kothapeta
-
కరెంట్ చార్జీల బాదుడుపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట
-
వైఎస్ఆర్ సీపీలోకి భారీగా చేరికలు
-
బీసీ, దళిత, మైనారిటీలను అణగదొక్కేందుకే చంద్రబాబు కుట్ర..
-
సామాజిక న్యాయం సీఎం జగన్ చేసి చూపించారు: మంత్రి కారుమూరి
సాక్షి, కోనసీమ జిల్లా: కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు యాత్ర సాగింది. సాయంత్రం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి మాట్లాడుతూ, పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని కిందిస్థాయిలో ఏ ఒక్క కార్యకర్త కలవలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇంతకంటే ఏం కావాలని పేద వర్గాలు అంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. జైలు ఊచలు లెక్కపెట్టిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు గుండెకాయ రోగం వచ్చిందట అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు -నేడు వంటి కార్యక్రమాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఎంతోమందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది. ఆయనకంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసిన ఘనత ఆయన కుమారుడు జగన్‌కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు. నాడు నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు: మార్గాని భరత్ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. మరి చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నాడు-నేడుతో ఏడున్నర దశాబ్దాల స్కూళ్ల పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని మార్గాని పేర్కొన్నారు. చదవండి: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ -
నకిలీ వస్త్రాలతో అడ్డంగా దొరికిన షాపింగ్ మాల్ యాజమాన్యం..
-
కొత్త రెవెన్యూ డివిజన్: కొత్తపేటకు పచ్చజెండా
కొత్తపేట(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాలోని మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికు అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు దీంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అధికార వైఎస్సార్ సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు. కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే, అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు కలిసి 31న పలు భవనాలను పరిశీలించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ఎంవీఎస్ సుబ్బరాజు కల్యాణ మంటపం అనువైనదిగా నిర్ణయించారు. వెనువెంటనే ఆ భవనానికి ‘రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, కొత్తపేట, కోనసీమ జిల్లా’ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కొత్తపేట డివిజన్ ప్రస్తావన లేకుండా అమలాపురం, రామచంద్రపురం డివిజన్లతోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతవరకూ అమలాపురం డివిజన్లో ఉన్న కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాలతో పాటు రాజమహేంద్రవరం డివిజన్లో ఉన్న ఆలమూరు మండలాన్ని రామచంద్రపురం డివిజన్లో కలుపుతూ ఈ నెల 3న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. దీంతో సుబ్బరాజు కల్యాణ మంటపానికి ఏర్పాటు చేసిన ‘కొత్తపేట రెవెన్యూ డివిజన్ బోర్డు’ కూడా తొలగించారు. ఇదీ.. రెవెన్యూ డివిజన్ పరిధి కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన రోజు ఉదయమే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. డివిజన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ పొందారు. చివరకు జగ్గిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజల ఆకాంక్ష నెరవేరింది కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పూర్వపు తాలూకా, పంచాయతీ సమితి కేంద్రంగా ఒక వైభవం, వెలుగు వెలిగిన కొత్తపేటకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పునర్వైభవం వస్తుంది. నేను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించాను. ఇందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి, సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కొత్తపేట -
ఈ నెల 25 నుండి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మూసివేత
-
నవ్వుల జాబిలి అందాల అంజలి
-
మీ ప్రతిభను విన్నాం.. ఇప్పుడు స్వయంగా చూశాం
సాక్షి, కొత్తపేట: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పకళా ప్రతిభను ప్రశంసించింది. శిల్పి రాజ్‌కుమార్ తయారు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 8న ఆయన జయంతి సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చాన్సలర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానించేందుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో శిల్పి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దానితో ట్రిపుల్ ఐటీ తరఫున చాన్సలర్ డాక్టర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ లేఖ పంపారు. చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించారని, మీరు ఎన్నో వైఎస్ విగ్రహాలు తయారుచేసి ఉండవచ్చు గానీ మీరు ఇచ్చిన విగ్రహం మా ట్రిపుల్ ఐటీకి మరింత శోభను తెచ్చిందని పేర్కొన్నారు. శిల్ప కళలో మీ ప్రతిభను విన్నాం.. ఈ విగ్రహం ద్వారా స్వయంగా చూశాం.. మీ ప్రతిభ ఎంతో ప్రశంసనీయం.. మీకు ఇంకా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం.. అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం
సాక్షి, కాకినాడ: కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండురోజులపాటు ఈ వేడకలు జరగనున్నాయి. బుధవారం కొత్తపేటలో ఏకరుద్రులు ఒకేచోట కొలువయ్యాయి. 12 ప్రభలు కొత్తపేట పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్థానిక హైస్కూల్ మైదానంకు ప్రభలు చేరుకోగా అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చారు. టపాసుల పేలుళ్లతో కొత్తపేట హోరెత్తిపోయింది. ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది జనాలు తరలిరావటంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిరపోయాయి. కాగా కోనసీమలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే ప్రభల తీర్థం. 17వ శతాబ్ధం నుంచి ప్రభల తీర్థం నిర్వహించబడుతుందని చారిత్రాత్మక కథనం. చదవండి: జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా! -
కొత్తపేటలో భారీ చోరీ
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాలకు కూతవేటు దూరంలోని కొత్తపేటలో సోమవారం ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాను బద్దలు కొట్టి అందులోని 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. బాధితులు పోలీసులకు అందించిన వివరాల మేరకు...వేటపాలెం మండలం కొత్తపేట ప్రధాన కూడలి అయిన పంచాయతీరాజ్ శాఖ భవనాల సముదాయం వద్ద గోగినేని హనుమంతరావు, ధనలక్ష్మి వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. హనుమంతరావు కలప వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కుమారుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో నివసిస్తుండగా కుమారై అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి అనారోగ్యంతో నెలన్నర క్రితం చెన్నైలోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఆమె భర్త హనుమంతరావు మాత్రం ఇంటివద్దనే ఉన్నాడు. అయితే 15 రోజులు క్రితం హనుమంతరావు కూడా చెన్నైలోని కుమారుడి వద్దకు వెళ్లాడు. చెన్నైకి వెళ్లిన అతనికి కూడా అనారోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి శ్రేయోభిలాషిగా ఉండే వ్యక్తి ప్రతిరోజు హనుమంతరావు ఇంటికి వచ్చి బాగోగులు చూస్తుంటాడు. రోజు మాదిరిగా సోమవారం ఉదయం వచ్చిన అతనికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టి ఉండడం గమనించాడు. దీంతో అతడు హనుమంతరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన హనుమంతరావు తనకు ఉన్న పరిచయాలతో స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, సీఐలు నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇంకొల్లు సీఐ రాంబాబు, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమాచారం అందుకున్న డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీరాలకు చేరుకున్న బాధితులు. ఇంటిలో దొంగతనం జరిగిందన్న సమాచారం అందుకున్న బాధితులైన హనుమంతరావు, ధనలక్ష్మి దంపతులు సాయంత్రం 3 గంటలకు చెన్నై నుంచి చీరాలకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆ ఇంట్లో కోటి రూపాయలు నగదు, బంగారం దొంగలు అపహరించారనే పుకార్లు పట్టణంలో షికార్లు చేశాయి. బాధితులు వచ్చే వరకు ఇతర వ్యక్తులు ఎవ్వరిని ఆ ఇంట్లోకి వెళ్లనీయలేదు. బాధితులు వచ్చి పగిలిన బీరువాను పరిశీలించారు. అలానే కొన్ని బ్యాంకులకు వారు స్వయంగా వెళ్లి లాకర్లను పరిశీలించుకున్నారు. అన్నింటినీ పరిశీలించుకున్న తరువాత 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇంటికి కన్నం వేసేందుకు ప్రయత్నం.. దొంగతనం జరిగిన ఇంటికి కూత వేటు దూరంలోనే మరో ఇంట్లో చోరీకి దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరూ ఇంట్లో లేరని గుర్తించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ తాళం పగలకపోవడంతో హనుమంతరావు ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. సీసీ కెమెరా లేకపోవడంతోనే.. కొత్తపేటలోని ప్రధాన కూడలిలో జనం నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో దొంగతనం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెద్ద భవంతిలోనే దొంగలు పడి దోచుకుంటే సామాన్యుల ఇళ్లు దొంగలకు పెద్ద పనికాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పెద్ద భవంతికి సీసీ కెమెరా లేకపోవడం కూడా దొంగలకు కలిసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగతనం జరిగిన ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ సీసీ కెమెరా ఉంది. దొంగలు సీసీ పుటేజీలో పడే అవకాశం ఉంది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఊరికి వెళ్లే సమయంలో లాక్డ్ మానిటరింగ్ సిస్టంను ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరిగి ఉండేది కాదని, పోలీసులు నిరంతరం ఆ ఇంటిని కాపాలా కాస్తుండేవారని డీఎస్పీ తెలిపారు. -
కొత్తపేట ఎన్నికల ప్రచార సభలో వైఎస్ షర్మిల
-
అప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా?
సాక్షి, తూర్పుగోదావరి : ‘ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరిగింది. ప్రతి పథకంలోనూ కరప్షనే. ప్రతి ప్రాజెక్టులోనూ కమిషనే. లిక్కర్ నుంచి ఇసుకదాక పత్రి దాంట్లో మాఫియా, కరప్షన్లే. భూములను మింగేశారు. మళ్లీ ఇప్పుడు ‘మీ భవిష్యత్ - నా బాధ్యత’ అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్ భవిష్యత్ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటనియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అవినీతి పాలన పోయి..రైతే రాజు కావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ సభాలో ఆమె ఇంకా ఏమన్నారంటే... చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు కొత్తపేట నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఇది పుత్ర వాత్సల్యం కాదా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. నిజానికి టీడీపీ వాళ్లు ఎంత డబ్బు ఇచ్చిన మీ అప్పు తీర్చలేరు. వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి ఈ అవినీతి పాలన పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు ఆర్థిక సహాయం చేస్తాం. మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. జగనన్నను ఆశీర్వదించాలని నా ప్రార్థన. బాబు వస్తే జాబు అన్నారు. ఎం వచ్చింది? కరువు వచ్చింది. అందుకే చంద్రబాబు బై బై బాబు అని చెప్పాలి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డిని జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలి’ అని ప్రజలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి
-
కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచారం
-
‘విన్’డిపెండెంట్లు లేరక్కడ!
సాక్షి, కొత్తపేట (తూర్పు గోదావరి): జిల్లాలో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు ఎప్పుడూ పట్టం కట్టలేదు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో నువ్వా.. నేనా..? అనే రీతిలో తలపడి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఆది నుంచీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పలువురు ఎన్నికల బరిలో నిలిచినా ప్రధానంగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం), ఎంవీఎస్ సుబ్బరాజు, డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి ఓటమిపాలైనా తమ సత్తా చాటుకున్నారు. 1962, 1967 ఎన్నికల్లో వరుసగా ముత్యాల సుబ్బారాయుడు మాస్టారు (కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం) కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీఎస్ సుబ్బరాజుకు గట్టి పోటీ ఇచ్చి కేవలం 1,542 ఓట్లు, 3,143 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1972లో ఎంవీఎస్ సుబ్బరాజు కాంగ్రెస్ అభ్యర్థి భానుతిలకంతో తలపడి 9,829 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డాక్టర్ ఐఎస్ రాజు, బండారు సత్యానందరావులతో తలపడి 1,397, 16,113 ఓట్ల తేడాతో ప్రత్యర్థిగా నిలిచి తన సత్తా చాటుకున్నారు. అలా ఈ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకే పట్టం కట్టారు. -
చిన్న జీయర్‌కు తప్పిన ప్రమాదం
-
కొత్తపేట చౌరస్తాలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట చౌరస్తాలోని వీఎం హోం వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న వీఎం హోం గ్రౌండ్‌ను అధికారులు మూసివేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వీఎం హోంను తెరవాలని దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు కొత్తపేట చౌరస్తాలో బైఠాయించి, ప్రధాన రహదారిపైనే వ్యాయామాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డితోపాటూ స్థానిక ప్రజా సంఘాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు నిరుద్యోగ యువతకు సర్దిచెప్పి, ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. -
కుప్పకూలిన కొత్తపేట ట్రెజరీ కార్యాలయం
-
190వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
కొత్తపేటలో సాక్షి మైత్రి సదస్సు
-
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కొత్తపేట: ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పొరపాటున వదిలేసిన నగదు కవరును తిరిగి తీసుకువెళ్లి అప్పగించడం ద్వారా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొత్తపేట బోడిపాలెం ప్రాంతానికి చెందిన బండారు నాగేంద్రప్రసాద్ అనే చికెన్ షాపు యజమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్దే చికిత్స పొందుతున్నాడు. ఆయనను కొన్నిరోజులు తన ఇంటి వద్ద ఉంచుకునేందుకు ప్రసాద్ తమ్ముడు రామచంద్రరావు సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్‌లో తన ఇంటికి ఆటోలో పంపించారు. తనతో పాటు తీసుకువెళ్లిన రూ.80 వేల నగదు, బ్యాంక్ పాస్‌బుక్ కవర్ ఆటోలో మరచిపోయారు. తరువాత ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు ఆ నగదు కవర్ కనిపించగా దానిలో రూ.80 వేలు నగదు ఉంది. వెంటనే బోడిపాలెంలో చికెన్ షాపు వద్దకు వెళ్లి రామచంద్రరావుకు అప్పగించాడు. దానిపై రామచంద్రరావుతో పాటు స్థానికులు శ్రీనివాస్ నిజాయతీని అభినందించారు. -
ఎన్నికల సమరానికి సర్వసన్నద్ధం కావాలి
రావులపాలెం (కొత్తపేట) : ఎన్నికల సమరానికి ఎంతో సమయం లేదని, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్సీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, ప్రతి 100 మందికి ఒక బూత్ సభ్యుడు ఉండేలా కన్వీనర్లు నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇందుకు ఉత్సాహవంతులు, పార్టీ కోసం పని చేసేవారిని తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నాయకులకు వివరించి, పరిష్కరించడం ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు వారథులుగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల సూక్ష్మస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, అతడితో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా, చంద్రబాబు అదే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తూ, 53 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. తమ అనుకూల ఎల్లో మీడియాలో పదేపదే రాజధాని ఊహాచిత్రాలను చూపిస్తూ ప్రజలను మ«భ్యపెడుతున్నారని, వాస్తవంగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు ఓడించడానికి జన్మ«భూమి కమిటీలనే ఒక్క కారణం చాలని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసినా, స్పీకర్ ఇంతవరకూ వారిపై అనర్హత వేటు వేయకపోవడం, వారిలో నలుగురితో మంత్రులుగా సాక్షాత్తూ గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలను అందించారని, కానీ చంద్రబాబు తమకు ఓటు వేస్తేనే లబ్ధి చేకూరుస్తామనే నీచమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గడచిన 70 ఏళ్లలో ఇంత అన్యాయమైన పాలన ఏనాడూ చూడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కమీషన్లపై కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందని ధర్మాన అన్నారు. మరో ముఖ్య అతిథి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లేని పోల్ మేనేజ్మెంట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అనే రెండు కొత్త స్కీములు అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, రెండేసి ఓట్లు ఎలా వేయాలో పోల్ మేనేజ్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే.. చేసిన దూబరా ఖర్చులను కప్పిపుచ్చడానికి ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయాన్ని వ్యాపారం, నేరమయంగా మార్చేశారన్నారు. మాజీ మంత్రి, అమలాపురం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి గొల్ల పల్లి డేవిడ్‌రాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రొఫెసర్లు రవికుమార్, నారాయణరెడ్డిలు పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, సామాజిక మాధ్యమాలు, వర్తమాన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ఆవిర్భావం, ఆదర్శవాదం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం ధర్మాన, బోస్ తదితర నాయకులను జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. -
సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యం
కొత్తపేట: సమాజాన్ని ప్రభావితం చేసే సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. గాయత్రీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జనరల్ మేనేజర్ బొరుసు వెంకట ఉదయబాస్కర్ మేనల్లుడు పసుపులేటి సాయిహర్ష – రమ్య వివాహ రిసెప్షన్ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొత్తపేట వచ్చిన వినాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్షనిజం, రాజకీయ, ముఠాకక్షలు తదితర అంశాలతో పెడదారి పట్టిన సమాజాన్ని ప్రభావితం చేసి, సన్మార్గంలో నడిపించే కథాంశాలతో చిత్రాలు తీస్తూ వచ్చానని తెలిపారు. అదే ఒరవడి కొనసాగిస్తూ చిత్రాలు తీస్తానన్నారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్ఫూర్తితో దర్శకుడిని కావాలనే లక్ష్యంతో సినీ రం గానికి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించానన్నారు. ఆయన వద్ద, దర్శకుడు సాగర్ వద్ద కృష్ణ హీరోగా ‘అమ్మదొంగా’ సినిమాకు పని చేశానన్నారు. తొలుత జూనియర్ ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఆది’ సినిమా తీశానన్నారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించగా 13 సూపర్‌హిట్ అయ్యాయన్నారు. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదని, త్వరలో కథ ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. ఆ కథకు హీరో ఎవరన్నది ఇంకా అనుకోలేదన్నారు. ‘‘నాకు లక్ష్యం అంటూ ఏమీ లేదని, డైరెక్టర్ కావాలని ఆశించాను. అయ్యాను. ఆశించిన దానికన్నా వెయ్యిరెట్లు సంతృప్తి చెందాను’’ అని వినాయక్ చెప్పారు. శ్రీదేవి మృతి తీరని లోటు ప్రముఖ నటి శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వినాయక్ అన్నారు. ఆమె మరణించారన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకునిగా, టెక్నీషియన్‌గా ఆమెను అభిమానించేవాడినన్నారు. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుల్లో శ్రీదేవి ఒకరన్నారు. -
రహదారుల రక్తదాహం
మృతులు.. క్షతగాత్రుల రక్తం, అయిన వారి కన్నీళ్లతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. అజాగ్రత్త... ఏదైతేనేం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిశాయి. మరో ఐదుగురు రక్తగాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. మృతుల్లో ఒకరు కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యానికి బయలుదేరిన బాలుడు కాగా, మరో విద్యార్థి ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన డిగ్రీ విద్యార్థి. - వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు - ఇద్దరు విద్యార్థుల దుర్మరణం - మరో ఐదుగురికి గాయాలు గుత్తి రూరల్ : హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని గుత్తి మండలం కొత్తపేట శివార్లలో మంగళవారం ఆటో బోల్తా పడి పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందిన అయ్యవార్ల ప్రశాంత్‌కుమార్(13) మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మిడుతూరులో ఒకే కుటుంబానికి చెందిన శ్యామలమ్మ(32), స్నేహ(12), వనజ(13), హరిత(12), ప్రశాంత్‌కుమార్ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్లలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆటోలో ఉదయమే బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తపేట వద్దకు రాగానే డ్రైవర్ వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో మిడుతూరుకు చెందిన నాగలక్ష్మీ, మనోహర్ ఒక్కగానొక్క కుమారుడు ప్రశాంత్‌కుమార్ పై నుంచి ఆటో వెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యామలమ్మ, స్నేహ, వనజ, హరిత, ఆటో డ్రైవర్ రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. లెయ్ కొడుకా.. బడికి పోదువు... లెయ్ కొడకా.. బడికి పోదువు.. నువ్వు బడికిపోయిన్నా బతికి ఉండేవాడివి కదరా.. ఎంత పనైంది దేవుడా.. అంటూ ప్రశాంత్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించడం కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
భర్తల వేధింపులు తాళలేకే..
పిల్లలతో అక్కా చెల్లెళ్ల అఘాయిత్యం మిగిలిన ముగ్గురి మృతదేహాలు లభ్యం నిందితుల కోసం పోలీసుల గాలింపు ఏడు అడుగులు నడిచి.. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ఆ ఇద్దరు ధన మందాధుల కాఠిన్యాన్ని తట్టుకోలేక.. పిల్లలతో కలిసి ఆత్మాహత్యలకు పాల్పడిన అక్కాచెల్లెళ్ల ఉదంతం, అనంతరం పరిణామాలు కొత్తపేటలో సోమవారం అందరి హృదయాలను కలిచివేశాయి. ఈ సంఘటనలో ఆదివారం ఒక మృతదేహం లభ్యం కాగా, ఒక కుమార్తె ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే. మిగిలిన ముగ్గురి మృతదేహాల సోమవారం లభ్యమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన ఒక కుమార్తె ప్రమీల.. తల్లిదండ్రులను కలిసినప్పుడు వారి వేదన కట్టలు తెచ్చుకుంది. ఇంతటి ఘాతుకానికి కారకులైన ఇద్దరు భర్తలు, మామపై పోలీసులు కేసులు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. కొత్తపేట : ఒకే కడుపున పుట్టిన అక్కాచెల్లెళ్లు, ముగ్గురు పిల్ల్లలతో ఆదివారం కాలువలో దూకిన ఘటనలో.. మానేపల్లి పుష్పలత (35), కుమార్తె మాన్విత (7), ప్రమీల కుమార్తె నల్లమిల్లి శ్రీగోదా అలివేలు మంగతాయారు (5) మృతదేహాలు సోమవారం ఉదయం కండ్రిగ సమీపంలో లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలను పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆదివారం రాత్రి నల్లమిల్లి నాగవెంకట పద్మ ప్రమీలను స్థానికులు రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి మృతుల తండ్రి, తాత బుచ్చిరాజు పోలీసులకు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనుమానాలతో వేధింపులు బుచ్చిరాజు పెద్ద కుమార్తె పుష్పలతకు విజయవాడకు చెందిన ఫైనాన్షియర్ మానేపల్లి రణధీర్‌తో 2006లో వివాహమైంది. వారికి సంజన్, మాన్విత ఇద్దరు పిల్ల్లలు. వారి సంసారం కొంతకాలం సజావుగానే సాగింది. అనంతరం అనుమానం, అదనపు కట్నం కోసం భార్యను, పిల్లలను వేధించేవాడు. ఈ విషయాన్ని పుష్పలత తన తల్లిదండ్రులకు ఫో¯ŒS చేసి చెప్పేది. వారు నచ్చజెబుతూ వచ్చారు. రెండో కుమార్తె నాగసత్యపద్మ ప్రమీలను రాజమహేంద్రవరానికి చెందిన పోలవరం ప్రాజెక్టులోని ఒక కాంట్రాక్టర్ వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నల్లమిల్లి వెంకటరత్నంతో 2010లో వివాహం జరిగింది. వారి కుమార్తె శ్రీ గోదా అలివేలు మంగతాయారు. ఈమె భర్త, మామ వీరబ్రహ్మానందం అదనపు కట్నం తీసుకురమ్మని, ఎవరితోనూ మాట్లాడకూడదని, సుమారు మూడున్నరేళ్ల పాటు ఇంట్లో నిర్బంధిస్తూ వేధించారు. దీంతో ఏడాది క్రితం కుమార్తెతో పుట్టింటికి వచ్చేసింది. భర్త కొన్ని రోజుల క్రితం విడాకుల నోటీసు పంపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విజయవాడ వెళ్లిన తల్లిదండ్రులు.. భర్త వేధింపులపై పెద్ద కుమార్తె పుష్పలత శనివారం ఫో¯ŒSలో చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విజయవాడ వెళ్లారు. అక్కడ పుష్పలత, పిల్లలు లేకపోవడంతో బుచ్చిరాజు తన అల్లుడు రణధీర్‌ను నిలదీశారు. వారి కోసం వెతుకుతుండగా, రెండో కుమార్తె ప్రమీల ఫో¯ŒS చేసి అక్క కొత్తపేట వచ్చినట్టు తెలిపింది. వారు తిరుగు ప్రయాణంలో ఉండగా రాత్రి 7 గంటల సమయంలో బంధువులు ఫో¯ŒS చేసి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు మనుమలతో కాలువలో దూకినట్టు తెలిపారు. తల్లిదండ్రులు, బంధువుల రోదన వర్ణనాతీతం విజయవాడ నుంచి ఆదివారం రాత్రి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, ప్రాణాలతో బయటపడిన ప్రమీల రోదన అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. ఆస్పత్రిలో మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు వర్ణనాతీతం. మీ సంసారాలు చక్కదిద్దేందుకు మరో ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండా మీరే నిర్ణయం తీసుకుని దూరమయ్యారా.. మా జీవితంలో ఆనందం లేకుండా చేశారంటూ ఆ దంపతులు రోదించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఇద్దరి భర్తలు, మామపై కేసుల నమోదు అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, రావులపాలెం సీఐ బి.పెది్దరాజు మృతుల వివరాలను బంధువుల నుంచి సేకరించారు. తండ్రి బుచ్చిరాజు ఫిర్యాదు మేరకు మృతురాలు పుష్పలత భర్త మానేపల్లి రణధీర్పై అదనపు ఎస్సై కేఎం జోషి, నల్లమిల్లి నాగసత్యపద్మ ప్రమీల ఫిర్యాదు మేరకు ఆమె భర్త వెంకటరత్నం, మామ వీరబ్రహ్మానందంపై ఎస్సై డి.విజయకుమార్ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ స్థానికేతర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫో¯ŒSలో బుచ్చిరాజును పరామర్శించి సానుభూతి తెలిపా రు. ఆయన తరఫున వైఎస్సార్సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు తదితరులు మృతుల తల్లిదండ్రులు, బంధువులను స్థానిక ఆస్పత్రి వద్ద ఓదార్చారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు కూడా వారిని పరామర్శించారు. పోలీసుల అదుపులో పెద్దల్లుడు.. పరారీలో చిన్నల్లుడు బుచ్చిరాజు పెద్దల్లుడు విజయవాడకు చెందిన మానేపల్లి రణధీర్గుప్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండో అల్లుడు, రాజమహేంద్రవరానికి చెందిన నల్లమిల్లి వెంకటరత్నం, అతని తండ్రి వీరబ్రహ్మానందం పరారీలో వున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు. -
ఆ పండుటాకుకొచ్చింది.. 111వ వసంతం
కొత్తపేట : సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ పండు వృద్ధురాలికి ఆమె తరతరాల వారసులు శుక్రవారం 110వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవతాళ్ళపాలెంకు చెందిన మాకా మంగమ్మ 1907 జనవరి 15న జన్మించారని, ఈ నెల 15న 111వ ఏట అడుగు పెడతారని వారసులు తెలిపారు. మంగమ్మకు చిల్లా ముసలమ్మ, ఏలూరి లక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన ముసలమ్మ వయసు 85 ఏళ్లకు పైబడింది. మంగమ్మ చాలాకాలంగా కొత్తపేట మండలం పలివెల శివారు వీరభద్రచౌదరిపురంలోని ముసలమ్మ వద్దే ఉంటున్నారు. ఆమె వారసులు 42 మందిలో అనేకులు ఉపాధి, ఉద్యోగాల పేరిట వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ వారు చౌదరిపురం వచ్చి మంగమ్మ బాగోగులు చూసి, తమ వద్దకు తీసుకువెళ్తుంటారు.110వ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు వారంతా వచ్చి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసారు.ఆమెతో కేక్ కట్ చేయించారు. ఆమెతో కలిసి అందరూ భోజనం చేశారు. -
తమ్ముళ్ల కుమ్ములాట
కొత్తపేటలో చెరో బాట ఆధిపత్య పోరు.. అభివృద్ధికి ఎసరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : వ్యక్తిగత ప్రాబల్యం కోసం తెలుగు తమ్ముళ్లు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. ప్రజోపకరమైన పనులను వర్గ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుంది కొత్తపేట నియోజకవర్గ టీడీపీలో ఇద్దరు నేతల తీరు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా ఎప్పుడో చీలిపోయింది. పార్టీకి జిల్లా నాయకత్వం కూడా లేకపోవడంతో చక్కదిద్దలేని స్థాయికి ఈ వర్గ పోరు చేరింది. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడే దుస్థితి దాపురించింది. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏడాదిన్నరగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న వైషమ్యాలు తాజాగా ఆదివారం ఆలమూరు మండలం జొన్నాడలో అంగ¯ŒSవాడీ భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమంలో బయటపడ్డాయి. తాను చేయాల్సిన అంగ¯ŒSవాడీ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి బండారు ముందుగానే వచ్చి ఉండటంతో ఆర్ఎస్కు కోపం కట్టలు తెంచుకుంది. ప్రారంభోత్సవం దగ్గర సరైన ఏర్పాట్లు చేయలేదనే సాకు చూపి భవనాన్ని ప్రారంభించకుండానే ఆర్ఎస్ వెళ్లిపోయారు. అయితే అదే జొన్నాడలో రైతులు సొంతంగా నిర్మించుకున్న సొసైటీ భవనాన్ని బండారుతో ప్రారంభింపచేయాలని స్థానిక కేడర్ నిర్ణయించడమే ఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. నియోజకవర్గంలో ఇద్దరు పార్టీలో రెండు బలమైన సామాజికవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ పార్టీలో సీనియర్లే. కానీ ఎమ్మెల్యేగా బండారు అధికారాన్ని ఎక్కువ కాలం అనుభవించారు. ఆర్ఎస్కు సుదీర్ఘ నిరీక్షణ తరువాత తొలిసారి సామాజికవర్గ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది. బండారు పార్టీ నియోకవర్గ ఇ¯ŒSచార్జి కావటం, ఆర్ఎస్కు ఎమ్మెల్సీగా ప్రొటోకాల్ ఉండటంతో నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం వీరు పోటీ పడుతున్నారు. దెబ్బకు దెబ్బ గత సెప్టెంబరులో కొత్తపేటలో జరిగిన రాష్ట్రస్థాయి షటిల్ పోటీల సందర్భంగా ఫ్లెక్సీల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఆర్ఎస్ నిర్వహించిన ఈ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ నాయకుడు ఫొటో లేకుండా చేశారని బండారు వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇందుకు జనచైతన్య యాత్రల్లో బండారు వర్గీయులు బదులు తీర్చుకున్నారు. కొత్తపేటలో టీడీపీ జన చైతన్యయాత్ర సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ నేత ఫొటోకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆర్ఎస్ వర్గం కినుక వహించింది. జన చైతన్యయాత్రకు డుమ్మా ఆ తరువాత పి.గన్నవరం జనచైతన్యయాత్రలో బండారుపై మంత్రులు యనమల, రాజప్పకు ఆర్ఎస్ ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కొత్తపేట జనచైతన్యయాత్రల్లో తాను పాల్గొనేది లేదని తెగేసి చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చినా కనీసం పూలమాల కూడా వేయలేదు సరికదా, అనంతరం వాడపాలెంలో బండారు స్వగృహంలో విందుకు మంత్రులు వచ్చినా ఆర్ఎస్ గైర్హాజరయ్యారు. ఆయనను పలు జిల్లాలకు ఇ¯ŒSచార్‌్జగా నియమించడంతోనే రాలేకపోతున్నట్టుగా ఆర్ఎస్ వర్గం చెబుతోంది. జెడ్పీటీసీ దర్నాల రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మ¯ŒS కోరం జయకుమార్, డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, ఏఎంసీ మాజీ చైర్మ¯ŒS సయ్యపురాజు జనార్థనరాజు బండారు వర్గంగాను, ఏఎంసీ చైర్మ¯ŒS బండారు వెంకటసత్తిబాబు, కరుటూరి నరసింహరావు, మాజీ సర్పంచ్ సయ్యపురాజు రామకృష్ణంరాజు ఎమ్మెల్సీ ఆర్ఎస్ వర్గంగా ఉన్నారు. ఇ¯ŒSచార్జి నియామకంతో ఆజ్యం బండారు టీడీపీ నుంచి పీఆర్పీకి వెళ్లి అక్కడ ఎమ్మెల్యే అయ్య తిరిగి సొంతగూటి(టీడీపీ)కి రాగా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఆర్ఎస్ తన రాజకీయ శత్రువు బండారు పీఆర్పీకి వెళ్లడంతో టీడీపీకి తిరిగొచ్చారు. గడచిన ఎన్నికల వరకూ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSచారి్జగా వ్యవహరించిన ఆర్ఎస్ను కాదని టీడీపీకి తిరిగొచ్చిన బండారుకు ఇ¯ŒSచార్జి బాధ్యతలు అప్పగించడంతోనే వీరి ఆధిపత్య పోరుకు తెరలేచింది. ఎమ్మెల్సీ అయ్యాక సమన్వయంతో వ్యవహరించకుండా ఆర్ఎస్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని బండారు వర్గీయులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాదం నామినేటెడ్ పోస్టుల భర్తీకి వచ్చేసరికి మరింత ముదురుపాకాన పడింది. కొత్తపేట ఏఎంసీ చైర్మ¯ŒS పదవి ఆర్ఎస్ తన వర్గీయుడైన బండారు వెంకటసత్తిబాబుకు దక్కేలా చక్రం తిప్పారు. బండారు ప్రతిపాదించిన వారిని పక్కనబెట్టేశారు. తాజాగా వాడపల్లి, ర్యాలి ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మ¯ŒSల నియామకం ఈ రెండు గ్రూపుల వివాదంతో నిలిచిపోయింది. ఈ వర్గ పోరును చక్కదిద్దలేక మంత్రులు యనమల, చినరాజప్ప చేతులెత్తేశారు. వీరి పోరు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిబంధకంగా తయారైంది. -
ఉత్తమ సేవలతో..
జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన కొత్తపేట డిగ్రీ కళాశాల ఎ¯ŒSఎస్ఎస్ యూనిట్ రాష్ట్ర స్థాయి ఉత్తమ పీఓగా అరుణ్‌కుమార్‌కు అవార్డు కేరళలో జాతీయ సమైక్యతా శిబిరానికి పయనం న్యూఢిల్లీలో రిపబ్లిక్ పెరేడ్‌కు, రాష్ట్రపతి అవార్డుకు వలంటీర్ ఎంపిక కొత్తపేట : స్థానిక విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎ¯ŒSఎస్ఎస్) యూనిట్ ఉత్తమ సేవా కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కళాశాల లైబ్రేరియన్, ఎ¯ŒSఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్ అరుణ్‌కుమార్ ఉన్నత లక్ష్యాలతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన కార్యక్రమాలకు ఉన్నత స్థాయిలో గుర్తింపు లభించింది. దానిలో భాగంగా ఈ నెల 25న కేరళ రాష్ట్రం అలెప్పీలో చిరుతల దగ్గర జాతీయ స్థాయిలో ఎ¯ŒSఎస్ఎస్ సమైక్యతా శిబిరానికి పీఓ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో 11 మంది విద్యార్థులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 24న ఎ¯ŒSఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పీఓ అవార్డు స్వీకరించారు. అక్టోబర్ ఐదో తేదీ నుంచి 14 వరకూ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన జాతీయ స్థాయి అడ్వంచర్ క్యాంపులకు పది మంది యూనిట్ వలంటీర్లతో వెళ్లి అక్కడ ట్రెక్కింగ్, రోపింగ్, రివర్ క్రాసింగ్, జంగిల్ వాక్స్, పర్వతాలు ఎక్కడం వంటి వాటిలో శిక్షణ పొంది వాటిని అధిరోహించారు. అదే నెల 24 నుంచి 30 వరకూ తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్లో జరిగిన జాతీయ స్థాయి సమైక్యతా శిబిరానికి ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నారు. గత నెల రెండో తేదీ నుంచి 11 వరకూ గుజరాత్ రాష్ట్రం వడోదరలో జాతీయ స్థాయిలో జరిగిన ప్రీ రిపబ్లిక్ పేరేడ్‌కు ఇద్దరు విద్యార్థులు వెళ్లి శిక్షణ పొందారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కర్నాటక రాష్ట్రం మైసూర్లో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరానికి నలుగురు వలంటీర్లు పాల్గొన్నారు. అంతేకాక పై అన్ని జాతీయ సమైక్యతా శిబిరాలకు ఏపీ తరఫున పీఓ అరుణ్‌కుమార్ టీమ్ లీడర్‌గా పాల్గొన్నారు. న్యూడిల్లీ రిపబ్లిక్ పేరేడ్‌కు విద్యార్ధి ఎంపిక వచ్చే నెల 26న న్యూఢిల్లీలో భారత రిపబ్లిక్ పేరేడ్ మార్చ్ఫాస్ట్ కార్యక్రమానికి ఎ¯ŒSఎస్ఎస్ విభాగంలో ఈ కళాశాల నుంచి బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థి కె సాయిరామకృష్ణ ఎంపికయ్యాడు. అతడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఎ¯ŒSఎస్ఎస్ వలంటీర్ అవార్డును తీసుకోనున్నాడు. యూనిట్ పీఓ, వలంటీర్లకు అభినందనలు చదువుతో పాటు ఎ¯ŒSఎస్ఎస్ యూనిట్ ద్వారా సామాజిక సేవ తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన పీఓ అరుణ్‌కుమార్, వలంటీర్లను కాలేజ్ ఎడ్యుకేష¯ŒS రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె గంగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ కె వెంకట్రావు, అధ్యాపకులు కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. -
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
జిల్లా చెకుముకి సై¯Œ్స సంబరాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట : విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే శాస్రీ్తయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి చెకుముకి సై¯Œ్స సంబరాలు–2016 (సై¯Œ్స ప్రతిభా పరీక్ష) జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట కాంతిభారతి హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ మండల శాఖ అధ్యక్షుడు బండారు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆదివారపుపేట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు–కాంతిభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ టి సత్యవాణి పర్యవేక్షణలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ ఆర్ఎస్, జేవీవీ పతాకాన్ని ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీహెచ్ స్టాలి¯ŒS ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ చెకుముకి సై¯Œ్స ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కాంతిభారతి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ మాట్లాడుతూ ఈ దేశభవిష్యత్తు గురువులు, విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అనాగరికత నుంచి నాగరికతలోకి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామంటే దాని వెనుక సై¯Œ్స హస్తం ఉందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల మేధస్సుతో సై¯Œ్స తద్వారా దేశం ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎండీ ఖాజామొహిద్దీన్, కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ఎంఈఓ వై. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
భావితరాలకు సంస్కృతి విత్తనాలను నాటాలి
అవనిగడ్డ: భారతదేశం పురాతన సంస్కృతి, సంప్రదాయాలకు నిల యమని, దీనిని భావితరాలకు తీసుకెళ్లాలంటే సంస్కృతి అనే విత్తనాలను నాటాలని కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతిస్వామి అన్నారు. మండలంలోని కొత్తపేట పుష్కర ఘాట్ వద్ద చంద్రశేఖర సరస్వతిస్వామి చిత్తరువు శిలాఫలకాన్ని వారు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీక్షేత్రంలో భక్తుల కు అనుగ్రహ భాషణం చేశారు. విజయేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ శంకరాచార్యులు వేదాంతం అనే విత్తనాలను నాటడం వల్ల భారతదేశం గొప్ప సంససస్కృతీ సంప్రదాయంతో విరసిల్లుతూ విద్యలోనూ ముం దంజలో ఉందన్నారు. ఏబీసీడీలతోపాటు మన పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలని అన్నారు. సంస్కృతిని కాపాడేందుకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పలు విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. విద్యార్థినిలు ప్రదర్శించిన కోలాట నృత్యాన్ని పీఠాధిపతులు తిలకించారు. శ్రీలంకమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూ.13.80 లక్షలతో నిర్మించిన అర్చనా మండçపాన్ని పీఠాధిపతులు జయేంద్రసరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండే వెంకటనాగకనకదుర్గ, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
లలితంగా ప్రతిమను తీర్చిదిద్దుతూ..
కొత్తపేట : చెన్నైలో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈఆర్ఐ) యూనివర్సిటీలో నెలకొల్పేందుకు తమిళనాడు దివంగత సీఎం జయలలిత విగ్రహాన్ని రూపొందించనున్నట్టు కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్ తెలిపారు. వుడయార్ తన శిల్పశాలలో జయలలిత నమూనా విగ్రహానికి మంగళవారం తుదిమెరుగులు దిద్ది, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై సమీపంలోని వేలంచేరు పిల్లల ఆశ్రమంలో నెలకొల్పిన జయలలిత బస్ట్ విగ్రహాన్ని తానే రూపొందించానని తెలిపారు. ఆ విగ్రహం నమూనాకు నేడు తుది మెరుగులు దిద్ది సిద్ధం చేశానన్నారు. చెన్నై ఎంజీఆర్ ఈఆర్ఐ యూనివర్సిటీకి ఎంజీఆర్ విగ్రహం రూపకల్పనకు ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ షణ్ముగం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్డరిచ్చారని తెలిపారు. ఆ విగ్రహాన్ని వచ్చే జనవరిలో జయలలిత ఆవిష్కరించాల్సి ఉందని, ఆ సందర్భంగా తనకు సన్మానం ఏర్పాటుచేశారని తెలిపారు. అయితే ఈలోపు ఆమె మృతి చెందడం దురదృష్టకరమన్నారు. -
దొరికిన మొసలి పిల్ల
గోదావరిలో వదిలిన అటవీశాఖ అధికారులు కొత్తపేట : ఎట్టకేలకు మొసలి పిల్ల అటవీశాఖ అధికారుల వలకు చిక్కింది. మండలంలోని పలివెల–మాచవరం పంట కాలువలో అవిడి గ్రామ ముఖ ద్వారం సమీపంలోని డామ్ వద్ద శని, ఆదివారాల్లో మొసలి పిల్ల సంచరించిన సంగతి తెలిసిందే. స్థానికులు, వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎ¯ŒS.శ్రీధర్ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ రాజమండ్రి రేంజ్ ఆఫీసర్ రవి సిబ్బందితో మొసలి పిల్ల సంచరించిన ప్రదేశానికి చేరుకుని మొసళ్లను పట్టుకునే వలలతో గాలించి అర్ధరాత్రి ఒక మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని డ్రమ్‌లో బంధించి వానపల్లి శివారు నారాయణలంక వద్ద గౌతమీ గోదావరిలో వదిలినట్టు తహసీల్దార్ తెలిపారు. -
హత్యా.. ఆత్మహత్యా ?
విజయవాడ (చిట్టినగర్) : భర్త నుంచి విడిపోయి మరో యువకుడితో సహజీవనం సాగిస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్యకు గురైందా.. అనే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ కొత్తపేట రావిచెట్టు సెంటర్ కొండ ప్రాంతానికి చెందిన బొట్టు వెంకటరమణ(25)కు తొమ్మిదేళ్ల క్రితం వీరాస్వామి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా వెంకటరమణ కొంతకాలంగా వేరుగా ఉంటోంది. బీసెంటర్ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్న ఆమెకు ఏడాదిన్నర క్రితం సురేష్ అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వెంకటరమణ, సురేష్ కలిసి నాలుగు నెలలుగా ఇదే ప్రాంతంలోని తమ్మిన కొండయ్య వీధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సురేష్, వెంకటరమణ మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం వెంకటరమణ పిన్ని సుశీల నిద్ర లేచే సరికి ఇంటి ముందు ముగ్గు వేసి లేదు. దీంతో ఆమె వచ్చి ఇంట్లోకి చూడగా... వెంకటరమణ మృతదేహం నేలపై పడి ఉంది. వెంటనే ఆమె అక్క ఫణికంటి పద్మావతి, బావ సుబ్బారావుకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనాస్థలంలో వివరాలు సేకరించి మృతదేహానికి పంచానామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సురేష్ కనిపించకుండా పోయాడు. వెంకట రమణ ఇంట్లో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించడం లేదు. మరోవైపు సురేష్ కనిపించకపోవడంతో పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రమణ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
ప్రీ క్వార్టర్స్ దశకు చేరిన టోర్నీ కొత్తపేట: కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016లో భాగంగా రెండోరోజు గురువారం నాటి మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మెయిన్ డ్రా ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా పోటీలను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు,జిల్లా అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బాలురు, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. రెండో రౌండ్ విజేతలు.. గురువారం మొదటి, రెండో రౌండు మ్యాచ్‌లు ముగిసి టోర్నీ ప్రీక్వార్టర్స్ దశకు చేరింది. బాలుర విభాగంలో రెండో రౌండ్లో సాయికిరణ్(విశాఖ)పై జశ్వంత్(చిత్తూరు), జి.శ్రీనివాసరావు(విజయనగరం)పై టి. విజయ్‌కుమార్(పశ్చిమ గోదావరి), సుజిత్(కృష్ణ)పై చారి(విశాఖ), పాల్‌ప్రీత్ శిలాస్(అనంతపురం)పై శ్రీకర్(శ్రీకాకుళం), గణేష్(ప్రకాశం)పై గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), మనోహర్ (కర్నూలు)పై దత్తాత్రేయరెడ్డి(కడప), అమన్గౌడ్(తూర్పుగోదావరి)పై సాయికిషోర్(పశ్చిమగోదావరి), ప్రశాంత్‌కుమార్(పశ్చిమగోదావరి)పై చంద్రాజ్పట్నాయక్(విశాఖ), కార్తీక్(కృష్ణ)పై శివసుందర్సాయి(చిత్తూరు), సాయిదత్తా(శ్రీకాకుళం)పై రోహిత్‌కుమార్(విశాఖ), వరప్రసాద్(విజయనగరం)పై ప్రణయ్(విశాఖ), రాహుల్(కర్నూలు)పై రాయుడు(తూర్పుగోదావరి), శ్రీకర్(అనంతపురం)పై డి.శరత్(గుంటూరు), యశ్వంత్(విశాఖ)పై వేదవ్యాస్సాయి(ప్రకాశం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చేరారు. బాలికల విభాగంలో జయశ్రీ(ప్రకాశం)పై మేఘన(పశ్చిమ గోదావరి), దీక్షితారాణి(అనంతపురం)పై నివేదిత(విశాఖ), షర్మిలా(కృష్ణా)పై వెన్నెల(తూర్పుగోదావరి), యామినిశ్రీ(శ్రీకాకుళం)పై వెన్నెల(కడప), మల్లిక(కృష్ణా)పై షన్విత(తూర్పుగోదావరి), హర్షిణి(పశ్చిమగోదావరి)పై బాలభువనేశ్వరి(విజయనగరం), పద్మజ(కృష్ణా)పై లక్ష్మి(విశాఖ) అంజలి(ప్రకాశం)పై నవ్యస్వరూప(తూర్పుగోదావరి), కాశీబాయ్(చిత్తూరు)పై సంజన(పశ్చిమగోదావరి), శ్రీలత(కడప)పై ^è రిష్మా(పశ్చిమగోదావరి), తేజా(తూర్పుగోదావరి)పై అసియా(కర్నూలు), సుష్మ(శ్రీకాకుళంపై)పై శ్వేత(అనంతపురం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చే రారని ఛీప్ రిఫరీ ఎస్.సూరిబాబు, డిప్యూటీ రిఫరీ బి.పాపయ్యశాస్త్రి, మ్యాచ్ కంట్రోలర్ కె.రమేష్ తెలిపారు. స్టేట్, నేషనల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు స్టేట్, నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటూ ఖ్యాతి తీసుకువస్తున్నారు. క్రికెట్ తరువాత షటిల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తపేటలో అండర్–19 సెలక్షన్స్ చక్కగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి పున్నయ్యచౌదరి కృషి ఎంతగానో ఉంది. –కాశీ విశ్వనాథ్, ఏపీబీఏ అంపైర్ ఆరోగ్యానికి దోహదపడే క్రీడ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడను ఎక్కువ మంది ఆరోగ్యపరంగా ఎంచుకుని ఆడుతున్నారు. ప్రభుత్వం పట్టణ, పలు గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలను అందుబాటులోకి తీసుకువస్తే మరింత మంది దేశానికి పేరుతెచ్చే క్రీడాకారులు తయారవుతారు. ఖరీౖదైన ఈ క్రీడ ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళుతుంది. –భద్రం, ఏపీబీఏ సీనియర్కోచ్ అంతర్జాతీయస్థాయిలో ఆడడమే లక్ష్యం షటిల్ బ్యాడ్మింటన్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించాలన్నదే నా లక్ష్యం. షటిల్ ఎంజాయ్మెంట్ గేమ్. కాన్ఫిడెంట్‌గా ఆడవచ్చు. జైపూర్‌లో జరిగిన అండర్–17 నేషనల్స్ ఆడాను. ఇక్కడ పోటీల ప్రారంభం కార్యక్రమం ఎంతో అందంగా జరిగింది. సౌకర్యాలు, మర్యాదలు చాలా బాగున్నాయి. – పి.నిషిత, విశాఖ శ్రీకాంత్ నాకు స్ఫూర్తి షటిల్ బ్యాడ్మింటన్ ఇండియా నెంబర్ వన్ ప్లేయర్ శ్రీకాంత్ నాకు స్ఫూర్తి. కోచ్ సుధాకరరెడ్డి శిక్షణలో రాణిస్తున్నాను. గతేడాది అండర్–19 సౌత్ జోన్లో గోల్డ్‌మెడల్ సాధించాను. ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాను. ఇక్కడ సౌకర్యాలు ఎంతో బాగున్నాయి. – ఎ.వేదవ్యాస్, ప్రకాశం జిల్లా -
నేటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
సిద్ధమైన కొత్తపేట ఇండోర్ షటిల్ స్టేడియం కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలురు, బాలికల చాంపియన్ షిప్ 2016 పోటీలకు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి శనివారం వరకూ నాలుగు రోజుల పాటు ఈ పోటీల నిర్వహణకు కొత్తపేట కాస్మొపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్)–జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. పోటీల వివరాలను మంగళవారం సీఆర్ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి విలేకర్లకు వివరించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో రావులపాలెం సీఆర్సీ–కొత్తపేట సీఆర్ఎస్ సంయుక్తంగా రెండు ఇండోర్ స్టేడియంలలో జాతీయ షటిల్ పోటీలు నిర్వహిస్తామని ఆర్ఎస్ తెలిపారు. తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి సింగిల్– 2, డబుల్ 1 చొప్పున బాలురు, బాలికలు టీమ్‌లు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఆరు చొప్పున పాల్గొంటాయని, తొలిరోజు క్వాలిఫై టీములు ఆడతాయన్నారు. మలి రోజు నుంచి 20 మ్యాచ్‌లు, ఆఖరి రోజు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. విజేతలు త్వరలో జరిగే సౌత్ జోన్, నేషనల్స్‌కు వెళతారని తెలిపారు. -
21 నుంచి కొత్తపేటలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహణ 13 జిల్లాల నుంచీ పాల్గొననున్న 78 జట్లు కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ –19 బాలురు,బాలికల చాంపియన్ షిప్ –2016 టోర్నమెంట్‌కు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ టోర్నీ నిర్వహణకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్) ఫౌండర్, చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం స్టేడియంలో టోర్నీ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా చైతన్యం పెరిగేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ టోర్నీని కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ క్రీడా పోటీలకు ఒకప్పుడు పేరొందిన కొత్తపేటకు ఆ వైభవం మరలా తెచ్చేందుకు ఈ పోటీలు నాంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏ క్రీడా కోర్టుకూ లేని ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు కొత్తపేట సీఆర్ఎస్, రావులపాలెం సీఆర్సీల సమన్వయంతో వసతి,ఇతర సౌకర్యాలు కలగచేస్తున్నట్టు తెలిపారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచీ బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో ఒకటి చొప్పున ఆరేసి జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఇంతవరకూ నిర్వహించిన టోర్నీలతో పోలిస్తే ఇది మెగా ఈవెంట్ అంటూ ఎమ్మెల్సీ ఆర్ఎస్ను అభినందించారు. జిల్లా అసోసియేషన్ సలహాదారు కె.శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్, సీఆర్ఎస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీరామకృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల భూరిబాబు, సెక్రటరీ జీపీ నాయుడు, జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను, కోశాధికారి ఎస్.శివయ్య, సభ్యులు ఎస్.సందీప్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కడియం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
21 నుంచి కొత్తపేటలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహణ 13 జిల్లాల నుంచీ పాల్గొననున్న 78 జట్లు కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ –19 బాలురు,బాలికల చాంపియన్ షిప్ –2016 టోర్నమెంట్‌కు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ టోర్నీ నిర్వహణకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్) ఫౌండర్, చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం స్టేడియంలో టోర్నీ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా చైతన్యం పెరిగేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ టోర్నీని కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ క్రీడా పోటీలకు ఒకప్పుడు పేరొందిన కొత్తపేటకు ఆ వైభవం మరలా తెచ్చేందుకు ఈ పోటీలు నాంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏ క్రీడా కోర్టుకూ లేని ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు కొత్తపేట సీఆర్ఎస్, రావులపాలెం సీఆర్సీల సమన్వయంతో వసతి,ఇతర సౌకర్యాలు కలగచేస్తున్నట్టు తెలిపారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచీ బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో ఒకటి చొప్పున ఆరేసి జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఇంతవరకూ నిర్వహించిన టోర్నీలతో పోలిస్తే ఇది మెగా ఈవెంట్ అంటూ ఎమ్మెల్సీ ఆర్ఎస్ను అభినందించారు. జిల్లా అసోసియేషన్ సలహాదారు కె.శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్, సీఆర్ఎస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీరామకృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల భూరిబాబు, సెక్రటరీ జీపీ నాయుడు, జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను, కోశాధికారి ఎస్.శివయ్య, సభ్యులు ఎస్.సందీప్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కడియం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కవులే భవిష్యత్తు నిర్దేశకులు
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి కొత్తపేట : భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశకులు కవులేనని, కవి లేకపోతే చరిత్రే లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత∙అద్దంకి కేశవరావు 98వ జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో గురువారం జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేశవరావు వంటి కవులు తెలుగు జాతిరత్నాలని అన్నారు. నేటి సినిమా పాటలు ఒంటిని కదిలిస్తూండగా.. నాటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయని అన్నారు. జాతికి భాషే ప్రామాణికమని, సాహిత్యంతో భాష ముడిపడి ఉందని అన్నారు. అమ్మలాంటి తెలుగు భాషను కాపాడుకోవాలని కవులను కోరారు. కేశవరావు కుమారుడు, బాలవిహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యాన ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహర దేవళరాజు అధ్యక్షత వహించారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 50 మంది కవులు మానవతావాదంపైన, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ పోకడలపైన వినిపించిన కవితలు ఆలోచింపజేశాయి. కవులకు పొట్లూరి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏవీ సుబ్బారావు, ప్రముఖ బుర్రకథ కళాకారుడు నిట్టల హనుమంతరావు, ప్రముఖ మెజీషియన్ చింతా శ్యామ్‌కుమార్, కళాసమితి అధ్యక్షుడు నల్లా సత్యనారాయణమూర్తి, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తిమండ ప్రతాప్, నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు టి.సత్యనారాయణ, కవులు దేవవరపు నీలకంఠేశ్వరరావు, భగ్వాన్, ధర్మోజీరావు, మధునాపంతుల, వీవీవీ సుబ్బారావు, షేక్ గౌస్, పద్మజావాణి, సోమయాజులు, పిట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి
కొత్తపేట : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి, ఎన్సీసీ ఆర్మీ కేడెట్ యెల్లమిల్లి చార్లెస్ కుమార్ జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు జి.సూర్యప్రకాశరావు గురువారం తెలిపారు. ఈ నెల 6న కాకినాడలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలకు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యాన ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఎనిమిదో తరగతి విద్యార్థి చార్లెస్‌కుమార్ అండర్–14 రైఫిల్ షూటింగ్లో విజయం సాధించాడు. తద్వారా ఈ నెలాఖరున కడపలో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు. తొలి అడుగులోనే విజయబావుటా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలకు సుమారు 30 ఏళ్లకు పూర్వమే ఎన్సీసీ యూనిట్ ఉండేది. అప్పట్లో ఎందరో ఎన్సీసీ విద్యార్థులు వివిధ ఉద్యోగాలు పొందారు. తరువాతి కాలంలో వివిధ కారణాలవల్ల పాఠశాలలో ఎ¯Œæసీసీ యూనిట్‌ను రద్దు చేశారు. కాగా, ఎన్íసీసీ ఆర్మీ చీఫ్ ఆఫీసర్ అయిన గణిత ఉపాధ్యాయుడు ఉప్పలపాటి మాచిరాజు కృషి మేరకు ఈ విద్యా సంవత్సరం ఎన్సీసీ యూనిట్ మంజూరైంది. 25 మంది విద్యార్థులను యూనిట్లో జాయిన్ చేసుకుని శిక్షణ ప్రారంభించారు. మొట్టమొదటగా జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లగా చార్లెస్‌కుమార్ విజయం సాధించి, తొలి అడుగులోనే విజయ బావుటా ఎగురవేశాడు. ఈ సందర్భంగా కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయం సాధిస్థానని విశ్వాçÜం వ్యక్తం చేశాడు. అతడిని డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని, ఎంఈఓ వై.సత్తిరాజు, ఎ¯Œæసీసీ 18వ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ మొనీష్గౌర్, హెచ్ఎం సూర్యప్రకాశరావు, పీడీ బి.అప్పాజీ, పీఈటీ జ్యోతి అభినందించారు. -
కొత్తపేట్‌లో సినీనటి రాశీకన్నా సందడి
సాక్షి,సిటీబ్యూరో: ప్రముఖ వస్త్రాల షోరూమ్ ఆర్.ఎస్.బ్రదర్స్ 12వ షోరూమ్‌ను శుక్రవారం కొత్తపేట్‌లో ప్రముఖ సినీనటి రాశీకన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం సకుటుంబ వస్త్ర ప్రపంచంగా కొనియాడారు. రిటెయిల్ రంగంలో ఆర్.ఎస్.బ్రదర్స్ ఒక సంచలనమన్నారు. ఈ షోరూమ్‌లో ఉన్న డిజైన్లు,వివిధ రకాల వస్త్రాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయన్నారు. కోఠిలో ఒక షోరూమ్‌తో ప్రారంభమైన కాగా ఆర్.ఎస్.బ్రదర్స్ ప్రస్తానం నేడు 12 షోరూమ్‌లకు చేరుకుందన్నారు. పురుషులు,మహిళలు,చిన్నారులకు నెం.1 షాపింగ్ మాల్ ఇదేనన్నారు. దశలవారీగా తెలంగాణా,ఏపీలోని ప్రముఖ నగరాల్లో ఆర్.ఎస్.బ్రదర్స్ షోరూమ్‌లను తెరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్.ఎస్.బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు సురేష్ సీమా, స్పందన, అభినవ్, రాకేష్, కేశవ్‌లు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో నెం.1 షాపింగ్ మాల్స్‌ను ఆర్.ఎస్.బ్రదర్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత 25 ఏళ్లుగా వినియోగదారులకు సకుటుంబ, సపరివార, ఆధునిక వస్త్రాలను సరసమైన ధరల్లో అందజేస్తున్నామన్నారు. -
గ్రామీణ రోడ్ల ఆధునికీకరణ
పీఆర్, ఉపాధి శాఖల కమిషనర్ రామాంజనేయులు కొత్తపేట : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)– కింద 14 వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ రోడ్లను సీసీ రోడ్లుగా ఆధునికీకరించామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఉపాధి శాఖల కమిషనర్ వి.రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఆయన కొత్తపేటలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద నిర్మించిన వర్మీ కంపోస్టు యార్డును ప్రారంభించి అక్కడే మొక్కలు నాటారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 వేల కోట్లతో 5 వేల కిలోమీటర్ల రోడ్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. ఇంతవరకూ 1,658 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్బజలాల పెంపునకు వ్యక్తిగత నీటికుంటలు, మొక్కల పెంపకం, వర్మీకంపోస్టు తయారు వంటివి చేపడుతున్నట్టు తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేసుకుంటే పనివారిని, ట్రాక్టర్లు, రిక్షాలు సమకూరుస్తామన్నారు. డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ ఎ.వరప్రసాద్, ఎంపీడీఓ పి.వీణాదేవి, ఏపీఓ ఎన్.ఆనంద్, గ్రామ కార్యదర్శి వీవీ రామన్ పాల్గొన్నారు. -
కొత్తపేట.. ఉత్తమ పంచాయతీ
పురస్కారం అందుకున్న సర్పంచ్ అనురాధ కొత్తపేట : స్వచ్ఛ భారత్ పథకాల లక్ష్య సాధనలో కొత్తపేట గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో లక్ష్య సాధనతో పాటు, ఘనవ్యర్థాల నిర్వహణ ద్వారా వర్మీ కంపోస్టు తయారీ కేంద్రం నిర్మాణం వంటి కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని కొత్తపేటను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆదివారం విజయవాడలో కృష్ణా పుష్కరాలు– 2016 వేదికపై ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సర్పంచ్ మిద్దే అనురాధ, ఆమె భర్త పంచాయతీ సభ్యుడు మిద్దే ఆదినారాయణ అందుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, కమిషనర్ రామాంజనేయులు వున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ దంపతులను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ఎంపీడీఓ పి వీణాదేవి తదితరులు అభినందించారు. -
ఆమె ఏమైంది...?
మృతి చెందిందా? మరేమైంది? lసౌదీ వెళ్లిన మహిళ జాడతెలియని వైనం అయోమయంలో కుటుంబ సభ్యులు కొత్తపేట: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన మహిళ ఏమైందో? ఎక్కడుందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు ఆమె చనిపోయిందని తెలిపారు. అయితే రెండు నెలలైనప్పటికీ ఆమె మృతదేహం ఇంటికి చేరలేదు. ఏజెంట్ ఆమె ఇండియాకు వచ్చేసినట్టు తహసీల్దార్‌కు తెలిపాడు. కానీ ఆమె ఇంటికి రాలేదు. ఆమె భర్త అర్జునరావు, అదే గ్రామానికి చెందిన మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ములగలేటి బంగారం బుధ వారం తెలిపిన వివరాల ప్రకా రం కొత్తపేట శివారు రామారావుపేటకు చెందిన కముజు విమల జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాలని నిర్ణయించుకోగా ఆ భార్యాభర్తలు పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కంకిపాడుకు చెందిన ఒక ఏజెంట్‌ను సంప్రదించారు. అతని ద్వారా గత ఏడాది జూన్ 15వ తేదీన విమల సౌదీ వెళ్లింది. 6 నెలల పాటు భర్తకు సక్రమంగానే జీతాల సొమ్ము పంపించింది.తరువాత నుంచి ఏమైందో ఏమో కానీ డబ్బులు రాలేదు. దానిపై అర్జునరావు విమల పనిచేసే ఇంటి యజమానికి ఫోన్‌చేసి అడగ్గా నీభార్య మాకు పనిచేయదు. ఆమెను రేపు ఇండియాకు పంపించేస్తున్నామని సమాధానం చెప్పారు. కానీ వారం రోజులు గడచినప్పటికీ విమల రాలేదు. దాంతో మరలా ఫోన్ చేయగా సౌదీ విమానాశ్రయంలో వదిలేశామని ఒకసారి, ముంబాయికి టికెట్టు తీసి పంపించామని మరోసారి పొంతనలేని సమాధానం చెప్పారు. దాంతో విమలను సౌదీ పంపించిన ఏజెంట్‌ను నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉండగా ఈ నెల 2వ తేదీన స్థానిక తహసీల్దార్ ఎన్. శ్రీధర్ సిబ్బందితో కలిసి అర్జునరావు ఇంటికి వచ్చి కముజు విమల మృతదేహం వచ్చిందా? అని ప్రశ్నించారు. దాంతో అర్జునరావు, అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఏమైంది సార్ అని వివరాలు అడగ్గా ‘కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. విచారణకు వచ్చాం’ అని చెప్పారు. ఆమె వివరాలను సేకరించుకొని వెళ్లారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన తహసీల్దార్ శ్రీధర్ ఏజెంట్‌ను రప్పించి ఎమ్మార్పీఎస్ నాయకుల సమక్షంలో ఆరా తీయగా ఏమైందో తనకూ తెలియదని, వారం రోజుల్లో వివరాలు తెలుసుకుని తెలియజేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకూ ఏ వివరమూ చెప్పలేదు. ఆమె ఎక్కడుంది? బతికుందా? లేక చనిపోయిందా? చనిపోతే మృతదేహం ఎక్కడ? సరైన సమాచారం అందజేసి లేదా ఆమె మృతదేహం ఎక్కడుందో విచారించి తగు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. తహసీల్దార్ వివరణ ఈ విషయంపై తహసీల్దార్ శ్రీధర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తమకు కలెక్టర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆమె వివరాలు తీసుకుని కలెక్టర్‌కు నివేదించామన్నారు. ఏజెంట్‌ను ఆరా తీయగా సౌదీ నుంచి వచ్చేసిందని తెలిపాడన్నారు. విమల కుటుంబ సభ్యులతో మాట్లాడతానని చెప్పాడన్నారు. -
ముగిసిన కోటి బిల్వార్చన మహాయాగం
కొత్తపేట : కొత్తపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం వేదికగా వందరోజులు సాగిన కోటి బిల్వార్చన మహాయాగం ఆదివారం ముగిసింది. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసుల రామచంద్రశర్మ (రాంబాబు), వేదపండితుడు మైలవరపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ వంద రోజులూ సుమారు 150 మంది దంపతులు వివిధ పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. ఆఖరిరోజు ఆదివారం జిల్లాలో పలువురు ప్రఖ్యాత వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. సుతాపల్లి లక్ష్మీనారాయణరావు, సత్యవరపు గంగాధరరావు, శ్రీఘాకోళ్లపు సూరిబాబు, నంభూరి రెడ్డియ్య, సత్యవరపు జమీందార్, తమ్మన సాయిప్రసాద్, పచ్చిపులుసు కృష్ణారావు పాల్గొన్నారు. -
బీజేపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదు
కొత్తపేట : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ నైతిక విలువలను తుంగలో తొక్కిన టీడీపీకి బీజేపీని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అన్నారు. ఆయన ఆదివారం కొత్తపేటలో తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీని అతి పెద్ద పార్టీగా గుర్తించి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో నరేంద్రమోదీ హవా, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రచారంతో టీడీపీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేపట్టిందనే విషయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల గ్రహించాలన్నారు. బీజేపీ దేశ భవిష్యత్తును, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగిస్తుందన్నారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు అన్న సీఎం చంద్రబాబు నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా మాట్లాడటం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకోవడం అభివృద్ధా అని ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని 2019లో ప్రజలు నిర్ణయిస్తారు. ముందు మీరు నైతిక విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు, రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నాలు చేయండి’ అని టీడీపీవారికి ఆయన హితవు పలికారు. 2014 ఎన్నికల్లో మీరిచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, నేటికీ ఆహామీలను నెరవేర్చకపోగా ప్రజలను తప్పుదోవ పట్టించి కేంద్రంపై నిందలు వేయడం సరికాదని హెచ్చరించారు. ఆయన వెంట మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి,ప్రధాన కార్యదర్శి పాలూరి జయప్రకాష్‌నారాయణ, కా>ర్యవర్గ సభ్యుడు బొరుసు జానకిరామయ్య, గ్రామ పార్టీ అద్యక్షుడు నేమాని రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
సంక్రాంతి రోజున వైభవంగా ప్రభల తీర్థం
-
కొత్తపేటలో అగ్ని ప్రమాదం
-
కొత్తపేటలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: కొత్తపేటలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దమొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంతో చుట్టుపక్కలవారు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో రెండు సిలిండర్లు, ఐదు వాహనాలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంచోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
మధ్యాహ్న భోజనంలో పురుగులు..
విద్యార్థుల ఆందోళన నాగోలు: హైదరాబాద్ నగరం కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనేక రోజుల నుంచి ముక్కిపోయిన బియ్యాన్ని వండడంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్థానికంగా ఉండే మహిళా సమాఖ్య వారే ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. పౌరసరఫరాల నుంచి వచ్చే బియ్యం ముక్కిపోవడంతో అందులో పురుగులు తొట్టెలు కట్టి ఉన్నాయి. వంట వండే వారు బియ్యాన్ని సరిగా శుభ్రపరచకుండా అలాగే వండటంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అనేకమార్లు వారికి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. మిగతా వారు గత్యంతరం లేక పురుగుల బియ్యంతో వండిన ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు రోజు రోజుకు తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో బియ్యం నిల్వ ఉండి పురుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ, సివిల్ సప్లై అధికారులు కల్పించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనం వండే మహిళా గ్రూపుల నిర్లక్ష్యం వల్లే నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, నీళ్ల చారు, సరిగా లేని కూరగాయలు వండి పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు సన్నబియ్యం అందజేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురుగుల బియ్యాన్ని సరఫరా చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైతేనే అధికారులు పట్టించుకుంటారా? అని విద్యార్థులు ప్రశ్నించారు. -
కొత్తపేట ఘటనలో గాయపడిన ముగ్గురి మృతి
రాజమండ్రి(కొత్తపేట): తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పెలివెలలో మందు గుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రం గాయపడ్డారు. వీరంతా కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కొత్త పేట గ్రామంలోని కొబ్బరి తోటలో దూలం కొటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో ఇటుక గోడలు, సిమెంట్ రేకులతో నిర్మించిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అ సమయంలో సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు అక్కడ పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి షెడ్డు శిథిలాల కింద ఉండిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని స్తానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు మృతిచెందారు. -
శోభాయమానం
-
జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్లో రైతులు, ఆటో సంఘాల మధ్య బుధవారం ఉదయం వివాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నుంచి మార్కెట్ వరకు కూరగాయల తరలింపునకు తమ ఆటోలనే వినియోగించుకోవాలని ఆటో సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రైతులు ఆటో సంఘాలపై ఎదురు తిరిగారు. ఆటో డ్రైవర్ల వైఖరికి వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కూరగాయలు పారబోసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి రైతులను శాంతింపజేశారు. -
హామీ అమలేది బాబూ!
కొత్తపేట :తమ పార్టీ అదికారంలోకి వస్తే డ్వాక్రా, రైతు రుణాలు అన్నీ మాఫీ చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నమ్మి ఓట్లేశాం. వందరోజుల పాలన ముగిసినప్పటికీ నేటికీ రుణమాఫీ విషయం తేల్చలేదంటూ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రుణమాఫీ హామీ దగాపై కొత్తపేట మండలం పలివెల గ్రామ సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. సాక్షి మీడియా ముందు చంద్రబాబుపై తమ ఆవేశాన్ని వెళ్ల గక్కారు. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టి 100 రోజుల పూర్తయ్యింది. ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు అంటూ మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని రుణాలు చెల్లించ లేదని, తమకు ఏ సమాచారమూ లేకుండానే తమ పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును రుణం కింద జమ చేసేసుకుంటున్నారని పలువురు మహిళలు వాపోయారు. వ్యవసాయ రుణాలు తీర్చాలంటూబ్యాంక్ సిబ్బంది నోటీసులు మీద నోటీసులు ఇచ్చి వత్తిడి చేస్తున్నారని పలువురు రైతులు వాపోయారు. నమ్మించి మోసం చేసిన వారిని వదల కూడదని, రోడ్డుపైకి ఈడ్చి తగు గుణపాఠం చెప్పేందుకు దగా పడిన మహిళలు, రైతులు ఉద్యమించాలని పలివెల మహిళలు పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలు చేయకుంటే మహిళా ఉద్యమం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన డ్వాక్రా, రైతు రుణమాఫీ అమలు హామీ సాధ్యం కాదని ప్రతి పక్ష పార్టీలు, మేధావులు చెప్పినా అమలు చేసి తీరుతానని చంద్రబాబు నమ్మించారు. నిజమనుకుని నమ్మి ఓట్లేశాం. హామీ మేరకు రుణ మాఫీ చేసి తీరాల్సిందే. లేకుంటే రైతు, మహిళా ఉద్యమం తప్పదు. - మార్గన సత్యవేణి గంగాధర్, ఎంపీటీసీ సభ్యురాలు, పలివెల పొదుపు సొమ్ము జమ చేసేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడని రుణాలు చెల్లించ లేదు. ఏ సమాచారమూ లేకుండానే మా పొదుపు ఖాతాలో ఉన్న రూ. 30 వేలు రుణం చెల్లింపు కింద జమ చేసేసుకున్నారు. ఇది చాలా దారుణం. హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేస్తే, మాకు చెప్పా చెయ్యకుండా బ్యాంకర్లు మోసం చేస్తున్నారు. - రామదాసు సత్యవతి, డ్వాక్రా మహిళ, పలివెల ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారు మూడేళ్ల క్రితం బంగారం వస్తువులు కుదువపెట్టి వ్యవసాయ రుణం కింద రూ. 20 వేలు తీసుకున్నాం. మూడేళ్లుగా తుపాన్లు, భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రుణాలు చెల్లించలేకపోయాం. రుణమాఫీ వర్తిస్తుందని ఆశిస్తుండగా బ్యాంకు వారు రెండు నోటీసులు ఇచ్చారు. బంగారం వేలం వేస్తామని ఇంటికి వచ్చి మరీ బెదిరించారు. - నూలు నూకరత్నం, రైతు, డ్వాక్రా రుణ గ్రహీత, పలివెల