి స్థానంలో మనమే ఉండటం కలవరపరుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ ఆఫ్రికా దేశాల సరసన నిలబడి 11వ స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ మలేరియా నివేదిక–2019 స్పష్టం చేసింది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఆగ్నేయాసియాలో 11 దేశాలుంటే, వాటిల్లో కేవలం 3 దేశాల్లోనే 98 శాతం మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో భారత్‌లోనే ఎక్కువగా 58 శాతం కేసులు నమోదవగా.. ఇండోనేసియాలో 30 శాతం, మయన్మార్‌లో 10 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా మరణాలు సైతం భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మలేరియా కేసులు 19 దేశాల్లోనే నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఐదేళ్లలో భారత్‌లో తగ్గుముఖం.. 2020 నాటికి మలేరియా కేసుల సంఖ్యను 40 శాతం కంటే ఎక్కువగా తగ్గించాలని, 2030 నాటికి మలేరియాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు మార్గనిర్దేశనం చేసింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ ముందుకు సాగుతోందని, సాపేక్షికంగా చూస్తే మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2014లో భారత్‌లో 11.02 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 562 మంది చనిపోయారు. అయితే తర్వాత మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2018లో మలేరియా కేసుల సంఖ్య ఏకంగా 3.99 లక్షలకు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 85కు పడిపోయింది. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నివేదికలో నూ వెల్లడించింది. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 5,189 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 1,327 మలేరియా కేసులే నమోదయ్యాయి. 38 దేశాలు మలేరియా రహితం.. మన పక్కనే ఉన్న మాల్దీవులు, శ్రీలంక దేశాలు మలేరియా రహితంగా కొనసాగుతున్నాయి. మొత్తం 38 దేశాలు మలేరియా రహితమని ధ్రువీకరించడం గమనార్హం. ఇక 2018లో 27 దేశాల్లో 100 కంటే తక్కువ మలేరియా కేసులున్నట్లు తేలింది. ప్రపంచంలో గతేడాది ఏకంగా 4.05 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారని నివేదిక తెలిపింది. అందు లో 2.72 లక్షల (67%) మంది ఐదేళ్ల పిల్లలే కావడం గమనార్హం. ఈ మరణాల్లో 85 శాతం భారత్ సహా ఆఫ్రికన్ ప్రాంతంలోనే సంభవించడంపై విచారం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో మలేరియాను ఎదుర్కోవాలన్న సవాల్లో పురోగతి మందగించిందని ప్రపంచ మలేరియా నివేదిక వ్యాఖ్యానించింది. వెయ్యిలో 57 మందికి.. 2010–18 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియా తీవ్రత తగ్గిందని ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది. 2010లో ప్రతీ వెయ్యిలో 71 మంది మలేరియాకు గురికాగా, 2018లో ఆ సంఖ్య 57 కేసులకు పడిపోయింది. ఏదేమైనా 2014–2018 వరకు మలేరియా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువ గా మలేరియా బారిన పడుతున్నా రు. వీరిపై దృష్టి పెట్టకపోతే ఎటువంటి పురోగతి సాధించలేమని మలేరియా నివేదిక తెలిపింది. -
ఇక మస్కిటోలు.. మస్కా ‘కుట్ట’లేవు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరవాసుల్ని దోమలు ఎడాపెడా కుట్టి పారేశాయి. డెంగీ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సహా పలువురిని తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దోమల నివారణ చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఏ ప్రాంతంలో డెంగీ కారక దోమలు ఎక్కువున్నాయో గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ‘మస్కీట్’అనే ఉపకరణాలను శేరిలింగంపల్లి జోన్ మినహా మిగతా ఐదు జోన్లలోని ఐదు ప్రాంతాల్లో అమర్చారు. వీటి ద్వారా వెల్లడయ్యే లెక్కలతో ఆయా ప్రాంతాల్లోని దోమల రకాల్ని గుర్తిస్తారు.ఆపై నివారణ చర్యలు చేపడతారు. ‘మస్కీట్’లు ఎక్కడెక్కడ? సికింద్రాబాద్ జోన్– బేగంపేట కూకట్పల్లి జోన్– బోరబండ ఎల్బీనగర్ జోన్– నాచారం చార్మినార్ జోన్– మలక్‌పేట ఖైరతాబాద్ జోన్– జీహెచ్ఎంసీప్రధాన కార్యాలయం 902: గ్రేటర్లో సెపె్టంబర్ 5 – అక్టోబర్ 30 మధ్య ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన డెంగీ కేసులు 1,415: ప్రైవేట్ ఆస్పత్రుల్లోధ్రువీకరించిన డెంగీ అనుమానిత కేసులు బేగంపేటలో దోమల బెడద ఎక్కువ.. మస్కీట్ ఉపకరణాల్లోకి చేరిన దోమలను లెక్కించడం ద్వారా డెంగీని వ్యాపించే దోమలు బేగంపేట, నాచారం ప్రాంతాల్లో ఎక్కువున్నట్టు గుర్తించారు. బోరబండ, మలక్‌పేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా కు కారణమైన ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ తెగలకు చెందిన దోమలు, మలేరియా కారకాలైన అనాఫిలిస్ సబ్పిక్టస్, అనాఫిలిస్ క్యూలిసిఫేసీస్ కూడా బేగంపేట లోనే ఎక్కువ. మెదడువాపు, బోదకాలు వ్యాధులకు కారణమైన క్యూలెక్స్ క్వింక్లకు సైతం బేగంపేటనే అడ్డా.. తరువాత స్థానంలో బోరబండ ఉంది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో మాత్రం అన్ని రకాల దోమలూ స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. ఐదుచోట్ల లెక్కలతో అంచనా కష్టం వివిధ రకాల దోమలు సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే ‘మస్కీట్’కు ఎక్కువగా చిక్కాయి. ఇంత పెద్ద మహానగరంలో ఐదు ప్రాంతాల్లోని లెక్కల ఆధారంగా దోమల రకాలను అంచనా వేయడం కష్టమని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. దాదాపు వంద ప్రాంతాల్లో ఇటువంటివి ఏర్పాటైతే ఏ వ్యాధికారక దోమలు ఎక్కువున్నాయో స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉపకరణాలు బిగించిన ప్రాంతాల్లో ఏ రకం దోమలు ఎక్కువున్నాయో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. నెల పాటు అధ్యయనం తరువాత ‘మస్కీట్’లెక్కలపై స్పష్టత వస్తుందన్నారు. ‘మస్కీట్’ఇలా పని చేస్తుంది.. మస్కీట్ ఉపకరణాల్లో లిక్విడ్, సెన్సర్లతో పాటు ఉండే ప్రత్యేక వాసనలు వదులుతారు. వీటికి దోమలు ఆకర్షితమై ఉపకరణాల్లోకి చేరతాయి. మస్కీట్‌కు అనుసంధానించిన కంప్యూటర్ డ్యాష్‌బోర్డు ఆధారంగా ఇలా చేరిన దోమల్లో రకానివెన్నో విశ్లేషిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏయే వేళల్లో దోమల తీవ్రత ఎక్కువ ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు. ఒక్కో మస్కీట్ ఉపకరణానికి జీహెచ్ఎంసీ రూ.70 వేల చొప్పున వెచ్చించింది. ఈ యంత్రాలం వినియోగం ద్వారా మొదట ఆయా ప్రాంతాల్లోని దోమల రకాలను గుర్తిస్తారు. తద్వారా ఆయా దోమకారక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటారు. -
ట్యాబ్లెట్లో దోమ
సంగారెడ్డి రూరల్ : గ్రామ ఆరోగ్య వేదికలో వైద్య సిబ్బంది అందజేసిన ప్యారసెటమాల్ ట్యాబ్లెట్లో దోమ రావడంతో అధికారులు కంగుతిన్నారు. బుధవారం సంగారెడ్డి రూరల్ మండల కేంద్రమైన కందిలో గ్రామ ఆరోగ్య వేదిక నిర్వహించారు. లక్ష్మీనగర్‌కు చెందిన సీహెచ్ రాము అనే యువకుడికి జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఉండటంతో ఆరోగ్య వేదికకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన రాము, సిబ్బంది ఇచ్చిన ట్యాబ్లెట్లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్ ట్యాబ్లెట్ ప్యాకింగ్‌లో మృతి చెందిన దోమ ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే ఆరోగ్య వేదికకు వచ్చి ట్యాబ్లెట్‌ను సిబ్బందికి చూపించడంతో వారు ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకొని పైఅధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్‌గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి. -
రక్త పిశాచాలు వచ్చేశాయ్..!
సాక్షి, దర్శి టౌన్: వర్షాకాలం.. వ్యాధుల వ్వాప్తికి అనువైనది. ఎక్కడికక్కడ వర్షం నీరు, మురుగు నిల్వ ఉండటంతో దోమలు వ్వాప్తి చెందుతాయి. జనంపై దాడి చేస్తాయి. వ్యాధుల వ్వాప్తికి కారణం అవుతాయి. దోమల నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖలు ఏమాత్రం అలక్ష్యం చేసినా అతిసారా, డయేరియా, చికున్ గున్యా, విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపరచని కారణంగా 2017లో జిల్లాలో 1.10 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు. మొత్తం 71 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దోమల సంతానోత్పత్తి ఇలా.. ► నిల్వ ఉన్న మురుగు నీటిలో దోమలు జీవిస్తాయి. ► వర్షాకాలంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తితో వృద్ధి చెందుతాయి. ► దోమ జీవిత కాలం 40 నుంచి 60 రోజులు ఉంటుంది. ► ఒక దోమ జీవిత కాలంలో సుమారు పది వేల గుడ్లు పెడుతుంది. ► గుడ్ల దశ నుంచి దోమగా మారడానికి కేవలం 10 నుంచి 12 రోజలు పడుతుంది. ► ఆడ దోమలే మనుషులను కుడతాయి. వ్యాధుల వ్వాప్తికి ఆడ దోమలే కారణం. దోమల వల్ల వచ్చే వ్యాధులు దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా, మెదడు వాపు వ్యాధులు సోకుతాయి. ప్లాస్మోడియం, ఫాల్లిఫారం అనే పరాన్న జీవి కలిగి ఉన్న ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. చలితో కూడిన జ్వరం దీని లక్షణం. సకాలంలో స్పందించి వైద్య సేవలు పొందకపోతే మరణించే అవకాశాలూ లేకపోలేదు. చికున్ గున్యా ఈ వ్యాధి కూడా నీటి నిల్వలో పెరిగే ఈజిప్ట్, టైగర్ దోమల వల్ల వస్తుంది. తీవ్రమైన జ్వరాలు, కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వస్తాయి. మందులు వాడితే తగ్గినట్టుండి మళ్లీ వస్తుంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొందాలి. డెంగీ మంచినీరు, మురుగు నీటిలో పెరిగిన ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ లేదా టైగర్ దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. డెంగీ హేమరేజస్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్‌కు గురైతే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకితే తీవ్రమైన జ్వరం, శరీరం ఎర్రగా కందిపోయి దద్దుర్లు రావడం, కళ్లు కదిలించలేక పోవడం, ఒళ్లు, కండరాల నొప్పులు, సాధారణ వాంతులు, రక్తం వాంతులు అవుతాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వ్యాధిగ్రస్తుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడాలి. మెదడు వాపు క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్నపిల్లలకు ఎక్కువగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల కళ్లు తిరగడం, రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. కదల్లేని నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. పందులకు కుట్టిన వ్యాధికారక వైరస్ దోమలు మనుషులకు కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. నివారణ ఇలా.. పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలి. మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లో చెత్తాచెదారం, పేడదిబ్బలు దూరంగా వేయాలి. కొబ్బరి బొండాలు, పాత టైర్లు, వినియోగించని మట్టి పాత్రలు, పూల కుండీలు, దోమలు అభివృద్ధి చెందే పనికిరాని పరికరాలు ఇళ్లకు దూరంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఫ్రిజ్, కూలర్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి వస్తువులను ఎండబెట్టడం ద్వారా దోమలను నివారించుకోవచ్చు. దోమలు నివాసాల్లోకి రాకుండా కిటికీలు, తలుపులు సాయంత్రం మూసివేయాలి. దోమల నిర్మూలనకు కాయిల్స్ వాడాలి. అప్రమత్తం చేశాం ఇప్పడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి అనారోగ్యానికి గురైనా సమాచారం అందించి వైద్యసేవలు పొందాలని సూచిస్తున్నాం. – బి.రత్నం, పీహెచ్సీ వైద్యాధికారి, తూర్పుగంగవరం -
పట్నంలో అడవి దోమ!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి దాకా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకే పరిమితమైన దోమలు ఇప్పుడు గ్రేటర్‌లోనూ దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీ ఫారం(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి దాకా 191 మలేరియా కేసులు నమోదవగా, వీటిలో 150 మందిలో పీఎఫ్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా మలేరియా సోకుతుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం(పీఎఫ్) అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్ వ్యాపించినపుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ ప్లాస్మోడియం పాల్సీఫారం మలేరియా చాలా ప్రమాదకరమైంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో కన్పించే ఈ జ్వరాలు.. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు విస్తరించడం, కొత్తగా ఫామ్‌హౌస్‌లు అందుబాటులోకి రావడం, నిర్మాణానికి సంబంధించిన గుంతల్లో వరద నీరు చేరి నిల్వ ఉండటం, వాటి నిండా చెత్త పేరుకపోవడం వల్ల ఈ దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరీక్ష చేసేవారే లేరు హైదరాబాద్ జిల్లాలో ఫీవర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, మాసాబ్ ట్యాంక్, మలక్‌పేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్లలో మలేరియా సబ్‌సెంటర్లు ఉన్నాయి. 17 మంది ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఉండగా, వీటన్నింటికీ ఒక్క టెక్నీషియన్ మాత్రమే ఉన్నాడు. మిగతా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేసే నాథుడే కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో మలేరియా, డెంగీ కేసు నమోదైన వెంటనే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులతో పాటు సదరు కాలనీలో 50 మందికి తక్కువ కాకుండా రక్త నమూనాలు సేకరించాలి. వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు నమూనాలు సేకరించాలి. కొన్ని ఏరియాల్లో సేకరిస్తున్నా అవి ల్యాబ్‌లకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని పరీక్షించేందుకు తీవ్రంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్యంపై దృష్టి దోమల నియంత్రణ చేపట్టాల్సిన బల్దియా చోద్యం చూస్తోంది. విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు కొన్ని రోజులుగా నగరంలో డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో గతేడాది 150 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటి దాకా 205 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ జ్వర లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీని పూర్తిగా నివారించవచ్చు. అయితే, అందుకు తొలుత రక్త పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆస్పత్రుల్లో ఆ అవకాశం దాదాపు ఉండడం లేదు. నగరంలో మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నా సరే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నివారణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లక్షణాల గుర్తింపు ఇలా.. ప్లాస్మోడియం పాల్సీఫారం రకం మలేరియాను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్స అందించడంలో ఆలస్యమైతే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో జ్వరం వస్తుంది. రోజు విడిచి రోజు ఒక సమయంలో ఎక్కువగా సాయంత్రం వేళల్లో చలి జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మూడు రోజులు మించి ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేసుకోవాలి. – డాక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ -
ధూమపానం, కాయిల్స్‌తో క్యాన్సర్ రాదట!
సాక్షి, న్యూఢిల్లీ : ధూమపానం వల్ల, దోమలను పారదోలేందుకు కాయిల్స్ కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వస్తున్నాం. అది పొరపాటు అభిప్రాయమని, వాటిల్లో క్యాన్సర్ కారకాలు అంతగా లేవని తాజా పరిశోధనలో వెల్లడయింది. కాకపోతే వీటి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. తలుపులు భిగించిన గదుల్లో సిగరెట్లను, దోమల కాయిల్స్‌ను విడివిడిగా వెలిగించినప్పుడు, అవి కాలుతున్నప్పుడు, కాల్చిన తర్వాత ఆయా గదుల వాతావరణంలోకి ఎలాంటి ఖనిజాలు వెలువడ్డాయో పరిశోధకులు అధ్యయనం జరిపారు. అల్యూమినియం, కాపర్, జింక్, కాడిమియం, క్రోమియం, మాంగనీసు, నికిల్, లెడ్, వనడియం, సెలినియం, స్కాండియం తదితర ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. రెండు రకాల శాంపుల్స్ తీసుకొని వాటిలో ఈ ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా పరిశీలించారు. రెండింట్లోనూ అల్యూమినియం, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్లు, కాడిమియం, వాలియం, సెలెనియం తక్కువగా ఉన్నట్లు తేలింది. క్రోమియం, లెడ్, నికిల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతుందన్న విషయంపై కూడా తాము అధ్యయనం జరిపామని, క్యాన్సర్ వచ్చే అవకాశం కన్నా అవి తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని అధ్యయనానికి అక్షరరూపం ఇచ్చిన ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ రసాయన శాస్త్ర విభాగం అధిపతి అజయ్ తనేజా తెలిపారు. ఆయన అధ్యయన వ్యాసాన్ని ‘ఎస్ఎన్ అప్లైడ్ సైన్సెస్’ జర్నల్ ప్రచురించింది. తాము ప్రస్తుతానికి సిగరెట్, వివిధ రకాల మస్కిటో కాయల్స్ నుంచి వెలువడుతున్న ఖనిజాలపైనే అధ్యయనం జరిపామని, వీటి నుంచి దాదపు నాలుగువేల రసాయనాలు కూడా వెలువడుతాయని, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అన్న కోణంలో ఇంకా అధ్యయనం జరపాల్సి ఉందని తనేజా పేర్కొన్నారు. దోమల కాయల్స్లో కన్నా సెగరెట్లలోనే కాపర్, జింక్, మాంగనీస్, నికిల్, లెడ్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే క్యాన్సర్ వచ్చే స్థాయిల్లో మాత్రం లేదని, ధూమపాన ప్రియలు ఇళ్లలో, గాలి బయటకు పోని గదుల్లో పొగ తాగకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇంట్లో దోమలను చంపేందుకు లేదా పారదోలేందుకు కాయిల్స్‌ను కాల్చడం వల్ల ఎక్కువ మందిలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తనేజా చెప్పారు. ఎక్కువ కాలం వీటికి ఎక్స్పోజ్ అయితేనే వ్యాధులు వస్తాయని అన్నారు. ఎవరికి, ఎంతకాలంలో వస్తుందన్నది అంచనా వేయలేమని, వారి వారి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి బట్టి ఈ శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన వివరించారు. కొందరికి శరీరంపై దద్దులు, ఇతర ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దోమలను పారదోలే ‘ఆల్ అవుట్’ లాంటి ద్రవరూపక ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ప్రత్యామ్నాయం కాదని, వాటి ద్వారా కూడా సేంద్రియ రసాయనాలు వెలువడతాయని ఆయన హెచ్చరించారు. శ్వాసకోస వ్యాధులు కూడా దీర్ఘకాలంలో మరణానికి దారితీస్తాయని, ఈ మరణాలను కూడా వాయు కాలుష్య మరణాల కింద లెక్కించాల్సి ఉంటుందని తనేజా తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2017లోనే భారత్‌లో 12 లక్షల మంది మరణించినట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ 2018, డిసెంబర్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఇటీవల భారత్‌లోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిన విషయం తెల్సిందే. బయటి కాలుష్యం ఎంత ప్రమాదకరమో ఇళ్లలోని వాయు కాలుష్యం కూడా అంతే ప్రమాదకరమని తనేజా హెచ్చరిస్తున్నారు. -
కాయిల్ పొగ.. పెడుతుంది సెగ..!
వానాకాలం వచ్చేసింది.. దోమలు విజృంభించే కాలమిది. ఏం ఫర్వాలేదు.. వాటిని తరిమేందుకు మా దగ్గర కాయిల్ ఉందిగా అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే దోమలను పారదోలేందుకు వాడే కాయిల్స్‌తో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాయిల్స్ పొగతో పాటు ఇళ్లలోపల సిగరెట్ పొగ కారణంగా అనారోగ్యం గ్యారంటీ అని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే ఇక్కడ ఓ శుభవార్త ఉంది. ఈ రెండు పొగల కారణంగా కేన్సర్ మాత్రం రాదని ఎస్ఎన్ అప్లయిడ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. ఇళ్ల లోపలి గాలిలోని కాలుష్యం మన ఆరోగ్యంపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఆగ్రాలోని అంబేడ్కర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. సీల్ చేసిన గదిలో వేర్వేరు పొగల ద్వారా ఏయే రసాయనాలు, లోహాలు గాల్లో కలుస్తున్నాయి.. వాటి పరిమాణం ఎంత.. (పీఎం 25, పీఎం 10, పీఎం 2.5, పీఎం 1) అన్నది లెక్కకట్టారు. మండించేందుకు ముందు.. మండుతూ ఉండగా, ఆ తర్వాత పరిశీలించగా అల్యూమినియం, రాగి, జింక్, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, సీసం, వనాడియం, సెలీనియం, స్కాండియం వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. వీటిల్లో కూడా అల్యూమినియం, జింక్‌ల మోతాదు ఎక్కువగా ఉందని, కాడ్మియం, వనాడియంలు లేశమాత్రంగా ఉన్నాయని అజయ్ తనేజా అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్ ప్రమాదం తక్కువే.. క్రోమియం, సీసం, నికెల్‌ల ద్వారా కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నా.. దోమల కాయిల్, సిగరెట్ పొగ రెండింటి ద్వారా వెలువడే ఈ లోహాలు పరిమితమైన స్థాయిలోనే ఉన్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఎంతకాలం పాటు ఈ విషవాయువులను పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయో స్పష్టంగా తెలియదని అజయ్ తనేజా వివరించారు. కాయిల్‌కు బదులుగా ద్రవాన్ని వాడినా ఇవే రకమైన రసాయనాలు విడుదలవుతాయని చెప్పారు. వాయుకాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం వాయుకాలుష్య నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాయిల్, సిగరెట్లను మండించినప్పుడు అతి సూక్ష్మమైన ధూళికణాలు గాల్లోకి చేరతాయని వీటిని పీల్చడం వల్ల.. శరీరంపై దద్దుర్లు, అనేక రకాల అలర్జీలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశముందని అజయ్ తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. -
దోదో!
‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘ఈ ఎండల్లో కొచ్చెన్ ఏం అడుగుతానుగానీ...నువ్వు విన్నవి కన్నవి చల్లని రెండు జోక్‌లు చెప్పు చాలు’’ అన్నాడు నీరసంగా భేతాళుడు. ‘‘ఓకే’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు: అనగనగా ఒక మగదోమ, ఒక ఆడదోమ. మగదోమ రెండు వారాల పాటు ఏదో పని మీద బిహార్ వెళ్లి వచ్చింది. ‘‘ఎలా ఉన్నావు డియర్!’’ అడిగింది ఆడదోమ. ‘‘నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టు....నీకోసం ఏమైనా చేస్తాను. సింహాన్ని వేటాడి తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘సరేలే’’ అన్నది తేలికగా ఆడదోమ. ‘‘సరేలే కాదు. నిన్ను నా భుజాల రెక్కలపై కూర్చోబెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏడ్చినట్టే ఉంది’’ అన్నది ఆడదోమ. ‘‘ఏడ్చినట్లే ఉండడం కాదు...ప్రియా! స్వర్గాన్ని నీ కోసం ఆన్లైన్లో తెప్పిస్తాను’’ ‘‘సరేలేగానీ....కాస్త రెస్ట్ తీసుకోండి...ప్రయాణ బడలికతో వచ్చారు’’ అన్నది ఆడదోమ. ‘‘రెస్ట్ సంగతి సరే...ఆ ఎవరెస్ట్‌ను నీ పాదాల దగ్గర తెల్లకుక్క పిల్లలా కూర్చోబెడతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏమైంది మీకు? ఎందుకు ఇలా కోతలు కోస్తున్నారు?!’’ అని ఆశ్చర్యంగా అడిగింది ఆడదోమ. ‘‘కోతలు కాదు ప్రియా! తాజ్‌మహల్ దగ్గరకు ఎవరైనా వెళతారు. కాని ఆ తాజ్‌మహల్‌నే నీ దగ్గరకు తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘ఇవన్నీ కాదుగానీ నా కోసం ఒకచోటుకి రావాలి’’ గోముగా అడిగింది ఆడదోమ. ‘‘సరే దానిదేముంది!’’ అంటూ ఆడదోమతో పాటు వెళ్లింది మగదోమ. ‘దోమల మానసిక చికిత్స కేంద్రం’ అని బోర్డ్‌పై రాసి ఉన్న హాస్పిటల్లోకి రెండు దోమలు వెళ్లాయి. ‘‘ఇంతకీ ఏమిటి మీ సమస్య?’’ డాక్టర్ దోమ ఆడదోమను అడిగింది. ‘‘సమస్య నాకు కాదు...మా ఆయనకు’’ అన్నది ఆడదోమ. ‘‘చూస్తే దుక్కలా ఉన్నాడు. ఏమిటి సమస్య!’’ అని గోడ కూలినట్లు నవ్వింది డాక్టర్ దోమ. ‘‘మా ఆయన రెండు వారాల పాటు టూరు వెళ్లారండీ. అప్పటి నుంచి చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన తొడకొడుతున్నారు. మీసం మెలేస్తున్నారు. ఒక దగ్గర రెండు దోమలు కనబడితే చాలు ఉపన్యాసమిస్తున్నాడు. ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు....’’ చెప్పుకుంటూ పోయింది ఆడదోమ. డాక్టర్ దోమకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు స్కెతస్కోప్తో తలకొట్టుకొని ఆలోచించింది. ఏమీ స్ఫురించలేదు. లైబ్రరీకి వెళ్లి సీరియస్‌గా బుక్స్ తిరిగేసి నోట్స్ రాసుకొని వచ్చింది. ‘‘అయ్యా! హాస్పిటల్‌కు వచ్చి అరగంటవుతోంది. ఇంతవరకు సమస్య ఏమిటో చెప్పలేదు’’ అసహనంగా అన్నది ఆడదోమ. ‘‘దాని గురించే ఆలోచిస్తున్నాను’’ అని పెన్నును నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచించసాగింది డాక్టర్ దోమ. ‘‘అయ్యా కేసు నన్ను టేకప్ చేయమంటారా?’’ ఆతృతతో అడిగింది కంపౌండర్ దోమ. ‘‘చేసి చావు...’’ అని నిద్రలోకి జారింది డాక్టర్ దోమ. ‘‘ఏమయ్యా ఇలా వచ్చి కూర్చో’’ అని ఆర్డరేసింది కంపౌడర్ దోమ. ‘‘అలాగే’’ అంటూ బుద్ధిగా కూర్చుంది మగదోమ, ‘‘ఏమయ్యా...నీ పేరేమిటి?’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘దోసకొండ దోమప్ప... అందరూ ముద్దుగా దోదో అని పిలుస్తారు’’ అని చెప్పింది మగదోమ. ‘‘చూడు దోదో...ఇప్పుడు నేను నిన్ను ట్రాన్స్‌లోకి తీసుకువెళతాను. ఓకేనా!’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘ఓకే’’ అన్నది దోదో. ‘‘ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటున్నావు. నీకు చెవులు ఉన్నాయి... కానీ నేను మాట్లాడింది తప్ప ఏ సౌండూ నీకు వినబడడం లేదు. నీకు మైండ్ ఉంది. కానీ నేను చెప్పిందాన్ని గురించి తప్ప దేని గురించి...అది ఆలోచించడం లేదు. వెళుతున్నావు.... లోలోనికి వెళుతున్నావు. నీదైన ప్రపంచంలోకి... ఇప్పుడు చెప్పు...అసలు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?’’ అడిగింది కంపౌడర్ దోమ. ‘‘పని మీద బిహార్‌కు వెళ్లానండి. అక్కడ ఎలక్షన్ హడావిడి కనిపించింది. ఒకరోజు బిహార్‌లో ఒకచోట బాగా ఆకలైంది. ఎటుచూసినా చెట్టుచేమలే తప్ప మనుషుల జాడ కనిపించలేదు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తే వేగంగా అటు వెళ్లాను. అక్కడ ఎన్నికల సభ జరుగుతోంది. నాయకుడు మాంచి జోరుమీద ఉన్నాడు. ‘‘మీ కోసం నా ప్రాణం ఇస్తాను’’ అంటున్నాడు. ‘‘ప్రాణం ఎందుకుగానీ...రక్తం ఇవ్వు చాలు’’ అని వెళ్లి కుట్టాను. దీంతో నా మైండ్ దెబ్బతింది. నేనేమి మాట్లాడుతున్నానో....నాకే తెలియడం లేదు.’’ అని అసలు విషయం చెప్పింది దోదో!! 2 సుబ్బారావు అప్పారావుకు లక్షరూపాయలు అప్పు ఇచ్చాడు. కాని అప్పారావు ‘ఇదిగో అదిగో’ అంటున్నాడే తప్ప అప్పు తీర్చడం లేదు. విసుగెత్తిన సుబ్బారావు ఒక లాయర్ దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ‘‘అప్పారావుకు లక్ష రూపాయాలు అప్పు ఇచ్చినట్లు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా?’’ అడిగాడు లాయర్. ‘‘లేదు’’ అని భోరుమన్నాడు సుబ్బారావు. ‘‘అయితే ఇలా చెయ్’’ అని సుబ్బారావు చెవిలో ఏదో చెప్పాడు లాయర్. పావుగంటలోనే సుబ్బారావుకు గట్టి సాక్ష్యం దొరికింది. ‘‘భేతాళా! ఈరోజు నేను నిన్ను కొచ్చెన్ అడుగుతాను. ఇంతకీ లాయర్ అతడి చెవిలో ఏం ఊదాడు?’’ అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు చెప్పిన జవాబు: సుబ్బారావు అప్పారావుకు ఫోన్ చేసి...‘‘నీకు అప్పుగా ఇచ్చిన అయిదు లక్షలు నాకు అర్జంటుగా కావాలి’’ అన్నాడు. ‘‘అయిదు లక్షలా...ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు. మతిగానీ పోయిందా’’ మండిపడ్డాడు అప్పారావు. ‘‘నువ్వు ఇలా మరిచిపోతే ఎలా అప్పారావు! అక్షరాల అయిదు లక్షలు ఇచ్చా’’ అన్నాడు సుబ్బారావు. ‘‘నువ్వు నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఇంతకంటే నువ్వు ఒక్క పైసా నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’అన్నాడు అప్పారావు. ‘‘అంటే నువ్వు తీసుకుంది లక్షరూపాయలేనంటావు’’ ‘‘కచ్చితంగా లక్షరూపాయలే’’ ‘ఓకే’అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. అప్పారావు వాయిస్ రికార్డయింది. ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది! – యాకుబ్ పాషా -
టమాటాకు రక్షణ బంతి
తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది. లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం. -
ప్రాణం తీసిన దోమల చక్రం!
చేబ్రోలు (పొన్నూరు): దోమల బెడద నివారణ కోసం వెలిగించిన దోమల చక్రం ఓ మహిళ ప్రాణం తీసింది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాపురం చానల్ సమీపంలో జీబీసీ రహదారి పక్కన పూరిల్లు వేసుకొని రేపూరి శ్రీను, వనజ నివసిస్తున్నారు. చేపలు పట్టుకొని, విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. బుధవారం రాత్రి దోమలు కుట్టకుండా దోమల చక్రాలను అంటించుకుని పడుకున్నారు. ప్రమాదవశాత్తు పూరిపాకకు నిప్పురాజుకుని మంటలు చెలరేగడంతో వనజ (50) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త శ్రీను కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. చేబ్రోలు సీఐ డి.నరేష్కుమార్, ఎస్ఐ సీహెచ్ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
అమ్మో అమెరికా దోమ
అమలాపురం: ఖండాంతరాలు దాటి కడియపు లంకకు చేరుకున్న శత్రువు పచ్చని గోదారి జిల్లాలను పీల్చి పిప్పి చేస్తోంది. ఎటు చూసినా పచ్చని పైర్లు, పండ్ల తోటలు, నర్సరీలతో అలరారే ఉభయగోదావరి జిల్లాలు ఈ శత్రువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు.. తరువాత కడియం నర్సరీలకు..అక్కడ నుంచి క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది రూగోస్ వైట్ఫ్లై (వలయాకారపు తెల్లదోమ). తొలుత నర్సరీల్లోని మొక్కలకు.. తరువాత కొబ్బరి.. ఆయిల్ పామ్.. తాజాగా అరటి, మామిడి, జీడిమామిడి, సీతాఫలం, సపోటా, పనస..ఇలా అన్ని రకాల పంటలను ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేరళ, తమిళనాడు కొబ్బరి రైతులకు వలయాకార తెల్లదోమ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అక్కడ దిగుబడి 40 శాతం వరకు పడిపోయింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఈ దోమ ఉధృతికి తోడు వర్షాలు లేక వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయి. మూడేళ్ల క్రితం దీని జాడ కనిపించినా ఇప్పటికీ ఉధృతి తగ్గలేదు. మన రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న కొబ్బరి మొక్కల ద్వారా ఇది వ్యాపించింది. తరువాత కడియం నర్సరీకి వ్యాపించింది. నర్సరీ మొక్కల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దీని ఉధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి 1.78 లక్షల ఎకరాల్లోను, ఆయిల్‌పామ్ 98 వేల ఎకరాలు, అరటి 74 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక కడియం, పరిసర ప్రాంతాల్లో 14 వేల 500 ఎకరాల్లో పూలు, పూలమొక్కలు, ఆర్నమెంట్ సాగు చేస్తున్నారు. దిగుబడిపై పెనుప్రభావం... కొబ్బరి, ఆయిల్ పామ్ దీర్ఘకాలిక పంటలు. అరటి కార్సి తోట పంట కావడం వల్ల మూడేళ్లపాటు రైతులకు ఆదాయాన్నిస్తోంది. ఈ పంటలను తెల్లదోమ ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. నర్సరీ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గడచిన రెండేళ్లుగా తెల్లదోమ వల్ల సుమారు 30 శాతం విక్రయాలు తగ్గిపోయాయని నర్సరీ రైతులు చెబుతున్నారు. మొక్క ఆకుల దిగువు భాగాన్ని ఈ తెల్లదోమ అశిస్తోంది. ఇది వదిలే వ్యర్థం ఆకు ఎగువ భాగంలో దట్టమైన నల్లని పొర రూపంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఆకుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు బలహీనంగా మారి దిగుబడి పడిపోతోంది. వాతావరణంలో తేమ పెరిగే కొద్దీ ఇది శరవేగంగా విస్తరిస్తోంది. చేతులెత్తేసిన అధికారులు.. తెల్లదోమ నిర్మూలన విషయంలో ఉద్యాన శాఖ అధికారులు చేతులెత్తేశారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దీన్ని నివారించేందుకు కొంతవరకు చర్యలు చేపట్టారు. గతంలో కడియం మొక్కలను గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారు. తెల్లదోమను అరికట్టేందుకు ఎల్లోస్టిక్స్ (పసుపురంగు అట్టలు), ఎన్కార్సియా గ్వడెలోపే, ఎన్కార్సియా డిస్‌పెర్సా (బదినికలు), వేపనూనె మందులను అందించారు. డ్రోన్లను తీసుకు వచ్చి మందులు పిచికారీ చేయించారు. కేరళ, తమిళనాడు నుంచి తెల్లదోమ సోకిన మొక్కలు రాగా వాటిని గుర్తించి తగులబెట్టారు. తొలి ఆరు నెలల్లో దీని ఉధృతిని అరికట్టేందుకు కృషి చేసిన ఉద్యానశాఖ అధికారులు తరువాత కాలంలో అలసత్వం ప్రదర్శించారు. దీనికితోడు రైతులు సైతం సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో దీని ఉధృతి క్రమేపీ తీవ్రమవుతోంది. అన్ని ప్రాంతాల్లోను కొబ్బరి, అరటి, ఆయిల్ పామ్ తోటలకు ఇది విస్తరిస్తోంది. ఇప్పటివరకు గోదావరి జిల్లాల కొబ్బరిలో 30 శాతం అంటే సుమారు 50 వేల ఎకరాలకు పైబడి ఈ వ్యాధి సోకిందని అంచనా. చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నిర్మూలనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తాజాగా డ్రైకోక్రైసా ఆస్టర్ మిత్ర పురుగులను రైతులకు అందిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది. మిత్ర పురుగులతో ఎదుర్కొంటున్నాం... తెల్లదోమ ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. రసాయన మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతి, మిత్ర పురుగులు వినియోగం ద్వారా చాలా వరకు దీన్ని అరికట్టే అవకాశముంది. ఎన్కార్సియా గ్వడెలోపే, డైకోక్రైసాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. – ఎన్.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
జ్వరం..కలవరం..!
జూన్, జూలైలో తొలకరి చినుకులు పలకరించాయి. తరువాత అడపాదడపా వానలు పడ్డాయి. తేలికపాటి జల్లులకే నిద్రావస్థలో ఉన్న దోమలు మేల్కొన్నాయి. అందుకు జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం తోడైంది. ఇంకేముంది దోమలు ప్రజలపై దండయాత్ర చేయడం ప్రారంభించాయి. దీంతో జిల్లా వాసులు జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రుల బాట పట్టారు. కడప రూరల్: జిల్లాలోని కడప రిమ్స్‌లో ఒక రోజుకు ఔట్ పేషెంట్స్ గడిచిన మే నెలలో 800 నుంచి 1100 వరకు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1200 నుంచి 1600 వరకు పెరిగింది. ఇందులో అన్ని వ్యాధులకు సంబంధించిన వారు ఉన్నప్పటికీ, జ్వర పీడితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో తాజాగా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అక్కడికి ఒక రోజుకు దాదాపు 70 నుంచి 100 మందికి పైగా వస్తున్నారు. గడిచిన ఏడాది వానలు పుష్కలంగా పడ్డాయి. దాంతోపాటే రోగాలు కూడా పెరిగాయి. ప్రతి ఏటా దాదాపు ఒక లక్ష మంది వరకు కేవలం వివిధ రకాల జ్వరాల బారిన పడుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు దాదాపు 40 వేల మందికిపైగా జ్వరాలకు గురయ్యారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా డెంగీ కేసులకు సంబంధించి 45 మంది అనుమానితులుగా గుర్తించగా అందులో కడప నగరం ప్రకాష్‌నగర్, మరియాపురం, మస్తాన్‌వలి వీధిలో ఒక్కక్కరి చొప్పున ప్రొద్దుటూరు, పెద్ద చెప్పలి, ఎర్రగుంట్లలో మొత్తం ఏడుగురికి డెంగీ ఉన్నట్లుగా గుర్తించారు. పరిసరాల అపరిశుభ్రత, కలుషిత నీరు, తదితర కారణాల వల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డయేరియా, నీళ్ల విరేచనాల కేసులు నమోదవుతున్నాయి. జ్వరాలు ఎందుకొస్తాయంటే... వాతావరణంలో సంభవించే మార్పులు, ఇంట్లో, బయట పరిసరాల అపరిశుభ్రత కారణంగా వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఏడాదికి ఒకవైరస్ పుడుతోంది. ఆ మేరకు వైరల్ ఫీవర్స్ వస్తాయి.వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను పాటించడం వల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చు అని వైద్యులు అంటున్నారు. కొరవడిన శాఖల మధ్య సమన్వయం... దోమల నివారణ, పరిసరాల శుభ్రత, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, వైద్య సేవలను అందించడం తదితర పనులను పంచా యతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు ఏకకాలంలో చేపట్టాలి. అయితే ఆ శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఉదాహరణకు దోమలనే చెప్పుకోవచ్చు. వీటివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్చలు చేపట్టాల్సి ఉంది. వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది.. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలను విరివిగా చేపడుతున్నాం. మా హాస్పిటల్స్‌లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో డీడీటీని స్ప్రే చేయిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరసరాల శుభ్రతకు పాటు పడాలి. జిల్లాలో వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది.– డాక్టర్ ఉమాసుందరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పెద్ద దోమా.. కుట్టదమ్మా!
దోమతో కుట్టించుకోవాలని ఎవరికైనా ఉంటుందా.. వాటిని ఇంట్లో నుంచి పంపేందుకు నానా తంటాలు పడుతుంటాం. మరి అంతచిన్న దోమ విషయంలోనే ఇలా ఉంటే మరి అరచేతి పరిమాణంలో ఉండే దోమ కుడితే మన పరిస్థితి ఏంటి? మనం చూసే దోమ కన్నా 10 రెట్లు పెద్ద దోమ మన ఇంట్లోకి చేరితే ఇంకేమైనా ఉందా.. అందుకోసం పెద్ద పెద్ద దోమల బ్యాట్స్ కొనే పరిస్థితి వస్తుందేమో..! ఇంతకీ ఈ దోమ విశేషాలేంటంటే.. దోమను చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో పరిశోధకులు గుర్తించారు. భారీ సైజులో ఉన్న ఈ దోమ జపాన్‌కు హలోరుసియా మికాడో అనే జాతికి చెందిందని చెప్పారు. సాధారణంగా ఈ జాతి దోమలు 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయని, కానీ ఈ దోమ మాత్రం 11.15 సెంటీమీటర్లు ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద దోమగా దీన్ని పరిగణిస్తున్నట్లు చెప్పారు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ దోమ ఎవరినీ కుట్టదట. లార్వాలను తిని జీవనం సాగిస్తుందట. ఇక మీరు ఊపిరి పీల్చుకోవచ్చు.. ఇక ఈ దోమ మీ ఇంట్లోకి రాదు.. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని కుట్టదు! ఇంకో విషయం ఏంటంటే ఈ దోమ కేవలం 7 రోజులు మాత్రమే బతుకుతుందట. -
ప్రపంచంలోనే అతి పెద్ద దోమ..??
సిచువాన్ ప్రావిన్సు, చైనా : దోమతో కుట్టించుకోవాలని ఎవరికీ ఉండదు. చాలా చిన్నసైజులో ఉన్న దోమ కుడితేనే చాలా ఫీల్ అవుతాం. అదే అరచేతి కంటే పెద్ద సైజులో ఉన్న దోమ కాటు వేస్తే పరిస్థితి ఏంటి?. సగటు దోమ సైజు కంటే 10 రెట్లు భారీ సైజులో ఉన్న దోమను చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో నిపుణులు గుర్తించారు. భారీ సైజులో ఉన్న ఈ దోమ జపాన్‌కు హలోరుసియా మికాడో అనే జాతికి చెందినదని చెప్పారు. సాధారణంగా ఈ జాతి దోమలు 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయని, కానీ ఈ దోమ మాత్రం 11.15 సెంటీమీటర్లు ఉందని తెలిపారు. తొలిసారి దీన్ని గుర్తించినప్పుడు ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద దోమగా దీన్ని భావిస్తున్నట్లు చెప్పారు. మంచి విషయం ఏంటంటే ఈ దోమ ఎవ్వరిని కుట్టదని చెప్పారు. లార్వాలపై ఆధారపడి శరీరాన్ని పోషక పదార్థాలను తయారు చేసుకుంటుందని వివరించారు. భారీ సైజులో ఉండే దోమ జీవిత కాలం కేవలం ఏడు రోజులు మాత్రమేనని వివరించారు. -
నాదే రాజ్యం నేనే రాజు
కార్పొరేషన్ నిధులు మస్కిటో కాయిల్‌లా కాలిపోతున్నాయి. సామాన్యుడి జేబులో డబ్బులు నీరులా ఆవిరైపోతున్నాయి. కానీ.. నగరంలో తిరుగుతున్న దోమకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. సంతతి పెంచుకుంటూ వేధిస్తున్నాయి. రక్త పిపాసుల్లా మారి ఇంటింటిలోనూ వ్యాధుల కుంపటి పెడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఓ వైపు దోమల పనిపట్టేందుకు పక్కా ప్లాన్‌తో టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని ఊదరగొట్టిన అధికారులు.. ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. మరోవైపు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా స్మార్ట్ నగరం దోమల రాజ్యంలా మారిపోతూ.. నగర జీవికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విశాఖసిటీ : నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల వల్ల ప్రబలుతున్న కేసుల సంఖ్య తగ్గిందని గతంలో బాహాటంగా ప్రకటించిన గ్రేటర్ అధికారులు.. ఇప్పుడు దోమనెలా తరమాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల డెంగూ వ్యాధి బారిన పడిన కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది దోమల వల్ల కలిగే వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఓవైపు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులు చెప్పినా.. ఫలితం మాత్రం శూన్యమనేది గణాంకాలు చెబుతున్నాయి. నామమాత్రంగా నివారణ చర్యలు దోమలపై యుద్ధం ప్రకటిస్తున్నంతగా ఊదరగొడుతున్న ప్రజారోగ్య విభాగాధికారులు.. వాస్తవంగా మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు కచ్చితంగా ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. మహా విశాఖనగర పాలక సంస్థ పరిధిలో కేవలం 40 నుంచి 45 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా సిబ్బంది చేస్తోంది 25 నుంచి 30 శాతం ప్రాంతాలకు మాత్రమే. లెక్కల్లో తారుమారు చేసేస్తూ నిధులు స్వాహా చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అసలు ఫాగింగ్ ఏడాదికి ఒకసారైనా చేయడం లేదంటే పాలకులకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఏటా ఫాగింగ్ మొదలైన దోమల నివారణ చర్యలకు జీవీఎంసీ సుమారు రూ.1.48 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంతలా ఖర్చు చేస్తున్నా.. దోమలు చావడం లేదని ప్రజారోగ్య విభాగం పరిశీలనలో తేలింది. దెబ్బ తగిలిన చోటే మందు రాస్తున్నారు జీవీఎంసీ మలేరియా విభాగంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదనంగా 250 మంది కార్మికులను ఏటా టెండర్ల ప్రక్రియ ద్వారా నియమిస్తుంటారు. వీరంతా రోజూ వార్డుల్లో పర్యటించి కాలువలు, గెడ్డల్లో దోమల లార్వాలను నశింపజేసే రసాయనాలు పిచికారి చేయాలి. అయితే వీరి విధులపై నియంత్రణ లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తూ పని చేయకుండా కాలం గడిపేస్తుంటారు. ఎక్కడైనా మలేరియా, డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిస్తే ఆ ప్రాంతాల్లో మాత్రమే స్ప్రేయింగ్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. దోమల వ్యాధుల నివారణకు వినియోగించే మందుల నిల్వలు, వాటి సరఫరా, కార్మికుల సంఖ్య, విధులు, విధానాలు, ఫాగింగ్ యంత్రాల పనితీరు మొదలైన అంశాలపై స్వయంగా కమిషనర్ పర్యవేక్షిస్తే తప్ప ప్రజారోగ్య విభాగంలో మార్పు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు.. దోమల వ్యాప్తి నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. స్మార్ట్ డెన్సిటీ సిస్టమ్ ఎక్కడ? నగరంలో దోమల వ్యాప్తి పెరుగుతుండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని రాష్ట్ర పురపాలక విభాగం ఏడాది కిందట ప్రణాళికలు రూపొందించి పైలట్ ప్రాజెక్టుగా జీవీఎంసీని ఎంపిక చేసింది. ప్రాణాంతక దోమలు ఎక్కడున్నాయో టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని నాశనం చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ అధికారులు ప్రకటించారు. స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టమ్ పేరుతో ఈ విధానం అమలు చేసేందుకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల్లో ప్రారంభించాలని అనుకున్న ఈ ప్రాజెక్టు ఏడాది గడిచినా పట్టాలెక్కలేదు. దోమలను గుర్తించేందుకు ఎక్కడికక్కడ సెన్సార్లు ఏర్పాటు చేయాలని భావించారు. చదరపు కిలోమీటర్‌కు 10 సెన్సార్లు చొప్పున వీధుల్లోని విద్యుత్ స్తంభాలకు వీటిని అమర్చి ఆ ప్రాంతాల్లో ఉన్న దోమలను గుర్తించి.. వాటిని మందులతో సంహరించాలన్న ఈ ప్రాజెక్టుకు ఇంత వరకు బీజం పడలేదు. సమస్యాత్మక ప్రాంతాలివీ జీవీఎంసీ పరిధిని 3 రోగ విభాగాలుగా విభజించారు. డెంగ్యూ జోన్ : సింథియా, శ్రీహరిపురం, మల్కాపురం, గాజువాక, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి తదితర ప్రాంతాలు మలేరియా జోన్: దొండపర్తి, అక్కయ్యపాలెం, మర్రిపాలెం, ఆరిలోవ, అంబేడ్కర్‌నగర్, ఎండాడ, శివాజీపాలెం, గొల్లలపాలెం, మద్దిలిపాలెం, సీతమ్మధార, సీతంపేట, వీఐపీ రోడ్డు తదితర ప్రాంతాలు చికున్ గున్యా జోన్: సిరిపురం, వన్‌టౌన్, బీచ్‌రోడ్డు, జగదాంబ, పూర్ణామార్కెట్, కురుపాం, బురుజుపేట, రామకృష్ణ మార్కెట్ జంక్షన్ తదితర ప్రాంతాలు కేఆర్ఎం కాలనీ, కొబ్బరితోట, గొల్లలపాలెంలో డెంగ్యూ వ్యాప్తి చేసే ఈడిస్ దోమలు పెరుగుతున్నాయి. కాగా.. మలేరియాను వ్యాప్తి చేసే ఆడ అనాఫిలస్ దోమలను గుర్తించే వ్యవస్థ ఇప్పటి వరకూ జీవీఎంసీలో లేకపోవడం గమనార్హం. సంపాదనలో సగం దోమల కోసమే.. జీవీఎంసీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో.. దోమ రహిత నగరంగా మారడం కల్లగా మారిపోయింది. ఫలితంగా కార్పొరేషన్ ఖజానాను ఖాళీ చేస్తున్న దోమలు ప్రజల డబ్బునీ ఆవిరి చేసేస్తున్నాయి. ఒక కాయిల్ బాక్స్ కొనేందుకు నెలకు రూ. 90 చొప్పున ఏడాదికి రూ.1100 పైన ఖర్చు చేస్తున్నారు. లిక్విడ్ జెల్స్ కోసం మరో రూ.1500, మస్కిటో బ్యాట్లు కొనుగోలు, వాటి నిర్వహణకు రూ.500 ఇలా.. దోమలను ఇంటినుంచి తరిమేందుకు ఏడాదికి సగటు నగర జీవికి రూ.3 వేలకు పైనే చేతి చమురు వదులుతోంది. ఇదిలా ఉండగా.. మలేరియా, డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం వల్ల ఏడాదికి రూ.5,000 నుంచి రూ.10000 వరకూ ఖర్చు చేస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర ఉండట్లేదు దోమలు ఒక్కోసారి తగ్గుముఖం పడుతున్నాయి. నెల తర్వాత పెరిగిపోతున్నాయి. వాటిని తరిమేందుకు నానా యాతన పడాల్సి వస్తోంది. రాత్రిళ్లు నిద్ర ఉండట్లేదు. అప్పుడప్పుడు ఫాగింగ్ చేస్తున్నారు కానీ, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఫాగింగ్ చేసిన రెండు రోజులకే దోమలు పెరిగిపోతున్నాయి. –బొడ్డేపల్లి సుధ, కంచరపాలెం బడ్జెట్లో వాటి కోసం కేటాయింపు దోమలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కార్పొరేషన్ వాళ్లు స్ప్రేయింగ్ చేయడం, మూడు నెలలకోసారి ఇంటికి వచ్చి మలేరియా, డెంగ్యూ గురించి చెబుతున్నారు. కానీ.. పూర్తిగా దోమలను నివారించలేకపోతున్నారు. ఇంటికి రాకుండా చేసేందుకు కిటికీలకు నెట్లు పెట్టాం. నెలసరి బడ్జెట్లో దోమల కోసం కొంత కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తింది. – వెంకటరమణ, లలితానగర్ దోమల నివారణకు ముందస్తు కార్యాచరణ నగరంలో దోమల నివారణకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా, నమోదైన కేసులను నివారించేందుకు కమిషనర్ ఆదేశాలతో ఏటా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మరోవైపు వార్డుకో బృందం చొప్పున దోమల ఉత్పత్తికి కారణమయ్యే ప్రాంతాల గురించి, వాటి వల్ల వచ్చే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం డ్రై డే పాటించాలని ప్రచారం చేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో 59 వేల వరకూ దోమ తెరలు పంపిణీ చేశాం. యాంటీ లార్వా కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఎంవీవీ మురళీమోహన్, ఏఎంహెచ్‌వో, జీవీఎంసీ -
అల్లాడిస్తున్న తెల్లదోమ!
విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులు,మొక్కలు, పండ్లు, కాయలపై సరైన నిఘాలేకపోవడం వల్ల కొత్త రకం చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించి రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. ఫ్లోరిడా నుంచి ఏడాదిన్నర క్రితం కేరళకు దిగుమతైన రూగోస్ తెల్లదోమ అక్కడి కొబ్బరి తోటలను చావుదెబ్బ తీíసింది. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవాలకు పాకింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నర్సరీలకు, కొబ్బరి, పామాయిల్ తోటలకు సోకింది. ఈ తోటలను కేరళకు చెందిన కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ఇటీవల పరిశీలించారు. రసాయనిక పురుగుమందులు చల్లకుండా ఉండటమే పరిష్కారమని ‘సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.. ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్న కొత్త రకం తెల్లదోమ గురించి రైతాంగంలో ఇటీవల ఆందోళన నెలకొంది. ఈ తెల్లదోమ కేరళ మీదుగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించిందని చెబుతున్నారు. ఇది కేరళకు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది? 2016 జూలైలో కేరళలో కొబ్బరి తోటలపై ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’(అల్యూరోడికస్ రుగియో పెర్యులేటస్) కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం నుంచి తెచ్చిన పూల మొక్కల ద్వారా ఇది మన దేశంలోకి వచ్చింది. కేరళలోని అనేక జిల్లాల్లో కొబ్బరి తోటలను ఇది తీవ్రంగా నష్టపరిచింది. ఇక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రపదేశ్, కర్ణాటక, గోవాలకు పాకింది. ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ► రూగోస్ తెల్లదోమను గుర్తించడమెలా? రూగోస్ తెల్లదోమ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో విరివిగా జామ, కొబ్బరి తోటల్లో కనిపించే వలయాకార తెల్లదోమ(స్పైరలింగ్ వైట్ఫ్లై)ని పోలి ఉంటుంది. ఈ దోమ రెక్కల మీద గోధుమ రంగు పట్టీలను బట్టి రూగోస్ తెల్లదోమను గుర్తించవచ్చు. దీన్ని 2009లో ఫ్లోరిడా(అమెరికా)లో కొన్ని పూల మొక్కలపై తొలుత గుర్తించారు. మెక్సికో, గౌటెమాలాకు కూడా పాకింది. మన దేశంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేరళలోని అన్ని జిల్లాలకు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలకు వ్యాప్తిచెందింది. కోస్తా తీర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలను ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి, హైబ్రిడ్ రకాల కొబ్బరి తోటలు, కొబ్బరి మొక్కలకు సోకింది. అయితే, కేరళలో ఎత్తయిన కొబ్బరి తోటలకు కూడా సోకినా, నష్టం తక్కువగా ఉంది. ► రూగోస్ తెల్లదోమ పంటలను ఎలా నష్టపరుస్తుంది? రూగోస్ తెల్లదోమ ఒక రకమైన రసంపీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఇది సుమారు 2.5 మి.మీ. పొడువుతో మిగతా తెల్లదోమల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల చెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఆకుల మీద అర్ధవృత్తాకారంలో వలయాలు వలయాలుగా గుడ్లు పెడుతుంది. ఈ వలయాలు తెల్లని దూదిలాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి... అంతేకాక, రెక్కల పురుగులు తేనె వంటి జిగురును విసర్జిస్తాయి. ఈ జిగురుకు నల్లరంగులో ఉండే ఒక శిలీంధ్రం(సూటి మౌల్డ్) ఆకర్షితమై.. ఆకులపై నల్లగా పరుచుకుంటుంది. దాని వల్ల కిరణజన్య సంయోజక క్రియ తగ్గి, చెట్టు బలహీన పడుతుంది. తెల్లదోమ తాకిడి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆకులేకాక, రెమ్మ మొదళ్లు, లేత కొబ్బరికాయలు సైతం తెల్లని దూదిలాంటి పదార్థంతో నిండిపోయి ఉంటాయి. ► తెల్లదోమ తీవ్రత ఎలా ఉంది? దీన్ని ప్రకృతిసిద్ధమైన జీవనియంత్రణతోనే అదుపు చేయగలం. రసాయనిక పురుగుమందుల ద్వారా నియంత్రించలేం. రసాయనిక పురుగుమందుల వాడకం తక్కువ కాబట్టి కేరళలో 3–5 నెలల్లో రూగోస్ తెల్లదోమ తీవ్రత తగ్గింది. అయితే, తమిళనాడులో రసాయనిక పురుగుమందుల వాడకం ఎక్కువ కాబట్టి అక్కడ అదుపులోకి రాలేదు. ► సహజ పద్ధతుల్లో తెల్లదోమను అదుపు చేసేదెలా? కందిరీగ జాతికి చెందిన చిన్న దోమ పరిమాణంలో ఉండే ఒక పరాన్నజీవి రూగోస్ తెల్లదోమ వృద్ధిని అదుపులో పెడుతుండటం గమనించాం. దీన్ని ఎన్‌కార్సియ గోడెలోపి అంటారు. వీటితోపాటు కొన్ని టెంకరెక్క పురుగులు (బీటిల్స్), సాలెపురుగులు కూడా ఈ తెల్లదోమ నియంత్రణలో తోడ్పడతాయి. రసాయనిక పురుగుమందులు ఎక్కువగా వాడిన తోటల్లో ఈ సహజ శత్రువులు తక్కువ సంఖ్యలో ఉంటున్నట్లు గమనించాం. ► ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి? తెల్లదోమ మరీ తీవ్రస్థాయిలో ఉంటే 0.5 శాతం వేపనూనె(లీటరు నీటికి 5 గ్రాముల వేపనూనె)ను పిచికారీ చేయాలి. నల్లని శిలీంధ్రం ఉధృతంగా పరచుకున్న ఆకుల మీద 1% మైదా పిండి (లీటరు నీటికి 10 గ్రాముల మైదా పిండి) ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ సహజ శత్రువులను బాగా వృద్ధి అయిన తోటల్లో నుంచి ఆకు ముక్కలను తీసుకెళ్లి.. ఉధృతంగా ఉన్న తోటల్లో చెట్లపైన ఉంచాలి. జిగురుతో కూడిన పసుపు అట్టలను చెట్ల మొదళ్లకు చుట్టాలి. తద్వారా కొంతవరకు ఈ దోమలను దిగ్బంధించవచ్చు. నల్ల శిలీంధ్రాన్ని తినే టెంకరెక్క పురుగులను గుర్తించి, పరిరక్షించాలి. ► ఇంకా పాటించాల్సిన నియమాలేమైనా ఉన్నాయా? తెల్లదోమ తాకిడి గల ప్రాంతం నుంచి కొబ్బరి మొక్కలుగానీ, ఆకులు గానీ, కాయలుగానీ లేదా పామ్ సంతతికి చెందిన అలంకారపు మొక్కలు గాని వేరే ప్రాంతాలకు తరలించకూడదు. దోమ తాకిడి గల ప్రదేశాల నుంచి తాకిడి లేని ప్రదేశాలకు వెళ్లే రవాణా వాహనాలను పూర్తిగా శుద్ధి చేయాలి. విమానాశ్రయాలలో/నౌకాశ్రయాలలో మొక్కలు, కాయల తరలింపుపై కఠిన నియమాలను అమలు చేయడం ద్వారా హానికర చీడపీడల వ్యాప్తిని అరికట్టాలి. ► నర్సరీల నుంచి కొబ్బరి మొక్కల అమ్మకాలను ఆపెయ్యాల్సిన అవసరం ఉందా? పూర్తిగా ఆపెయ్యనక్కరలేదు. అయితే, రూగోస్ తెల్లదోమ లేదని నిర్ధారణ జరిగిన తర్వాతే నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలను బయటకు పంపాలి. తెల్లదోమ ఆశించిన మొక్కలను ఇవ్వకూడదు. ► రసాయనిక పురుగుమందులను నిషేధించాలా? పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదోమ ఉధృతంగా ఉన్న కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో, ఆ పరిసరాల్లో కనీసం 4–5 నెలల పాటు రసాయనిక పురుగు మందుల వాడకాన్ని కచ్చితంగా ఆపెయ్యాలి. ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులు స్వచ్ఛందంగా ఈ జాగ్రత్త పాటించాలి. ఇలా జాగ్రత్తపడిన రైతుల తోటల్లో తెల్లదోమ అదుపులోకి వచ్చింది. ► రూగోస్ తెల్లదోమ ఆశించే ఇతర పంటలేవి? ఇది ప్రపంచవ్యాప్తంగా 43 కుటుంబాలకు చెందిన 118 పంటలకు, మొక్కలకు ఆశిస్తుంది. దక్షిణ భారతదేశంలో కొబ్బరితోపాటు మామిడి, జామ, అరటి, రామాఫలం, పనస చెట్లతోపాటు, కరివేపాకుపైన, హెలికోనియా అనే పూల జాతి మొక్కలపైన రూగోస్ తెల్లదోమ కనిపించింది. అయితే, వీటిలో ఒక్క అరటి మొక్కల మీద మాత్రమే ఇది తన పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేయగలదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రూగోస్ తెల్లదోమ సోకిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించాను. రూగోస్ తెల్లదోమలు సోకిన చెట్ల మీద వీటిని సహజంగా అదుపు చేసే ఎన్కార్పియా గౌడలోపే రకం కందిరీగల్లాంటి పురుగులు కూడా కనిపించాయి. కాబట్టి, మరీ భయపడనక్కరలేదు. తెల్లదోమ తోటలను చంపెయ్యదు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా జాగ్రత్తలు పాటిస్తే కొన్నాళ్లలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. రసాయనిక పురుగుమందులను చల్లితే మిత్రపురుగులూ చనిపోయి.. తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది. ‘‘ బదనికలు వదిలిన తర్వాత తెల్లదోమ తగ్గింది.. మా కొబ్బరి తోటకు సోకిన రూగోస్ తెల్లదోమ వలన దిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది. ఆరు ఎకరాల్లో గోదావర గంగా టీఅండ్‌డీ రకం కొబ్బరిని సాగు చేస్తున్నాను. మొదటిసారిగా 2017 అక్టోబర్ నెలాఖర్లో కొబ్బరి తోటను తెల్లదోమ ఆశించింది. కొవ్వూరు, అంబాజీ పేట కొబ్బరి పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి, తెల్లదోమ నివారణకు వేపనూనెను పిచికారీ చేయమని సూచించారు. మళ్లీ డిసెంబర్లో మరోసారి తెల్లదోమ విజృంభించింది. నిడదవోలు, చాగల్లు మండలాల్లో సుమారు 12 వందల హె క్టార్లో కొబ్బరికి, ఆరు వందల హెక్టారుల్లో పామాయిల్ తోటలకు తెల్లదోమ ఆశించింది. శాస్త్రవేత్తలు కేరళ నుంచి బదనికలు తీసుకువచ్చి జనవరి మొదటి వారంలో నా వ్యవసాయక్షేత్రంలో వదిలారు. బదనికలు వదిలాక తెల్లదోమ తీవ్రత తగ్గింది. తెల్లదోమను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. ముళ్లపూడి మురళీకృష్ణ (94405 83725), కొబ్బరి రైతు, కలవలపల్లి, చాగల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‘‘ -
‘సుడి’గుండంలో రైతన్న!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: అకాల వర్షాలు, వాతావరణంలో అనూహ్య మార్పులు.. వాటి కారణంగా దాడి చేస్తున్న తెగుళ్లు, సమస్యలు రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచుతున్నాయి. గులాబీరంగు పురుగు దాడి, రంగు మారడంతో ఇప్పటికే పత్తి రైతులు నష్టపోగా.. అటు దోమపోటు కారణంగా వరి రైతు తలపట్టుకుంటున్నాడు. గింజ దశ దాకా బాగానే ఉన్న వరి పంట దోమపోటు కారణంగా దెబ్బతినడంతో ఆందోళనలో మునిగిపోయాడు. వేలకు వేలు ఖర్చు చేసి పురుగుమందులు కొట్టినా ఫలితం లేక ఆవేదనలో పడ్డాడు. చివరికి పంటను కోసే కూలీలకు సరిపడా సొమ్ము కూడా రాని దుస్థితిలో.. కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడుతున్నాడు. ఐదు లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది ఖరీఫ్‌లో 18.85 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, సుడి దోమ దాడి కారణంగా మూడో వంతు పంటకు నష్టం జరిగినట్లు అంచనా. భారీ వర్షాలకు 50 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు నిర్ధారించగా... 5 లక్షల ఎకరాల్లో సుడిదోమ పంజా విసిరిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ముఖ్యంగా బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 1504, కేఎన్ఎం 118 రకాలకు దోమపోటు ఎక్కువగా ఆశించినట్లు గుర్తించింది. ఇందులో బీపీటీ 5204 పంట బాగా దెబ్బతిన్నట్లు తేల్చింది. ఆ జిల్లాలో ఏకంగా 50 నుంచి 60 శాతం పంట దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో మార్పులు, తేమ శాతం పెరగడం వల్లే సుడిదోమ ఉధృతి పెరిగిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో వరికి కాండం తొలిచే పురుగు, సుడిదోమ ఉధృతి ఉన్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అధ్యయనంలో తేలింది. సగం దిగుబడి స్వాహా: వరిలో దోమపోటు సోకితే ఏకంగా 50 శాతం దిగుబడి తగ్గిపోతుంది. సెప్టెంబర్– నవంబర్ మధ్య ఎక్కువగా ఆశించే సుడిదోమ.. మొక్కల మొదళ్లలో చేరి రసాన్ని పీల్చేస్తుంది. దీంతో పంట లేత పసుపురంగులోకి మారి.. సుడులు సుడులుగా ఎండిపోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21–23 డిగ్రీల సెల్సియస్, పగటి ఉష్ణోగ్రతలు 25–30 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయినప్పుడు ఈ దోమ విజృంభణ ఎక్కువగా ఉంటుంది. యూరియా ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఈ దోమ ఎక్కువగా ఆశిస్తుంది. నాలుగైదు రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. సుడిదోమ ఆశిస్తే పిలక దశలో 10–15 శాతం నష్టం, ఈనే దశలో అయితే 40 శాతం, గింజ దశలో అయితే 70–80 శాతం నష్టం జరుగుతుంది. మందులు చల్లినా ఫలితమేదీ..? దోమపోటు నివారణ కోసం పురుగు మందులను చల్లినా పెద్దగా ప్రయోజనం కల్పించడం లేదని.. పైగా సాగు ఖర్చు పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. దోమపోటు నివారణ మందులను చల్లడానికి ఒక్కో ఎకరాకు ఒకసారికి రూ. వెయ్యి వరకు ఖర్చవుతుంది. ఆవేదనతో పంటకు నిప్పు దోమపోటుతో పంట ఎండిపోవడం.. పంటకోసిన కూలీలకు అయ్యే వ్యయమైనా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. చివరికి ఏం చేయాలో అర్థంగాక పంటకు నిప్పు పెడుతున్నారు. సూర్యాపేట మండలంలో దాదాపు 25 ఎకరాల్లో రైతులు వరికి నిప్పు పెట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. - జగిత్యాల జిల్లాకు చెందిన ఈ రైతు ఎడ్మల నచ్చరెడ్డి. నాలుగెకరాల్లో సన్నరకం వరి వేశాడు. గింజ దశలో దోమపోటు వచ్చింది. ఇప్పటికే ఐదారు వేలు ఖర్చుపెట్టి పురుగుమందులు కొట్టాడు. పొలంలో పాయలు సైతం తీశాడు. అయినా దోమ ఉధృతి ఆగలేదు. రూ.50 వేల దాకా నష్టం జరిగిందని.. ప్రభుత్వం పరిహారం అందించాలని వాపోతున్నాడు. యూరియా ఎక్కువ వాడొద్దు వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కు వగా దోమపోటు వచ్చింది. నత్రజని (యూరి యా)ఎకరాకు 30 కిలోలు మించి వాడినా దోమ పెరుగుతుంది. దోమపోటు కొద్దిగా వచ్చిన సమయంలోనే రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. దోమ తరచుగా ఆశించే ప్రాంతాల్లో దోమ పోటును తట్టుకునే రకాలను సాగు చేయాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. వెడల్పు బాటలు వదిలి, పొలాన్ని ఆరబెట్టాలి. – ఎం.వెంకటయ్య, శాస్త్రవేత్త, పొలాస మూడో వంతు సోకితేనే బీమా దోమపోటుకు పంటల బీమా పథకం కింద పరిహారం పొందే వీలుంది. అయితే గ్రామం యూనిట్‌గా మూడో వంతు వరికి దోమపోటు సోకితేనే రైతులకు పరిహారం వస్తుంది. దీనిపై మరింత అధ్యయనం చేసి పరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తాం.. –పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
దోమల్ని తరిమేసే స్మార్ట్‌ఫోన్.. ధర?
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎల్జీ కే7ఐ పేరుతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ దక్షిణ కొరియా కంపెనీ కే సీరీస్‌లో ఈ స్పెషల్ మొబైల్ ను లాంచ్ చేసింది. దోమల్ని తరమేసే స్మార్ట్‌ఫోన్ (మస్కిటో అవే)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఎల్జీ ప్రటించింది. బడ్జెట్ ధరలో ఈ ఆండ్రాయిడ్ డివైస్‌ను లాంచ్ చేసింది. వెనక భాగంలో స్పీకర్‌కు కున్న ఒక ప్రత్యేకమైన కవర్ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా దోమలను దూరంగా తరిమేస్తుంది. 30కెహెచ్‌జెడ్ ధ్వనులను ఈ డివైస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దోమలకుమాత్రమే హానికరమని ఎల్జీ చెప్పింది. దీని వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చింది. యూనిక్ ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలో ఎల్జీ ఎపుడూ ముందువరసలో ఉటుందని ఎల్జీ ప్రధాన మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. అలాగే ఎలాంటి హానికారక కెమికల్స్‌ను ఇదులో వాడలేదని భరోసా ఇచ్చారు. దీని రూ. 7,990 గా నిర్ణయించింది. ఈ ఎల్జీ కే7ఐ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఎల్జీ కే7ఐ ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రస్తుతం బ్రౌన్ కలర్ ఆప్షన్ లో ఫ్లైన్ అవుట్లెట్ల ద్వారా లభిస్తుంది. -
అమ్మో మలేరియా బ్యాట్‌మ్యాన్
డే టైమ్‌లో ట్రాఫిక్ నైట్ టైమ్‌లో దోమలు ఒణికించేస్తున్నాయి. జుయ్‌మని వర్షాలకు బండ్లు జారిపడడం.. గుయ్‌మని వచ్చి కుట్టే దోమలకు మన బండి మంచం మీద పడడం.. ఈ సీజన్లో వెరీ కామన్! సచిన్, ధోనీ, కొహ్లీ.. ఈ ముగ్గుర్నీ వేలంలో కొనుక్కుని బ్యాట్ చేతికిచ్చినా... అంతా డకౌట్ అవుతారే తప్ప... దోమలు నాటౌట్. అంతేనా?! వాటి దెబ్బకు మన టెంపరేచర్ సెంచరీ దాటుతుంది. ఎలా మరి? జాగ్రత్తగా ఉంటే సరి. దోమ సైజు చాలా చిన్నది. కానీ అది కలిగించే వ్యాధుల జాబితా మాత్రం పెద్దది. ఆ జాబితాలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న వ్యాధి మలేరియా. ఏజెన్సీ ఏరియాలోని గిరిపుత్రుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న మలేరియా... కేవలం మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో దాదాపు 110 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... సగానికి పైగా గ్లోబును ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఆ మలేరియా గురించి అవగాహన కోసం ఈ కథనం. ప్రధాన లక్షణాలు మలేరియా వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం జ్వరం. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు, నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి మృత్యువు కూడా దారితీయవచ్చు. స్థూలంగా కనిపించేవి జ్వరం ∙తలనొప్పి ∙తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరం : ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజాయిట్స్ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. చలి : మొదట చలి వస్తుంది. ఆ తర్వాత విపరీతమైన చెమటలు పడతాయి. లక్షణాల్లో తేడాలిలా... ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజాయిట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందువల్ల జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒక్కోలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవేల్‌లో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. అదే మలేరీ ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది. నిర్ధారణ... ఇటీవలి కాలంలో అభివృద్ధి మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్–స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా. గతంలోని పరీక్షలు రక్త పరీక్ష : థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ : మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్–ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని, ప్రస్తుతం వీటిని పెద్దగా వాడటం లేదు. చికిత్సలో విప్లవాత్మకమైన పురోగతి గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. అందుకే ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది. సాధారణ చికిత్స ప్రక్రియలు తొలుత మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ వంటి మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, మంచి విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్ అయితే... ఒకవేళ అది తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహ తప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి. ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ప్రభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియాలో ఆసుపత్రిలో లభ్యమయ్యే ఈ తరహా చికిత్స రోగికి దొరకకపోతే ఒక్కోసారి అది రోగి మరణానికీ దారితీయవచ్చు. మొక్క నుంచి మందులు ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్వుడ్’ అని పిలిచే చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో గుణం చాలా మెరుగ్గానూ, వేగంగానూ కనిపిస్తుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో ఆర్టిమిసినిన్తో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు ఇలా మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు. నివారణ దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు.మన ఇంట్లోకి, గదిలోకి దోమలు రాకుండా చూసుకోడానికి రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల çపరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దీనితో పాటు కాల్వల్లో నీరు నిత్యం పారేలా కాల్వల పూడిక లేకుండా చూసుకోవడం అవసరం. దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ – పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్ (కీమో– ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవచ్చు.పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి.వాటర్ కూలర్స్లో కొంతమంది కొన్ని నీటిని ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలుపడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, కూలర్లను మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్ స్థలాలుగా మారిపోతాయి. హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను వాడకండి. ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడండి. మలేరియా అర్థమేమిటంటే? క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. ప్రపంచమంతా ఉన్న ఈ వ్యాధి గురించి, దాని చరిత్రను గురించి సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు ‘సికింద్రాబాద్’లోనే కనుక్కున్నారు. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం. వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ... ►వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో ►జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో ►పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ►మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. డాక్టర్ జె. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హెల్త్ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
జల..'భద్రం'
బాత్రూమ్లో షవర్ ఆన్ చేసుకుందామంటే అలాంటి బాత్రూములు మనకెక్కడుంటాయ్? పోనీ... అలాంటి బాత్రూములు సంపాదించామే అనుకోండి! ట్యాంకులో నీళ్లెక్కడుంటాయ్? ఏ షవర్నైనా మైమరపించే మాన్సూన్ షవర్ వస్తుంటే జరభద్రం... కొంచెం జాగ్రత్త... అంటూ ఈ విసుర్లేంటి? ఇప్పటి వానలు... ఒకప్పటి వానల్లా కాదు. సేదదీర్చే వర్షంతో పాటు కుట్టే, కొరికే, అంటించే జబ్బులు వస్తాయి. అదిగో వాన వస్తోంది... ఇదిగో దోమ, ఈగ, ఎలుక వచ్చేశాయి. జర భద్రం... జల భద్రం! నీరు కలుషితం కావడం వల్ల ఈ సీజన్లో నీరు కలుషితం కావడం వల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ప్రధానంగా వస్తుంటాయి. ఇలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే కొన్ని ప్రధాన వ్యాధులు... టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇందులో నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ప్రత్యేకమైన ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోయి, ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. షిజెల్లోసిస్ జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్‌తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ–కొలై నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్‌కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. వర్షాకాలం వ్యాధుల నివారణ ⇒ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం. ⇒కుండల్లో/బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకండి. అలా నిల్వ ఉన్న నీరు తాగకండి. ⇒మరీ వీలుకానప్పుడు మినహా ఈ సీజన్లో బయట వండిన ఆహార పదార్థాలు తినకపోవడమే మేలు. ⇒తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని మాటి మాటికీ వేడి చేసి తినవద్దు. ⇒మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. అయితే వ్యాధిని వ్యాప్తి చేసే ఈగల వంటి కీటకాలు ముసరడానికి మాంసం కారణమవుతుంది. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్లనే ఈ అవకాశం ఎక్కువ. ఇక మాంసాహార ప్రియులు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ సీజన్లో మాంసాహారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం. ⇒పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైపెచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించండి. దోమ తెరలు వాడటం మేలు. ⇒ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ⇒ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే వెల్క్రో వంటి ప్లాస్టిక్ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ⇒వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ⇒ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ⇒వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి. ⇒కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు లేదా డిష్‌వాషింగ్ డిటర్జెంట్స్ వూత్రమే వాడాలి. ⇒అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు... వానలో అతిగా తడిస్తే నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్‌వాష్‌తో గానీ, సబ్బుతోగాని కడుక్కోని శుభ్రంగా ఉంచుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారించుకోవచ్చు. ఈగలతో వచ్చే వ్యాధులు వర్షాల సీజన్ మొదలుకాగానే ఈగలు మూగడం మొదలవుతుంది. ఈగల కారణంగా వచ్చే వ్యాధుల సంఖ్య దాదాపు వందకు పైగానే ఉంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లోనే ఎక్కువ. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలవు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ప్రోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, పోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్‌లనూ ఈగ వ్యాప్తి చేస్తుంది. ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... అమీబియాసిస్ ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములివి. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. జియార్డియాసిస్ ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఆహారాన్నంతా జియార్డియా జీవులే తీసుకోవడం వల్ల ఆహారం ఒంటికి పట్టదు. దోమలతో వచ్చే వ్యాధులు మలేరియా ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా ఈ వ్యాధిని కలిగిస్తుంది. ప్లాస్మోడియమ్లో ఒక్కో రకం (స్పీïసీస్) వల్ల ఒక్కోరకం మలేరియా వస్తుంది. అయితే వీటిన్నింటిలోనూ సెరిబ్రల్ మలేరియా తీవ్రమైనదీ, ప్రాణాంతకమైనది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు. చికన్ గున్యా ఈ వ్యాధి ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ దోమ కాటు వల్ల జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఆ కీళ్లనొప్పులు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా భరించలేనంతగా ఉంటాయి. డెంగ్యూ ఈ వ్యాధికి కూడా ఏడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. మామూలుగా వచ్చే డెంగ్యూవ్యాధిని క్లాసికల్ డెంగ్యూ అంటారు. ఈ వ్యాధిలోని మరో దశ అయిన డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్‌లో అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురికావచ్చు. దీన్ని ‘డెంగ్యూ షాక్ సిండ్రోమ్’ అంటారు. ఎలుకల వల్ల... వర్షాలకు బయటి ఎలుకలు ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది. డా.ఎమ్. గోవర్థన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
దోమలపై ఎన్ని దండగయాత్రలో..?!
మనుషులు.. దోమల మధ్య జరుగుతున్న యుద్దంలో దోమలే పైచేయి సాధిస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఓ సారి మేల్కొని మందులు, పొగతో అస్త్రాలు సిద్ధం చేసుకునేలోపు దోమలు వాటి సంతానాన్ని పదింతలు చేసుకుంటున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు ప్రజలు, అధికారుల మధ్య సమన్వ యలోపంతో నీరుగారిపోతున్నాయి. దోమలపై దండయాత్ర అంటూ గతేడాది ఆరంభం అదిరిపోయేట్లు చేసి ఆపై కుంభకర్ణుడిలా నిద్రపో యిన అధికారులు ఈ సారి దోమల నివారణ నెల పేరిట మరో దండగ యాత్రకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు(అర్బన్): దోమల నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా పంచాయతీలకు ఏటా రూ. 10వేల చొప్పున విడుదలవుతోంది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నడిచే పారిశుద్ధ్య కమిటీ సమావేశమై ఈ నిధులను దోమల నిర్మూలన కోసం ఖర్చు పెట్టాలి. కానీ 2వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో ఒకసారి దోమల నివారణ చేపట్టేందుకు కూలీలకు, మందుల కొనుగోలుకు రూ. 15వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ నిధులను కూడా విత్‌డ్రా చేసేందుకు చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంలు ముందుకు రావడం లేదు. ఇక మేజర్ పంచాయతీలకు సైతం రూ.10వేలే ఇవ్వడంతో ఏ మూలకూ సరిపోవడంలేదు. మేజర్ పంచాయతీల్లో ఒకసారి దోమల మందు పిచికారి చేయాలంటే కనీసం రూ.25వేల వరకు ఖర్చు అవుతోంది. సీజన్లో నాలుగుసార్లు దోమల మందు పిచికారి చేయాలంటే రూ.లక్ష నిధులు అవసరం. పైగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ అధికారుల మధ్య సమన్వయంలేకపోడం కూడా దోమల ఉత్పత్తికి పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. పట్టణాల్లో దారుణం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అధికారులు ఓడీఎఫ్‌ను సైతం ప్రకటించారు. అయినా సరే మురికి వాడల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు బహిర్భూమిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలైతే మురిగునీటి కాలువల్లోనే తమ కాలకృత్యాలు తీర్చుకోవడం దోమల ఉత్పత్తికి కారణంగా నిలుస్తోంది. మదనపల్లె మున్సిపాలిటీ, చిత్తూరు కార్పొరేషన్ నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఒకేసారి వారానికి సరిపడ నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా నిల్వ నీటి నుంచి దోమల ఉత్పత్తి పెరుగుతోంది. -
మలేరియా దోమరణం
పరిపరి శోధన మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. అలాగే మలేరియా మరణాల్లో 90 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. మనిషి రక్తంలోకి పేరసైట్లను ప్రవేశపెట్టి రోగానికి కారణమవుతుంది. మలేరియా వ్యాధి... 9 నుంచి 14 రోజులపాటు జ్వరం, వణకడం, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. -
అడవులు తగ్గుతున్న కొద్దీ పెరుగుతున్న దోమలు!
హెల్త్ ల్యాబ్ అడవుల్లో కనిపించాల్సిన జంతువులు ఇటీవల నగరాల్లో కనిపించడం అందరికీ తెలిసిందే. దీనికి కారణాలూ తెలుసు. తాము స్వేచ్ఛగా సంచరించాల్సిన అడవులు తగ్గుతున్న కొద్దీ అక్కడ నడయాడాల్సిన జంతువులు పట్టణాల్లోకి, నగరాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ‘సన్ బేర్’గా వ్యవహించే కొన్ని ఎలుగుబంట్లను చూసి వాటిని ఏలియన్స్‌గా అనుమానించిన ఉదంతమూ తెలిసిందే. అయితే ఇది కేవలం అడవి జంతువులకు మాత్రమే వర్తించే విషయం కాదు. అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బందానికి నేతత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. -
ఏపీని దోమల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం
– జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపు కర్నూలు(టౌన్): దోమల నిర్మూలనను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొని దోమల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుదామని జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో ‘దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు దోమలపై దండయాత్ర పేరుతో చేపట్టిన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దోమలతో ఇద్దరు మతి చెందడంతో ముఖ్యమంత్రి దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున్న చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తి చెందవన్నారు. అనంతరం హరితాంధ్ర ప్రదేశ్‌లో భాగంగా స్టేడియం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్పీ ఆకె రవికృష్ణ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపేటలో మందు పిచికారీ చేసిన మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి నగరంలోని ధర్మపేటలో పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. దోమలపై డండయాత్ర కార్యక్రమంలో భాగంగా మురుగు కాల్వల్లో మందును పిచికారీ చేశారు. నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. -
దోమలపై దండయాత్ర షురూ
కడప ఎడ్యుకేషన్: దోమలపై దండయాత్ర ప్రారంభమైందని దోమల నిర్మూలను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో యుద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జేసీ శ్వేత పిలుపునిచ్చారు. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని రాష్ట్ర అతి«థి గృహం వద్ద శనివారం విద్యా, వైద్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో దోమలపై దండయాత్రకు సంబంధించిన ర్యాలీని వారు ప్రారంభించి మాట్లాడారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు ఖచ్చితంగా డ్రైడేని నిర్వహించాలన్నారు. ఆ రోజు ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చేసి ఆరబెట్టాలన్నారు. దీంతోపాటు పరిపరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు చెత్తాచెదారం పేరుకోకుండా చూడాలన్నారు. నీళ్లు తొట్లు, ట్యాంకులపై ఖచ్చితంగా మూతలను వాడాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ ర్యాలీలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, విద్య, వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ కొటిరెడ్డి సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడళి వరకూ సాగింది. అనంతరం ఏడు కోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాకాధికారి బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, నరగపాలక కమీషనర్ చంద్రమౌళీశ్వరెడ్డి, డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు, డీఎంహెచ్ఓ రామిరెడ్డి,అడిషినల్ డీఎంఅండ్‌హెచ్‌ఓలు చంద్రశేఖర్, అరుణసులోచన, జిల్లా ఆరోగ్య విద్యాధికారి వైద్యాధికారి గుణశేఖర్, జిల్లా స్టాటికల్ అధికారి ఉమామహేశ్వరెడ్డి,టి బి అధికారి ఉమమహేశ్వర్, జల్లా మలేరియా అధికారి త్యాగరాజు, వైద్యసిబ్బంది వెంగల్రెడ్డి, ఆపూస్మ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దోమల నిర్మూలనకు సహకరించండి
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(హాస్పిటల్): జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజంభిస్తున్నాయని, దోమల నిర్మూలనకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అనే అంశంపై మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖల పరస్పర సహకారంతో దోమలను నిర్మూలిద్దామని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించడంతోపాటు జ్వరపీడితులకు రక్తపరీక్షలు చేసి మందులు ఇవ్వాలన్నారు. ఇందుకు పెన్షనర్లు, మహిళా సంఘాలు, రైతుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ నెల 24న గ్రామ, పంచాయతీ, మండల స్థాయిలో ఆయా స్థాయి అధికారులు దోమల నిర్మూలనపై ర్యాలీ నిర్వహించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులను దోమల నిర్మూలనకు ఖర్చు చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్–2 రామస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి, డీపీవో ఆనంద్‌నాయక్, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు రామకష్ణ, డ్వామా పుల్లారెడ్డి, రామాంజనేయులు, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు పాల్గొన్నారు. -
దోమలకాలం.. నివారణే మార్గం
– ప్రజలు భాగస్వాములు కావాలి – డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో పలు ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి...దోమలు వృద్ధి చెందడంతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దోమకాటు బారినపడకుండా ఎవరికి వారు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మలేరియా విభాగం దోమల నివారణకు చర్యలు చేపడుతోందని, దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. ఇళ్లు, పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపడితే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి ఆమె వివరించారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు మలేరియా : ఆడ అనఫిలిస్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు: వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం, తలనొప్పి, జ్వరం రోజు విడిచి రోజు రావడం, వాంతులు అవడం. మెదడువాపు వ్యాధి ః జపనీస్ ఎన్సెఫలిటిస్ దోమకాటు వల్ల వస్తుంది. పందులు, పశువులను కుట్టిన దోమలు మనుషులకు కుట్టిన వెంటనే రక్తం ద్వారా వ్యాధి కారక క్రిములు మెదడుకు చేరి మెదడువాపు వ్యాధి వస్తుంది. లక్షణాలు : ఈ వ్యాధి ముఖ్యంగా 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, స్పహతప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగీ : ఏడిస్ ఈజిపై ్ట అనే దోమ ద్వారా డెంగీ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం జరగవచ్చు. దీంతో ఒక్కసారి ఒంట్లో రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు రావచ్చు. పైలేరియా(బోదకాలు): క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం రావడం, వృషణాల్లో వాపు, కాళ్లలో నీరసం, కాళ్లవాపు, ప్రత్యేకించి కళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాలు పాడవడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు. చికున్ గున్యా : చికున్ గున్యా జ్వరం వైరస్ సోకడం వల్ల వస్తుంది. ఈ వైరస్ పగటి పూట పులిదోమ కాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం, భరించలేనంతగా కళ్లు, కండరాల నొప్పులు, వాంతి అవుతున్నట్లుగా, దాహం అధికంగా ఉండటం, తీవ్రమైన ఒళ్లునొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. నివారణ చర్యలు – ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగేందుకు అనువుగా ఉండే నీటి నిల్వలను నిర్మూలించాలి. –తాగి పారేసిన కొబ్బరిబోండాలను ముక్కలుగా చేసి చెత్తకుండీలో వేయాలి. –ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటినిల్వ పాత్రలను, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు లాంటి వాటిని పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. – కాల్వలో వ్యర్థాలు, చెత్త, చెట్లకొమ్మలు వేయరాదు. – వారానికి ఒకసారి పూలతొట్టెలలో, పూల కుండీలలో నీరు మార్చాలి.నీరు నిల్వ ఉండకుండా చూడాలి. – దోమలు లోపలికి రాకుండా కిటికీలకు సన్న జాలిని కట్టాలి. దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. – ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. –టైర్లు, రోడ్డుపై గుంతలో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. –జ్వరం వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. -
దోమను నమ్ముకుని రూ.130కోట్ల వ్యాపారం
సామాన్యుల జేబులకు చిల్లులు అయినా వదలని దోమరాక్షసులు దోమ నివారణా ఉత్పత్తుల పేరిట రూ.60 కోట్ల వ్యాపారం దోమ బారినపడకుండా ప్రజలు చేసే ఖర్చు రూ.70 కోట్ల పైమాటే జిల్లా జనాభా 44లక్షలు విశాఖసిటీ జనాభా 21.50 లక్షలు ఏజెన్సీ జనాభా 6.5 లక్షలు కుటుంబాలు 11.50 లక్షలు సిటీలో కుటుంబాల సంఖ్య 5.50 లక్షల పంచాయతీలు 925 గ్రామాలు 2811 వర్గాల వారీగా ప్రజలు జిల్లాలో ధనికులు 5 శాతం ఎగువ మధ్యతరగతి ప్రజలు 15 శాతం మధ్యతరగతి ప్రజలు 30 శాతం దిగువ మధ్యతరగతి ప్రజలు 10శాతం అల్పాదాయ, నిరుపేద వర్గాలు 40 శాతం దోమల నివారణకు కోసం ఖర్చు చేసే మొత్తం– ధనికులు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పజలు రూ.500 నుంచి వెయ్యి వరకు నిరుపేదలకు రూ.100 నుంచి రూ.200 వరకు దోమల ఉత్పత్తుల అమ్మకాలు నెలకు..(సీజన్లో)– బడా షాపింగ్‌మాల్స్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు హోల్‌సేల్ దుకాణాల్లో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు సూపర్ మార్కెట్లలో రూ.15వేల నుంచి రూ.25వేల వరకు రిటైల్ షాపుల్లో నెలకు రూ.10వేల నుంచి 15వేల వరకు ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తులుః– లిక్విడ్స్(ఆల్అవుట్, గుడ్‌నైట్ వంటివి) 60 శాతం హిట్స్ వంటి స్పేయర్స్ 15 శాతం క్వాయల్స్ 25 శాతం ఈ గణాంకాలు చాలు మనిషి ప్రాణాలతో చలగాటమాడే దోమపై ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో...ఏ స్థాయిలో ప్రజలు ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి. హోల్‌సేల్, మాల్స్, రిటైల్ షాపుల సంఖ్య జిల్లాలో ఐదారువేల వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ షాపులు 500 వరకు ఉండగా, సుమారు 50కు పైగా మాల్స్, వెయ్యికి పైగా సూపర్మార్కెట్స్, 4,500కు పైగా రిటైల్‌దుకాణాలు ఉంటాయని అంచనా. దోమల నిర్మూలన కోసం ఉపయోగించే ఉత్పత్తుల వ్యాపారం చూస్తే ఎంత తక్కువ లెక్కేసుకున్నా నెలకు రూ.ఐదారుకోట్లకు పైగానే టర్నోవర్ జరుగుతోంది. ఇక దోమల నిర్మూలన కోసం ఎవరికి వారు తాము సంపాదించే మొత్తంలో కనీసం 5 నుంచి 10 శాతం సొమ్ము ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ధనికులంతా దోమల నిర్మూలన కోసం ఎక్కువగా లిక్విడ్స్ కొను గోలు చేస్తున్నారు. ఇంట్లో గదుల సంఖ్యను బట్టి ప్రతి నెలా రెండు నుంచి ఐదు వరకు లిక్విడ్స్ వీరు కొనుగోలు చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలైతే ఎక్కువగా హిట్స్, బేగాన్ వంటి స్ప్రేయర్స్ నెలంతా సరిపడే విధంగా కనీసం నెలకొకటి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారు కూడా ఎక్కువగా లిక్విడ్స్నే వినియోగిస్తున్నారు. బాగా కడు నిరుపేదలు, రిక్షా పుల్లర్స్, భిక్షగాళ్లు మాత్రమే ప్రతి నెలా కనీసం రెండు ప్యాకెట్స్ చొప్పున క్వాయిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో దోమలు చొరబడకుండా ఉండేందుకు కిటికీలకు మెస్సులు, దోమతెరలు వంటి ఇతర రక్షణ చర్యలు కోసం సీజన్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా లెక్కలు వేస్తే దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ప్రతి నెలా అక్షరాల రూ.ఆరేడుకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.అంటే నెలకు రూ.5కోట్ల చొప్పున లెక్కేసినా ఏడాదికి జరిగే వ్యాపారం రూ.60కోట్ల పైమాటే. అదే విధంగా వీటితో పాటు ఇతర రక్షణ చర్యలకోసం నెలకు రూ.6 కోట్లచొప్పున ఏడాదికి 70 కోట్లకు పైగా తమ కష్టార్జితాన్ని దోమల బారిన పడకుండా ప్రజలు ఖర్చు చేస్తున్నారన్న మాట. ఇవన్నీ సుమారుగా లెక్కలే. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. –సాక్షి, విశాఖపట్నం -
దోమను నమ్ముకుని రూ.130కోట్ల వ్యాపారం
సామాన్యుల జేబులకు చిల్లులు అయినా వదలని దోమరాక్షసులు దోమ నివారణా ఉత్పత్తుల పేరిట రూ.60 కోట్ల వ్యాపారం దోమ బారినపడకుండా ప్రజలు చేసే ఖర్చు రూ.70 కోట్ల పైమాటే జిల్లా జనాభా 44లక్షలు విశాఖసిటీ జనాభా 21.50 లక్షలు ఏజెన్సీ జనాభా 6.5 లక్షలు కుటుంబాలు 11.50 లక్షలు సిటీలో కుటుంబాల సంఖ్య 5.50 లక్షల పంచాయతీలు 925 గ్రామాలు 2811 వర్గాల వారీగా ప్రజలు జిల్లాలో ధనికులు 5 శాతం ఎగువ మధ్యతరగతి ప్రజలు 15 శాతం మధ్యతరగతి ప్రజలు 30 శాతం దిగువ మధ్యతరగతి ప్రజలు 10శాతం అల్పాదాయ, నిరుపేద వర్గాలు 40 శాతం దోమల నివారణకు కోసం ఖర్చు చేసే మొత్తం– ధనికులు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పజలు రూ.500 నుంచి వెయ్యి వరకు నిరుపేదలకు రూ.100 నుంచి రూ.200 వరకు దోమల ఉత్పత్తుల అమ్మకాలు నెలకు..(సీజన్లో)– బడా షాపింగ్‌మాల్స్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు హోల్‌సేల్ దుకాణాల్లో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు సూపర్ మార్కెట్లలో రూ.15వేల నుంచి రూ.25వేల వరకు రిటైల్ షాపుల్లో నెలకు రూ.10వేల నుంచి 15వేల వరకు ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తులుః– లిక్విడ్స్(ఆల్అవుట్, గుడ్‌నైట్ వంటివి) 60 శాతం హిట్స్ వంటి స్పేయర్స్ 15 శాతం క్వాయల్స్ 25 శాతం ఈ గణాంకాలు చాలు మనిషి ప్రాణాలతో చలగాటమాడే దోమపై ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో...ఏ స్థాయిలో ప్రజలు ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి. హోల్‌సేల్, మాల్స్, రిటైల్ షాపుల సంఖ్య జిల్లాలో ఐదారువేల వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ షాపులు 500 వరకు ఉండగా, సుమారు 50కు పైగా మాల్స్, వెయ్యికి పైగా సూపర్మార్కెట్స్, 4,500కు పైగా రిటైల్‌దుకాణాలు ఉంటాయని అంచనా. దోమల నిర్మూలన కోసం ఉపయోగించే ఉత్పత్తుల వ్యాపారం చూస్తే ఎంత తక్కువ లెక్కేసుకున్నా నెలకు రూ.ఐదారుకోట్లకు పైగానే టర్నోవర్ జరుగుతోంది. ఇక దోమల నిర్మూలన కోసం ఎవరికి వారు తాము సంపాదించే మొత్తంలో కనీసం 5 నుంచి 10 శాతం సొమ్ము ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ధనికులంతా దోమల నిర్మూలన కోసం ఎక్కువగా లిక్విడ్స్ కొను గోలు చేస్తున్నారు. ఇంట్లో గదుల సంఖ్యను బట్టి ప్రతి నెలా రెండు నుంచి ఐదు వరకు లిక్విడ్స్ వీరు కొనుగోలు చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలైతే ఎక్కువగా హిట్స్, బేగాన్ వంటి స్ప్రేయర్స్ నెలంతా సరిపడే విధంగా కనీసం నెలకొకటి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారు కూడా ఎక్కువగా లిక్విడ్స్నే వినియోగిస్తున్నారు. బాగా కడు నిరుపేదలు, రిక్షా పుల్లర్స్, భిక్షగాళ్లు మాత్రమే ప్రతి నెలా కనీసం రెండు ప్యాకెట్స్ చొప్పున క్వాయిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో దోమలు చొరబడకుండా ఉండేందుకు కిటికీలకు మెస్సులు, దోమతెరలు వంటి ఇతర రక్షణ చర్యలు కోసం సీజన్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా లెక్కలు వేస్తే దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ప్రతి నెలా అక్షరాల రూ.ఆరేడుకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.అంటే నెలకు రూ.5కోట్ల చొప్పున లెక్కేసినా ఏడాదికి జరిగే వ్యాపారం రూ.60కోట్ల పైమాటే. అదే విధంగా వీటితో పాటు ఇతర రక్షణ చర్యలకోసం నెలకు రూ.6 కోట్లచొప్పున ఏడాదికి 70 కోట్లకు పైగా తమ కష్టార్జితాన్ని దోమల బారిన పడకుండా ప్రజలు ఖర్చు చేస్తున్నారన్న మాట. ఇవన్నీ సుమారుగా లెక్కలే. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. –సాక్షి, విశాఖపట్నం -
దోమను నమ్ముకుని రూ.130కోట్ల వ్యాపారం
సామాన్యుల జేబులకు చిల్లులు అయినా వదలని దోమరాక్షసులు దోమ నివారణా ఉత్పత్తుల పేరిట రూ.60 కోట్ల వ్యాపారం దోమ బారినపడకుండా ప్రజలు చేసే ఖర్చు రూ.70 కోట్ల పైమాటే జిల్లా జనాభా 44లక్షలు విశాఖసిటీ జనాభా 21.50 లక్షలు ఏజెన్సీ జనాభా 6.5 లక్షలు కుటుంబాలు 11.50 లక్షలు సిటీలో కుటుంబాల సంఖ్య 5.50 లక్షల పంచాయతీలు 925 గ్రామాలు 2811 వర్గాల వారీగా ప్రజలు జిల్లాలో ధనికులు 5 శాతం ఎగువ మధ్యతరగతి ప్రజలు 15 శాతం మధ్యతరగతి ప్రజలు 30 శాతం దిగువ మధ్యతరగతి ప్రజలు 10శాతం అల్పాదాయ, నిరుపేద వర్గాలు 40 శాతం దోమల నివారణకు కోసం ఖర్చు చేసే మొత్తం– ధనికులు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పజలు రూ.500 నుంచి వెయ్యి వరకు నిరుపేదలకు రూ.100 నుంచి రూ.200 వరకు దోమల ఉత్పత్తుల అమ్మకాలు నెలకు..(సీజన్లో)– బడా షాపింగ్‌మాల్స్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు హోల్‌సేల్ దుకాణాల్లో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు సూపర్ మార్కెట్లలో రూ.15వేల నుంచి రూ.25వేల వరకు రిటైల్ షాపుల్లో నెలకు రూ.10వేల నుంచి 15వేల వరకు ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తులుః– లిక్విడ్స్(ఆల్అవుట్, గుడ్‌నైట్ వంటివి) 60 శాతం హిట్స్ వంటి స్పేయర్స్ 15 శాతం క్వాయల్స్ 25 శాతం ఈ గణాంకాలు చాలు మనిషి ప్రాణాలతో చలగాటమాడే దోమపై ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో...ఏ స్థాయిలో ప్రజలు ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి. హోల్‌సేల్, మాల్స్, రిటైల్ షాపుల సంఖ్య జిల్లాలో ఐదారువేల వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ షాపులు 500 వరకు ఉండగా, సుమారు 50కు పైగా మాల్స్, వెయ్యికి పైగా సూపర్మార్కెట్స్, 4,500కు పైగా రిటైల్‌దుకాణాలు ఉంటాయని అంచనా. దోమల నిర్మూలన కోసం ఉపయోగించే ఉత్పత్తుల వ్యాపారం చూస్తే ఎంత తక్కువ లెక్కేసుకున్నా నెలకు రూ.ఐదారుకోట్లకు పైగానే టర్నోవర్ జరుగుతోంది. ఇక దోమల నిర్మూలన కోసం ఎవరికి వారు తాము సంపాదించే మొత్తంలో కనీసం 5 నుంచి 10 శాతం సొమ్ము ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ధనికులంతా దోమల నిర్మూలన కోసం ఎక్కువగా లిక్విడ్స్ కొను గోలు చేస్తున్నారు. ఇంట్లో గదుల సంఖ్యను బట్టి ప్రతి నెలా రెండు నుంచి ఐదు వరకు లిక్విడ్స్ వీరు కొనుగోలు చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలైతే ఎక్కువగా హిట్స్, బేగాన్ వంటి స్ప్రేయర్స్ నెలంతా సరిపడే విధంగా కనీసం నెలకొకటి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారు కూడా ఎక్కువగా లిక్విడ్స్నే వినియోగిస్తున్నారు. బాగా కడు నిరుపేదలు, రిక్షా పుల్లర్స్, భిక్షగాళ్లు మాత్రమే ప్రతి నెలా కనీసం రెండు ప్యాకెట్స్ చొప్పున క్వాయిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో దోమలు చొరబడకుండా ఉండేందుకు కిటికీలకు మెస్సులు, దోమతెరలు వంటి ఇతర రక్షణ చర్యలు కోసం సీజన్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా లెక్కలు వేస్తే దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ప్రతి నెలా అక్షరాల రూ.ఆరేడుకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.అంటే నెలకు రూ.5కోట్ల చొప్పున లెక్కేసినా ఏడాదికి జరిగే వ్యాపారం రూ.60కోట్ల పైమాటే. అదే విధంగా వీటితో పాటు ఇతర రక్షణ చర్యలకోసం నెలకు రూ.6 కోట్లచొప్పున ఏడాదికి 70 కోట్లకు పైగా తమ కష్టార్జితాన్ని దోమల బారిన పడకుండా ప్రజలు ఖర్చు చేస్తున్నారన్న మాట. ఇవన్నీ సుమారుగా లెక్కలే. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. –సాక్షి, విశాఖపట్నం -
రియోను మించేలా సంబరాలు
డీజైవైసీ ప్రకటన (సిటీ డెస్క్) ‘ఈ ఏడాది దినోత్సవ సంబరాలు రియోను మించి చేయాలని నిర్ణయించాం..ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 120 ఏళ్ల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖలోని పూర్ణామార్కెట్‌ను ఎంచుకున్నాం. గంటకొక ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని తీర్మానించాం’ అని విశాఖ డీజేవైసీ (దోమల జాయింట్ యాక్షన్ కమిటీ) ప్రకటించింది. సరిగ్గా 1897 ఆగస్టు 20న మా సోదరి ఎనాఫిలిస్ దోమ వలన మానవులకు మలేరియా వ్యాపిస్తుందని విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నాం. నిజంగా ఆయనే కానీ ఈ విషయాన్ని బయటపెట్టకపోయి ఉంటే మా జాతి అంత గౌరవం లభించేది కాదు. మేము లేని ప్రాంతం లేదు. మేము గీ పెట్టకుండా ఉంటే ఎందరో గాఢనిద్రలోకి జారుకుని ఊబకాయులుగా మారిపోతారు. అంతేకాదు మా మీద కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో మా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గాల్లో ఎగిరే ర్యాలీ చేయాలని నిర్ణయించాం. ఈ సమావేశం నొవెటల్ నిర్వహించాలని మొదట అనుకున్నాం. అయితే ప్రభుత్వం రహదారి భద్రతపై రెండు రోజుల పాటు జాతీయ వర్క్‌షాప్ ఏర్పాటు చేసి మా ఉనికిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. అందుకే పూర్ణామార్కెట్‌లో మాకిష్టమైన చెత్తాచెదారం మధ్య ఈ 120 ఏళ్ల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు డీజేవైసీ ప్రకటించింది. సమావేశానికి ఎనాఫిలస్, క్యూలెక్స్, ఈడిస్, జపనిస్ ఎన్సెఫలైటిస్ దోమలు ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఎనాఫిలస్ మాట్లాడుతూ...కలలో కూడా ఊహించలేదు. మేం ఇంత గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటామని, అదంతా అధికారులు, ప్రజాప్రతినిధులు దయే. వారికి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడే ఎందుకంటే...! ఎన్నో ప్రాంతాలు ఉండగా ఇక్కడే ఉత్సవాలను జరుపుకోవడానికి కారణం.. గత గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరం రోజులు పారిశుధ్య కార్మికులు ఆందోళన చేసి తమ జాతి వద్ధికి ఎంతో సహకరించారు. మేం దినోత్సవం జరుపుకునే నాటికి కష్ణాపుష్కరాలు జరుగుతుండటంతో యాదచ్ఛికమే అయినా...మాకూ... పుష్కరాలకు..మాకూ.. జీవీఎంసీ పారిశుధ్య విభాగానికి తరతరాల అనుబంధం ఏదో ఉంది. కార్మికులంతా పుష్కర సేవలకు వెళ్లడంతో నగరంలో చెత్తాచెదారం పెరిగిపోతోంది. అది మాకు కలిసొచ్చే అంశం. మరిన్ని ఎక్కువ దోమలు వద్ధి చెందడానికి మాకు ఇంతకంటే మంచి అవకాశం లేదు. ఈ విధంగా ముందుకు పోతున్న చంద్రబాబు సర్కార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనే సీఎంగా లేకుంటే మాకు ఇంత పేరుప్రఖ్యాతలు వచ్చి ఉండేవి కావు. అందుకని ఆయన ఎక్కడుంటే అక్కడ మా దోమల దండు అండగా ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని అధికారులకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వారికి ‘దోమస్కార్’ అవార్డులు ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. అవార్డు కింద టార్టోయస్, మస్కిటో క్వాయిల్స్, దోమ తెరలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్కారు, అధికారుల జోలికిపోకూడదని... సర్కారు, అధికారుల జోలికి మేం పోకూడదని ‘చిటుకుచిటుకు’ మంటూ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు గానీ స్వయంగా బాధ అనుభవిస్తే మాపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక పోతే...మాకు నవ్వు తెప్పించేలా అప్పుడప్పుడూ మున్సిపల్ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. చెత్త తొలగిస్తాం...ఫాగింగ్చేస్తాం...బ్లీచింగ్ జల్లుతామని... ఎన్నాళ్లునుంచే ఈ ప్రకటనలు వినీవినీ బోరు కొడుతోంది. ఫాగింగ్ మాకు స్ప్రేతో సమానం... బ్లీచింగ్ మాకు ఫేసుకు రాసుకునే పౌడర్... లేకపోతే ఇప్పటికే మా జాతి అంతరించేది. మనుషులు టెక్నాలజీతో పోటీపడుతుంటే మేము మాత్రం వెనుకబడే ఉన్నామనుకుంటే ఎలా? మరీ విడ్డూరం కాకపోతే...పసుపునకు..కీటకాలను నాశనం చేసే గుణం ఉంటుంది. అదే పసుపు ఎక్కువై గత గోదావరిలో పుష్కరాల్లో ఈకోలీ బ్యాక్టీరియా పుట్టుకువచ్చింది. దీంతో పసుపు కూడా మమ్మల్ని ఏమీ చేయలేక చేతులెత్తేసినందుకు గర్వంగా ఉంది. ఈ నేపథ్యంలో మా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈకోలీ బ్యాక్టీరియాను ఆహ్వానిస్తున్నాం. విశాఖజిల్లాలో ఎడిస్,సూరోఫోరా, హిరోనోటేలియా, ఎల్లోఫీవర్ దోమలు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షంచనున్నాయి. దోమయోగా..! క్యూలెక్స్, ఈడిస్ దోమలు మాట్లాడుతూ...నగరంలో కొత్తగా వచ్చిన కమిషనర్ అక్కడక్కడా చెత్త తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా సభ్యులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. వీరి ఆందోళన జయించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2700 రకాల దోమలను విశాఖ రప్పిస్తున్నాం. వాళ్ల చేత ‘దోమయోగా’ కార్యక్రమం నిర్వహించనున్నాం. బ్లీచింగ్, ఫాగింగ్చేసేటప్పుడు యోగాసనాలద్వారా వాటì నుంచి తప్పించుకునేలా శిక్షణ ఇస్తాం. ఈ కార్యక్రమానికి మాకు స్ఫూర్తి కమలనాథులే. వారికి కూడా ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. 120 ఏళ్ల పండుగకు భారీ ఏర్పాట్లు ఇక 120 ఏళ్ల పండగకు కోట్లాది దోమలు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రధాన మురికికాలువలు, టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త కుప్పలను సిద్ధం చేశాం. చరిత్రలో నిలిచిపోయేలా నేషనల్ జియోగ్రఫీ ఛానల్, స్టార్ గ్రూప్ ఛానల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఈవెంట్‌కు దర్శకత్వ బాధ్యతలను ‘దోమపాటి’కి అవకాశం కల్పించాం. వీలైనన్ని చెత్త కుప్పలను సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన వివరాలకు డీజేవైఏ అని స్పేస్ ఇచ్చి 5757కు ఎస్ఎంఎస్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తామని దోమల సంఘం ప్రకటించింది. సమావేశం అనంతరం అన్ని కలిసి సెల్ఫీలతో సందడి చేశాయి. -
పంజా
విజృంభిస్తున్న దోమ.. ప్రబలుతున్న డెంగీ వ్యాధి పెరుగుతున్న రోగుల సంఖ్య అధికారికంగా 15 కేసుల నమోదు సంగారెడ్డిలో ఒకరు డెంగీతో మృతి చేతులెత్తేసిన ప్రభుత్వాస్పత్రులు రోగ నిర్థారణ, చికిత్స కరువు సాక్షి, సంగారెడ్డిడెంగీతో సంగారెడ్డి పట్టణంలో ఒకరు మృతి చెందగా, పలువురు జిల్లా, హైదరాబాద్‌లలోని ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలేవి? డెంగీని నిర్థారించేందుకు అవసరమైన పరికరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా మెతుకుసీమను దోమ వణికిస్తోంది. దీని కాటుకు ఇప్పటికి 15 మంది డెంగీ బారిన పడ్డారు. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా, సమీపంలోని రాజధానికి వెళ్లి పలువురు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. వర్షాకాలంలో పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరుగుతుండటంతో వ్యాది బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయని చెబుతున్నా.. ఈ సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. దీనికితోడు డెంగీ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు చికిత్స అందించకుండా హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. స్థోమత ఉన్న వారు హైదరాబాద్ వెళ్తుండగా, పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. డెంగీని కచ్చితంగా నిర్థారించాలంటే ఎలిజా టెస్టు చేయాలి. ఈ టెస్టు నిర్వహించేందుకు ఉపయోగించే మిషనరీ వ్యయం రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది ప్రస్తుతం సంగారెడ్డి సమీపంలోని ఎంఎ¯ŒSఆర్ వైద్య కళాశాలలోనే అందుబాటులో ఉంది. దీంతో అక్కడికే ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీ అధికారులు డెంగీ వ్యాధి నిర్థారణ కోసం శాంపిల్స్ పంపుతున్నారు. ఇలా పంపిన శాంపిల్స్‌లో 15 కేసులు డెంగీ ఉన్నట్లు నిర్థారణ వచ్చినట్లు మలేరియా అధికారి నాగయ్య తెలిపారు. పారిశుద్ధ్య లోపమే శాపం దోమల కారణంగా డెంగీ సోకుతుంది. పారిశుద్ధ్యం లోపించటం, మురికినీరు ఒకచోట నిలిచిపోయిన ప్రాంతాల్లో డెంగీ కారక దోమలు పెరుగుతాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినందున గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత లోపించటంతో దోమల బెడద పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సరిగ్గా సాగటంలేదు. మున్సిపాలిటీల్లో సైతం ఫాగింగ్ చేయకపోవటం, మురికికాల్వలు శుభ్రం చేయకపోవటంతో డెంగీ పంజా విసురుతోంది. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో డెంగీకి గురై ఒకరు మృతి చెందారు. ఇటీవల నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ముగ్గురు విద్యార్థులు డెంగీ బారిన పడ్డారు. టె¯ŒS్త చదివే బిందు, నమ్రతతో పాటు 6వ తరగతి చదివే నితి¯ŒSకుమార్ గత నెల 25 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు డెంగీకి చికిత్స పొందారు. బిందు గాంధీ ఆసుపత్రిలో, నమ్రత, నితి¯ŒSకుమార్ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం తీసుకున్నారు. అక్కడే 10–15 మంది రోగులు.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ నుంచే 10–15 మంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఆ మండలంలోని వివిధ గ్రామాల నుంచి సైతం డెంగీ రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే డెంగీ నిర్ధారణ సౌలభ్యం ప్రభుత్వాసుపత్రుల్లో లేకపోవడం వల్ల పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రంతో మందును పిచికారి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అటువంటిదేదీ కనబడడం లేదని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు సైతం డెంగీ కచ్చితంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరా>లు లేనప్పటికీ తమ ల్యాబ్‌్సలో అందుబాటులో ఉన్న పరికరాలతో సీబీపీ లాంటి టెస్టులు చేసి డెంగీ సోకినట్లు రోగులకు చెప్పి వారిని ఆసుపత్రుల్లో చేర్చుకుని డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. డెంగీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్యం లోపించి దోమలు పెరగటం వల్ల డెంగీ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ప్రజలు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమల తెరలు వాడాలి. డెంగీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు డెంగీ కేసులపై అధ్యయనం జరుపుతున్నాం. – నాగయ్య, జిల్లా మలేరియా అధికారి -
నో ఫాగింగ్
పెరిగిన దోమల బెడద పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు కుంటలను తలపిస్తున్న ఖాళీ స్థలాలు పట్టించుకోని పంచాయతీ అధికారులు ఇచ్చోడ : అసలే వర్షాకాలం. ఆపై నెల నుంచి ముసురు. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. ఇందులో పందులు, కుక్కలు సంచరించడంతో కాలనీలో విపరితమైన దోమలు, ఈగలు వద్ధి చెందుతున్నాయి. దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు నీరు నిలిచే చోట బయటకు పంపే ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి ఉండడం..అందులోనే చెత్తాచెదారం పడేయడంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇళ్ల మధ్యనే కుంటల్లాగా నీరు నిలిచి ఉండడంతో పందులు బొర్లుతున్నాయి. దోమలు వద్ధి చెందుతున్నాయి. దీంతో చుట్టు పక్కల ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. మలేరియా, డెంగీ, కలరా తదితర వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. కనిపించని ఫాగింగ్ వర్షాకాలంలో మండల కేంద్రంలో ప్రతీ చోట ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు పంచాయతీ అధికారులు ఫాగింగ్ చేయలేదు. ఫాగింగ్ చేస్తే దోమలు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మేజర్ పంచాయతీ పరిధిలోని కేవలం రెండు కాలనీలో మాత్రమే ఫాగింగ్ చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతీ కాలనీలో ఫాగింగ్ చే సి దోమల నిర్మూలన కోసం కృషి చేయాలని కోరుతున్నారు. -
దోమలకు వలవేస్తాయి!
టొరంటో: డెంగ్యూ, మలేరియా, జికా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న దోమలను అరికట్టేందుకు కెనడా శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. దోమలను ఆకర్షించడం, అవి పెట్టిన గుడ్లను నాశనం చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఇందుకోసం ఓవిల్లాంట అనే పరికరాన్ని తయారు చేశారు. దీనికోసం పనికిరాని పాత కారు టైర్లను సుమారు 50 సెంటీమీటర్ల పొడవుతో కోసి ఒకదానిపై ఒకటి ఉంచి.. ఇలా ఓ ఫ్రేమ్‌లో బిగించారు. కిందిభాగంలో పాలతో తయారు చేసిన ఓ ద్రావణాన్ని (దీనిని కెనడాలోని లారెంటియన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు) నింపారు. ద్రావణంపైన ఓ పేపర్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. ఈ ద్రావణానికి ఆడ దోమలను ఆకర్షించే గుణం ఉండడంతో అవి ఒవిల్లాంటాలోకి చేరి అందులోని పేపర్ స్ట్రిప్‌పై గుడ్లుపెట్టడం మొదలుపెట్టాయి. వారానికోసారి ఆ పేపర్ స్ట్రిప్‌ను బయటకు తీసి దానిపైన ఉన్న గుడ్లను ఇథనాల్‌తో నాశనం చేశారు. ఇలా కేవలం ఒక నెలలోనే 18,100 దోమల గుడ్లను నాశనం చేశారు. దోమలను అంతమొందించడం కంటే వాటి గుడ్లను నాశనం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దోమలను అరికట్టేందుకు వినియోగిస్తున్న రకరకాల ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలను వినియోగిస్తున్నందున అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ఓవిల్లాంటాతో అటువంటి ఇబ్బందులేమీ ఉండవని చెబుతున్నారు. -
దోమల ఫ్యాక్టరీ
హైదరాబాద్: దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. దోమలద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా మొదలుకొని రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటికితోడు చైనాలో ఓ బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమల భరతం పడతామంటోంది. ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ నెలకొల్పి ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని బయటకు వదులుతామంటోంది. ఉన్న దోమలకు తోడు ఈ కొత్త దోమలెందుకబ్బా? అనేగా మీ సందేహం. చైనాలోని సన్ యాట్సెన్ వర్సిటీ శాస్త్రవేత్త జియాంగ్ జీ, మిషిగన్ స్టేట్ వర్సిటీలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే అభివృద్ధి చేస్తారు. మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మగదోమలు మామూలు ఆడదోమలతో కలిస్తే పుట్టే సంతానం మొత్తానికి వంధ్యత్వం (పిల్లలు పుట్టకపోవడం) వస్తుంది. అవి మళ్లీ సంతానోత్పత్తి చేయలేవు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది గాంగ్జూలోని ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట. -
లైంగిక చర్యతో కూడా జికా వ్యాప్తి!
న్యూయార్క్: జికా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. ప్రెగ్నెన్సీ మహిళలు దీని బారిన పడితే వారికి పుట్టే పిల్లల్లో తల పరిమాణం చిన్నదిగా ఉండి మెదడుకు సంబంధించిన ఎదుగుల తక్కువగా ఉంటోంది ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల కాలంలో జికా వైరస్ ప్రభావానికి గురైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకూ జికా వైరస్ దోమ కాటు ద్వారానే వ్యాప్తి చెందుతుందని భావిస్తూ వచ్చారు. ఎడీస్ ఈజిప్టి దోమ జికా వైరస్‌ను వ్యాప్తి చెస్తోంది. అయితే లైంగిక చర్య ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జికా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి రక్తంతో పాటు వీర్యం శాంపిల్స్‌లో కూడా రెండు వారాల పాటు వైరస్ ఉనికిని గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. బ్రెజిల్లో జికా వైరస్ విజృంభిస్తుండటంతో రియో ఒలంపిక్స్పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు తమ మహిళా క్రీడాకారిణిలను బ్రెజిల్ పంపడానికి సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఒలంపిక్స్ నాటికి జికాను అదుపులోకి తెస్తామని బ్రెజిల్ చెబుతోంది. భారత్‌లో డెంగీ వ్యాప్తి చేసే ఎడీస్ దోమలకు కొదువలేదు. ఈ దోమలే జికా వైరస్‌నూ వ్యాప్తి చెందిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇంటిప్స్
వాతావరణంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుంటే, దోమల బెడద కూడా పెరుగుతుంది. మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వంటివి కొందరికి సరిపడక అలెర్జీలు వస్తుంటాయి. అలాంటప్పుడు చీకటిపడే వేళ ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, ఎండిన వేపాకులను వేసి పొగపెడితే చాలు. దోమల బెడద తీరుంది. దోమలు కుడితే పిల్లలకు దద్దుర్లు వస్తుంటాయి. పిల్లలకు దోమకాటు బెడద తప్పాలంటే, వేపనూనె, పసుపు కలిపి ఒంటికి పూస్తే చాలు. దోమలు దూరంగా ఉంటాయి. -
దోమకు చెలగాటం... మనిషికి డెంగ్యూ సంకటం!
అప్పుడెప్పుడో అష్టదిగ్గజాలు కొలువుదీరి సరదాగా పద్యపూరణం కోసం ‘‘దోమ గొంతుకలో ఏనుగు చిక్కుకుంది’’ అనే అర్థం వచ్చే చివరి పాదంతో పద్యం పూర్తి చేయమన్నారట ఒక కవి. కానీ... ఆ అష్టదిగ్గజాలే ఈ రోజున ఉంటే... పూరణం కోసం సీరియస్‌గా ఇచ్చే పద్యపాదం ‘‘మానవయోధుడు దోమ గొంతున చిక్కె’’ అని ఉండవచ్చు. పైగా దీన్ని పూరించడమూ ఈజీ! డెంగ్యూ అనే వ్యాధిబారిన పడ్డందువల్ల మనిషి అంతటివాడు దోమ బారిన పడి బాధలనుభవించాడని చెప్పేయవచ్చు. ప్రస్తుతం అంత తీవ్రంగా ప్రబలుతోంది డెంగ్యూ వ్యాధి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వ్యాపిస్తున్న సందర్భంగా డెంగ్యూ వ్యాధిపైన, దాని నివారణ, చికిత్స వంటి పలు అంశాలపై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. ఈ సీజన్లో దోమల వ్యాప్తి సాధారణం. దోమల్లోనూ అనేక రకాలు. అందులో పులిదోమ ఒకటి ఉంటుంది. పేరుకు తగ్గట్టు మనుషుల్ని వేటాడుతుందీ దోమ. ఈ టైగర్‌దోమ నోటి అవయవాలు కూడా పులి కోరలతో పోల్చదగ్గవే... అవి రక్తం పీల్చే అవయవాలైన మాండిబుల్, మాక్సిల్లే. వాటి సహాయంతో టైగర్‌దోమ రక్తం పీలుస్తూ, డెంగ్యూ వైరస్‌ను మనిషిలో ప్రవేశపెడుతుంది. అంతే... ఆ వైరస్ ప్రవేశించిన 2 నుంచి 7 రోజుల్లోపు ఆ వ్యక్తిలో డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. చాలా వైరస్‌లలాగే ఇది తనంతట తానే తగ్గిపోతుంది. అయితే తీవ్రతను బట్టి డెంగ్యూను మూడు రకాలుగా విభజించవచ్చు. 1. అన్ డిఫరెన్షియేటెడ్ ఫీవర్ - ఇతర ఫీవర్స్లాగానే అనిపించే జ్వరం. 2. డెంగ్యూ హెమరెజిక్ ఫీవర్ - మన అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం. 3. డెంగ్యూ హెమరెజిక్ షాక్ - అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు... బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లడం. డెంగ్యూ సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ర్యాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం.రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ అంతర్గత రక్తస్రావం లక్షణాలు ముందుగా కనుగొనడానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించవచ్చు. చర్మంపై ఎర్రని మచ్చలు కనబడుతున్నా, కళ్లలో, నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజెక్షన్ ఇచ్చినచోట లేదా ఇతర ప్రదేశాల నుంచి రక్తస్రావం జరుగుతున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా లేదా విరేచనం నల్లగా వస్తున్నా డెంగ్యూ హెమరేజిక్ జ్వరంగా అనుమానించాలి. ఈ జబ్బులో అంతర్గత రక్తస్రావం వల్ల కాళ్లు, చేతులు, ముఖం వాయడం జరగవచ్చు. అంతేకాకుండా పొట్టలో, ఊపిరితిత్తుల బయట, గుండె చుట్టూ నీరు చేసి ఆయాసం పెరగవచ్చు. సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల జ్వరం వచ్చి తగ్గిన తరువాత ప్లేట్లెట్స్ పడిపోవడం, ఫలితంగా అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగడం, బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం, షాక్ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైనా జ్వరం తగ్గిపోయింది కదా ఇంకేం ఉండదులే అని అనుకొని వైద్యుడి దగ్గరకి వెళ్లకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జ్వరం వచ్చి తగ్గాక ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. చికిత్స ఇలా... ఈ జబ్బుకి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచీ ఓఆర్ఎస్ ఇవ్వవచ్చు. షాక్‌లోకి వెళుతున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి ప్లేట్లెట్స్ సంఖ్య మరీ తక్కువకు పడిపోయినప్పుడు ఎప్పుడు వాటిని ఎక్కించాలో డాక్టర్ నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరిలోనైనా రావొచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. సాధారణంగా ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే! కాబట్టే ఈ జాగ్రత్త. నివారణ ఎంతో మేలు... ఏ వ్యాధి విషయంలోనైనా చికిత్స కంటే నివారణ మేలు. డెంగ్యూకు కారణమయ్యే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే స్వైర విహారం చేస్తుంది. నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు అనేది నిల్వ ఉండకుండా ఒకరోజు నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశంలో ఎడిస్ ఎజిప్టై విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి. అదే సమయంలో బయటి నుంచి దోమలు రాకుండా కిటికీలకు మెష్ అమర్చుకోవాలి. ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిప్టై గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లను పైజామాలు, సాక్స్‌తో కవర్ చేసుకుంటే మంచిది.ఈ దోమలు ముదురు రంగులకు ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.పగలు కూడా మస్కిటో కాయిల్స్ వాడవచ్చు. కొందరికి ఈ వాసన సరిపడకపోవచ్చు. అలా సరిపడని పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా వహించాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడటం చాలా ఉత్తమమైన మార్గం. ప్రమాద హెచ్చరికలు ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చివుళ్లలోంచి కానీ చర్మంలోపల కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. సాధారణంగా ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే! కాబట్టే ఈ జాగ్రత్త. ఆయుర్వేద చిట్కాలు ఎండిన వేప ఆకులు, వేప ఈనెలు, ఆవాలు, ఇంగువతో పొగపెట్టి ఇల్లంతా పట్టాలి.ఇంటి మూలల్లో కర్పూరపు ఉండలు కూడా పెట్టుకోవచ్చు. వీటివల్ల దోమలే కాకుండా ఇతర హానికారకమైన క్రిములూ చచ్చిపోతాయి.అలాగే మనలో వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి అమృతారిష్ట అనే టానిక్‌ను తీసుకోవాలి. ఎనిమిదేళ్లలోపు పిల్లలకైతే రెండు చెంచాల అమృతారిష్ట మందును రెండు చెంచాల నీళ్లతో కలిపి ఉదయం, రాత్రి రెండు పూటలా ఇవ్వాలి. పెద్దవాళ్లయితే నాలుగు చెంచాల అమృతారిష్ట మందు, నాలుగు చెంచాల నీళ్లతో కలిపి ఉడయం, రాత్రి తీసుకోవాలి.అమృతారిష్ట మందు దొరకని ప్రాంతాల వాళ్లు రెండు చెంచాల ఇప్పతీగ ఆకుల రసంలో తేనె కలుపుకొని ఉదయం, రాత్రి తీసుకుంటే సరిపోతుంది.ఒకవేళ దోమ కాటుతో ఇంట్లో వాళ్లు జ్వరం బారిన పడ్డా బెంబేలు పడకుండా ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.మృత్యుంజయ రస, చంద్రకళారస అనే ఆయుర్వేద మాత్రలను ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వేసుకోవాలి. వీటితోపాటు అమృతారిష్ట టానిక్నూ తీసుకోవాలి. ఇవి డెంగ్యూ వల్ల పడిపోయిన ప్లేట్లెట్ కౌంట్స్ని, బ్లీడింగ్‌ని కంట్రోల్ చేస్తాయి. డాక్టర్ గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
క్యాప్సూల్ లో దోమా...దేవుడా!
ముంబై: మొన్న మ్యాగీ ..నిన్న కెఎఫ్సీ ..తర్వాత గ్లూకాన్డీ లో పురుగులు.. చివరికి పసిపిల్లలకు పెట్టే సెరిలాక్లో కూడా పురుగులు. వాటికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తోడయ్యింది. సాధారణంగా నీరసించిన శరీరానికి శక్తిని అందించేందుకు, మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోమని వైద్యులు చెబుతారు. మరి అలాంటి మాత్రలో ఈగలు, దోమలు కనిపిస్తే ఎలా ఉంటుంది. యాక్ తూ....అంటాం.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ముంబైలోని ఓ మహిళకు. ఈ మధ్యనే పాపకు జన్మనిచ్చిన ఆమెకు శక్తి వచ్చేందుకు వైద్యులు కొన్ని మాత్రలు రాసిచ్చారు. అలా ఆమె కొనుక్కున్న క్యాప్సూల్ ఒకదాంట్లో చచ్చిపోయిన దోమ కనిపించింది. దీంతో షాకవడం ఆమె వంతయ్యింది. అదనపు శక్తి మాట దేవుడెరుగు, అసలుకే మోసం వస్తే ఎలా అని.... తాను కొన్నమందుల్లోని క్యాప్సూల్‌లో చచ్చిపోయిన దోమను చూసి ఆశ్చర్యపోయానని బాధితురాలు వాపోయింది. దీనిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. -
దోమపోటు..పంటకు చేటు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాల్లో దోమపోటు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది వ్యాపిస్తోందని చెబుతున్నారు. వరి 25 రోజుల నుంచి పొట్ట దశ వరకు ఉంది. ముందుగా వేసిన వరి పొట్టదశలో ఉంది. ప్రధానంగా 5204 సాంబ మసూరీ రకం వరిలో అధికంగా దోమపోటు ఉన్నట్లు వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎంటీయూ 1010, 1001 వంటి రకాలు దోమను తట్టుకొనే గుణం ఉన్నా వాతావరణం అనుకూలించకపోవటంతో వీటినీ దోమ ఆశించిందని జిల్లా వ్యవసాయ ఉప సంచాలకులు ఎం.రత్నమంజుల తెలిపారు. వరి పంట దిగుబడులను దెబ్బతీసే దోమ పోటును సమర్థంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. దోమపోటు నివారణ చర్యల గురించి వివరించారు. వరిని ఆశించే దోమల రకాలు వరిని రెండు రకాల దోమలు ఆశించి నాశనం చేస్తాయి. 1.గోధుమ రంగు వర్ణపు దోమ (బ్రేన్ ప్లాంట్ హాపర్) 2. తెల్లవీపు దోమ ( వైట్ బ్లాక్ ప్లాంట్ హాపర్) దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు వాతావరణంలో 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80-90 శాతం ఉంటే దోమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. నత్రజనిని అధికంగా వాడిన ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్న పొలాల్లో దోమపోటు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దోమ జీవిత చరిత్ర ఆడదోమ మొక్క అడుగు భాగంలోని ఆకు తొడుగులో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు కంటికి కనిపించని పరిమాణంలో ఉంటాయి. సుమారు వారం రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. రసాన్ని పీల్చి పెరుగుతాయి. ఈ పిల్ల పురుగులు 12-17 రోజుల్లో 5 దశల్లో పెరిగి క్రమేపి పెద్దవవుతాయి. ఈ పెద్ద పురుగులు తిరిగి గుడ్లు పెడతాయి. ఆడదోమలు, మగ దోమల కన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి. పంటను ఇలా నష్టపరుస్తాయి గోధుమ రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్ల దగ్గర గుంపులుగా చేరి కాండం నుంచి రసాన్ని పీల్చి వేయడం వల్ల మొక్కకు పోషక పదార్థాలు అందక బలహీనపడతాయి. క్రమేపీ మొక్కలు సుడులుగా ఎండిపోతాయి. దీన్నే సుడి తెగులు అంటారు. తెల్లవీపుదోమ కూడా గోధుమ వర్ణపు దోమవలె వరిమొక్కలోని రసాన్ని పీల్చి పంటకు నష్టం చేస్తుంది. నివారణ చర్యలు నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. పైపాటుగా వాడేటప్పుడు 2-3 దఫాలుగా వాడాలి. వరి నాటే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ (తూర్పు. పడమర) పాయలను వదిలి నాటితే గాలి ప్రసరించి దోమల ఉధృతి తక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉంటే దోమ ఉధృతి పెరుగుతుంది. పొలాన్ని ఆరగట్టి తిరిగి నీటిని పెట్టడం ద్వారా దోమల ఉధృతిని తగ్గించవచ్చు. విచక్షణ రహితంగా పురుగుమందులను వినియోగించవద్దు. ఉదాహరణకు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేస్తే దోమ ఉధృతి తగ్గటానికి బదులు ఎక్కువవుతుంది. వాడాల్సిన పురుగు మందులు మోనోక్రొటోఫాస్ 36 శాతం ద్రావణం ఎకరాకు 440 మి.లీ లేదా ఎసిఫేట్ 75 శాతం 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి ప్రభావం 3-4 రోజుల వరకు ఉంటుంది. ఫిప్రోనిల్ 5 శాతం 400 మి.లీ పిచికారీ చేసి కూడా నివారించుకోవచ్చు. అయితే దీని ప్రభావం కన్పించడానికి 2-3 రోజుల సమయం పడుతుంది. 15-20 రోజుల వరకు కీటకాలను నాశనం చేస్తుంది. ఎథోఫెన్ ప్రాక్సి 10 శాతం ద్రావణం ఎకరాకు 400 మి.లీ లేదా బూప్రోఫెజిన్ 25 శాతం 320 మి.లీ మందు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ రెండు కీటక నాశినులు దోమ ఉధృతిని తగ్గించటమేగాక దోమ సహజ శత్రువైన మిరిడీ బగ్స్ సాలీడులకు తక్కువ హాని చేస్తాయి. పిచికారీ విధానం: నాజిల్‌ను మొక్క మొదలు వైపు ఉంచి క్రిమిసంహారక మందును పిచికారీ చేయాలి. దోమ మొక్కల కాండం అడుగు భాగాన ఉంటుంది. కాబట్టి పంటపైన పిచికారీ చేస్తే ప్రయోజనం ఉండదు. -
దోమల రాజ్యం
నివారణలో పురపాలక నిర్లక్ష్యం వ్యాధులతో పట్టణవాసులకు అనారోగ్యం యలమంచిలి : దోమల విజృంభణతో యలమంచి లి పట్టణవాసులు భయపడిపోతున్నారు. వీటి నివారణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా ఫలితం కనిపిం చడం లేదని మండిపడుతున్నారు. ఈ మున్సిపాలిటీ లో జ్వరపీడితుల సంఖ్య ఇటీవల ఎక్కువగా ఉంది. జ్వర బాధితులతో పట్టణంలో ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెం గ్యూ, ఫైలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. చర్యలు అంతంత మాత్రమే.. దోమల నివారణకు పురపాలక సంఘం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేయటం లేదు. దోమల కారక మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాటి లార్వాలు చనిపోయేందుకు ప్రతి వారం బెటైక్సు, మలాథియన్ రసాయనాలు పిచికారీ చేయాలి. లార్వాలు తినే గంబూషియా చేపలు మురికి కాల్వల్లో వదలాల్సి ఉండగా ఆ మాటే మరిచారు. మరుగు కాల్వల్లో ఎం.ఎల్ ఆయిల్ బాల్స్ వేయాల్సి ఉన్నా నామమాత్రంగా వేసి నిధులు ఖర్చయినట్టు చూపిస్తున్నారు. ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఆ ఊసే పక్కనపెట్టేశారు. కొద్ది నెలలుగా మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరినా పట్టించుకోకపోవడం దోమల నివారణపై చూపుతున్న శ్రద్ధ ఏపాటిదో అర్ధమైపోతోంది. మరుగుదొడ్ల ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా గొట్టాలకు వలలు కట్టారు. చెత్త నిల్వ ప్రాంతాల్లో తొలగించిన తరువాత బ్లీచింగ్ చల్లాలి. కేవలం చెత్త ఏరివేసి సరిపెట్టేస్తున్నారు. అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థ.. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో యానాద్రి కాలువ పూడికతో నిండి కాలువలన్నీ శిథి లమయ్యాయి. మూడేళ్ల క్రితం గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చే స్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. గత ఎమ్మెల్యే కన్నబా బు యానాద్రి కాలువ విస్తరణ పను లు చేయించాలని ప్రయత్నించినా మధ్యలోనే నిలిచిపోయింది. మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ వంటి వ్యాధులు దోమలు కారణంగా వ్యాప్తి చెందుతున్నాయి. శివారుగ్రామాలు కట్టుపాలెం, గొల్లలపాలెం, మంత్రిపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రోడ్లన్నీ బహిర్భూమిగా ఉపయోగించడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దోమల నిర్మూలనకు చర్యలు.. పట్టణంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తరచూ మలాథియాన్, బెటైక్స్ పిచికారీ చేస్తున్నాం. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తున్నాం. రూ.10 లక్షలతో యానాద్రి కాలువ, మరికొన్ని ప్రధాన మురుగు కాలువల్లో పూడిక తీయిం చేందుకు త్వరలో టెండర్ ఖరారు చేస్తాం. -సత్తారు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ -
మీ ముందు‘చూపే’.. మరొకరికి కంటి వెలుగు
దోమ: ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే అంతా అంధకారమే.. రాత్రి వేళ కరెంట్ పోతే చాలు వెంటనే దీపం కోసమో.. టార్చలైట్ కోసమో వెతికేస్తాం.. మరి చూపే లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదూ.. పుట్టుకతో అంధత్వం గల వారితో పాటు పలు కారణాలతో మధ్యలో చూపు కోల్పోయిన వారిని సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. అలాంటి వారిని ఆదుకొని కంటి చూపు ప్రసాదించడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయినా ఇంకా ఎందరో అందమైన ప్రపంచాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ దిశగా వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాలను నిర్వహిస్తోంది. సరైన సమయంలో చికిత్స అందకే.. అధికారుల వివరాల ప్రకారం జిల్లాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది అంధత్వంతో బాధపడుతున్నారు. పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న వారు 15 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. పాక్షిక అంధత్వంతో బాధ పడుతున్న వారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం మూలంగానే దృష్టిలోపానికి గురవుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో... జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత కంటి వై ద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారి కి హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది 20 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 22 వేల మందికి నిర్వహించారు. నేత్రదానం మహాదానం... జిల్లాలో కార్నియా అంధత్వంతో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు. ఏటా 100 నుంచి 120 మంది వరకు ఈ తరహా అంధత్వానికి గురవుతున్నారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన కళ్లను ఇలాంటి వారికి అమర్చడం ద్వారా చూపును ప్రసాదించే వీలుంది. వారికి అమర్చడానికి కార్నియాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేత్రదానం చేసే వారి సంఖ్య పెరిగితే ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది. నేత్ర దానానికి వీరు అర్హులు... ప్రమాదవ శాత్తు గుండె జబ్బులు, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్ర దానానికి అర్హులు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. మధుమేహం, రక్త పోటు వ్యాధిగ్రస్తులు కూడా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. నేత్రదానం చేయాలనుకునే వారు... నేత్ర దానం చేయాలని సంకల్పించే వారు ముందుగా తమ కుటుంబ సభ్యుల సమ్మతితో సంబంధిత ప్రతిజ్ఞా పత్రాన్ని నింపి సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో గానీ, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐ బ్యాంకుల్లో గానీ అందజేయవచ్చు. చనిపోయిన 6 గంటల లోపు వారి కుటుంబ సభ్యులు, బంధువుల అనుమతితో కళ్లను సేకరిస్తారు. జిల్లాలో గత ఏడాది 70 మంది నేత్రదానానికి ముందుకు రాగా ఈ ఏడాది 80 మంది ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
మలేరియాపై పరిశోధనలో కీలకపాత్ర..
-
ప్రపంచానికే...చలిజ్వరం!
‘దోమ కొంచెం... వ్యాధి తీవ్రం’ అనే మాట మలేరియాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే... ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో 109 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... ప్రపంచంలోని సగానికి పైగా దేశాలను ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఇక మన దేశంలో ప్రతి ఏడాదీ మూడు కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనూ ఏజెన్సీ ఏరియాలు అని మనం పిలుచుకునే అనేక కొండ ప్రాంతాల్లోని, అటవీ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో మలేరియా దెబ్బకు కునారిల్లుతున్నారు. సత్వర వైద్య సహాయం అందక అల్లాడుతున్నారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినం. ఈ సందర్భంగా ఇంత చిన్న దోమ కాటుతో అంత పెద్ద మనిషికి ప్రాణహాని సైతం కల్పించే ‘మలేరియా’పై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం. దోమానవ బంధం మలేరియా ఇంతగా బాధించే వ్యాధి కదా. మరి దోమలన్నింటినీ నిర్మూలిస్తే మలేరియాను పూర్తిగా నివారించవచ్చు కదా అన్నది చాలామందిలోని భావన. మలేరియా వ్యాధిని కలగజేసే పరాన్నజీవులను వ్యాప్తి చేసే దోమలు ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అదేమిటంటే... తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువ తేమ, దాంతో పాటు నీళ్ల లభ్యత ఉండటం. ఈ మూడూ వర్షారణ్య ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు. చిత్రంగా ఇవే పరిస్థితులు వరి పండించే ప్రాంతాల్లోనూ ఉంటాయి. అంటే తీవ్రమైన వేడిమి, తేమతో పాటు వర్షం ఎక్కువగా కురవడం అన్నది వరి పంటకు అనువైన పరిస్థితులు. అందుకే ఒక్కమాటలో బండగుర్తుగా చెప్పాలంటే వర్షారణ్య ప్రాంతాలతో పాటు వరి పండేందుకు అనువైన అన్ని చోట్లా మలేరియా సోకడానికి కారణమయ్యే దోమలూ పెరుగుతాయి. అందుకే వరి పంట ఉన్నంత కాలం దోమలూ... అవి ఉన్నంత కాలం మలేరియా జ్వరాలు ఉంటాయన్నది కొందరు ఎంటమాలజిస్టుల అభిప్రాయం. ఇక ఒక దోమ జీవన వ్యవధి (ఆయుఃప్రమాణం) 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్పలో నిల్వ ఉన్న 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల ఉండే ‘మిగులు జలాల్లో’నూ దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని తరమడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికి అవి కూడా అన్ని దార్లు వెతుకుతుంటాయి. తద్వారా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం. ప్లాస్మోడియమ్జీవిత చక్రం సాగుతుందిలా... అంతకు ముందే మలేరియా వ్యాధి ఉన్న రోగిని కుట్టిన దోమ... మళ్లీ ఆరోగ్యవంతుడిని కుట్టగానే ‘మలేరియా’ వ్యాధిని కల్పించే కారకాలు ఆరోగ్యవంతుడైన మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ వ్యాధి కారకాలను ‘స్పోరోజువైట్స్’ అంటారు. ఆరోగ్యవంతుడి రక్తప్రవాహంలోకి చేరిన అవి... నేరుగా ఆ వ్యక్తి కాలేయంలోకి చేరి అక్కడ ఆశ్రయం ఏర్పరచుకుంటాయి. అక్కడ అవి తమ సంఖ్యను అలైంగిక మార్గంలో పెంపొందించుకుంటాయి. ఆ తర్వాత అవి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి. కాలేయం నుంచి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించే వ్యాధి కారకాలను ‘మెరోజువైట్స్’ అంటారు. కొన్ని పరాన్న జీవులు ఎర్రరక్తకణాల నుంచి గ్యామెటోసైట్స్ అని పిలిచే కణాలుగా మారి మళ్లీ దోమ రక్తంలోకి ప్రవేశిస్తాయి. దోమ కడుపులో అవి లైంగిక చర్య ద్వారా తమ సంఖ్యను పెద్ద సంఖ్యలో అభివృద్ధిపరచుకుంటాయి. దోమ కడుపులో ఉన్న వ్యాధి కారకాలు తొలుత ఊకైనేట్స్గా... ఆ తర్వాత ‘ఊసిస్ట్స్’గా అభివృద్ధి చెందాక చివరగా ‘స్పోరోజువైట్స్’గా మారి దోమ లాలాజలంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మళ్లీ మరో ఆరోగ్యవంతుడిని చేరగానే... పైన పేర్కొన్న జీవిత చక్రం (లైఫ్ సైకిల్) మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ, అలా వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటుందన్నమాట. వ్యాధి కారకాలైన ప్లాస్మోడియమ్ మనిషిలో ఆశ్రయం తీసుకున్నప్పుడు అవి మనిషిలో అలైంగిక చర్య ద్వారా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనిషిని ‘ఇంటర్మీడియట్ హోస్ట్’ అని అంటారు. అయితే చిత్రం ఏమిటంటే... ప్లాస్మోడియమ్ పరాన్నజీవులు మనిషికి వ్యాధిని కలిగిస్తాయి. దోమకు ఎలాంటి హానీ చేయవు. కాబట్టి దోమను ‘క్యారియర్’ (వ్యాధి వ్యాప్తికి దోహదపడే వాహకం) గా అభివర్ణిస్తారు. వ్యాక్సిన్లు ప్రస్తుతానికి మలేరియాకు లెసైన్స్డ్ వ్యాక్సిన్ ఏదీ లభ్యం కావడం లేదు. అయితే ఆర్టీఎస్.ఎస్/ఏఎస్ఓ1 అనే వ్యాక్సిన్లు పరీక్ష దశల్లో చాలా పురోగతి సాధించాయి. ప్రస్తుతానికి ఇవి ‘క్లినికల్ ట్రయల్’ దశలో ఉన్నాయి. అందుకే త్వరలోనే మలేరియాకు మంచి వ్యాక్సిన్ లభ్యమవుతుందనే ఆశాకిరణం కనిపిస్తోంది. మలేరియా అంటే...? క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో మలేరియా అన్న వ్యాధి చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. దోమ కడుపులో జరిగే జీవిత చరిత్రను సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు మన సికింద్రాబాద్ లోనే కనుక్కున్నారు. అంటే ప్రపంచానికి ఉపయోగపడే ఒక కీలకమైన పరిశోధన ఫలితాలు మన సికింద్రాబాద్‌లోనే ఆవిష్కృతమయ్యాయన్నమాట. వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ ? వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. లక్షణాలు మలేరియా జ్వరం ప్రధాన లక్షణంగా కనిపించే వ్యాధి. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మలేరియా లక్షణాలు ఇవి... చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు ఒక్కోసారి అది మృత్యువుకు కూడా దారితీయవచ్చు. స్థూలంగా కనిపించే అన్ని లక్షణాలు... జ్వరం తలనొప్పి తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరం: ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజువైట్స్ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. చలి: మొదట చలి వచ్చి ఆ తర్వాత విపరీతమైన చెమటలు వస్తాయి. లక్షణాల్లో తేడాలిలా... ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజువైట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందుకే జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒకలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవ్యులాలో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. మలేరియా ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది. నిర్ధారణ... ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్-స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఇంత వేగంగా చేయగలిగే ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా. గతంలోని పరీక్షలు... రక్త పరీక్ష: థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్-ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు. చికిత్సలోనూ ఇప్పుడు విప్లవాత్మక పురోగతి... గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా ఒకనాడు విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. దాంతో ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది. సాధారణ చికిత్సా ప్రక్రియలు మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది తీవ్రత తక్కువగా ఉండే వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్ అయితే... తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాలి. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ర్పభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహతప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి. ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాలి. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి ఈ తరహా చికిత్స దొరకకపోతే రోగి మరణానికి కూడా దారితీయవచ్చు. చికిత్సల్లో ఇప్పుడు చోటు చేసుకున్న పురోగతి ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్వుడ్’ అని పిలిచే ఒక రకం చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో రోగిలో గుణం కనిపించడం చాలా మెరుగ్గానూ, వేగంగానూ జరుగుతుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో కేవలం ఆర్టిమిసినిన్ గ్రూపు మందులే కాకుండా వాటితో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు. నివారణ దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చన్నమాట. వ్యక్తిగతమైన నివారణలో భాగంగా మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడటం ఒక పద్ధతి. దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండి, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా శుభ్రం చేసుకోవడం అవసరం. దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ - పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్ (కీమో-ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. వ్యాధి నిర్ధారణ ప్రక్రియల్లో, చికిత్స పద్ధతుల్లో ఇంతగా పురోగతి చోటు చేసుకుంటున్నా చాలా ప్రాంతాల్లో ఇదో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. మన రాష్ట్రంలోనూ అనేక గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇది తీవ్రంగా బాధిస్తోంది. అందుకే చవగ్గా లభ్యమయ్యే మరిన్ని మందులు, నివారణ ప్రక్రియల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. అవి అవసరం కూడా. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి