కొత్తపేటలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దమొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్: కొత్తపేటలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దమొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంతో చుట్టుపక్కలవారు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.
ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో రెండు సిలిండర్లు, ఐదు వాహనాలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంచోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.