జగ్గన్నతోటలో కొలువు దీరనున్న ఏకరుద్రులు | Prabhala Theertham Celebrations In Jagganna Thota | Sakshi
Sakshi News home page

కోనసీమలో కన్నుల విందుగా ప్రభల తీర్థం

Published Thu, Jan 16 2020 2:04 PM | Last Updated on Thu, Jan 16 2020 2:35 PM

Prabhala Theertham Celebrations In Jagganna Thota - Sakshi

సాక్షి, కాకినాడ: కోనసీమలో ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ పండగను పురస్కరించుకుని అంబాజీపేట మండలం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో గురువారం ఏకాదశరుద్రులు కొలువుదీరనున్నారు. ఈ మేరకు పదకొండు గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు ఊరేగింపుగా బయలు దేరాయి. ఏకాదశ రుద్రులను చూసేందుకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. కాగా ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కనుమ నాడు జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం కోసం చర్చిస్తారని ప్రతీతి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

చదవండి: 
ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం

జగ్గన్నతోట ప్రభల తీర్థంపై స్పెషల్‌ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement