timber depo
-
టింబర్ డిపో మాటున ఎర్రచందనం రవాణా
కర్నూలు, మహానంది: టింబర్‌డిపో పెట్టుకుని కలప విక్రయాల మాటున ఎర్రచందనంపై గురిపెట్టాడు. డిపోలోని సామగ్రికి చలనాలు కట్టి అదే పేరుతో ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో అన్నీ తేలాయి. శేషాచలం నుంచి ముంబైకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కేసులో ఒకరికి అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఆదివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మల్లికార్జున, మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహానంది పోలీసుస్టేషన్లో వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న అంకిరెడ్డిచెరువు వద్ద హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కల్యాణి యుగల్ కిశోర్‌ను అరెస్ట్ చేసి 177కిలోల బరువున్న 19 ఎర్రచందనం దుంగలు, 193కిలోల బరువున్న ఇతర 13 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో ముంబైకి చెందిన హారూన్ అబ్దుల్ లతీఫ్‌ను అరెస్ట్ చేశామన్నారు. లతీఫ్.. ముంబైలో టింబర్ డిపో నిర్వహిస్తూ ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తుంటాడన్నారు. హైదరాబాద్‌లోని ఓ పార్సిల్ సర్వీస్‌లో పనిచేస్తున్న కల్యాణి యుగల్ కిషోర్ సహకారం తీసుకునేవాడని చెప్పారు. జైపూర్‌లోని ఓ లాడ్జీలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడన్న సమాచారం మేరకు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇదే కేసులో రుద్రవరం గ్రామానికి చెందిన ఎర్రశ్రీను, ఢిల్లీకి చెందిన సలీంల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. వీరిని సైతం త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ను పట్టుకున్న మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని నర్సరావుపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరవకట్టలోని ఓ టింబర్ డిపోలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ డిపోలో కలపతో పాటు విలువైన టేకు మొద్దులు ఉన్నట్లు సమాచారం. సుమారు కోటి రూపాయల కలప దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. -
ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారి
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: ఓ టింబర్ డిపో యాజమాని నుంచి కాకినాడ ఫారెస్ట్ సెక్షన్ అధికారి గౌతమ్ వరప్రసాద్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పిఠాపురానికిచెందిన సాయిదత్తా టింబర్ డిపో యజమాని చెక్కా పార్థసారధి కలపతో మంచాలు, వివిధ రకాల గృహోపకరణాలకు చెందిన వస్తువులు తయారు చేసి అమ్ముతుంటాడు. జనవరి 12న టింబర్ డిపోను మూసేసి తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో గౌతమ్ వరప్రసాద్ టింబర్ డిపో తనిఖీకి వెళ్లాడు. ప్రక్కనే ఉన్న పార్థసారధి బంధువులను అడిగి షట్టర్ తాళాలు తీయించాడు. వెంటనే షట్టర్ మూసివేసి తిరిగి తాళాలు ఇవ్వకుండా కాకినాడ వచ్చి తనను కలవాలని సూచించాడు. విషయం తెలుసుకున్న పార్థసారధి కాకినాడ వార్ఫు రోడ్డులో ఉన్న ఫారెస్టు కార్యాలయానికి వచ్చి సెక్షన్ ఆఫీసర్ గౌతమ్వరప్రసాద్ను కలిసాడు. అనుమతులు లేకుండా కర్రతో వస్తువులు తయారు చేసి అమ్మడం నేరమని, కేసు పెడతామని, లేదంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాదాపుగా నెలరోజుల పాటు తాళాన్ని అతడి దగ్గరే ఉంచుకున్నాడు. చివరకు రూ. 25వేలకు బేరం కుదిరింది. మరోవైపు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేధింపులు భరించలేక పార్థసారధి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఇరువురు చేసుకున్న ఒప్పందం మేరకు రమణయ్యపేట ఇందిరాకాలనీలో నివాసం ఉంటున్న గౌతమ్వరప్రసాద్కు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకొని గౌతమ్ వరప్రసాద్‌ను కాకినాడ ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చి అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడిలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం సుధాకర్, సీఐలు మోహనరావు, పుల్లారావు పాల్గొన్నారు. -
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
గుంతకల్లు టౌన్ : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం మహేంద్ర స్ట్రీట్‌లోని ఇస్మాయిల్ టింబర్ డిపోలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డీపో నుంచి దట్టమైన పొగ, ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిద్రావస్థలో ఉన డిపో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడిలేచి ఆందోళనతో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న టింబర్ డిపో యజమాని పరుగులతో వచ్చి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఆఫీసర్ యోగేశ్వరరెడ్డి, సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. డిపోలో భారీ స్థాయిలో కలప తగలబడడంతో మంటలను ఆర్పిందుకు మరో ఫైరింజన్‌ను రప్పించారు. ఉదయం 11 గంటలకు మంటలు అదుపులోనికి వచ్చాయి. విద్యుత్ షార్ట్సర్కుట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు. డిపోలో నిల్వ ఉంచిన 2 వేల చదరపు అడుగుల కట్సైజ్ బలాసా టేకు, వెయ్యి చదరపు అడుగుల మత్తి కట్టెలు కాలిబూడిదయ్యాయని వాపోయాడు. సుమారు రూ.40 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని కంటనీరు పెట్టుకున్నారు. -
కొత్తపేటలో అగ్ని ప్రమాదం
-
కొత్తపేటలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: కొత్తపేటలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దమొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంతో చుట్టుపక్కలవారు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో రెండు సిలిండర్లు, ఐదు వాహనాలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంచోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.