
సాక్షి, గుంటూరు : జిల్లాలోని నర్సరావుపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరవకట్టలోని ఓ టింబర్ డిపోలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ డిపోలో కలపతో పాటు విలువైన టేకు మొద్దులు ఉన్నట్లు సమాచారం. సుమారు కోటి రూపాయల కలప దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment