
చేబ్రోలు (పొన్నూరు): దోమల బెడద నివారణ కోసం వెలిగించిన దోమల చక్రం ఓ మహిళ ప్రాణం తీసింది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాపురం చానల్ సమీపంలో జీబీసీ రహదారి పక్కన పూరిల్లు వేసుకొని రేపూరి శ్రీను, వనజ నివసిస్తున్నారు. చేపలు పట్టుకొని, విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. బుధవారం రాత్రి దోమలు కుట్టకుండా దోమల చక్రాలను అంటించుకుని పడుకున్నారు. ప్రమాదవశాత్తు పూరిపాకకు నిప్పురాజుకుని మంటలు చెలరేగడంతో వనజ (50) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త శ్రీను కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. చేబ్రోలు సీఐ డి.నరేష్‌కుమార్, ఎస్‌ఐ సీహెచ్ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment