సాక్షి, కాకినాడ: కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండురోజులపాటు ఈ వేడకలు జరగనున్నాయి. బుధవారం కొత్తపేటలో ఏకరుద్రులు ఒకేచోట కొలువయ్యాయి. 12 ప్రభలు కొత్తపేట పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్థానిక హైస్కూల్ మైదానంకు ప్రభలు చేరుకోగా అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చారు. టపాసుల పేలుళ్లతో కొత్తపేట హోరెత్తిపోయింది. ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది జనాలు తరలిరావటంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిరపోయాయి. కాగా కోనసీమలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే ప్రభల తీర్థం. 17వ శతాబ్ధం నుంచి ప్రభల తీర్థం నిర్వహించబడుతుందని చారిత్రాత్మక కథనం.
Comments
Please login to add a commentAdd a comment